సిండెగా జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిండెగా జిల్లా
జార్ఖండ్ లో సిండెగా జిల్లా స్థానము
జార్ఖండ్ లో సిండెగా జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
పరిపాలన విభాగముదక్షిణ ఛోటానాగపూర్ డివిజను
ముఖ్య పట్టణంసిండెగా
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుKhunti (shared with Khunti district)
 • శాసనసభ నియోజకవర్గాలు3
విస్తీర్ణం
 • మొత్తం3.2 కి.మీ2 (1,452.2 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం5,99,813
 • సాంద్రత160/కి.మీ2 (410/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత67.59 per cent
 • లింగ నిష్పత్తి1000
జాలస్థలిఅధికారిక జాలస్థలి

జార్ఖండ్ లోని 24 జిల్లాల్లో సిండెగా జిల్లా ఒకటి. సిండెగా పట్టణం దీని ముఖ్యపట్టణం. 2001 ఏప్రిల్ 30 న గుమ్లా జిల్లానుండి ఈ ప్రాంతాన్ని విడదీసి ఈ జిల్లాను ఏర్పరచారు. ఈ జిల్లా "ఎర్ర నడవా"లో భాగంగా ఉంది.[1] జార్ఖండ్‌లో అత్యల్ప జనాభా గల జిల్లాల్లో, లోహార్‌దాగా, ఖుంతి ల తరువాత ఇది మూడవ స్థానంలో ఉంది.[2]

ఆర్థికం[మార్చు]

దేశంలో అత్యంత వెనుకబడ్డ 250 జిల్లాల్లో సిండెగా ఒకటి. 2006 లో భారత ప్రభుత్వ పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖ దీన్ని గుర్తించింది.[3] వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి గ్రాంటు పథకంలో నిధులు పొందుతున్న 21 జార్ఖండ్ జిల్లాల్లో సిండెగా కూడా ఒకటి.[3]

జనాభా వివరాలు[మార్చు]

Religions in Simdega district (2011)[4]
Christianity
  
51.14%
Hinduism
  
33.61%
Sarnaism
  
12.35%
Islam
  
2.52%
Jainism
  
0.14%
Buddhism
  
0.13%
Sikhism
  
0.01%
Distribution of religions

2011 జనగణన ప్రకారం సిండెగా జిల్లా జనసంఖ్య 5,99,578.[5] జనాభా పరంగా ఇది భారతదేశపు జిల్లాల్లో 526 వ స్థానంలో ఉంది. (మొత్తం 640 జిల్లాల్లో).[5] జనసాంద్రత ప్రతి చ.కి.మీ.కు 160 మంది.[5] 2001-2011 దశాబ్దంలో జనాభా పెరుగుదల 16.62%గా ఉంది.[5] ఇక్కడి లింగ నిష్పత్తి 1000/1000 [5] అక్షరాస్యత 67.59%. జార్ఖండ్‌లో క్రైస్తవ మెజారిటీ జిల్లా ఇదొక్కటే.[4] జనాభాలో షెడ్యూల్డ్ కులాల వారు 7.5%, షెడ్యూల్డు తెగల వారు 70.8%గా ఉన్నారు.[5]

2011 జనగణన ప్రకారం జిల్లాలో 53.91% మంది సద్రి భాష మాట్లాడతారు. 22.50% మంది ముండారి, 15.44% మంది ఖరియా, 4.02% మంది హిందీ, 1.44% మంది కురుఖ్,1.36% మంది ఉర్దూ మాట్లాడుతారు.[6]

మూలాలు[మార్చు]

  1. "83 districts under the Security Related Expendure Scheme". IntelliBriefs. 2009-12-11. Retrieved 2011-09-17.
  2. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). 27, 2011 "A Note on the Backward Regions Grant Fund Programme" Check |url= value (help). National Institute of Rural Development.[permanent dead link]
  4. 4.0 4.1 Simdega District Population Census 2011, Jharkhand literacy sex ratio and density
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  6. 2011 Census of India, Population By Mother Tongue