వాడుకరి చర్చ:Pavan santhosh.s/పాత చర్చ 4

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
     పాత చర్చ 4   
All Pages:  ... (up to 100)


రొయ్య సంబంధిత వ్యాసాల విలీనము

పవన్ గారూ రొయ్య జీర్ణ వ్యవస్థ, రొయ్య శ్వాసవ్యవస్థ మరియు రొయ్య ప్రసరణ వ్యవస్థ వ్యాసాలను రొయ్య వ్యాసంలో విలీనము చేయాలని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలను రొయ్య చర్చా పేజీలో తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 19:03, 8 మే 2015 (UTC)

సుల్తాన్ ఖాదర్ గారూ ఈ విషయంపై నా అభిప్రాయాలను అక్కడ రాశాను చూడండి. నా చర్చ పేజీలో రాసిమరీ చర్చలో భాగం చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. --పవన్ సంతోష్ (చర్చ) 13:40, 9 మే 2015 (UTC)
చక్కని వివరణతో స్పందించినందుకు ధన్యవాదములు పవన్ గారూ.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:01, 10 మే 2015 (UTC)

తెవికీ నిర్వాహకులుగా స్వాగతం

నిర్వాహకత్వ ప్రతిపాదన విజయవంతమై తెలుగు వికీపీడియాలో అత్యధిక సభ్యుల మద్దతు కూడగట్టుకొని నిర్వహకులుగా ఎన్నికైనందుకు మీకు నా హార్థిక శుభాకాంక్షలు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 01:15, 10 మే 2015 (UTC)

మీరు తెలుగు వికీపీడియా నిర్వాహకులు అయినందులకు శుభాకాంక్షలు. JVRKPRASAD (చర్చ) 02:28, 10 మే 2015 (UTC)
  • అంతమంది సభ్యులు నాపై ఈ బాధ్యతను పెట్టారంటే చాలా సంతోషం. దాన్ని నెరవేర్చేందుకు శ్రమిస్తాను. నన్ను ఇందుకు ప్రతిపాదించినందుకు ధన్యవాదాలు వెంకటరమణ గారూ, అనుకూలంగా స్పందించిన 15మంది మిత్రులకీ, శుభాకాంక్షలు తెలియజేసిన ప్రసాద్ గార్కీ కృతజ్ఞతలు. --పవన్ సంతోష్ (చర్చ) 18:11, 12 మే 2015 (UTC)

దన్యవాదాలు

సార్ నమస్తే

తెవిపీ నాకు చాలావరకు ఇప్పటి వరకు చాలా విషయాలు అర్ధం కాలేదు, ఆందుకే తప్పులు జరుగుచున్నవి, ఏంతగా అంటే కనీసం ఖాతా ప్రారంబించిన కొద్ది రోజుల్లో మీకు దన్యవాదాలు చెప్పడం నాకు రాలేదు. అందుకే మీలాంటి అనుభవం ఉన్నవారి వద్ద సలహాలు అడిగి పలువిషయాలు నేర్చుకుంటున్నాను, తెలువక పలు తప్పులు జరిగాయాని మన్నించాలని కోరుతు, Pavan santhosh.s మీ ద్వారా చెబుచున్నాను. దన్యవాదాలు...--నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 06:46, 14 మే 2015 (UTC)

