వూషమల్ల కృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వి.కృష్ణ
వూషమల్ల కృష్ణ
జననం(1961-10-01)1961 అక్టోబరు 1
వృత్తిప్రొఫెసర్
తల్లిదండ్రులు
  • శ్రీ వూషమల్ల రామస్వామి(ఎర్రోల్ల) (తండ్రి)
  • శ్రీ వూషమల్ల రాజమ్మ (తల్లి)
వెబ్‌సైటుhttp://drvooshamallakrishna0110.blogspot.com/

డా. వి. కృష్ణ (V. Krishna, Vooshamalla krishna) హైదరాబాదు విశ్వవిద్యాలయంలోని హిందీ శాఖ ఆచార్యుడిగా, మానవీయ శాస్త్రల విభాగానికి డీన్ గా పని చేస్తున్నారు.[1]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

తులనాత్మక సాహిత్య పరిశోధకుడిగా, అనువాదకుడిగా, సామాజిక, హేతువాద ఉద్యమకారుడిగా దాదాపు మూడు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న వూషమల్ల కృష్ణ రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, లింగంపల్లి గ్రామంలో తండ్రి వూషమల్ల రామస్వామి, తల్లి వూషమల్ల రాజమ్మలకు 01.10.1961న జన్మించారు.1983లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తీ చేశారు. ఆ తర్వాత హైదరాబాదు విశ్వవిద్యాలయంనుండి 1985లో ఏం.ఏ హిందీ చేసి, అనంతరం 1988వ సంవత్సరం జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (న్యూ ఢిల్లీ)లో ఎం.ఫిల్ పూర్తి చేశారు. ఆ తర్వాత 1993లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 'స్వాతంత్య్రోరోత్తర్ కవితా కా వైచారిక్ సంఘర్శ్ ( హిందీ-తెలుగు కవితా కా తులనాత్మక అధ్యయన్) అనే అంశం మీద డాక్టరేట్ పట్టా పొందారు.

ఉద్యోగ ప్రస్తానం

[మార్చు]

వూషమల్ల కృష్ణ 1990 నుండి 1993 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా కొన్నాళ్ళు పనిచేశారు. ఆ తర్వాత 1993 వ సంవత్సరం హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఉద్యోగంలో చేరి, లెక్చరర్గా, రీడర్గా అంచెలంచెలుగా ఎదిగి 2006 నుండి ఆచార్యుడిగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా 2007 నుండి 2010 వరకు బెల్జియం దేశంలోని ఘెంట్ యూనివర్సిటీలో చైర్ ప్రొఫెసర్గా, 2016 నుండి 2018 వరకు బల్గేరియ దేశంలోని సోఫియా యునివర్సిటీలో చైర్ ప్రొఫెసర్గా ఐ.సి.సి.ఆర్ (The Indian Council for Cultural Relations-ICCR)) తరపున డిప్యూటేషన్ మీద విధులు నిర్వహించారు.హైదరాబాదు విశ్వవిద్యాలయం హిందీ విభాగం అధ్యక్షుడిగా, ‘కంట్రోలర్ ఆఫ్ ఎక్షామినేషన్స్’గా విధులు నిర్వహించారు. హాస్టల్ వార్దేన్గా. ప్రొక్టోరియల్ మెంబర్గా, ఎస్సీ. ఎస్టి రేమేడియాల్ కోచింగ్ సెంటర్కి మొట్ట మొదటి కో-ఆర్డినేటర్గా వివిధ కమిటిలో మెంబర్గా సేవలు అందించారు. 2011వ సంవత్సరం హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ; దళిత ఆదివాసి, అధ్యయన అనువాద కేంద్రం; స్థాపించి దానికి డైరెక్టర్గా కూడా విధులు నిర్వహించారు. ఈ దళిత ఆదివాసి, అధ్యయన అనువాద కేంద్రంలో అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులు నిర్వహించారు. ఇప్పటి వరకు వీరి పర్యవేక్షణలో 30 పి.హెచ్.డి పరిశోధనలు, 42 ఎమ్.ఫిల్ పరిశోధనలు జరిగాయి. వూషమల్ల కృష్ణ ఇప్పటి వరకు 21 పుస్తకాలు (హిందీ -12, తెలుగు -8, ఆంగ్లం -1) రాశారు. సాహిత్యం, సామాజిక అంశాలపైన వివిధ పత్రికల్లో దాదాపు 100 కి పైగా వ్యాసాలు రాశారు.

