కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం
కాళోజీ నారాయణరావు
రకంప్రజా
స్థాపితం2014, సెప్టెంబరు 26
వైస్ ఛాన్సలర్డా. బి.కరుణాకర రెడ్డి
స్థానంవరంగల్, తెలంగాణ, భారతదేశం
కాంపస్పట్టణ

కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం, తెలంగాణలోని వైద్య విశ్వవిద్యాలయం. తెలంగాణ కవి, సామాజిక కార్యకర్త కాళోజీ నారాయణరావు స్మృత్యర్థం "కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం"గా నామకరణం చేయబడింది.[1]

చరిత్ర[మార్చు]

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు వైద్యకళాశాలలన్ని ఎన్.టి.ఆర్. ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలుగా ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  తెలంగాణ ప్రభుత్వం  నూతన విశ్వవిద్యాలయం "శ్రీ కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2016 ఆగస్టు 7న శంకుస్థాపన చేసాడు.[2] ప్రస్తుతం ఇది వరంగల్ లో ఉంది.తెలంగాణలోని  వైద్య  కళాశాలలన్ని దీనికి అనుబంధ కళాశాలలుగా ఉంటాయి.[3][4]

ప్రవేశం[మార్చు]

అభ్యర్థుల ప్రవేశాలు నీట్ లేదా ఎంసెట్ ఆధారంగా జరుగుతాయి.

అనుబంధ కళాశాలలు[మార్చు]

ప్రభుత్వ కళాశాలల్లో 1250 సీట్లు ఉన్నాయి.

ప్రైవేటు కళాశాలు[మార్చు]

ప్రైవేట్ కాలేజీల్లో 2250 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

  • చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్
  • దక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్
  • డా.విఆర్కె మహిళా వైద్య కళాశాల, అజీమ్‌నగర్
  • షాదన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్
  • అయాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, వికారాబాద్ జిల్లా
  • అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్
  • భాస్కర్ మెడికల్ కాలేజీ, మొయినాబాద్
  • కామినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, హైదరాబాద్
  • కామినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నల్గొండ
  • మమత మెడికల్ కాలేజీ, ఖమ్మం
  • మహేశ్వరి వైద్య కళాశాల, పటాన్‌చెరు
  • మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఘన్‌పూర్
  • ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్, సంగారెడ్డి
  • ఎస్.వి.ఎస్. మెడికల్ కాలేజీ, మహబూబ్‌నగర్
  • ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్
  • ఆర్.వి.యం. మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్, మెదక్

మూలాలు[మార్చు]

  1. "కాళోజి ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు". www.ntnews.com. 2019-09-07. Retrieved 2019-10-05.
  2. http://www.thehindu.com/news/cities/Hyderabad/modi-accorded-warm-welcome/article8957488.ece
  3. http://timesofindia.indiatimes.com/city/hyderabad/Telangana-starts-disaffiliation-of-colleges-under-NTR-health-university/articleshow/50940157.cms
  4. http://www.oneindia.com/hyderabad/warangal-prison-will-now-host-a-university-2159032.html

వెలుపలి లంకెలు[మార్చు]