వాడుకరి చర్చ:Pavan santhosh.s/పాత చర్చ 3
This is an archive of past discussions with User:Pavan santhosh.s. Do not edit the contents of this page. If you wish to start a new discussion or revive an old one, please do so on the current talk page. |
పాత చర్చ 3 |
All Pages: | ... (up to 100) |
11 వ వార్షికోత్సవాల గురించి.....
ఆర్యా.... పై విషయం గురించి రచ్చబండ లో కొన్ని ప్రతిపాదనలు చేయడమైనది. వాటిని పరిశీలించి... పరిశోధించి మీ అమూల్యమైన అభిప్రాయాలను, సూచనలను, అవసరమైన చోట్ల దిద్దు బాట్లను చేసి దానికి సమగ్ర రూపమివ్వాలని కోరడమైనది. వాడుకరి: Bhaskaranaidu
సహవికీపీడియనులకు మనవి: తిరుపతిలో జరుపబోవు తెవికి సభల గురించి మూడు రోజుల కార్యక్రమాల సమయానుకూల వివరాలు వ్రాయడమైనది. వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations లో 18 వ అంశముగా వ్రాయడమైనది. దీనిని పరిశీలించి తగు విధంగా సవరించి దీనికి ఒక సమగ్ర రూపమివ్వవలసినదిగా కోరడమైనది. ఎల్లంకి (చర్చ) 08:23, 1 జనవరి 2015 (UTC)
చేతి పుస్తకము గురించి
చేతి పుస్తకము (హాండ్ బుక్) కు కావలసిన సమాచరమంతా.... సకలనం చేసి రచ్చబండ లో పెట్టాను. దానిని పరిశీలించి ఉచితమైన మార్పులు చేర్పులు చేసి, తగు పేరును చూచించ వలసినదిగ కోరడమైనది. దీనిని త్వరలో ముద్రిస్తే 11 వ వార్షిక ఉత్సవాలకు అందు బాటులోని రాగదు. ఎల్లంకి (చర్చ) 05:20, 30 డిసెంబరు 2014 (UTC) (వాడుకరి: భాస్కరనాయుడు)
వికీపీడియా:తెలుగు వికీపీడియా మార్గదర్శిని అనే క్రొత్త పుటలో వివరాలు చూడండి. ఎల్లంకి (చర్చ) 11:29, 30 డిసెంబరు 2014 (UTC)
- అలాగేనండీ. --పవన్ సంతోష్ (చర్చ) 11:30, 30 డిసెంబరు 2014 (UTC)
వర్ణం (హిందూమతం) వ్యాస విలీనం
మీరు వర్ణం (హిందూమతం) వ్యాసాన్ని సృష్టించారు. యిది వరకు తెవికీలో చతుర్వర్ణాలు అనే వ్యాసం ఉన్నది. మీరు సృష్టించిన వ్యాసాన్ని యిదివరకు ఉన్న వ్యాసంలో విలీనం చేస్తే బాగుండునేమో పరిశీలించి తెలియజేయండి. -- కె.వెంకటరమణ⇒✉ 15:11, 16 జనవరి 2015 (UTC)
స్వాగతం
తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి. |
అభినందనలు
2014 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. JVRKPRASAD (చర్చ) 03:08, 11 ఫిబ్రవరి 2015 (UTC)
- ధన్యవాదాలు సర్. --పవన్ సంతోష్ (చర్చ) 06:51, 11 ఫిబ్రవరి 2015 (UTC)
అభినందనలు
మీరు కొమర్రాజు లక్ష్మణరావు తెలుగు వికీమీడియా పురస్కార విజేత- 2014 గా ఎన్నిక అయ్యినందుకు అభినందనలు Palagiri (చర్చ) 04:44, 11 ఫిబ్రవరి 2015 (UTC)
- ధన్యవాదాలండీ.--పవన్ సంతోష్ (చర్చ) 08:11, 11 ఫిబ్రవరి 2015 (UTC)
స్పందన
నమస్కారం. మీ సందేశానికి ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించండి. మీరు చెప్పినదాని బట్టీ నాకు అర్ధమైన దాని బట్టీ మీరొక పని చెయ్యగలరని నాకర్ధమయ్యింది. ముందుగా మీరు ఏ వ్యాసాలను విస్తీర్ణం చేయాలనుకున్నారో ఆ వ్యాసాలకు సంబంధించి అంతర్జాలంలో తెలుగు ఫాంట్ లో వెతకండి. మూలాలు సేకరించండి. మీకు ఇది అందుకు ఉపయోగపడుతుంది. అనువాదం కంటే కూడా నేరు మూలాలను మీరు దీని ద్వారా సేకరించండి. ఆ వ్యాసాన్ని విస్తరించాక వీలుంటే ఉచిత దస్త్రాలను జతచేయండి.
