సత్తెనపల్లి
పట్టణం | |
Coordinates: 16°23′46″N 80°08′59″E / 16.3962°N 80.1497°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు జిల్లా |
మండలం | సత్తెనపల్లి మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 22.81 కి.మీ2 (8.81 చ. మై) |
జనాభా | |
• మొత్తం | 56,721 |
• జనసాంద్రత | 2,500/కి.మీ2 (6,400/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1001 |
ప్రాంతపు కోడ్ | +91 ( 8641 ) |
పిన్(PIN) | 522403 |
Website |
సత్తెనపల్లి పల్నాడు జిల్లాలోని పట్టణం, అదేపేరుగల మండలానికి కేంద్రం. ఈ నగరం పల్నాడుకు ముఖ ద్వారము వంటిది. ఇక్కడి ప్రజలు వ్యవసాయ సంబంధిత పరిశ్రమల మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో వరి, మిరప, ప్రత్తి విరివిగా పండిస్తారు.
భౌగోళికం
[మార్చు]జిల్లా కేంద్రమైన నరసరావుపేట నుండి ఈశాన్య దిశలో 23 కి.మీ. దూరంలో, సమీప నగరమైన గుంటూరు కు వాయవ్య దిశలో 35 కి.మీ దూరంలో ఈ పట్టణం వుంది.
జనగణన గణాంకాలు
[మార్చు]2011 జనగణన ప్రకాం పట్ణణ జనాభా 56,721.
రవాణా సౌకర్యాలు
[మార్చు]గుంటూరు - మాచర్ల రహదారి పట్టణంగుండా పోతుంది. గుంటూరు - నడికుడి రైల్వే మార్గంలో ఈ పట్టణం వుంది.
ఇతర విశేషాలు
[మార్చు]ఉమ్మడి జిల్లాలో తొలిసారి ట్రాన్స్ కో ఇక్కడ ఒక 400 కె.వి. సబ్-స్టేషనును ఏర్పాటుచేసింది. ఈ సబ్-స్టేషను నుండి వర్షాకాలంలో శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రం నుండి, ఎండాకాలంలో విజయవాడ థర్మల్ పవర్ స్టేషను నుండి, విద్యుత్తు సరఫరా చేయుటకు ఏర్పాటుచేసారు.
ప్రముఖులు
[మార్చు]- కన్నెగంటి బ్రహ్మానందాచారి ఉరఫ్ కన్నెగంటి బ్రహ్మానందం సొంతవూరు సత్తెనపల్లికి 15 కి.మీల దూరంలోని ముప్పాళ్ల.
- జానీ లీవర్ అని హిందీ సినిమా ప్రేమికులు ఆప్యాయంగా పిలుచుకునే 'జనుముల జాన్ ప్రకాశరావు' కు సత్తెనపల్లితో అనుబంధముంది.
- జింకా రామారావు, చిత్రకారుడు, పాత్రికేయుడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
- ↑ http://sattenapalle.cdma.ap.gov.in/.
{{cite web}}
: Missing or empty|title=
(help) - ↑ మన తెలంగాణ, దునియా (3 January 2019). "జింకా జీవకళ". Archived from the original on 12 December 2020. Retrieved 12 December 2020.