వరంగల్ పోలీస్ కమీషనరేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వరంగల్ పోలీస్ కమీషనరేట్
మామూలుగా పిలిచే పేరువరంగల్ పోలీస్
Agency overview
ఉద్యోగులుకమీషనర్ ఆఫ్ పోలీసు
డిప్యూటి కమీషనర్
అడిషినల్ డిప్యూటి కమీషనర్స్
పోలీసు ఇస్స్పెక్టర్స్
అసిస్టెంట్ పోలీసు ఇస్స్పెక్టర్స్
సబ్ ఇస్స్పెక్టర్స్
Jurisdictional structure
Operations jurisdictionభారతదేశం
పరిమాణం5,672 చ.మీ.
జనాభా2.3 మిలియన్
Legal jurisdictionహన్మకొండ, వరంగల్, జనగాం
Governing bodyతెలంగాణ ప్రభుత్వం
General nature
ప్రధాన కార్యాలయంవరంగల్, తెలంగాణ,  భారతదేశం
Agency executive
Parent agencyతెలంగాణ పోలీసు
Facilities
Stations71

వరంగల్ పోలీస్ కమీషనరేట్, తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా (హన్మకొండ, వరంగల్, జనగాం జిల్లాల) పరిధిలో చట్టాన్ని అమలుచేయడానికి, నేర దర్యాప్తులో ప్రాథమిక బాధ్యతలను కలిగి ఉన్న నగర పోలీసు విభాగం.[1][2][3] దీనికి పోలీస్ కమిషనర్ నేతృత్వం వహిస్తాడు. డా. తరుణ్ జోషి (ఐపిఎస్) ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమీషనర్ గా ఉన్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి మొత్తం జిల్లా పోలీసు కమీషనరేట్ కార్యాలయం ద్వారా నిర్వహించబడుతుంది. ఏవీ రంగ‌నాథ్‌ 2022 నవంబర్ 30న వ‌రంగ‌ల్ పోలీసు క‌మిష‌న‌ర్‌గా నియమితుడయ్యాడు.[4]

జిల్లా చరిత్ర[మార్చు]

1985లో ఎన్.టి. రామారావు మండల వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడు వరంగల్ జిల్లా 50 మండలాలుగా విభజించబడింది. కానీ వరంగల్ మండలం, హన్మకొండ మండలం నుండి వరంగల్ పట్టణ ప్రాంతాన్ని కలిగివుండగా ఇది మొత్తం 51 మండలాలకు పెరిగింది. వరంగల్ జిల్లాలో రెవెన్యూ డివిజన్లు 5 కి పెరిగాయి.

తెలంగాణ ఏర్పడిన తరువాత 2016, అక్టోబరులో 33 కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పాత వరంగల్ జిల్లా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, జయశంకర్, మహబూబాబాద్ అనే 5 కొత్త జిల్లాలుగా విడిపోయింది.[5] అయితే, ప్రజల డిమాండ్ మేరకు 2021 ఆగస్టు 12న వరంగల్ రూరల్ జిల్లాను 13 మండలాలతో వరంగల్ జిల్లాగా, వరంగల్ అర్బన్ జిల్లాను 14 మండలాలతో హన్మకొండ జిల్లాగా పునర్వ్యవస్థీకరించబడ్డాయి.[6]

సంస్థాగత నిర్మాణం[మార్చు]

ఐపిఎస్ అధికారైన పోలీస్ కమిషనర్ నేతృత్వంలో వరంగల్ పోలీస్ కమీషనరేట్ ఉంటుంది. ఇందులో సబ్ డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజనులో సర్కిల్స్ ఉంటాయి. ప్రతి సర్కిల్ లో నిర్దిష్ట సంఖ్యలో పోలీస్ స్టేషన్లు ఉంటాయి. వరగంల్ జిల్లాలో 71 పోలీస్ స్టేషన్లు, 11 సర్కిళ్ళు, 10 – సబ్ డివిజన్‌లు ఉన్నాయి. జిల్లాలో సుమారు 5000 మంది పోలీసు అధికారులు పనిచేస్తున్నారు.

నూతన భవనం[మార్చు]

50 కోట్ల రూపాయలతో ఐదు ఎకరాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటుకానున్న నూతన పోలీస్ కమిషనరేట్ భవనానికి 2017 మే 29న శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, స్పీకర్ ఎస్. మధుసూదనాచారి, డీజీపీ అనురాగ్ శర్మ, సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ భవనంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు శాంతిభద్రతలు, ట్రాఫిక్ వింగ్‌లు ఉంటాయి.[7][8]

భరోసా కేంద్రం[మార్చు]

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులకు సంబంధించి వారికి రక్షణ కల్పించడంకోసం కమీషనరేట్ లో ఏర్పాటుచేయనున్న భరోసా కేంద్ర నూతన భవనానికి 2022 నవంబరు 25న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.[9]

మూలాలు[మార్చు]

  1. "Warangal Commissionerate set for expansion". deccanchronicle.com. Retrieved 2022-01-07.
  2. "Warangal gets its first police commissioner". deccanchronicle.com. Retrieved 2022-01-07.
  3. "Khammam made police commissionerate - The Hindu". thehindu.com. Retrieved 2022-01-07.
  4. Namasthe Telangana (30 November 2022). "వ‌రంగ‌ల్ పోలీసు క‌మిష‌న‌ర్‌గా ఏవీ రంగ‌నాథ్‌". Retrieved 30 November 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  5. "Telangana CM hints at 4 new districts due to public, political pressure". www.deccanchronicle.com. 2016-10-04. Retrieved 2022-01-07.
  6. "Hanamkonda, Warangal in Telangana to be new districts now". The New Indian Express. 13 August 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. "Warangal to get second biggest police headquarters". www.thehindu.com. 30 May 2017. Archived from the original on 2022-01-08. Retrieved 2022-11-25.
  8. "Iconic tower for Warangal Police Commissionerate". The Hans India. 2017-05-30. Archived from the original on 2022-11-25. Retrieved 2022-11-25.
  9. telugu, NT News (2022-11-25). "తెలంగాణలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత : మంత్రి ఎర్రబెల్లి". www.ntnews.com. Archived from the original on 2022-11-25. Retrieved 2022-11-25.