ఇలా అంటున్నందుకు తప్పుగా అనుకోవద్దు. మనం రాసే భాష కూడా జీఏ ఎఫే లపై ప్రభావం చూపిస్తాయి కనుక మూడవ వ్యక్తిగా వీలైనంత నేరుగా సూటిగా రాయండి. మరలా కలుస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఆలస్యం అవ్వచ్చు. కానీ మధ్యలో ఖచ్చితంగా కలుస్తాను. ధన్యవాదాలు. Pavanjandhyala (చర్చ) 07:24, 12 ఫిబ్రవరి 2015 (UTC)
- థాంక్యూ. మీరు ఇచ్చిన లింకు బుక్మార్క్ చేసుకున్నాను. చాలా బావుందది. దాని ద్వారా వెతికి అభివృద్ధి చేస్తాను. మీ సూచనలకు ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 05:35, 13 ఫిబ్రవరి 2015 (UTC)
డీ.ఎల్.ఐ నుండి పుస్తకాలు పీడీఎఫ్లుగా దింపుకోవటానికి
మీకిది నచ్చుతుందని ఈ లింకు ఇస్తున్నాను https://code.google.com/p/dli-downloader/ --వైజాసత్య (చర్చ) 04:30, 7 మార్చి 2015 (UTC)
- థాంక్యూ సర్ వాడిచూస్తాను.--పవన్ సంతోష్ (చర్చ) 13:27, 7 మార్చి 2015 (UTC)
వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు
JVRKPRASAD (చర్చ) 07:09, 12 మార్చి 2015 (UTC)
డబ్బింగ్ చిత్రాలు
అంతపని చెయ్యొద్దు. డబ్బింగ్ చిత్రాలకు ఒక పేజీని ఇక్కడ సృష్టించాక వాటి అసలును సృష్టించడం తగదు. ఆంగ్లంలో అనేక భాషలకు చోటుంది కనుక అసలుకు మాత్రమే పేజీ ఉంటుంది. ప్రాంతీయ వికీలలో అలాంటివి ఉండక్కర్లేదు. తమిళ వికీలో మావీరన్ ఉంటుంది. మగధీర ఉండదు. ఇదీ అంతే. Pavanjandhyala (చర్చ) 13:08, 11 ఏప్రిల్ 2015 (UTC)
- సరేనండీ.--పవన్ సంతోష్ (చర్చ) 13:59, 11 ఏప్రిల్ 2015 (UTC)
వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం
దీనిని మీ వాడుకరి పేజీలో వీలుగా అమర్చుకోగలరు...--విశ్వనాధ్ (చర్చ) 07:16, 18 ఏప్రిల్ 2015 (UTC)
- బర్న్ స్టార్లు ఇవ్వడం ఇటీవలి కాలంలో చూడలేదు. చాలా సంతోషం సర్. చక్రం కూడా చాలాబావుంది.--పవన్ సంతోష్ (చర్చ) 16:10, 18 ఏప్రిల్ 2015 (UTC)
- తెవికీలో మీ కృషికి ప్రశంసా పతకం అందుకున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకంక్షలు. మీరు ఇలాగే కృషి చేస్తూ మరిన్ని సత్కారాలు పొందాలని ఆశిస్తున్నాను-- కె.వెంకటరమణ⇒✉ 16:28, 18 ఏప్రిల్ 2015 (UTC)
- బర్న్ స్టార్లు ఇవ్వడం ఇటీవలి కాలంలో చూడలేదు. చాలా సంతోషం సర్. చక్రం కూడా చాలాబావుంది.--పవన్ సంతోష్ (చర్చ) 16:10, 18 ఏప్రిల్ 2015 (UTC)
వ్యాసాలకు మూసలు
పవన్ గారూ, రచ్చబండలో కొత్తవాడుకరులు కొద్ది వ్యాసం చేర్చితే మూసలు, పాత వాడుకరులకు మూసలు ఉండాలని అనుకున్నాం కదా. తెవికీలో ఏకవాక్య వ్యాసాలు వ్రాసే వారికి {{చాలా కొద్ది సమాచారం}} మూస, ప్రాముఖ్యత లేని వ్యాసారు వ్రాసిన వారికి {{ప్రాముఖ్యత లేని విషయం}} మూస. అనుభవం ఉన్న వాడుకరులకు {{New page}} అనే మూసలు ఎలాగూ ఉన్నాయి కదా. అవి సరిపోవంటారా. కొత్తవాడుకరులకు ప్రోత్సాహక మూస ఉండాలని భావిస్తే దానిలో పాఠ్యం ఏ విధంగా ఉంటే బాగుండునో తెలియజేయగలరు.-- కె.వెంకటరమణ⇒✉ 15:17, 24 ఏప్రిల్ 2015 (UTC)
