వాడుకరి చర్చ:జయంత్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జయంత్ కుమార్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియాలో అలా విహరించండి. ఓ అవగాహన ఏర్పడుతుంది. తెవికీ గురించి ఆకళింపు చేసుకున్న తరువాత దిద్దుబాట్లు, వ్యాసాలు వ్రాయడం మొదలు పెట్టవచ్చు.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అహ్మద్ నిసార్(చర్చ)

ఈ నాటి చిట్కా...
వికీపీడీయా శైలి!

వికీపీడియాలో వ్యాసాలు ఏ శైలిలో ఉండాలన్నదానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వికీపీడియా:శైలి చూడండి. కానీ వీటిని చదవడం మీకు విసుగనిపిస్తే, బాగా రాయబడ్డ (ఉదాహరణకు ఈ వారం వ్యాసాల జాబితా) వ్యాసాలు చదివితే శైలి మీకే అర్థమవుతుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధన[మార్చు]

  • నేను వేరే ఎవరు అయిన వాడుకరిని సంప్రదించాలి అంటే ఎలా ?
మీరు ఎవరినైనా సంప్రదించాలంటే సదరు సభ్యుని చర్చా పేజీ లోకి వెళ్ళి (ఉదాహరణకు మీ చర్చా పేజీ వాడుకరి చర్చ:జయంత్ కుమార్ ). మార్చు అని నొక్కి అక్కడ మీ సందేశాన్ని ఉంచడమే. — రవిచంద్ర(చర్చ) 11:40, 1 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
  • భారతదేశం అతి పురాతణ మైన భాష ఏది?
నాకు ఖచ్చితంగా సమాధానం తెలియదు. సంస్కృతం అనుకుంటున్నాను. — రవిచంద్ర(చర్చ) 11:40, 1 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మీ మార్పులు[మార్చు]

గ్రామాల పేజీల్లో ఏమి మార్పులు చేస్తున్నారు? నేను చూస్తే ఏమీ మార్పులు చేసినట్లు కనిపించడం లేదు. ఏవైనా ఒకే రకమైన మార్పులు చాలా పేజీల్లో మార్పులు చేయాలంటే బాట్లు (ఆటోమాటిక్ ప్రోగ్రాములు) వాడవచ్చు. మీకు సందేహాలుంటే అడగండి. —[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] 09:27, 7 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నేను చెసిన మార్పులన్ని ఒకే విధమైన మార్పులు. అవి చుక్కలు మాత్రమే( . ). వాటిని ఒకే సారి మార్చాలి అంటే ఎలా ?

మీ యెక్క సలహాకు నా యొక్క వందనాలు.--జయంత్ కుమార్ 10:45, 7 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఇలాంటి సింపుల్ మార్పులకు బాట్లు అవసరం లేదు. ఈ మార్పులు వ్యాసాలకు ఎలాంటి సమాచారం చేర్చడం లేదు కదా! —రవిచంద్ర 11:19, 7 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
అలా అని చిన్న చిన్న మార్పులు చేయకూడదని కాదు. మీ సమయం వృధా అవుతుందని అలా చెప్పాను. మరోలా భావించవద్దు. చిన్న మార్పులు అంటే అక్షర దోషాలు సవరించడం, వర్గాలను చేర్చడం మొదలైనవి చేయవచ్చు. —రవిచంద్ర 11:55, 7 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అక్షరదోషాలు[మార్చు]

అక్షరదోషాలు దిద్ది తెలుగు వికీ నాణ్యత పెంచుతున్నందుకు కృతజ్ఞతలు --వైజాసత్య 15:04, 27 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]


గమనించ గలరు

జయంత్ కుమార్ గారూ! మీరు అక్షర దోషాలను ఉత్సాహంగా సరి చేస్తున్నందుకు కృతజ్ఞతలు. మీవంటి సభ్యుల కృషి తెలుగు వికీ నాణ్యతను పెంపొందించడానికి ఎంతో ఉపయోగ పడుతుంది. అయితే లోక్‌సభ నియోజక వర్గాల దిద్దుబాట్లలో ఒక విషయం గమనించండి. {{ఆంధ్రప్రదేశ్‌లోని లోకసభ నియోజకవర్గాలు}} అనే మూస, [[వర్గం:ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజక వర్గాలు]] అనే వర్గంలో అక్షర భేదాలను మార్చవద్దు. ఎందుకంటే ఇప్పటికే ఆ మూస, వర్గాలు ఇలా వ్రాయబడి ఉన్నాయి. అవి వ్యాసంలో భాగం కాదు గదా! అంతే కాకుండా ఇక ముందు కూడా మూసల పేర్లను, వర్గం పేర్లను మార్చవద్దు. ఏవైనా సందేహాలుంటే ఇక్కడే వ్రాయండి. --కాసుబాబు 07:50, 30 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

అన్ని పేజీలలో ఉన్న లోకసభను సరి దిద్ది పేజీ పేరును కుడా మార్చితే సరిపోతుంది కదాండి.. కాని 'లోక' సభ అని చాలా విచిత్రంగా అనిపించింది.