ఉద్యమ ప్రస్థానం

[మార్చు]

సామాజిక, ఉద్యమ స్పృహ కలిగిన ప్రొఫెసర్ కృష్ణ విద్యార్థి దశ నుండే అనేక ఉద్యమాలలో భాగస్వామ్యం అయ్యారు. ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (న్యూ ఢిల్లీ) హైదరాబాదు విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా అనేక ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. వామపక్ష ఉద్యమాలు, దళిత, అస్తిత్వ, ఆత్మగౌరవ ఉద్యమాలతో పాటు, హేతువాద, మానవతా వాద ఉద్యమాలలో ప్రధాన భూమికను పోషించారు. హైదరాబాదు విశ్వవిద్యాలయం వేదికగా తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా కీలక పాత్ర పోషించారు.ఉపాద్యాయ వృత్తితో పాటు, వైజ్ఞానిక సమాజం ఏర్పడాలనే సంకల్పంతో జనవిజ్ఞాన వేధిక, ప్రజా సైన్స్ వేధిక ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. 'ప్రజా సైన్సువేదిక'కు అధ్యక్షుడిగా, ‘జన విజ్ఞాన వేధిక’కు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం 'ప్రజాసైన్స్ వేధిక' కు గౌరవ అధ్యక్షుడిగా కూడా పని చేస్తున్నారు.

రచనల జాబితా

[మార్చు]

హిందీ రచనలు

  1. భారతీయ కవిత: వాదోం కే కటఘరే మె - 2010
  2. స్వాతంత్రోత్తర్ కవితా కా వైచారిక్ సంఘర్శ్ - 1996
  3. క్రాంతిదర్శి కవి ధూమిల్, సీతా ప్రచురణలు- 1994

సంపాదకత్వం వహించిన పుస్తకాలు

  1. గ్లోబలైజేషన్ - ఆదివాసీస్ ఆంగ్లం (సహా సంపాదకత్వం ఎం.ఎన్ రాజేష్, భీం సింగ్) 2014
  2. ఆదివాసి విమర్శ్ (సహా సంపాదకులు. ఎమ్. ఎన్ రాజేష్, భీంసింగ్) 2014
  3. భారతీయ దళిత సాహిత్య హైదరాబాదు హిందీ ప్రచార సభ హైదరాబాదు -2003
  4. తెలుగు సాహిత్య మె దళిత్ దస్తక్ (సహా సంపాదకత్వం. రమణిక గుప్త) - 2000

[[ తెలుగు సాహిత్య మె దళిత్ దస్తక్ పుస్తకానికి వి. కృష్ణ సంపాదకత్వం వహించడమే కాకుండా తెలుగులో ఎంతో ప్రాచుర్యం పొందిన కొన్ని కవితలన అనువాదం కూడా చేశారు)

హిందీ అనువాద రచనలు

తెలుగు సాహిత్యంలో విశేష ఆదరణ పొందిన కొన్ని రచనలను వూషమల్ల కృష్ణ హిందీ భాషలోకి అనువదించారు.

  1. కాలి కుముదినీ - (తెలుగు మూలం -నల్ల కలువ), కవిత్వం (డా. కత్తి పద్మారావు ) - 2022
  2. అనంత్ జీవన్ - (తెలుగు మూలం - అనంత జీవనం, నవల (పద్మశ్రీ కొలకలూరి ఇనాక్) - 2015
  3. అచూత్ వసంత్ - (తెలుగు మూలం-అంటరాని వసంతం),నవల (జి. కళ్యాణరావు) - 2012
  4. సాహిత్యితిహాస్:రచనా ఔర్ సంరచనా (Dr. సి.హెచ్ రాములుతో కలిసి చేసినది) 1995
  5. మా భూమి -(తెలుగు మూలం -మా భూమి నాటకం), (సుంకర సత్యనారాయణ వాసిరెడ్డి భాస్కరరావు) 1994

తెలుగు రచనలు

  1. సంత్ శిరోమణి గురు రవిదాస్ జీవితం: సాహిత్యం. సీడాస్ట్ హెచ్.సి.యు-2018
  2. సంత్ శిరోమణి గురు రావిదాసు ప్రభోదాలు -2012

తెలుగు అనువాద రచనలు

  1. చారిత్రిక సమస్యలు అంబేద్కర్ ఏమన్నారంటే. (మొదటి భాగం) ఛాయా ప్రచురణలు. 2021
  2. అవతలి గుడిసె హిందీ సాహిత్యపు మొట్ట మొదటి దళిత నవల (హిందీ మూలం- చప్పర్; జయప్రకాష్ కర్ధం-1994) ఛాయా ప్రచురణలు. 2021
  3. కావ్య పూలు. అన్వేషి రీసెర్చ్ సెంటర్ ఫర్ విమెన్. 2017
  4. పిన్ని. హెచ్.సి.యు లిటరరీ సర్కిల్. 2001
  5. పులి. జే.వి.వి ప్రచురణలు. 2000
  6. నెత్తుటి కేక. హెచ్.సి.యు లిటరరీ సర్కిల్. 2000
  7. వల్లకాడు. లోకాయత ప్రచురణలు. 1996

వివిధ పత్రికల్లో అచ్చైన తెలుగు వ్యాసాలు

  (1879 జూన్ 5 -చికాగో ట్రిబ్యూన్ లో ప్రచురితమైన మార్క్స్ ఇంటర్వ్యూ మేడె సందర్భంగా డా.వి.కృష్ణ చేసిన అనువాదం)

పొందిన పురస్కారాలు

[మార్చు]

హిందీ భాషా ఆచార్యుడిగా, విమర్శకుడు, తులనాత్మక సాహిత్య పరిశోధకుడిగా అనువాదకుడిగా హిందీ సాహిత్యానికి, దళిత సాహిత్యానికి చేసిన విశేష కృషికి గాను కొన్ని అవార్డులు డా.వి. కృష్ణ గారిని వరించాయి. అందులో కొన్ని ఈ విధంగా ఉన్నాయి.

