వాడుకరి చర్చ:ఈవని వినయ సాయి ఫణి రామ కృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం

[మార్చు]
ఈవని వినయ సాయి ఫణి రామ కృష్ణ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

ఈవని వినయ సాయి ఫణి రామ కృష్ణ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 06:10, 21 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

[మార్చు]

వాడుకరి:ఈవని వినయ సాయి ఫణి రామ కృష్ణ గారు, స్వాగత సందేశం చదవండి అర్థం చేసుకోండి జవాబు ఇవ్వండి పరిశీలనార్థం మీకు వికీపీడియా లోకి స్వాగతం. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 06:15, 21 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:ఈవని వినయ సాయి ఫణి రామ కృష్ణ గారు, ఖాతా సృష్టించుకుని చాలా చురుకుగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. అభినందనలు. మీ పేజీలో మార్పులు చేయండి, పుత్తగె రాశారు బాగుంది కానీ... మీ వాడుకరి పేజీ ఎలా ఉండాలి, అనేది కింద రాశాను గమనించండి. అలాగే మీరు కొత్త పేజీలు తర్వాత రాయవచ్చు కాని ముందు అన్ని చదవండి, అయితే మీకు తెలిసిన సమాచారం ఆధారాలు ఉన్న సమాచారాన్ని చేరడం చాలా ముఖ్యం, సరి అయిన పద్ధతి ఎందుకంటే ఇది తెలుగు వికి. వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగతం సందేశం పెట్టారు, గమనించారా? చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి. ఇది ఫేస్బుక్ లాంటిది కాదు అని మీకు తెలుసు, వికీపీడియా అనేది చాలా మహోన్నతమైనది, ఇందులో ఏ విషయం రాయాలన్న మూలాలు, ఆధారాలు ఉండాలి అంటే పేపర్లో... కాని టీవీలలో కాని ఆ విషయం పైన వచ్చి ఉండాలి. మీరు కొత్త వారు కాబట్టి కొత్త పేజీలు మరి కొన్ని విషయాలు తెలుసుకోండి. వికీపీడియాలో ఎలాంటి వ్యాసాలు సృష్టించాలి. అనే విషయం చదవండి. వాడుకరి పేజీ మీ గురించి గారు,ఇక్కడ నొక్కి ఇందులో వాడుకరి పేజీ లో ఏమి రాసుకోవాలి, అనేది ఇంతకుముందున్న పేజీలను చూడండి,ఉదాహరణకు వాడుకరి:Veera.sj, వాడుకరి:Pavan santhosh.s, వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:Chavakiran, వాడుకరి:స్వరలాసిక ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. అలాగే మీరు కూడా రాసుకోవచ్చు, వికిలో వాడుకరులు ఉంటారు, నిర్వాహకులు ఉంటారు, అధికారులు ఉంటారు, ముందు ముందు తెలుస్తుంది. అన్ని చదవండి. ఏదైనా ఇంకా అర్థం కాకపోతే మళ్లీ అడగండి ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 08:05, 21 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు సృష్టించిన పలిమారు, ఇతర వ్యాసాలు గురించి

[మార్చు]

ఫణి రామ కృష్ణ గారు, వికీపీడియాలో ఈ వ్యాసంతో పాటు పేజావర , పుత్తగె అనే వ్యాసాలుకు పేజీలు సృష్టించారు.చాలా సంతోషం. మీరు వికీపీడియాలో ప్రవేశించినందుకు ధన్యవాదాలు.అయితే వ్యాసాలలో ఉన్న సమాచారానికి తగిన ఆధారాలు చూపవలసి ఉంది.అందులో ఉంది, ఉన్నట్లు రాయకుండా ఉన్నదాన్నే వికీ శైలిలో రాయాలి. వ్యాసం అవకాశం ఉన్నంతవరకు విస్తరించాలి,బహుశా మీకు మూలాలు ఎలా కూర్పు చేయాలని తెలియకపోవచ్చు.మీరు ముందుగా మూలాలు ఎలా చూపాలి? , నిర్ధారత్వం అంటే ఏమిటి? , :శైలి/మార్గదర్శక, విధాన నిర్ణయాలు, శైలి/భాష ఎలా ఉండాలి? , వికీ శైలి , శైలి/వ్యాస పరిచయం ఎలా ఉండాలి అనే వాటిని కనీసం ఒకసారి చదివితే చాలా విషయాలు మీకు ఇట్టే అర్ధమైతాయి. మీరు సృష్టించిన వ్యాసాలలో కొన్ని నిర్వహణ మూసలు కనపడతాయి.వాటి ప్రకారం మీరు సవరించిన తరువాత,నిర్వాహకులు ఆ మూసలు తొలగిస్తారు.దయచేసి ఆ మూసలు మీరు తొలగించవద్దు.ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 04:55, 25 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈవని వినయ సాయి ఫణి రామ కృష్ణ