అది కాకుండా చాలా మందికి లోక్‌సభ అని వ్రాయడం కుడా తెలియదు. --జయంత్ కుమార్ 09:02, 30 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

జయంత్ గారూ లోక్ సభా మధ్యలోని స్పేసు ను ఎలా సరిచేశారు? నేను ప్రయత్నిస్తే లోక్సభ గా వస్తున్నది... మణి.
లోక్‌సభ అని వ్రాయాలి అంటే lOk^sabha అని వ్రాయండి. ఇంకా విఫులంగా కావాలంటే ఈ లంకెను చుడండి. వికీపీడియా:టైపింగు_సహాయం

మీరు అక్షరదోషాలు సవరించేటప్పుడు మూసలలో ఉన్న అక్షరాలను కూడా మార్చినారు. దీనివలన లింకులన్నీ తెగిపోయాయి. మీరు శోధన ద్వారా కాకుండా వ్యాసాలను ఎంచుకొని అక్షరదోషాలు సరిచేస్తే బాగుంటుంది. శోధనద్వారా చేయాలంటే బాటుద్వారా తేలికగా చేయవచ్చు. సి. చంద్ర కాంత రావు - చర్చ 12:36, 30 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

బాటుద్వారా అక్షరదోషాలు లేకుండా తేలికగా చేయలంటే ఎలా.... నాకు కొంచం వివరంగా తెలుపగలరు....--జయంత్ కుమార్ 12:51, 30 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
బాటు అంటే యంత్రం ద్వారా (ప్రొగ్రామింగ్) మార్పులు చేయడం. ఒకే పనిని పదేపదే చేయడం, అనేక వ్యాసాలలో ఒకే రకమైన మార్పులను/చేర్పులను చేయడం, మూసలను, వర్గాలను వ్యాసాలలో అతికించడం లాంటి పనులు మానవప్రయత్నం కంటె బాటు ద్వారా చాలా తేలిగగా చేయవచ్చు. దీనికై కొత్తగా బాటు అభ్యరిత్వాన్ని పొందవలసి ఉంటుంది. లేదా ఇప్పటికే బాటు అక్కౌంటు ఉన్న వైజాసత్య గారికి తెలిపితే సమయం ఉన్నప్పుడు మార్పులను చేయగలరు. బాటు గురించి మరిన్ని వివరాలకు చూడండి: వికీపీడియా:బాటు -- సి. చంద్ర కాంత రావు - చర్చ 19:23, 31 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

అక్షరదోషాలు - బాటు[మార్చు]

జయంత్ గారూ, ఈ పేజీ చూడండి వికీపీడియా చర్చ:అక్షరదోష నిర్మూలన దళం. అలాగే మీరు తారసపడిన సాధారణ అక్షరదోషాలని వికీపీడియా:భాషాదోషాల పట్టిక పేజీలో చేర్చండి. వీటిని కూర్చి నేనొక బాటును నడపగలను. --వైజాసత్య 16:52, 1 ఆగష్టు 2010 (UTC)

  • అక్షరదోషాలను అత్యంత చురుకుగా దిద్ది వీకీ నాణ్యత పెంచుతున్న జయంత్ కుమార్ గారికి కృతజ్ఞతలు.--t.sujatha 15:50, 4 ఆగష్టు 2010 (UTC)
అతిచిన్న అక్షరదోషాలు బాటు ద్వారా చేయడానికి వీలున్ననూ, ఆ విషయం మీకు ఇదివరకే తెలియజేసిననూ మీరు మానుకోవడం లేదు. కేవలం శోధన ద్వారా చిన్న అక్షరదోషాలు వెతికి పట్టి అవి మాత్రమే మార్పు చేసి ఆ వ్యాసాలలో ఇంకనూ మార్పు చేయాల్సిన పదాలను, అంశాలను వదిలివేస్తున్నారు. ఉదాహరణకు జిరాఫీ వ్యాసంలో బారము-->భారము మాత్రమే మార్పు చేసి ఇంకనూ సరిదిద్దాల్సిన అనేక పదాలను, వికీకరించాల్సిన అంశాలను, అక్షరదోషాలను, వాక్యశైలిని, అనవసర లింకులను పట్టించుకోలేరు. యాంత్రిక వ్యాసాలలో మనకు సరిచేయాల్సిన వాక్యాలు, లింకులు, దోషాలు బాహానే కనిపిస్తాయి. మీకు నచ్చిన, పట్టు ఉన్న అంశాలకు సంబంధించిన వ్యాసాలనే ఎంచుకొని వ్యాసంలోని అన్ని దోషాలను సరిచేస్తే బాగుంటుంది. కేవలం శోధన ద్వారా చకచకా మార్పులు చేయాలంటే ఇదివరకు చెప్పినట్లు బాటు ద్వారా తేలికగా చేయవచ్చు. సి. చంద్ర కాంత రావు - చర్చ 12:40, 10 ఆగష్టు 2010 (UTC)

