Jump to content

వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/రహ్మానుద్దీన్

వికీపీడియా నుండి

మీ మద్దతు ఇక్కడ తెలుపుము (డిసెంబర్ 11, 2013) ఆఖరి తేదీ : (జనవరి 25, 2014)
తెలుగు వికీపీడియా నిర్వహణలోనూ, వికీఅకాడెమీలు నిర్వహించడంలోనూ కలిగే కొన్ని ఇబ్బందులకు అధికార హోదా ఒక సుమార్గంగా కనిపిస్తున్నది. అందువలన నేను స్వతంత్రంగా అధికార హోదా కొరకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నా గురించి చెప్పాలంటే, గత నాలుగేళ్ళుగా తెవికీలో పని చేస్తున్నాను (ప్రస్తుత వాడుకరి నామంతో రెండేళ్ళుగా). వికీ శిక్షణ శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించాను. వికీ భారతదేశం చాప్టర్ లో తెలుగు విశేష అభిరుచి జట్టుకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ఇంకేదైనా ప్రశ్నలుంటే చర్చాపేజీలో రాయండి, నేను స్పందిస్తాను--రహ్మానుద్దీన్ (చర్చ) 17:53, 11 డిసెంబర్ 2013 (UTC)

ప్రశ్నలు-సమాధానాలు

వివరించండి

[మార్చు]

అధికార హోదా కొరకై స్వీయ ప్రతిపాదన చేసి చక్కని ఒరవడిని ప్రారంభించినందుకుకొనసాగించినందుకు ముందుగా ధన్యవాదాలు.

  • మీకు అధికార హోదా లేని కారణంగా ఏ ఇబ్బందులు ఎదురయ్యాయో వివరించండి. తెలుగు వికీపీడియా నిర్వహణలోనూ, వికీఅకాడెమీలు నిర్వహించడంలోనూ అధికారహోదా ఏ విధంగా ఉపయోగపడుతుందో నాకర్ధం కాలేదు. నాకు తెలిసినంత వరకూ నిర్వాహకుడు చెయ్యలేని, అధికారి చెయ్యగల ముఖ్యమైన పనులు ౧) ఇతర సభ్యులను అధికారులు, నిర్వాహకులు, బాట్లను చెయ్యగల సౌలభ్యం ౨) వాడుకరి పేరు మార్చుచెయ్యగల సౌలభ్యం. ఈ రెండవ అధికారాన్ని కేంద్రీకరించి, స్థానిక అధికారుల చేతుల్లో తీసివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది నాకు తెలిసింది. అఫ్‌కోర్సు నాకు తెలియనిది ఉండవచ్చు లేదా నాకు తెలిసినది తాజా సమాచారం కాకపోవునూ వచ్చు. అందుకే తెలుసుకోవాలని ప్రశ్నిస్తున్నాను. --వైజాసత్య (చర్చ) 07:37, 12 డిసెంబర్ 2013 (UTC)
  • వైజాసత్య గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఎదురయిన ఇబ్బంది వాడుకరి పేరును మార్చడం. ఇంకా వాడుకరి పేర్లు అధిక సంఖ్యలో సృష్టించే అధికారం కూడా బ్యూరోక్రాట్ కి ఉందని గ్రహించాను. అంతకు మించి, సాధారణంగా తెలుగు వికీపీడియాలో తోటి అధికారులకు సహాయకంగా ఉండాలన్నది కూడా ఒక ఆశయం. --రహ్మానుద్దీన్ (చర్చ) 07:49, 12 డిసెంబర్ 2013 (UTC)
క్షమించాలి. మీరు కూడ స్వయంప్రతిపాదన చేసుకున్నారని మరచిపోయాను. నేనూ స్వయంప్రతిపాదితున్నే :-) కాకపోతే అప్పటికి స్థానికంగా ఈ పేజీ లేదు, ఒక పద్ధతంటూ ఏర్పడలేదు. బహుశా, నేను రచ్చబండలో అధికారి హోదా కోరుతున్నాను అని వ్రాసినట్టున్నాను. --వైజాసత్య (చర్చ) 06:44, 31 డిసెంబర్ 2013 (UTC)
  • రహ్మానుద్దీన్ గారికి, నాకు తెలిసి వాడుకరి పేర్లు అధిక సంఖ్యలో సృష్టించే అధికారం బ్యూరోక్రాట్ కి లేదు. ఏమైనా ఆధారం వుంటే పేర్కొనండి. --అర్జున (చర్చ) 05:36, 31 డిసెంబర్ 2013 (UTC)
  • అధికారి హోదా ద్వారా వాడుకరుల పేరు మార్చడం వరకూ నాకు తెలుసు. ఇంకా ఇతర అధికారాల గురించి మరింత అవగాహన పెంచుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి అకౌంట్ రిక్వెస్ట్ పేజీ వాడుకునేలా కొత్త సభ్యులను కోరుతున్నాను. అలానే మార్పుల థ్రాటిల్ ఎదురవకుండా ఉండేలా ఏమయినా మార్గాలున్నాయా? --రహ్మానుద్దీన్ (చర్చ) 14:29, 1 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఏకాభిప్రాయాన్ని సమీకరించి నిర్ణయం చేయటం