అయ్యా నేను ఇప్పుడిప్పుడే తెలుగు వికీపీడియా గురించి ఓనమాలు నేర్చుకుంటున్నాను. కొంచెం అయోమయంగా వున్నది. నాకు కొంచెం guidence అవసరం. ఇట్లు ఈవని వినయ సాయి ఫణి రామ కృష్ణ evspramakrishna@gmail.com ఈవని వినయ సాయి ఫణి రామ కృష్ణ (చర్చ) 12:18, 27 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

బహుశా మీకు ఎక్కడ రాయాలా అర్థంకాక అలా రాశారు. ప్రతి వ్యాసానికి ఒక చర్చా పేజీ ఉంటుంది.ఆ వ్యాసానికి సంబంధం ఉన్న విషయాలు మాత్రమే, ఆ చర్చా పేజీలో రాయవలసి ఉంటుంది. ఇక ముందు నుండి అలా చేయండి. ఇలాంటివి నేరుగా వికీపీడియన్ల చర్చాపేజీలలో రాయాలి, లేదా సహాయం కావాలి అనే దానిపై క్లిక్ చేసి దానిలో రాయచ్చు.దానిని గురించి తెలిసినవారు మీకు సహాయపడతారు. యర్రా రామారావు (చర్చ) 13:57, 27 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అయ్యా నేనింకా తెలుగు వికీపీడియా గురించి ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్నాను. కొంచెం అయోమయంగా వున్నది. సదా మీ సూచనలు,సలహాలను ఆశిస్తూ, ఇట్లు ఈవని వినయ సాయి ఫణి రామ కృష్ణ evspramakrishna@gmail.com ఈవని వినయ సాయి ఫణి రామ కృష్ణ (చర్చ) 12:24, 27 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మీ స్పందనకు ధన్యవాదాలు.మీరు మంచి వాడుకరిగా (వికీపీడియన్) గా ఎదుగుతారు.పైన తెలిపినవి మీ తీరుబాటు చేసుకుని ఒకసారి చదవండి.మీకు ఏదైనా సందేహం కలిగినప్పుడు మీరు చురుకైన గౌరవ వికీపీడియన్లుకు వారి చర్చాపేజీలో నేరుగా రాయచ్చు.ఇంకొక మార్గం కూడా ఉంది. సహాయం కావాలి అనే దానిమీద క్లిక్ చేసి, మీ సందేహాలు అడిగితే, దానిని గురించి తెలిసినవారు మీకు సహాయపడతారు.వికీపీడియాలో మళ్లీ మళ్లీ కలుద్దాం. యర్రా రామారావు (చర్చ) 13:32, 27 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]


డిసెంబర్ 27 వ్యాసం పేజీలో రాసిన చర్చ గురించి

[మార్చు]

మీరు, అయ్యా నేనింకా తెలుగు వికీపీడియా గురించి ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్నాను. కొంచెం అయోమయంగా వున్నది. సదా మీ సూచనలు,సలహాలను ఆశిస్తూ, అని రాసారు.బహుశా మీకు ఎక్కడ రాయాలా అర్థంకాక అలా రాశారు. ప్రతి వ్యాసానికి ఒక చర్చా పేజీ ఉంటుంది.ఆ వ్యాసానికి సంబంధం ఉన్న విషయాలు మాత్రమే ఆ చర్చా పేజీలో రాయవలసి ఉంటుంది. ఇక ముందు నుండి అలా చేయండి. ఇలాంటివి పైన వివరించినట్లు నేరుగా వికీపీడియన్ల చర్చాపేజీలలో రాయాలి, లేదా సహాయం కావాలి అనే దానిపై క్లిక్ చేసి దానిలో రాయచ్చు. గమనించండి.ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 13:47, 27 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా రచనలో సూచనలు

[మార్చు]

