Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022/గ్రాంటు వినియోగం

వికీపీడియా నుండి

నమస్కారం ఈ పేజీని వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ప్రాజెక్టు నిర్వహణ కోసం అందిన గ్రాంటు వినియోగార్థం సృష్టించబడినది.

ఇటీవల వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 కోసం వికీమీడియా ఫౌండేషన్ వారికి అభ్యర్థించిన గ్రాంటు 2022 సెప్టెంబరు 21న మనకి అందినది.

అయితే వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ప్రాజెక్టు ఒక నిర్ణిత గడువుతో రూపొందించడం కారణాన ఈ ప్రాజెక్టుని ఆగస్టు 31న ముగించడం జరిగింది. ఆ ప్రాజెక్టులో చేసిన కృషిని ఇక్కడ తెలపడం జరిగింది.

కానీ ప్రాజెక్టు గ్రాంటు ఆలస్యంగా అందటం మూలాన, ఈ ప్రాజెక్టుకి ఒక అదనపు 25 రోజుల వ్యవధి జోడిస్తే మరింత మెరుగైన లక్ష్యాలను చేరుకోవచ్చునని భావిస్తున్నాము.

ఇక గ్రాంటు విషయానికొస్తే:

  • గ్రాంటు వివరాలు:

-మొత్తం అభ్యర్థించింది : 2,95,500 రూపాయలు -మనకు అందినది  : 2,94,756 రూపాయలు (కరెన్సీ మారక విలువలు ఈ మార్పుకి కారణం)

-ఈ గ్రాంటు ఉపయోగార్థం అందించిన వివరాలలో కింది అంశాలు ఉన్నాయి:

  1. సంప్రదింపులకు, మీడియా వ్యవహారాలకు : 30,000
  2. 20 వాడుకరులకు మొబైలు రీఛార్జ్ కొరకు : 11,000
  3. సర్టిఫికెట్లు, సావనీర్లు అందించడానికి : 42,000
  4. బహుమతులకు  : 42,500
    1. మొదటి బహుమతి ― ₹15000 గిఫ్ట్ కార్డు
    2. రెండవ బహుమతి ― ₹7500 గిఫ్ట్ కార్డు
    3. మూడవ బహుమతి ― ₹5000 గిఫ్ట్ కార్డు
    4. అత్యధిక ఆడియోలు చేర్చిన వారికి బహుమతి : ₹5000 గిఫ్ట్ కార్డు
    5. అత్యధిక వీడియోలు చేర్చిన వారి బహుమతి : ₹5000 గిఫ్ట్ కార్డు
    6. అత్యధిక బొమ్మలు చేసిన కొత్త వాడుకరి : ₹5000 గిఫ్ట్ కార్డు
  5. ఫోటో ట్రావెల్ : 52,500 (దీంట్లో భాగంగా ఐదుగురు వాడుకరులకు ఏడు రోజుల పాటు క్షేత్ర సందర్శన ద్వారా ఫోటోలు సేకరించే వెసులుబాటు కల్పించవచ్చు, ఇందుకు గాను వారికి రోజుకి 1500 రూపాయల గౌరవ వేతనం అందించబడుతుంది.)
  6. ట్రైనింగులు వగైరా.. సామూహిక కార్యక్రమాలకు : 1,00,000 (దీంట్లో భాగంగా 4 ట్రైనింగ్లు ఒక బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం జరపాలి, దీంట్లో ఒక్క ట్రైనింగ్ కార్యక్రమం పూర్తయింది.)
  7. న్యాయ నిర్ణేతలకు గౌరవార్థం: 7,500 (ఒక్కొక్కరికి 2500 గిఫ్ట్ కార్డు)
  8. ఇతరాత్ర ఖర్చులకి : 10,000

నా అభిప్రాయంలో ప్రాజెక్టులో జరగవలసిన చాలా కృషి ఇంకా మిగిలే ఉంది, కాబట్టి ప్రాజెక్టుకి ఒక ఇరవై అయిదు రోజుల పొడిగింపు లేదా ప్రత్యేక జోడింపు అవసరం. ఈ కాల వ్యవధిలో ప్రాజెక్టులో సూచించిన, వీడియోలు ఆడియోలు అలాగే ఫోటో ట్రావెల్ అంశాలపై పని చేసే అవకాశం దొరుకుతుంది.