[మార్చు]
  • అధికారిగా నిర్వాహకునికంటే క్లిష్టమైన అంశాలపై ఏకాభిప్రాయాన్ని సమీకరించగలిగి నిర్ణయం చేయగలగాలి. మీ నిర్వాహకఅనుభవంలో క్లిష్టమైన అంశాలకు దగ్గరిగావున్నటువంటి వాటిపై మీ నైపుణ్యాలను తెలిపే ఉదాహరణలేవైనా వుంటే తెలపండి.--అర్జున (చర్చ) 05:54, 31 డిసెంబర్ 2013 (UTC)
  • ఈ కిందివి కొన్ని నేను నిర్వాహకునిగా చేసినవి :
  1. పేజీలు తొలగించడంలో మరింత అనుభవజ్ఞత.
  2. పేజీలు తరలించడంలోని మెళకువలు
  3. కొన్ని అనవసరపు మార్పులు చేస్తున్న వాడుకరులను, ఐపీ అడ్రెస్ లను నిరోధించడం
  4. కొన్ని అవసరమున్న తీసివేయబడిన పేజీలను పునఃస్థాపించడం మొదలగునవి.

ఇంకా ఎన్నో విషయాలు నిరంతరం సీనియర్ సభ్యుల నుండి తెలుసుకొని నడుచుకుంటానని తెలియజేస్తున్నాను, --రహ్మానుద్దీన్ (చర్చ) 15:00, 1 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]


