Jump to content

వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/భీమవరం తెలుగు సంబరాలు ఎడిటథాన్-2022

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ ప్రాజెక్టు నిర్వహణ, కాలం, వనరులు, సృష్టించాల్సిన వ్యాసాలు వంటి మొదలైన అంశాల గురించి Nskjnv గారు, Chaduvari గారు,కశ్యప్ గారు,పవన్ సంతోష్ గారు, ప్రణయ్ గారు, యర్రా రామారావు గారు, ప్రభాకర్ గౌడ్ నోముల గారు మొదలైన సముదాయ సభ్యులు సూచనలు, సలహాలు ఇవ్వగలరు.౼అభిలాష్ మ్యాడం 17:07, 27 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఇదొక క్లిష్టమైన ప్రాజెక్టు. పెద్ద సవాలు లాంటి పని. ఇంగ్లీషు నుండి వ్యాసాలను అనువదించి ఇక్కడ పెట్టడంలో సమాచారం కోసం వెతుక్కునే పని లేదు. కానీ ఈ ప్రాజెక్టు అలాంటిది కాదు. దీని అంశాలపై ఇంగ్లీషులో అంతగా వ్యాసాలుండవు. సమాచారాన్నంతా మనమే సేకరించుకుంటూ మూలాలను చేరుస్తూ అక్షరాలను పేరుస్తూ వ్యాసం రాయాలి. "పుల్లా పుడకా ముక్కున కరచీ గూడును కట్టి"నట్టన్నమాట. అయితే అసలు వికీలో వ్యాసాలు పుట్టేదే అలా కాబట్టి, అలాగే చేద్దాం.
రాసి కాకుండా వాసి మీదనే దృష్టి పెడదాం. రాసేది ఒక్క వ్యాసమే అయినా.., భలే రాసార్రా అని చదివినవాళ్ళు అనుకోవాలి.
ముందుగా వ్యాసాలు రాసేందుకు సమయం పడుతుంది కాబట్టి, ప్రాజెక్టుకు తగునంత సమయం పెట్టుకుందాం. జనవరి 1 న మొదలెట్టి, ఫిబ్రవరిలో ఎప్పుడో భాషా దినోత్సవం వస్తుంది.. అప్పటి దాకా పెట్టుకుందాం. అంటే సుమారు 45 రోజులు.
యథావిధిగా..
  1. ఏయే వ్యాసాలుండవచ్చో చూసి ఆ జాబితా ఒకటి తయారు చేసుకుందాం. రచయితలు, పుస్తకాలు, సాహితీ పత్రికలు, పుస్తక సమీక్షా పుస్తకాలు, విమర్శనా సాహిత్యం, విశాల భారతంలో తెలుగు వెలుగు, విదేశాల్లో తెలుగు వికాసం వగైరా అంశాలపై వ్యాసాలు రాయవచ్చు.
  2. వనరుల జాబితా తయారు చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం.
  3. ఒక వ్యాసంపై ఒక్కరే అని పెట్టుకోకుండా అవసరమైన చోట్ల పలువురం పనిచేద్దాం.
  4. వ్యాసాల విస్తరణ కూడా చేపట్టవచ్చు
వ్యాసాంశాలకు సంబంధించి కింది పేజీలు తయారు చెయ్యవచ్చని నా సూచన:
  1. తెలుగుకై కృషి చేసిన/తెలుగు నేర్చిన తెలుగేతరులు అనే వ్యాసం రాయొచ్చు. అందులో ప్రాముఖ్యత ఉన్నవారికి విడిగా పేజీలు పెట్టవచ్చు. ఉదాహరణకు డేవిడ్ షుల్మన్.
  2. అంతర్జాలంలో తెలుగు: వీవెన్ గారూ, ఈ విషయం గురించిన వ్యాసం మీరు రాస్తే బాగుంటుంది.
  3. తెలుగు నిఘంటువులు: తెలుగులో నిఘంటువుల చరిత్ర
  4. తెలుగు గురించి/తెలుగు పుస్తకాల గురించి ఇంగ్లీషులో వచ్చిన పుస్తకాలు: అలాంటి పుస్తకాల గురించిన వ్యాసం. ఆ పుస్తకాల్లో ప్రాముఖ్యత ఉన్నవాటికి విడివిడిగా వ్యాసాలు రాయొచ్చు. ఉదా: యాంథాలజీ ఆఫ్ క్లాసికల్ తెలుగు పొయెట్రీ
  5. వివిధ ద్ఫేశాల్లో తెలుగువారు, తెలుగు భాష.. గురించి వ్యాసాలు రాయొచ్చు. మలేషియాలో తెలుగువారు, అమెరికాలో తెలుగువారు, అమెరికా ప్రభుత్వాల్లో పని చేసిన తెలుగువారు, అంతర్జాతీయ సంస్థలకు సారథులుగా పనిచేసిన తెలుగువారు.. (సాహిత్య రంగం నుండి కొంత కోతికొమ్మచ్చి)
  6. ఇలాంటివే ఇంకా
ఈ ప్రాజెక్టులో అందరూ పాలుపంచుకుంటే బాగుంటుంది. పరిశీలించండి.
@MYADAM ABHILASH గారూ, ఈ ప్రాజెక్టు చేపట్టినందుకు అభినందనలు. ప్రాజెక్టును మీరు అనుకున్న పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళండి. ఎక్కడైనా అవసరమనుకుంటే మార్పు చేర్పులు చేసుకుందాం. పదండి ముందుకు. ప్రాజెక్టు పేజీలో ఇతర సమాచారాన్ని కూడా చేర్చి ఒక రూపాన్నివ్వండి. __ చదువరి (చర్చరచనలు) 04:43, 29 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
పై జాబితాలోని అంతర్జాలంలో తెలుగు పేజీని నేను మొదలు పెట్టాను. అందరం దీనిపై పనిచేసి విస్తరించుదాం కలసిరండి. తెలుగు నిఘంటువులు అనే పేజీ ఈసరికే ఉన్నట్టు ఇప్పుడే గమనించాను. __ చదువరి (చర్చరచనలు) 13:35, 28 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు చదువరి గారూ, ప్రాజెక్టును మీరన్నట్టుగా ఫిబ్రవరి 21 దాకా నడిపిద్దాం. అలాగే వివిధ అంశాలకు చెందిన జాబితాను కూడా తయారు చేసుకుందాం. ఇందుకు మిగతా వాడుకరులందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. ప్రాజెక్టు మొదలు పెట్టే సమయానికి (1 జనవరి) జాబితా ఒకటి తయారైతే ప్రాజెక్టు ముందుకు కదులుతుంది. అందుకు అందరి సహకారం అవసరం--అభిలాష్ మ్యాడం 17:18, 29 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు బాగున్నది. అందరూ కలసి పనిచేయడం చాలా అవసరం. ముందుకే పోవాలి. 1. అమ్మనుడి పత్రికలో మంచి సమాచారం అందుబాటులో ఉన్నది. వాటినుండి ఏ నుకోవచ్చూను. 2. తెలుగు -బెంగాలీ భాషా సంబంధాలు మొదలైన వ్యాసాలు తయారుచేయాలి. 3. ఇతర భాహల్లోకి అనువాదించసబడిన పుస్తస్కాలు, పివిగారి లోపలి మనిషి వాలే, అనువాద రచయితల వ్యశాలలో మరిన్ని దొరుకుతాయి. మొదలుపెడదామా--Rajasekhar1961 (చర్చ) 10:31, 31 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు. మీరన్నట్టు మన ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది. ఆదిశగా అందరం వాడుకరులము ప్రయత్నం చేద్దాం--అభిలాష్ మ్యాడం 16:19, 31 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