వికీపీడియా గ్రాంటు వినియోగం - చర్చ: గూగుల్ మీట్ సమావేశంలో చర్చించిన విధంగా, నేను ప్రతిపాదించే ఈ 25 రోజుల వ్యవధి అయ్యాక, ముందు జరిగిన ప్రాజెక్టు కృషి ఆపై కొత్తగా జరిగే కృషిని పరిగణిస్తూ బహుమతులు అందజేయాలని తలుస్తున్నాం.

ఇప్పటి వరకు పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న వాడుకరులకు ఫోటో ట్రావెల్ పని చేసే వెసులుబాటు కల్పిద్దాం. అలాగే ఇప్పటి వరకు చేసిన వారందరికీ ఒక నిర్ణిత దిద్దుబాట్ల సంఖ్యతో (కనీసం 50) చేసిన వారికి మొబైలు అలవెన్సు అందజేద్దాం (ఈ అదనపు పదిహేను రోజుల గడువులో ఆ 50 దిద్దుబాట్ల మార్కుని దాటిన ఇతర వాడుకరులకు మొబైలు అలవెన్స్ అందజేయొచ్చు).

అయితే ఈ ప్రాజెక్టు లక్ష్యంగా వికీమీడియా వారికి అందించిన ప్రతిపాదనలో 1500 చిత్రాలని చెప్పాము, ఆ మైలు రాయిని మనం దాటేశాం. అలాగే కామన్స్ లో 150 చిత్రాలు, 20 వ్యాసాలలో ఆడియోలు, 20 వ్యాసాల్లో వీడియోలు అలాగే 20 కొత్త వ్యాసాలూ కూడా చేరుస్తామని ప్రతిపాదించడం జరిగింది.

అక్టోబరు 6 మొదలుకొని 31 వరకు ఈ 25 రోజుల మైలేజ్ ఎడిటతాన్ నిర్వహించడం ద్వారా పై మైలు రాళ్లు చేరుకోగలమని నా వినతి.

ఇట్లు ప్రాజెక్టు నిర్వాహకుడు NskJnv 17:28, 28 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టుకి జోడించే అదనపు రోజులకి కార్యాచరణ

[మార్చు]

ఇక్కడ సముదాయ సభ్యులు తమ సూచనలు చేర్చవచ్చును ఆడియోలు, వీడియోలు చేర్చిన వారికి ఒక ప్రత్యేక బహుమతి అందిస్తే బాగుంటుంది, అలాగే మిగిలిన కార్యశాలలు తెలుగు రాష్ట్రలలో హైదరాబాద్ మినహాయించి ఏవేని నాలుగు ముఖ్య పట్టణాలలో స్థానిక వికీపీడియన్ల సహకారంతో జరిగితే బాగుంటుంది : Kasyap (చర్చ) 05:04, 29 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

రెండు మంచి సూచనలు.నిన్నటి చర్చల ప్రకారం ఇంకా 4 కార్యశాలలు జరపవలసి ఉన్నది.కశ్యప్ గారు సూచించిన ప్రకారం జరపటం కూడా ముఖ్యం.ఆ నాలుగులో రెండు తెలంగాణాలో, రెండు ఆంధ్రప్రదేశ్ లో జరపాలి. యర్రా రామారావు (చర్చ) 07:35, 29 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

కార్యశాలలపై యర్రా రామారావు సందేహాలు, సూచనలు

[మార్చు]

సందేహాలు

[మార్చు]
  1. ప్రాజెక్టులో భాగంగా 4 ట్రైనింగ్లు ఒక బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం జరపాలి, దీంట్లో ఒక్క ట్రైనింగ్ కార్యక్రమం పూర్తయిందని అని ప్రాజెక్టు పేజీలో సూచించబడింది.అంటే ఇంకా 3 కార్యశాలలు, ఒక బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం మాత్రమే జరుగవలసి ఉందా?
  2. పూర్తైన కార్యశాల కార్యక్రమం ఎప్పుడు, ఎక్కడ జరిపారు? దానికి ఎంతమంది హాజరైనారు? కార్యశాలకు హాజరవటానికి ఎక్కడైనా నమోదు చేసుకునే అవకాశం కల్పించారా? నమోదు కావటానికి ఏమి ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకొనబడింది? ఇత్యాది పూర్తి వివరాలు, కార్యశాలలో జరిగిన చర్యలు వివరాలు ఎక్కడ తెలుసుకోవచ్చు?