నోముల ప్రభాకర్ గౌడ్ గారూ మన్నించడం లాంటి పెద్ద పెద్ద మాటలెందుకండీ. ఏది నేర్చుకునేప్పుడైనా ఇవన్నీ సహజం. ఇప్పటికీ ఈ ఫోటోలకు లైసెన్సులు చేయడంలో కొన్ని ఇబ్బందులు పడేవాళ్ళం ఉన్నాం. అటువంటప్పుడు మీరింత చొరవ తీసుకుని చేయడమే గొప్ప విషయం. కాకుంటే కామన్స్ లో మీ అక్కౌంట్ ఏమైనా బ్లాక్ అవుతుందేమోనని ముందస్తుగా జాగ్రత్త చెప్పాను. మరోమారు కామన్స్ ఫోటోల విషయంలో సూచనలు చేస్తున్నాను గమనించండి: మీరే తీసిన ఫోటోలు పెట్టండి.. నేర్చుకునే దశలో అది ఉత్తమం, అలానే లైసెన్సు వివరాలు చదువుకుంటూ నింపండి. ఇక ముఖ్యమైన విషయమేంటంటే ఎవరి ఫోటో అయినా తీసినప్పుడు ఒక పబ్లిక్ సమావేశంలా కనిపించే ప్రదేశంలో తీయండి. ఉదాహరణకు వారేదైనా మీటింగులో మాట్లాడుతున్న ఫోటోలాంటిది. దానివల్ల కొన్ని సమస్యలు తగ్గుతాయి. మీరు భవిష్యత్తులో వికీసముదాయానికి గొప్ప ఆస్తిలా నిలుస్తారని నమ్ముతున్నాను, అలానే అన్నీ తెలిసినవారెవరూ లేరన్నది కూడా సత్యం. ఉంటాను సర్. --పవన్ సంతోష్ (చర్చ) 13:33, 14 మే 2015 (UTC)

గూగుల్ లో డాక్టర్ వేంపల్లి గంగాధర్ కు వెళ్లి నప్పుడు తొలగించి నట్లు చూపిస్తోంది . ?

YesY సహాయం అందించబడింది


220.227.251.29 03:53, 11 జూన్ 2015 (UTC) పవన్ గారు నమస్కారాలు . నా పేరు ముందు 'డాక్టర్ ' తొలగించారు ...కారణం ఏమిటి ? గూగుల్ లో డాక్టర్ వేంపల్లి గంగాధర్ కు వెళ్లి నప్పుడు తొలగించి నట్లు చూపిస్తోంది . వేంపల్లి గంగాధర్ ఫైల్ అయినా డైరెక్ట్ గా గూగుల్ లో చూపించే విధంగా చేయ గలరు . మీ వృత్తి ఏమిటి ,ఎక్కడ ఉంటారు ....

నమస్తే. తెవికీలోనే కాక మొత్తం వికీపీడియాలన్నిటిలోని లిఖిత నియమమొకటి వుంది. అదేమిటంటే అత్యంత అసాధారణ పరిస్థితుల్లో తప్ప సామాన్యంగా వ్యాసం పేర్లు పెట్టేప్పుడు, బిరుదులు, గౌరవాలు వుండకూడదు. ఇప్పటికీ తెవికీలో నిర్వాహకులు చూడకపోవడం వల్ల అలాంటి పేజీలు కొన్ని ఉంటే వుండవచ్చును కానీ నియమానుసారం చూస్తే మాత్రం డాక్టర్ తొలగించి పేరు ఉంచుతాము. కొన్ని అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రం (ఉదాహరణకు డాక్టర్ బి సి రాయ్ అన్న పేరుమీదుగా ఓ ప్రఖ్యాత పురస్కారమే వుంది, అంటే ఆయన డాక్టర్ అన్న ప్రీఫిక్స్ తో ఏకంగా పురస్కారమే కలిగివున్నంతగా ప్రఖ్యాతులయ్యారు) వుండొచ్చో లేదో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చును. అయితే ఇది మాత్రం అత్యంత అరుదైన సందర్భాల్లో. మిమ్మల్ని అగౌరవించడం నా ఉద్దేశం కాదు. ఈ సందర్భంలో డాక్టర్ వేంపల్లి గంగాధర్ అన్న పేజీలోని సమాచారాన్నంతా వేంపల్లి గంగాధర్ అనే పేజీలోకి తరలించాను. వికీపీడియాలో చేసిన మార్పులను, మరీ ముఖ్యంగా వ్యాసం పేరుమార్పులను, గూగుల్ అతివేగంగా పట్టుకోలేదు. కనుకనే వేంపల్లి గంగాధర్ అన్నా, డాక్టర్ వేంపల్లి గంగాధర్ అన్నా ప్రస్తుతానికి తొలగించిన పేజీల్లోకి వెళ్తోంది. కానీ ఓ వారం రోజుల తర్వాత చూస్తే మాత్రం కంటెంట్ ఉన్న ప్రస్తుతపు పేజీకే వెళ్తుంది. అంతవరకూ వేచివుంటే సరిపోతుంది. వారం తర్వాత డాక్టర్ చేర్చి వెతికినా వేంపల్లి గంగాధర్ పేజీకే పంపుతుంది. ఎందుకంటే ఆ వ్యాసంలో ప్రారంభంలోనే డాక్టర్ ప్రీఫిక్స్ గా చేర్చి పేరు రాసివుంది కనుక. ఇది కేవలం గూగుల్ సాంకేతిక ఆలస్యమే, అదీ తొందరలో సరిఅవుతుంది.--పవన్ సంతోష్ (చర్చ) 06:10, 11 జూన్ 2015 (UTC) (నా వృత్తి, వేర్ అబౌట్స్ మీకు వ్యక్తిగతంగా మెయిల్లో తెలుపుతాను.)
@పవన్ సంతోష్ డాక్టర్ బి సి రాయ్ సరియైన వ్యాసం పేరుతో విలీనం చేసినప్పుడు అలానే మిగిలిపోయింది. దానిని తొలగించాను. ఇలాంటివి ఇంకా చాలా వున్నట్లున్నాయి. వాటిని కూడా తొలగించాలి. --అర్జున (చర్చ) 04:07, 12 జూన్ 2015 (UTC)