నేను ఇప్పడిప్పుడే తెలుగు వికీపీడియా గురించి తెలుసుకుంటున్నాను. ఇంకా అవగాహన లేదు. నాకు ఉడుపిలోని శ్రీకృష్ణమందిరానికి సమీపంలో వున్న అష్టమఠములను గురించి టూకీగా వ్రాసాను. ఇంకా సమాచారం పొందుపరచాలి.--ఈవని వినయ సాయి ఫణి రామ కృష్ణ. (ప్రణయ్‌రాజ్ వంగరి చర్చాపేజీలో రాసినది)

వాడుకరి:ఈవని వినయ సాయి ఫణి రామ కృష్ణ గారూ, తెవికీలో ఖాతా సృష్టించుకుని చాలా చురుకుగా మార్పులు చేర్పులు చేస్తున్నందుకు ధన్యవాదాలు.

వికీపీడియాలో రచనకు సంబంధించి ఈ క్రింది నిబంధనలు, సూచనలు గమనించగలరు:

  1. సమాచారాన్ని వేరే సైట్ల నుండి కాపీ చేసి ఇక్కడ పేస్టు చెయ్యరాదు. తమ కంటెంటును ఫ్రీగా వాడుకోవచ్చని ఆ వెబ్‌సైటులో రాసినా సరే అలా చెయ్యరాదు. ఆ వెబ్‌సైటు స్వయంగా మీదే అయినా సరే అలా కాపీ పేస్టు చెయ్యరాదు. అక్కడి పాఠ్యాన్ని తీసుకుని మళ్ళీ మీ స్వంత వాక్యాల్లో తిరగ రాయాలి. సదరు వెబ్ సైటును మూలంగా ఇక్కడ ఉదహరించాలి (నేను ఈ పాఠ్యాన్ని ఫలానా సైటు నుండి తీసుకున్నాను అని చెప్పాలన్నమాట).
  2. అయితే ఏ సైటు బడితే ఆ సైటును మూలంగా తీసుకోరాదు. స్థూలంగా కింది నియమాలు చూడండి..
    1. వ్యక్తుల స్వంత వెబ్‌సైట్లు, సామాజిక మధ్యమాలు (ట్విట్టరు, బ్లాగులు, ఫేసుబుక్కు వంటి చోట్లు) మూలంగా పనికిరావు.
    2. ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ వంటి సైట్లు మూలంగా పనికొస్తాయి.
  3. మన స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు, మన పరిశోధనలు వాటి ఫలితాలు వికీలో రాయకూడదు. వివిధ ప్రామాణిక ప్రచురణల్లో (గ్రంథాలు, పత్రికలు, వెబ్‌సైట్లు వగైరా) ఉన్న సమాచారాన్ని సేకరించి వికీపీడియా అనే చోట పెడుతున్నాం అనే సంగతిని గ్రహించండి.
  4. మూలం లేందే మనం రాసే సమాచారానికి వికీలో విలువ ఏమీ ఉండదు. సమాచారం ఇంకా వేరే చోట్ల కూడా ఉందా లేక ఈ వ్యక్తి స్వయంగా కల్పించి రాసినదా అనేది చదివేవాళ్ళు కూడా తెలుసుకోగలగాలి. అలా తెలుసుకునే అవకాశం రాసేవాళ్ళు ఇవ్వాలి.
    1. మీరు స్వంతంగా రాసిన కథైతే - వికీలో పనికిరాదు, తొలగించాలి.
    2. ఎక్కడో ఈసరికే రాసి ఉన్న కథైతే ఆ మూలాన్ని ఉదహరించాలి. మూలాలుగా ఏవి పనికొస్తాయో ఏవి పనికిరావో పైన చూసారు కదా!
  5. శైలి: వికీలో రాసే శైలి ఇతర వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. అది మీరు రాస్తున్నట్లు రాయకూడదు. ("ఏం జరిగిందో చెబుతాను వినండి", "ఆ సంగతి మనందరికీ తెలిసినదే కదా" లాంటి శైలి వికీకి పనికిరాదు) వికీపీడియా:శైలి చూడండి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:48, 27 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈవని వినయ సాయి ఫణి రామ కృష్ణ గారు, చురుకైన వాడుకరి గా చేయడం కోసం ప్రయోగం ఈ సమాచారం మీకు అందినదా తెలుపగలరు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 16:05, 27 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.