- కె.వెంకటరమణ గారూ ఈ వ్యాసం సృష్టించినవారి కృషిని తెలుగు వికీపీడియా ప్రశంసిస్తున్నది. తెవికీ నాణ్యత పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ వ్యాసాన్ని తొలగించవచ్చును. ఆ చర్యను దయచేసి వ్యాసకర్తల పట్లగాని, వ్యాసం విషయం పట్ల గాని తిరస్కార సూచకంగా భావించవద్దు. అని మనం ఆ మూసల్లో చెప్తూనేవున్నాం. కాకుంటే కొత్తవాడుకరులు, కొత్తగా ఉత్సాహంగా వ్రాస్తున్న వాడుకరులు దీనివల్ల కొంతవరకూ అఫెండ్ అవుతూన్నట్టు విశ్వనాధ్ గారు స్వయానా పలువురు కొత్తవాడుకరులతో తాను నిర్వహిస్తున్న కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా చూస్తున్న విషయమట. ఆయన ఇటీవల జరిగిన మీట్‌లో ఈ విషయాన్ని చెప్పగా నాకు వచ్చిన ఆలోచన ఆ అభినందనకు సంబంధించిన మూస. మూసలోని విషయం గురించి నేను ఊహించింది ఇది: మీరు ఫలానా వ్యాసాన్ని సృష్టించినందుకు ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా మనలాంటివారి కృషి మూలంగానే ఏర్పడింది. ఐతే వికీపీడియా నిర్వహణలో భాగంగా మీ వ్యాసం విలువైనదే కానీ చాలా తక్కువ సమాచారం కలిగివున్నదని గమనించాము. దీన్ని మీరు కనీసం మరో పది, పదిహేను లైన్లకు పైగా అభివృద్ధి చేస్తే బావుంటుంది. తక్కువ సమాచారం ఉన్న వ్యాసాలు తెవికీ నాణ్యతను దెబ్బతీస్తాయి. మీరు వ్యాసాన్ని అభివృద్ధి చేసేవుద్దేశం ఉన్నప్పుడు మరచిపోకుండా {{New page}} అనేది కాపీ చేసి వ్యాసం ప్రారంభంలో వాడండి. అభివృద్ధి చేశాకా ఆ మూసను తొలగించవచ్చు. ప్రస్తుతం అటువంటి మూసను మీరు వాడి, అభివృద్ధి చేయకుంటే మరో 7రోజుల్లో వ్యాసంలో {{చాలా కొద్ది సమాచారం}} చేర్చి తదుపరి కార్యకలాపాలు చేపట్టాల్సివుంటుంది. కనుక మీరు ఉత్సాహంగా కొనసాగి ఆ వ్యాసాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాము. ఇది చాలా కొద్ది సమాచారం వ్రాసిన వారికి, అలానే వ్యాసానికి ప్రాధాన్యత ఉంటేనే. ప్రాధాన్యత లేని వ్యాసాన్ని వ్రాస్తే, మీరు ఫలానా వ్యాసాన్ని సృష్టించినందుకు ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా మనలాంటివారి కృషి మూలంగానే ఏర్పడింది. ఐతే వికీపీడియా మౌలికంగా విజ్ఞానసర్వస్వం. విజ్ఞానసర్వస్వంలోని వ్యాసాలు ప్రాధాన్యత కలిగిన అంశంపైనే ఉండాలి. ఆ క్రమంలో ఈ పేజీలోని ప్రమాణాలను అనుసరిస్తే మీరు సృష్టించిన వ్యాసం వాటిని అందుకోలేదని భావిస్తున్నము. ప్రాముఖ్యత లేని వ్యాసాలు తెవికీ నాణ్యతను దెబ్బతీస్తాయి. పైన పేర్కొన్న ప్రమాణాల ప్రకారం మీ వ్యాసంలోని అంశం ప్రముఖమైనదేనని మీరు భావిస్తే, ఆ అభిప్రాయాన్ని సమర్థించే ఆధారాలతో సహా చర్చ పేజీలో వ్రాయండి. మీరు రాసిన విషయంపై కానీ, మీ కృషిపై కానీ తెవికీకి చాలా గౌరవం ఉందని, కానీ కొన్ని నిబంధనలు మాత్రమే వ్యాసం విషయంలో పాటించాలని మరోమారు గుర్తుచేస్తున్నాము. ధన్యవాదాలు. ఇలా వుండొచ్చు. ఇది నా ఆలోచన. ప్రాధాన్యత లేని విషయం వ్రాస్తే మాత్రం ఆ వ్యాసంలో మూస పెట్టి, సభ్యుని చర్చ పేజీలో ఇలాంటి మూస వేస్తే సరిపోతుంది. కానీ ప్రాధాన్యత ఉన్న తక్కువ సమాచారం కల పేజీలకే మూస చేర్చకుండా వ్యక్తి చర్చపేజీలో రాస్తే బావుంటుందేమోనని అభిప్రాయం. దీనివల్ల మీకు మరిన్ని పనులు పెట్టినవారమైతే క్షమించండి.--పవన్ సంతోష్ (చర్చ) 16:02, 24 ఏప్రిల్ 2015 (UTC)