జూన్ రెండవ వారం వెళ్ళిపోయింది

సంతోష్ గారూ నమస్తే, రచ్చబండలో మీ సమాధానం చదివి (సినిమా వ్యాసాలకు సంబంధించింది) నవ్వు ఆపుకోలేక పోయాను. వెల్ సెడ్.... అలాగే జూన్ రెండవ వారం గడిచిపోయి నెలన్నర అపోయింది. కానీ మీరు సెలవు మూసను తీయలేదు. గమనించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 17:11, 22 జూలై 2015 (UTC)

:-) థాంక్యూ, నా మాటలు నచ్చినందుకూ, నాకు మూస గురించి గుర్తుచేసినందుకూ. జూన్ రెండోవారం ముగిసినా సెలవు మూస తీయలేదన్నది గుర్తుచేసినందుకు ధన్యవాదాలు, అయితే మూస తీయకపోయినా అంతకన్నా ముందునుంచే నేను వికీలో యాక్టివ్ అయిపోవడం చూసేవుంటారు. మీరు చెప్పాకా ఇప్పుడే తీశాను. థాంక్స్ అగైన్.--పవన్ సంతోష్ (చర్చ) 05:32, 23 జూలై 2015 (UTC)

పుస్తకాల కాపీ హక్కులు

పవన్ గారూ, పుస్తకాల కాపీ హక్కులు ముద్రించిన ఎన్ని సంవత్సరాల వరకు ఉంటాయి. కామన్స్ లోని చర్చలో డిజిటల్ లైబ్రరీలో గ్రంథం 1988 లో ముద్రించబడింది కనుక కామన్స్ చర్చలో 2049 వరకు కాపీహక్కులు ఉంటాయి కనుక "File:SuprasiddulaJeevithaVisheshalu.djvu" ను తొలగించారని చెబుతున్నారు. కాపీహక్కుల గురించి మూలం ఏదైనా ఉంటే తెలియజేయండి. ఆ చర్య సరియైనదేనా?--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 13:36, 23 జూలై 2015 (UTC)

కాపీహక్కులు ముద్రించిన సంవత్సరం కాకుండా సాధారణంగా రచయిత మరణించిన 60 ఏళ్ళవరకూ చెల్లుబాటు అవుతాయి. అయితే ఇక్కడ స్థితి చూస్తే మాత్రం, ఈ లింకు పరిశీలిస్తే లింకు టెక్స్ట్ లోనే rights1=OUT_OF_COPYRIGHT అని రాశారు. నిజానికి కాపీహక్కుల చట్టం ప్రకారం కాపీహక్కుల పరిధిలోనే ఉన్న ఈ పుస్తకాన్ని DLI వారు కాపీహక్కు కలిగివున్నవారిని కలిసి కాపీహక్కులు విడిపించారు. --పవన్ సంతోష్ (చర్చ) 13:40, 23 జూలై 2015 (UTC)