మీరు సూచించిన అక్షరదోశాలు[మార్చు]

మీరు సూచించిన అక్షరదోశాలను సవరించడానికి బాటు నడుస్తున్నది. బాటు చేసిన మార్పులను ఇక్కడ చూడవచ్చు --వైజాసత్య 21:52, 15 ఆగష్టు 2010 (UTC)

గ్రామపంచాయతి[మార్చు]

మీరు గ్రామపంచాయతీ పదానికి విడదీసి గ్రామ పంచాయతీగా చాలా వ్యాసాలలో మార్పుచేశారు. వాస్తవానికి గ్రామపంచాయతి ఒక పదం మాత్రమే. గ్రామపాలన నిర్వహించే సంస్థకే గ్రామపంచాయతి అని పేరు. గ్రామ పంచాయతి అని విడదీస్తే గ్రామము యొక్క పంచాయతి అవుతుంది. పూర్వకాలంలో గ్రామాలలో పంచాయతీలు పెట్టేవారు, కాని ప్రస్తుతం ఆ పద్దతి లేదు. (పుస్తకాలలో, పత్రికలలో అప్పుడప్పుడూ విడదీసి ఇస్తున్నారు, అది మనకు అనవసరం). అలాగే మరికొన్ని ఒకే పదంగా ఉండాల్సిన, అంతగా మార్చడానికి అవసరం లేని పదాలను విడదీస్తున్నారు. ఒక వేళ విడదీయాలనుకొన్ననూ బాటుద్వారా చేయవచ్చు. తైబజార్ లాంటి పదాలను మార్చి రైతుబజార్ చేయడం వలన వాటి అర్థం పూర్తిగా మారిపోతుంది. చిన్న చిన్న గ్రామవ్యాసాలలో కాకుండా పెద్ద వ్యాసాలలో అక్షరదోషాలు సరిదిద్దితే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు - చర్చ 15:43, 17 ఆగష్టు 2010 (UTC)

మీరు అక్షరదోషాలను సరిచేయాలని అనుకోవడం, చేసే ప్రయత్నం చాలా బాగుంది, నేను మెచ్చుకుంటాను. అదే సమయంలో కొన్ని తెలియక తప్పులు జరుగుతున్నాయి. మొన్న లోకసభ పదానికి లోక్‌సభగా మార్పు చేయడం వల్ల చాలా వ్యాసాలలో లింకులు తెగిపోయాయి. లింకులలో ఉన్న పదాలను మార్చినప్పుడు లింకులు తెగిపోవడం అనే విషయం మీకు తెలియకపోవచ్చు. లింకులోని పదాలను మారిస్తే వాటికి కొత్తగా దారిమార్పులు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా బాటుద్వారా సాధ్యమయ్యే అక్షరదోషాల సవరణకు నేను సూచనలిచ్చాను. గ్రామపంచాయతిని విడదీసినందుకు తెలియజేశాను. కొన్ని పదాలను అలాగే ఉంచిననూ విడదీసిననూ పెద్దగా అర్థం మారకపోవచ్చు కాబట్టి ఉన్న పదాలను అలాగే ఉంచితే బాగుంటుంది. ఏదో ఒకచోట అంటే పొరపాటు జరిగిందనుకోవాలి, ప్రతిచోట అలాగే ఉంటే మార్పుచేసేటప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది. నేను అందరి మార్పులను గమనిస్తున్నాను కాబట్టి మీ మార్పులను పరిశీలించి సూచనలు ఇస్తున్నాను. నా సూచనలు పాటిస్తున్నందుకు సంతోషమే. ఇక మీరు అడిగిన సందేహం విషయానికి వస్తే అక్షరదోషాలు ఉండే వ్యాసాలను కనుగొనడానికి ఎలాంటి సాధనము లేదు. దాదాపుగా అన్ని వ్యాసాలలో (మొలకలు మినహా) అక్షరదోషాలు ఉండడం మామూలే, పెద్ద వ్యాసాలలో ఈ సంఖ్య పెరగవచ్చు. కొత్తసభ్యులు రచించే వ్యాసం లేదా వ్యాసభాగాలలో అక్షరదోషాలు బాగానే ఉంటాయి. మీరు ఉపయోస్తున్న శోధన పద్దతిద్వారా అక్షరదోషాలు కొంతవరకు పట్టవచ్చు. ఆ వ్యాసాలలో ఆ పదాలనే కాకుండా మొత్తం వ్యాసం పరిశీలించి అక్షరదోషాలు సరిచేస్తే వ్యాసం చక్కగా తయారౌతుంది. సి. చంద్ర కాంత రావు - చర్చ 18:21, 18 ఆగష్టు 2010 (UTC)

<br=clearall>

కొలరావిపు ప్రశంసాపత్రం[మార్చు]

కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
జయంత్ కుమార్ గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో అక్షరదోషాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.

స్వాగతం[మార్చు]

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

స్వాగతం[మార్చు]

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:08, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]