నిర్వాహక హోదా
పవన్ సంతోష్ గారికి,
మిమ్మల్ని నిర్వాహక హోదా గురించి ప్రతిపాదించాను. దయచేసి మీ సమ్మతిని వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/Pavan santhosh.s పుట లో తెలియజేయగలరు.-- కె.వెంకటరమణ⇒ (చర్చ•విద్యుల్లేఖ) 06:23, 2 మే 2015 (UTC)
- వెంకటరమణ గారూ అంగీకరిస్తూ అక్కడ ప్రతిస్పందించాను. మీవంటి నిబద్ధత కలిగిన నిర్వాహకులు నా కృషిని అవగాహన చేసుకుని, నిర్వాహకత్వం కోసం ప్రతిపాదించడం నాకు చాలా గౌరవప్రదమైన విషయం. ఇందుకు మీకు ధన్యవాదాలు.--పవన్ సంతోష్ (చర్చ) 07:29, 2 మే 2015 (UTC)
ప్రాజెక్టు నిర్వహణ మంచి పద్ధతులు పాటిస్తున్నందులకు గుర్తింపు
- అర్జున గారూ నాణ్యత మీద శ్రద్ధ ఉన్న మీవంటివారు ఇవ్వడం నాకు చాలా స్పెషల్. ఈ బర్న్‌స్టార్ చూడ్డానికి చాలా చాలా బావుంది. --పవన్ సంతోష్ (చర్చ) 16:05, 6 మే 2015 (UTC)
- మీకు నచ్చినందులకు సంతోషం.--అర్జున (చర్చ) 16:17, 6 మే 2015 (UTC)
- మంచి నిర్వహణ పద్ధతులు పాటించినందులకు గుర్తింపు పతకం పొందినందుకు అభినందనలు.--కె.వెంకటరమణ⇒✉ 06:31, 7 మే 2015 (UTC)
- ప్రాజెక్టు నిర్వహణ నందు మంచి పద్ధతులు పాటిస్తున్నందులకు మీకు వచ్చిన పతకమునకు అభినందనలు. JVRKPRASAD (చర్చ) 07:00, 7 మే 2015 (UTC)
- కృషికి తగిన గుర్తింపు పొందినందుకు అభినందనలు. ఐదారేళ్ళక్రితం వరకు ఇలాగే అసలైన కృషిచేసిన వారికే గుర్తింపు లభించేది. మళ్ళీ పూర్వవైభవం తెవికీకి రాబోతున్నట్లు సూచనలందుతుండటం సంతోషకర విషయం. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:49, 7 మే 2015 (UTC)
- ప్రాజెక్టు నిర్వహణ నందు మంచి పద్ధతులు పాటిస్తున్నందులకు మీకు వచ్చిన పతకమునకు అభినందనలు. JVRKPRASAD (చర్చ) 07:00, 7 మే 2015 (UTC)
- మంచి నిర్వహణ పద్ధతులు పాటించినందులకు గుర్తింపు పతకం పొందినందుకు అభినందనలు.--కె.వెంకటరమణ⇒✉ 06:31, 7 మే 2015 (UTC)
- మీకు నచ్చినందులకు సంతోషం.--అర్జున (చర్చ) 16:17, 6 మే 2015 (UTC)
- పతకం బావుంది, ఇలాంటి మంచి పతకం పొందినందుకు శుభాకాంక్షలు..--విశ్వనాధ్ (చర్చ) 15:39, 7 మే 2015 (UTC)
- పతకము పొందినందులకు అభినందనలు.మీ కృషి ఇలాగే కొనసాగి ఇతర సభ్యులకు, ముఖ్యంగా కొత్తవారికి ఆదర్శంగా నిలవాలని కోరుతూ --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 19:07, 8 మే 2015 (UTC)
వికీ డైరీ
మీరా మధ్య వికీడైరీ లాంటి దాని గురించి ప్రస్తావించారు. వాడుకరి:కాసుబాబు/వికీ డైరీ మాదిరిగా ఉపయోగపడుతుందేమో చూడండి.--అర్జున (చర్చ) 10:32, 8 మే 2015 (UTC)
- అర్జున గారూ భలే పేజీ చూపించారు. చాలా బావుందిది.--పవన్ సంతోష్ (చర్చ) 13:38, 9 మే 2015 (UTC)