Unused images without license

Hello, I made a list of images without licensing information (probably unfree) which are also unused. They must be deleted per wmf:Resolution:Licensing policy, unless they have a valid free license. Where can I ask deletion? Nemo bis (చర్చ) 14:33, 2 అక్టోబరు 2015 (UTC)

Nemo bis one of the two files I've uploaded is a cover page of the book, it is very much useful in article of that book. Even though I've added the file in infobox of the book, it doesn't became active in article due to unknown (to me) reasons. So, I've added the file in another way. Now its in use. --పవన్ సంతోష్ (చర్చ) 16:30, 2 అక్టోబరు 2015 (UTC)

మొదటి సినిమా వ్యాసాలు - పరిమితులు

పవన్ గారూ, కౌముది.నెట్ లోని గ్రంధాలయ విభాగంలో మొదటి సినిమా 1, 2, 3 విభాగాలు ఉన్నవి. మీరు సూచించిన విభాగము ఇదే నని భావిస్తున్నాను. ఈ సినిమా వ్యాసాలలో ఆయా సినిమాల గురించే కాకుండా వాటి దర్శకుల గురించి కూడా విస్తృత సమాచారము ఉన్నది. ఉదాహరణకు దర్శకుడు ఎ. మోహన గాంధీ గారి మొదటి సినిమా అర్ధాంగి (1977 సినిమా) వ్యాసంలో దర్శకుడి గురించిన సమాచారం కూడా లభిస్తున్నది. ఈ సమాచారం అధారంగా, సినిమా వ్యాసాల ప్రాజెక్టులో భాగంగా ఎ. మోహన గాంధీ వ్యాసాన్ని కూడా విస్తరించవచ్చునా? లేదా కేవలం [[[అర్ధాంగి (1977 సినిమా)]] ను మాత్రమే విస్తరించవలెనా? తెలుపగలరు. అలాగే ఈ వ్యాస మూలాన్ని ఏ శైలిలో చేర్చాలో తెలుపగలరు. ఉదా :
<ref name="Modati Cinema - Kaumudi.net">{{cite web|url=http://www.koumudi.net/books/modaticinema_koumudi.pdf|title=మొదటి సినిమా - పార్ట్ 1 |publisher=కౌముది.నెట్|date= తెలియదు|accessdate=2015-10-16}}</ref>