ప్రతిపాదనపై సభ్యుల అభిప్రాయాలు

[మార్చు]
మద్దతు(In favour)
  1. --కె.వెంకటరమణ (చర్చ) 04:00, 29 డిసెంబర్ 2013 (UTC)
  2. శుభం. క్రియాశీలకంగా వున్నవారు, టెక్నికల్ విషయాల పట్ల అవగాహన వున్నవారు, అధికార హోదా పొంది, తెవికీను నడపడానికి ముందుకు రావడం శుభ పరిణామమే. అహ్మద్ నిసార్ (చర్చ) 04:55, 29 డిసెంబర్ 2013 (UTC)
  3. రహ్మానుద్దీన్ గారి అధికార హోదా ప్రతిపాదనకు నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:15, 29 డిసెంబర్ 2013 (UTC)
  4. తెవికీ అధికారి హోదాకై రహ్మానుద్దీన్ గారి స్వీయ ప్రతిపాదనకు మద్దతు తెలుపుతున్నాను సి. చంద్ర కాంత రావు- చర్చ 20:01, 29 డిసెంబర్ 2013 (UTC)
  5. స్వ ప్రతిపాదనకు మద్దతు YVSREDDY (చర్చ) 02:21, 31 డిసెంబర్ 2013 (UTC)
  6. రహ్మానుద్దీన్ గారి అధికార హోదా ప్రతిపాదనకు నా మద్దతు ప్రకటిస్తున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 03:28, 31 డిసెంబర్ 2013 (UTC)
  7. . రహ్మానుద్దీన్ గారి అధికారి హోదా ప్రతిపాదనకు మనఃపూర్వక మద్దతు తెలియజేస్తున్నాను. --t.sujatha (చర్చ) 04:19, 31 డిసెంబర్ 2013 (UTC)
  8. .రహ్మానుద్దీన్ గారి అధికారి హోదా ప్రతిపాదనకు నా మద్దతు తెలుపుతున్నాను.--శ్రీరామమూర్తి (చర్చ) 12:48, 31 డిసెంబర్ 2013 (UTC)
  9. వికీలో చురుగ్గా ఉండడం, వికీ శైలి పట్ల, వికీ విధానాల పట్ల చక్కటి అవగాహన కలిగి ఉండడం, తోటి వాడుకరులతో వ్యవహరించే శైలి, వికీకి సంబంధించిన బాధ్యతలను జాలంలోను, బయటా నిర్వర్తించేందుకు ఉత్సాహంగా ముందుకు రావడం - ఈ కారణాల వల్ల రహ్మనుద్దీన్ గారి ప్రతిపాదనను నేను సమర్ధిస్తున్నాను. --చదువరి (చర్చరచనలు) 14:15, 1 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  10. రహ్మానుద్దీన్ సాంకేతికంగా నైపుణ్యం కలిగి, తెవికీలోనూ, తెవికీ బయటా, తెవికీ గురించి చాలా క్రియాశీలకంగా ఉత్సాహం గా పనిచేయటమే కాకుండా అనునిత్యం తెవికీ అభివృధ్ధి గురించి తపన పడే వ్యక్తి. రహ్మనుద్దీన్ అధికారి అయితే మన తెవికీకి ఇంకొక శక్తి కాగలరు. రహ్మనుద్దీన్ గారి ప్రతిపాదనకి నా పుర్తి మద్దతు తెలుపుతున్నాను. --విష్ణు (చర్చ)14:37, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  11. నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. ........Malladi kameswara rao (చర్చ) 18:27, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  12. రహ్మానుద్దీన్ గారు వికీలో చురుగ్గా ఉంటూ, తెలుగు వికీ విధానాల గురించి తెలిసినవాడై, వికీలో సాంకేతికంగా తోడ్పడుతూ... ఇతర సభ్యులకు సహకారం అందిస్తున్నారు. తన సేవలు మరింత పొందడంకోసం రహ్మానుద్దీన్ గారి అధికారి హోదా ప్రతిపాదనకు మనఃపూర్వక మద్దతు తెలియజేస్తున్నాను.Pranayraj1985 (చర్చ) 17:48, 18 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  13. రహ్మానుద్దీన్ నాకు తెలుగు ఉగాది మహోత్సవాల సమయంలో కొంత దగ్గరగా చూచాను. వారికి తెవికీ గురించి మంచి అవగాహన ఉన్నది. సాంకేతికంగా నైపుణ్యం ఉన్నది. వీలైనంత ఎక్కువ సమయం తెవికీలో పనికేసే అవకాశం ఉన్నది. ఇప్పుడు సి.ఐ.ఎస్.లో చేరి విష్ణుగారితో పనిచేస్తూ ఇంకా నిబద్ధతతో పనిచేయడానికి నిర్ణయం తీసుకొని అధికారిగా స్వీయప్రతిపాదన చేసుకున్నారని నాకు అనిపిస్తుంది. ఎక్కువగా సాంకేతిక నైపుణ్యం లేని నాలాంటి వారి కంటే రహ్మానుద్దీన్ లాంటి వారే అధికారిగా తెలుగు వికీపీడియా అభివృద్ధికి అవసరం అనిపిస్తుంది. ఈ పై కారణాల వలన వారి అభ్యర్ధిత్వానికి మద్దతు ప్రకటిస్తున్నాను.--Rajasekhar1961 (చర్చ) 04:11, 22 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యతిరేకత(Oppose)