  1. హిందీ విశిష్ట సేవా పురస్కారం - 2000, నేషనల్ సాహిత్య అకాడమి, కలకత్తా (Distingushed Hindi Service Award -

2000, National Hindi Academy, Culcutta

  1. డా. బి.ఆర్ అంబేద్కర్ విశిష్ట సేవా పురస్కారం - 2000, భారతీయ దళిత సాహిత్య అకాడమీ, న్యూ డిల్లి.

( Dr. B.R. Ambedkar Distingushed Service Award -2000, Bharatiya dalit Sahitya Academy, New Delhi).

  1. నారాయణ గురు సాహిత్య రత్న పురస్కార్ - 2003, భారతీయ దళిత సాహిత్య అకాడెమి,మధ్యప్రదేశ.  
  2. ఆచార్య భీంసేన్ నిర్మల్ నేషనల్ అవార్డ్, 2013.
  3. హిందియేతర రచయిత పురస్కారం, బిహార్ రాష్ట్ర ప్రభుత్వం 2003.


వివిధ అధికారిక కమిటీలలో సభ్యుడిగా

[మార్చు]

అనుభవం కలిగిన హిందీ భాషా ఆచార్యుడిగా రాష్ట్ర, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో వివిధ అకాడెమిక్ బాడిల్లో సభ్యుడిగా విధుల నిర్వహించారు. మరి కొన్ని కమిటీలలో ఇప్పటికి కూడా సభ్యుడిగా కొనసాగుతున్నారు.

  1. ఫౌండర్ & ట్రస్టీ మెంబర్, సెంటర్ ఫర్ దళిత్ లిటరేచర్ & ఆర్ట్, (CDS) న్యూడిల్లీ
  2. వైస్ చైర్మెన్, ఫౌండర్ మెంబర్, సెంటర్ ఫర్ దళిత స్టడీస్ (CDS), హైదరాబాదు.
  3. మెంబర్, బోర్డ్ ఆఫ్ స్టడీస్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాదు.
  4. మెంబర్, బోర్డ్ ఆఫ్ స్టడీస్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, (హైదరాబాదు).
  5. మెంబర్, బోర్డ్ ఆఫ్ స్టడీస్, ఇందిరా గాంధి నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ, అమర్కంటక్, (మధ్య ప్రదేశ్).
  6. మెంబర్, బోర్డ్ ఆఫ్ స్టడీస్, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, హైదరాబాదు.
  7. మెంబర్, బోర్డ్ ఆఫ్ స్టడీస్, సెంట్రల్ యూనివర్సిటీ కర్ణాటక, గుల్బర్గా, (కర్ణాటక).
  8. మెంబర్, బోర్డ్ ఆఫ్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ -టెక్నాలజీ, కొచ్చి, (కేరళ).
  9. మెంబర్ ఆఫ్ ఎక్స్ పర్ట్ కమిటి NASSSILL, UGC, NEW DELHI.
  10. మెంబర్, పురస్కారాల ఎంపిక కమిటీ, సాహిత్య అకాడమీ, న్యూడిల్లీ 2006
  11. హిందీ సలహా మండలి సభ్యుడు, వాణిజ్య మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, న్యూఢిల్లీ (2004-2007)
  12. హిందీ సలహా మండలి సభ్యుడు, రైల్వే మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, న్యూఢిల్లీ (2002-2004)
  13. హిందీ సలహా మండలి సభ్యుడు, కార్మిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, న్యూఢిల్లీ (1998 -2001)
  14. హిందీ సలహా మండలి సభ్యుడు, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, న్యూఢిల్లీ (1993 -1997)

మూలాలు

[మార్చు]
  1. Nov 18; 2014. "Prof. V. Krishna appointed CE at UoH |" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-09-29. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)

1.https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-601713#! 2. https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-554200 Archived 2022-09-29 at the Wayback Machine 3.https://uohyd.irins.org/profile/245131#personal_information_panel 4. https://www.thehansindia.com/.../3-day-meet-on-south[permanent dead link]... 5. https://in.linkedin.com/.../university-of-hyderabad[permanent dead link]... 6. https://uohyd.irins.org/faculty/index/Department+of+Hindi 7. https://soh.uohyd.ac.in/hindi/people/ 8. https://uohydtelugu.blogspot.com/.../maiiird-students[permanent dead link]... 9. https://www.firstpost.com/.../hcus-schism-between.../amp

బయటి లింకులు

[మార్చు]
  1. వూషమల్ల కృష్ణ గారి బ్లాగ్ లింక్ http://drvooshamallakrishna0110.blogspot.com/ Archived 2022-10-01 at the Wayback Machine