వ్యాసాల అభివృద్ధి సంగతి: సుల్తాన్ ఖాదర్ గారూ సమస్తే. ఈ ప్రణాళిక తెలుగు సినిమా మూలాలను ఉపయోగించుకుని వాటి ద్వారా అభివృద్ధి చేయదగిన వ్యాసాలను అభివృద్ధి చేయడం. అందుకుగాను ఈ ప్రణాళికలో పాలుపంచుకునేవారు కనీసం ఒక్కో మూలాన్నీ స్వీకరించి చేస్తున్నాం. ఐతే ఒక్క మూలంతో ఒక్క వ్యాసాన్నే అభివృద్ధి చేయాలనేమీ లేదు. అన్నే మోహనగాంధీ రాసిన వ్యాసంతో అర్థాంగి వ్యాసాన్ని, మోహనగాంధీ వ్యాసాన్ని కూడా అభివృద్ధి చేయవచ్చు. ఈ రెండు వ్యాసాలు ఆ మూలంతో బాగా అభివృద్ధి చెందుతాయి. అంతేకాక మరికొన్ని వ్యాసాలుంటాయి వాటిలోకీ సమాచారం చేరుతూంటుంది. ఉదాహరణకు ఈ వ్యాసంలోని ఛాయామాత్రమైన సమాచారం వాడి అల్లుడొచ్చాడు అన్న సినిమానూ కొంత అభివృద్ధి చేశాను. చేర్చింది ఒక్క శీర్షిక, అందులో ఓ వాక్యమే కానీ నేను సైతం ప్రపంచాగ్నికి అన్నట్టుగా ఓ రెండు ముక్కలు, ఒక మూలం చేర్చినా చేర్చినట్టేనని లెక్క. (వ్యాసంలో ఆ సినిమా గురించి అంతకన్నా సమాచారం దొరకలేదు) ఇలా చాలా వ్యాసాలకే మేళ్ళు చేయొచ్చు. ఇదంతా ప్రణాళిక పరిధిలోని విషయమే. --పవన్ సంతోష్ (చర్చ) 11:04, 17 అక్టోబరు 2015 (UTC)
మూలం తెలిపే సంగతి: మూలం తెలిపడంలో రెండు పద్ధతులు స్వీకరించవచ్చు. మొదటిది- దీన్ని వెబ్ సోర్సుగా పరిగణించి cite web ద్వారా నింపడం. దీనిలో నింపాలంటే ఇదిగో ఇదీ మోడల్ ref name="first movie mohan gandhi">{{cite web |url= http://www.koumudi.net/books/modaticinema_koumudi.pdf|title= అన్నే మోహన్ గాంధీ-మొదటి సినిమా|last1= అన్నే|first1= మోహన్ గాంధీ|last2= |first2= |date= |website= కౌముది|publisher= |accessdate=29 ఆగష్టు 2015}} </ref>వెబ్సైట్ వేరు, పబ్లిషర్ వేరు కాబట్టి వెబ్సైట్ కౌముది అనో, కౌముది.నెట్ అనో రాసేసి పబ్లిషర్ మనకు తెలియదు కనుక ఖాళీగా వదిలేయాలి, అలానే డేట్ కూడా ఖాళీగానే వదిలేస్తాం. ఏదైనా మనవద్ద సమాచారం లేనప్పుడు ఖాళీగా వదిలేస్తేనే సరి అని నా లెక్క. రెండోది- దీన్ని మేగజైన్ మూలంగా పరిగణించడం. ఈ వ్యాసాలన్నీ ఇప్పుడంటే సంకలనం చేసి ఇలా మూడు సంపుటులుగా ప్రచురించారు కానీ మొదట ఈ వ్యాసాలన్నీ కౌముది.నెట్లో ప్రతి నెల సంచికలో ప్రచురించారు. 2008-09 కాలంలో ప్రచురితమైవున్నాయి. అవి తెరచుకుని ఒక్కో వ్యాసాన్నీ మేగజైన్లో ప్రచురితమైన వ్యాసంగా పరిగణించి ఆ ప్రకారం సైటేషన్ ఇవ్వవచ్చు. ఉదాహరణకు <ref name="బీరం మస్తాన్ రావు మొదటి సినిమా">{{cite journal|last1=బీరం|first1=మస్తాన్ రావు|title=బీరం మస్తాన్ రావు-మొదటి సినిమా|journal=కౌముది.నెట్|date=ఫిబ్రవరి 2008|url=http://www.koumudi.net/Monthly/2008/february/index.html|accessdate=17 October 2015}}</ref>. ఈ రెండో పద్ధతి వల్ల శ్రమ పెరుగుతుంది. ఫలితం ఏమాత్రం ఉంటుందో నాకు తెలియదు. అందువల్ల మీరేది తేలికగా మంచిగా ఉందనుకుంటే అది ఇవ్వగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 11:23, 17 అక్టోబరు 2015 (UTC)
ధన్యవాదాలు పవన్. ఈ పీడీఎఫ్ లలోని ఫాంటుని వికీ ఫ్రెండ్లీ ఫాంటు లోనికి మార్చడానికి ఏమైనా ఉపకరణాలు ఉన్నచో తెలుపగలరు. ఈ మ్యాటర్ మొత్తం టైపు చెయ్యవలెనంటే సమయం పట్టుచున్నది. అలా కాకుండా మ్యాటర్ మొత్తాన్ని తెలుగు ఫాంటులోనికి మార్చుకొని తర్వాత వికీ శైలికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకొన్నచో ఈ అదనపు శ్రమ తప్పుతుంది. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 17:12, 20 అక్టోబరు 2015 (UTC)
  • సుల్తాన్ ఖాదర్ గారూ ఈ చర్చ చూడండి. ఇందులో కశ్యప్ గూగుల్ డాక్స్ లోకి ఏదైనా పీడీఎఫ్ ఎక్కించి అక్కడ మనకు పనికివచ్చే టెక్స్ట్ కిందికి మారుతుందని చెప్తున్నారు. వ్యక్తిగతంగా నాతో ఓమారు చెప్పినా నేనైతే ఎప్పుడూ వాడలేదు కనుక ప్రయోగించిన అనుభవం లేదు. ఒకసారి ప్రయోగించి చూడండి. మీకేదైనా సమస్య కలిగితే కశ్యప్, మీరు, నేను కలిసి ఓ వర్చువల్ సమావేశం ద్వారా మాట్లాడి చూద్దాం. --పవన్ సంతోష్ (చర్చ) 17:44, 22 అక్టోబరు 2015 (UTC)
పవన్ సంతోష్ గారూ చర్చ లింకు ఇవ్వగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:58, 1 నవంబర్ 2015 (UTC)