సూచనలు

[మార్చు]

కార్యశాలలు జరుపటానికి ఇది మంచి అవకాశం.కావున దీనికి ఖర్చుపెట్టే సొమ్ముకు తగిన వికీ అభివృద్దికి తగిన ప్రతిఫలం చేకూరితేనే కార్యశాలలు విజయవంతంగా జరిగినట్లు అని మనందరికి తెలుసు.

  1. అందుకు గాను కార్యశాలలు జరగటానికి తగినంత తొందరగా 4 ప్రాజెక్టు కార్యశాలలకు 4 ప్రాజెక్టు ఉపపేజీలు తయారుచేసి అందులో తేది, సమయం, వేదిక ఇత్యాది వివరాలతో ప్రాజెక్టు మొదలయ్యేలోపు తయారుచేసి సముదాయం ముందు పెట్ట్టాలి.
  2. ఎవరైనా స్థానిక వికీపీడియన్లు వారి సహకారంతో ముందుకువస్తే ఆ ప్రదేశం, లేదా ఆ ప్రాంతంలో జరపాలి.అయితే అవి రెండురాష్ట్రాలలో జరపటానికి లోబడి ఉండాలి.అలా ఎవ్వరూ ముందుకు రాని పక్షంలో ప్రాజెక్టు నిర్వహకుడు తన ఇష్టమొచ్చిన ప్రదేశం లేదా ప్రాంతంలో జరపాలి.అయితే అవి రెండురాష్ట్రాలలో జరపాలి.
  3. కార్యశాలకు కనీసం 25 మందికి తగ్గకుండా చూడాలి.ఇది చెప్పినంత సులభంకాకపోవచ్చు. కానీ తగిన ప్రయత్నం, మనవంతు కృషిచేయాలి.దానికి నాసూచన, నేను అందుకే కార్యశాల ఉపపేజీలు ముందుగా తయారుచేసి, వికీపీడియాలో గత 6 మాసాలలో లాగిన్ అయిన వాడుకరుల జాబితాను తీసుకుని, వారిలో కొద్దిగా సవరణలు చేసినవారికి, వికీపీడియా తరుపున వాడుకరి చర్చ పేజీలోని "ఈ వాడుకరికి ఈమెయిలు పంపించండి" అనే ఎంపిక ద్వారా ఆ నాలుగు కార్యశాలల ప్రాజెక్టు ఉపపేజీలు వారి మెయిలుకు పంపి, వారికి దగ్గరలోని కార్యశాలకు హాజరుకమ్మని కోరితే కొంత ప్రయోజనం ఉండవచ్చు.

ఇదే సమయంలో స్థానిక వికీపీడియన్లు మంచి సహకారం అందించాలి.ఇది మనందరి కార్యక్రమం అని భావించాలి, ఇలాంటి పనులు ఏ ఒక్కరివల్ల కావు, అందరి సహకారం ఉంటేనే ఇలాంటి ప్రాజెక్టులు విజయవంతమవుతాయని మనందరకు తెలుసు. ప్రాజెక్టును విజయవంతంగా నడపించటానికి ఇంకా దీనిమీద సూచనలు, సలహాలు తెలపగలరని ఆశిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 14:25, 29 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి, ఆదిత్య, యర్రా రామారావు, Kasyap గార్లకి, నమస్కారం!

మీ సూచనలు పరిగణలోకి తీసుకుంటూ, ప్రాజెక్టు పేజీలో విషయాలు ప్రస్తావించాను, వాటిని పరిశీలించి తగు మార్పులు ఉంటె ఇక్కడ సూచించడం గాని. చిన్న చిన్న దిద్దుబాట్లు ఉంటె ప్రాజెక్టు పేజీలోనే మార్పులు చేసి ఇక్కడ వాటిని తెలపగలరని ప్రార్ధన.