కంటింటి పాపరాజు

[మార్చు]

ప్రాజెక్టు వనరులు విభాగంలో కంకంటి పాపరాజు అనేది పొరపాటున "కంటింటి పాపరాజు" అని పడిందా? పరిశీలించండి.__ చదువరి (చర్చరచనలు) 22:19, 2 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ అవును అది కంకంటి పాపరాజు. పొరపాటున అలా పడింది.-అభిలాష్ మ్యాడం 11:32, 3 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు పేరు

[మార్చు]

"తెలుగు సాహిత్య అంశాలు" అనే పేరు చాలా జనరిక్‌గా, ఎంతో విస్తారమైన పరిధిని కలిగినది. ఈ ప్రాజెక్టు పరిధికి ఈ పేరు చాలా విస్తార్ంగా ఉన్నట్లు తోస్తోంది. దీనికి సరిపడేలా మరింత సరిపోయే పేరుకు తరలిస్తే బాగుంటుంది. ఉదా: "భీమవరం తెలుగు సంబరాలు ఎడిటథాన్-2022", "తెలుగు సాహిత్య అంశాలు-2022". పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 23:49, 2 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు చదువరి గారూ, నేనూ దీని గురించి ఆలోచించాను. మంచి ఆలోచన "తెలుగు సాహిత్య అంశాలు-2022" అనే పేరుకు తరలిస్తే బాగుంటుంది.-అభిలాష్ మ్యాడం 11:34, 3 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. భీమవరంలో జరిగే అంతర్జాతీయ తెలుగు సంబరాల్లో భాగంగా తెలుగు సాహిత్య సంబంధిత అంశాలను అభివృద్ధి చేయాటానికి లక్ష్యంగా తయారుచేయబడినందున "భీమవరం తెలుగు సంబరాలు ఎడిటథాన్-2022" అనే పేరుకు తరలించటం సముచితంగా ఉంటుంది. ప్రాజెక్టు పేజీలో మొదటి వాక్యం కూడా అదే ఉంది. యర్రా రామారావు (చర్చ) 17:11, 3 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
"భీమవరం తెలుగు సంబరాలు ఎడిటథాన్-2022" శీర్షిక సముచితంగా ఉంటుంది. పరిశీలించండి. ➤ కె.వెంకటరమణచర్చ 14:28, 8 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు శీర్షిక విషయంలో తగిన సూచనలు చేసిన చదువరి గారికి,యర్రా రామారావు గారికి,కె.వెంకటరమణ గారికి ధన్యవాదాలు. "భీమవరం తెలుగు సంబరాలు ఎడిటథాన్-2022" అనే పేరును సముచితంగా ఉన్నట్లు భావిస్తున్నారు కనుక ప్రాజెక్టు పేజీని ఈ శీర్షికకు తరలిస్తున్నాను. అలాగే చదువరి గారు వికీ సైట్ బ్యానర్లో ప్రాజెక్టు పేజీ శీర్షికకు తగిన మార్పులు చేస్తూ, ఆసియా ఖండం బొమ్మ కాకుండా తెలుగు సాహిత్య సంబంధిత బొమ్మను ఏదైనా ఉంచుతే బాగుంటుంది అని నా అభిప్రాయం--అభిలాష్ మ్యాడం 15:19, 9 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]