పేజీలు ఆంగ్ల పాఠ్యంతో ప్రారంభించడం గురించి

పవన్ సంతోష్ గారూ,మీ సూచనలకి ధాన్యవాదము. నేను వికిపిడియా కి కొత్త వాడిని కనుక నాకు ఆంగ్ల వికిపిడియా అర్థం కావడం లేదు. నేను రాసేందుకు ప్రయత్నిస్తే ఆ ఆర్టికల్స్ నిలువడం లేదు కనుక మీరు నాకు ఆంగ్ల పాఠ్యం 21st (2015 film) అనే ఆర్టికల్ రాసి సహాయం చెయ్యవలసిందిగా నా మనవి [[వాడుకరి:|JAISHANKAR DIRECTOR ]] (చర్చ) 23:11, 7 నవంబర్ 2015 (UTC)

జైశంకర్ గారూ, వాడుకరి:JAISHANKAR DIRECTORP ఆంగ్ల వికీపీడియాలో మీ చర్చ పేజీ చూశాను. అక్కడైనా, ఇక్కడైనా మీకు ఎదురవుతున్న సమస్యలకు ప్రాథమికమైన మూలం మీ సినిమాల గురించి, మీ గురించి మీరే రాసుకోవడం. అన్ని వికీపీడియాల్లోనూ ఇది నిషిద్ధమే. తెలుగు వికీపీడియాలో కూడా మీరు ప్రారంభించిన రెండు పేజీలు ఎవరో ఒక నిర్వాహకుడు తొలగిస్తారు, ఎందుకంటే అది మొదటి నియమం కనుక. వికీపీడియాలో మీ గురించి మారు రాసుకోవడానికి ఉన్న ఒకే ఒక స్థలం మీ వాడుకరి పేజీ. ఎందుకంటే మన గురించి, మనం పనిచేస్తున్న సినిమాల గురించి మనం నిష్పక్షపాతంగా రాయలేం కనుక ఈ నియమాన్ని వికీపీడియాల్లో ఎప్పటినుంచో అమలుచేస్తున్నారు. మీరు తొలగించినా పదేపదే అవే పేజీలు సృష్టించడంతో మిమ్మల్ని ఆంగ్లవికీలో నిరవధికంగా బ్లాక్ చేశారు. ఇప్పుడు నన్ను మీరు ఆంగ్లవికీలో ఆ పేజీలు ప్రారంభించమని సూచించారు. ఐతే ఆంగ్ల వికీపీడియాలో నోటబిలిటీ (విషయ ప్రాముఖ్యత)కి చెందిన అంశాలు చాలా బలంగా ఉంటాయి. చాలామంది ప్రతీ వ్యాసాన్ని పరిశీలించి తదనుగుణంగా లేకుంటే తొలగిస్తూంటారు. నేను ఆంగ్లంలో ఇప్పుడు కొత్తగా మీ పేజీ ప్రారంభించినా ఇప్పటికే నాలుగు సార్లు డిలీట్ అయివున్న పేజీ కనుక ఆ విషయం ఆ పేజీ సృష్టించేవారందరికీ కనిపిస్తుంది కనుక వెనువెంటనే డిలీట్ చేసేస్తారు. ఒకేమాటలో చెప్పాలంటే మీ సినిమా గురించి మీరు రాసుకోవడం, అందులోనూ పదేపదే రాసి బ్లాక్ అవడం వల్ల ఇప్పుడు విడుదలై డిస్ట్రిబ్యూట్ అయ్యేంతవరకూ నాబోటిగాడు ఆంగ్లంలో పేజీ సృష్టించడం కష్టం. అలాగే మరో విషయం, వెనువెంటనే ఆంగ్ల వికీలో మరో ఖాతా సృష్టించి రాసే ప్రయత్నం చేయవద్దు. ఎన్నిరకాలుగా చేసినా మీ గురించి మీరు రాసుకోవడం వాళ్ళు పడనివ్వరు. నా సమాధానం కటువుగా ఉంటే మరోలా అనుకోవద్దు, నేను చెప్పిన నిబంధనలు కటువు కాబట్టి తప్పలేదు. --పవన్ సంతోష్ (చర్చ) 05:52, 23 నవంబర్ 2015 (UTC)