రహ్మానుద్దీన్ గారి గురించి నాకు ఎక్కువగా గత రెండు సంవత్సరాలలో పరిచయముంది,వారితో వికీలో మరియు బయట (ప్రత్యక్షంగా కూడా) చర్చలు చేయడం జరిగింది. తెలుగు భాషాభిమానిగా, స్వేచ్ఛా సాఫ్ట్వేర్ గురించి కృషి చేసిన వ్యక్తిగా అలాగే తెలుగు వికీ ప్రచారాలు, సమావేశాలలో విశేష కృషి పై ప్రత్యేకంగా గౌరవం వుంది. అయినా వారి ప్రతిపాదనను తెలుగు వికీ అభివృద్ధి పై దీర్ఘకాలికదృష్టితో ఈ క్రింది కారణాల వలన వ్యతిరేకిస్తున్నాను.

  • తెలుగు వికీ విధానాలు, మార్గదర్శకాలు,నకలుహక్కులు వాటిపై అవగాహన, సభ్యులతో వికీలో సహకారం, ముఖ్యంగా ఏకాభిప్రాయాన్ని సమీకరించి నిర్ణయం చేయటంలలో రహ్మానుద్దీన్ గారి నైపుణ్యాలు నా అంచనాలలో తక్కువగా వున్నాయి.
  • అధికార హోదాకు వారు పేర్కొన్న కారణాలు వాడుకరి పేరు మార్పు అభ్యర్ధనలు అంత అత్యవసరమైనవి, తరచూ చేసేవి కావు
  • ఇటీవల మనం రచ్చబండ చర్చలో నిర్వాహకులు తప్పులు పై తప్పులు చేస్తున్నారన్న అభిప్రాయాలు చూస్తున్నాము.అందువలన సభ్యుల అదనపు హోదాల అభ్యర్ధనలకు సమ్మతి ప్రకటించే ముందే జాగ్రత్తగా వుండడం మేలనిపిస్తున్నది.
  • అధికారి హోదాఇచ్చిన తరువాత సభ్యుని అవగాహన ప్రవర్తన మెరుగుపడాలని ఆశించడం కంటే (తెవికీ కృషి స్వచ్ఛందంగా జరిగేది కాబట్టి) అవి మెరుగైన తరువాతనే అధికారిహోదా ఇవ్వడం వలన మరింత లాభం కలిగే అవకాశం వుంది.
  • రహ్మానుద్దీన్ గారు కొన్ని వికీ ప్రాజెక్టులకు సమన్వయకర్తగా వ్యవహరించి, కొన్ని విధానాలు మెరుగు చేయటానికి లేక కొత్తవి తయారు చేయడం లాంటి పనులు చేసిన తరువాత నేనే స్వయంగా వారికి అధికారి హోదాకి ప్రతిపాదించగలను.--అర్జున (చర్చ) 05:54, 18 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యతిరేకంగా వచ్చిన వ్యాఖ్యకు అభ్యర్ధి స్పందించడానికి మరో మూడు రోజులు గడువు పొడిగిస్తున్నాను. --వైజాసత్య (చర్చ) 09:39, 22 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
తటస్థం(Neutral)
ఫలితం(Result)
వ్యతిరేకంగా వచ్చిన వ్యాఖ్యలు చాలా రోజులు గడువు ఇచ్చినా అభ్యర్ధి ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందించలేదు. అంతేకాక అభ్యర్ధి తెవికీలో కొనసాగట్లేదని రచ్చబండలో ప్రకటించారు. కావున ఈ ప్రతిపాదన ప్రస్తుతానికి విఫలమైనట్లుగా భావించవచ్చు --వైజాసత్య (చర్చ) 06:58, 30 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]