మీ NskJnv 06:23, 2 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

రామారావు గారి ప్రతిపాదన మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒకానొక కీలకమైన నగరం అయిన విజయవాడలో స్థానిక వికీపీడియన్‌గా నేను ఒక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి నాకున్న అనుభవం మేరకు శాయశక్తులా దాని విజయానికి ప్రయత్నించగలను. అయితే, నేనిప్పుడు ఇరుక్కున అనేక పనుల వల్ల నిర్వాహకుల్లో ఒకరు ఆ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను పంచుకుంటే ఈ పనిని స్థానికంగా చేయగలనని తెలియజేస్తున్నాను. నిర్వాహకుల సమయాన్ని ఇలా తీసుకుని ఇబ్బందిపెట్టాలని కాదు, కానీ నాకున్న పరిమితుల వల్ల ఇలా కోరవలసివస్తోందని గ్రహించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 03:57, 3 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ మీకు ఇబ్బందులను పక్కనపెట్టి, విజయవాడలో కార్యశాల కార్యక్రమాన్ని జరపటానికి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం.ఈ కార్యక్రమానికి నావంతు సహకారం తప్పనిసరిగా నెరవేర్చగలను.మీకు ఈ సందర్బంగా ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 05:18, 3 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రెండువ కార్యశాల పల్నాటి జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలో జరపటానికి స్థానిక వికీపీడియనుగా నేను ఏర్పాటుచేసి నాకున్న అనుభవం మేరకు శాయశక్తులా దాని విజయానికి ప్రయత్నించగలను.--యర్రా రామారావు (చర్చ) 05:50, 3 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు , పవన్ సంతోష్ గార్ల స్పందనలకి ధన్యవాదాలు, మీ ప్రతిపాదనల్ని పేజీకి తరలించాను. నిర్వహణ నిమిత్తం ఈ చర్చలు అక్కడ జరపాలని భావిస్తున్నాను. NskJnv 06:20, 3 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

చిత్రయాత్ర

[మార్చు]
  • చిత్రయాత్రలో పాల్గొనుటపై నాకున్న సందేహాలు:
  1. ప్రాజెక్టు కాలవ్యవధిలో ఏ రోజు యాత్ర నిర్వహించుకోవాలి అన్న విషయాన్ని నిర్వాహకులే నిర్ధారిస్తారా? లేదా పాల్గొనే వాడుకరులే వారి అనుకులాన్ని బట్టి నిర్ధారించుకోవచ్చా?
  2. చిత్రయాత్రకు కావాల్సిన ఖర్చులను ఏ విధంగా అందిస్తారు అన్న విషయాన్ని కూడా తెలియజేయగలరు.--అభిలాష్ మ్యాడం (చర్చ) 17:00, 3 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మద్దతు/అభిప్రాయాలు

[మార్చు]

ఇక్కడ సముదాయ సభ్యులు తమ మద్దతు/అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు

  1. 25రోజుల మైలేజ్ ఎడిటతాన్ కి పూర్తి మద్దతు తెలుపుతున్నాను.-అభిలాష్ మ్యాడం (చర్చ) 04:03, 29 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  2. ప్రతిపాదన బాగానే ఉంది. అదనపు పోటీ నియమాలను (ఫొటోలు చేర్పు) ప్రాజెక్టు పేజీలో వివరంగా సందిగ్ధత లేకుండా రాయాలని కోరుతున్నాను. __చదువరి (చర్చ.రచనలు) 11:03, 29 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  3. మైలేజ్ ఎడిటథాన్ ప్రతిపాదన బాగానే ఉంది.దీనికి నా మద్దతుని తెలియజేస్తున్నాను. ఆదిత్య పకిడే Adbh266 (చర్చ) 09:51, 30 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  4. మైలేజ్ ఎడిటథాన్ కి నా మద్దతుని తెలియజేస్తున్నాను.Kasyap (చర్చ) 10:26, 30 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  5. మైలేజ్ ఎడిటథాన్ కి నా మద్దతుని తెలియజేస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 06:53, 1 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  6. మైలేజ్‌ ఎడిటథాన్‌ కి నా మద్దతుని తెలియజేస్తున్నాను,.--~~ramesh bethi~~ (చర్చ) 06:04, 6 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  7. మైలేజ్ ఎడిటథాన్ కి నా మద్దతుని తెలియజేస్తున్నాను.➤ కె.వెంకటరమణచర్చ 11:49, 6 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]