పేజీలు ఆంగ్ల పాఠ్యంతో ప్రారంభించడం గురించి

పవన్ సంతోష్ గారూ నాకు తెలియని విషయాలు వివరంగా చెప్పినందుకు చెప్పినందుకు గారూ మీ కృతజ్ఞతలు.

నా కృషిని గుర్తించినందుకు ధన్యవాదములు

పవన్ సంతోష్ గారూ అక్షరదోశ నిర్మూలన దళం లో చేరి తెవికీకి నవంతు కృషి చేయాలనుకుంటున్నాను, దయచేసి నా వాడుకరి పేరును తెలుగులోనికి మార్చగలరు (Muraliyelle (చర్చ) 05:07, 10 డిసెంబరు 2015 (UTC))

తెనాలి

నా దిద్దుబాటు తెనాలి.--Vin09 (చర్చ) 16:59, 20 డిసెంబరు 2015 (UTC)

వినయ్ గారూ తెవికీకి సాదర స్వాగతం. మీ కృషి కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఏ సహకారం అవసరమైనా అందించడానికి నేను సిద్ధమే. ఇక తెనాలి నగరం కనుక రెవెన్యూ గ్రామమన్నది మార్చి నగరం అన్నది చేర్చారు. ఐతే జనాభా ఎలా మార్చారు. మీకున్న మూలాలు ప్రస్తుతం గతంలోని సమాచారం ఉన్న మూలాల కన్నా ఏ విధంగా సరైనవి? అలాగే ప్రభుత్వాధినేత పేరు రాశారు. మూలం ఇవ్వగలరా? --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 03:14, 21 డిసెంబరు 2015 (UTC)
ఐతే జనాభా ఎలా మార్చారు. - > [2] అని ఉంది జనాభా దెగ్గర, ఆ లింక్ ని క్లిక్ చెయ్యండి. ఇ సెక్షన్ ని చూడంది. మీకున్న మూలాలు ప్రస్తుతం గతంలోని సమాచారం ఉన్న మూలాల కన్నా ఏ విధంగా సరైనవి? -> Census of India అనేది భారత ప్రభుత్వం జనాభా లెక్కల వెబ్ సైట్.--Vin09 (చర్చ) 06:41, 21 డిసెంబరు 2015 (UTC)

భౌతికశాస్త్ర వ్యాసాల సృష్టి

ఆంధ్ర లయోలా కాలేజీ విద్యార్థులు భౌతిక శాస్త్ర విభాగంలో వ్యాసాలు వ్రాస్తున్నారు. అందులో యిదివరకు లేని వ్యాసాలను సృష్టిస్తే బాగుంటుంది. వికీలో భౌతిక శాస్త్రంలొ ముఖ్యమైన విషయాలను తెలియజేసే భౌతిక శాస్త్రము - పారిభాషిక పదాలు (ఆంగ్లం - తెలుగు) మరియు భౌతిక శాస్త్ర నిఘంటువు వ్యాసాలలోని ఎర్ర లింకులు గల పదాలను విస్తరణ చేయిస్తే బాగుంటుంది. తరువాత యితర జాబితాలను తయారుచేయవచ్చు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 16:29, 14 జనవరి 2016 (UTC)

ఈ ప్రతిపాదన బాగుంది.--Rajasekhar1961 (చర్చ) 16:34, 14 జనవరి 2016 (UTC)
  • ఆలోచన బావుందండీ. ఓసారి అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులకు కూడా తెలియజేస్తాను. ఐతే మరో చిన్న సమస్య. ఇక్కడ తెలుగు పదం - అర్థం పెట్టారు, సరే. దానికి ఆంగ్ల సమానార్థకం కూడా వుంటే మరింత తేలిక అవుతుందేమో! --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 08:43, 15 జనవరి 2016 (UTC)

ప్రతిపాదన

పవన్ సంతోష్ గారు, నేను ఇళయరాజా వ్యాసాన్ని విశేష వ్యాసాల్లో చేర్చటం కొరకు ప్రతిపాదించాను. దయచేసి మీ సలహాలు, సూచనలు క్రింది లంకె ల తెలుపగలరు , ధన్యవాదములు.
వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/ఇళయరాజా KingDiggi (చర్చ) 11:08, 5 ఫిబ్రవరి 2016 (UTC)

కింగ్ డిగ్గీ గారూ మీ ప్రయత్నం చాలా బావుంది. మీరు ఇళయరాజా వ్యాసాన్ని చక్కగా అభివృద్ధి చేసినట్టూ వ్యాస చరిత్రలో తెలుస్తోంది. బాగా చూసి సూచనలు తెలియజేస్తాను. అభినందనలు. --పవన్ సంతోష్ (చర్చ) 06:58, 6 ఫిబ్రవరి 2016 (UTC)

Geographical Indications in India Edit-a-thon

​Hello,

Geographical Indications in India collage.jpg

Sorry for writing in English
CIS-A2K is going to organize an edit-a-thon between 25 and 31 January this year. The aim of this edit-a-thon is creating and improving List of Geographical Indications in India related articles.

We welcome all of you to join this edit-a-thon.
Please see the event and add your name as a participant: meta:CIS-A2K/Events/Geographical Indications in India Edit-a-thon

Feel free to ask if you have question(s).
Regards. --Titodutta (చర్చ) 20:11, 21 జనవరి 2016 (UTC)

వ్యాసాలు - మొలకలు

పవన్ గారు, మీకు మొలకలు జాబితా పట్టిక చిత్తు రూపం చేసి ఇస్తాను. మిగతా వాడుకరులతో సంప్రదించి పట్టికను కావల్సిన విధముగా తయారు చేయవచ్చును. ఏ సంగతి తెలియజేయండి. JVRKPRASAD (చర్చ) 06:56, 23 జనవరి 2016 (UTC)

JVRKPRASAD గారూ, బహుశా మీరు మొలకలు-వాటిని సృష్టించినవారి పేరుతో పాటుగా, ఆ మొలకలు తర్వాత ఏ మేరకు అభివృద్ధి చెందాయి అన్న విషయాన్ని కూడా చేర్చాలి అన్నట్టుగా చేసిన గత ప్రతిపాదన గురించే ఇది రాశారని భావిస్తున్నాను. మీరు జాబితా పట్టిక చిత్తు రూపం తయారుచేసి ఇవ్వడం ముదావహం. దానిపై చర్చించి చేయవచ్చు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:01, 6 ఫిబ్రవరి 2016 (UTC)