సోమేపల్లి సాహితీ పురస్కారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోమేపల్లి సాహితీ పురస్కారం
11
ఎందుకు ఇస్తారుజాతీయ ఉత్తమ కథలకు
సమర్పణసోమేపల్లి వెంకట సుబ్బయ్య
దేశంభారతదేశం
మొదటి ప్రధానం2007
చివరి ప్రధానం2016
అధికారక వెబ్‌సైటుwww.somepallipuraskaram.blogspot.in

జాతీయ స్థాయిలో చిన్న కథల పోటిలలో ఉత్తమ కథలను రచించిన వారికి సోమేపల్లి సాహితీ పురస్కారం అందచేస్తారు. సోమేపల్లి వెంకట సుబ్బయ్య వారి తల్లిదండ్రుల స్మృత్యార్థం ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో చిన్న కథల పోటిని రమ్యభారతి సాహిత్య త్రైమాస పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించి విజేతలకు సోమేపల్లి సాహితీ పురస్కారం అందచేస్తారు.[1]

పురస్కారం[మార్చు]

ఈ పురస్కారాన్ని వెంకటసుబ్బయ్య తల్లితండ్రులు సోమేపల్లి హనుమంతరావు, నాగరత్నంల స్మృత్యార్థం 2007 నుండి అందిస్తున్నారు. కథ నిలిచిన స్థాయిని బట్టి ప్రకటించిన నగదు, శాలువా, ధ్రువ పత్రం, జ్ఞాపిక పురస్కారంలో భాగంగా ఇస్తారు.[2][3]

పురస్కారాలు[మార్చు]

ప్రధమ పురస్కారాలు-2007[మార్చు]

ప్రథమ పురస్కారాలు 2007 జూలై 1న గుంటూరులో రమ్యభారతి త్రైమాస పత్రిక ఆధ్వర్యంలో ప్రదానం చేశారు. ముఖ్య అథిదిగా కథా రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య, గౌరవ అథిదిగా పాపినేని శివశంకర్ పాల్గొన్నారు. పొన్నూరు వెంకట శ్రీనివాసులు అధ్యక్ష్యతన జరిగిన కార్యక్రమంలో ద్వా.నా. శాస్త్రి, చలపాక ప్రకాష్ పాల్గొన్నారు.[4]

స్థానం కథ రచయిత
ప్రథమ రెక్కలు తెగిన పక్షులు చొప్పదండి సుధాకర్
ద్వితీయ గుండెపోటు జీడిగుంట రామచంద్ర మూర్తి
తృతీయ అలారం రేణుక అయోల
ఉత్తమ బలమైన కుటుంబాలు-బలహీన సమాజం జె.ఆర్.సుధీర్
ఉత్తమ రాణి – ఎ స్టడీ డా. ఎన్.రామచంద్ర
ఉత్తమ నింగి నీడలు వడలి రాధాకృష్ణ
ఉత్తమ గాజు బొమ్మలు పింగళి భట్టిప్రోలు బాలాదేవి
ఉత్తమ మట్టి వాసన న్యాడా
ఉత్తమ నిచ్చెన గుండాన జోగారావు
ఉత్తమ ఆతిధ్యం పాలపర్తి జ్యోతిష్మతి

ద్వితీయ పురస్కారాలు-2008[మార్చు]

ద్వితీయ పురస్కారాలు విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో రమ్యభారతి త్రైమాస పత్రిక ఆధ్వర్యంలో ప్రదానం చేశారు. ముఖ్య అథిదిగా విజయవాడ ఆకాశవాణి సంచాలకులు మంగళగిరి ఆదిత్య ప్రసాద్, గౌరవ అథిదిగా రసరాజు పాల్గొన్నారు. పొన్నూరు వెంకట శ్రీనివాసులు అధ్యక్ష్యతన జరిగిన కార్యక్రమంలో సర్వజిత్, చలపాక ప్రకాష్ పాల్గొన్నారు.[4]

స్థానం కథ రచయిత
ప్రథమ స్టొరీ 2040 అయినాల కనక రాత్నాచారి
ద్వితీయ సుచిత్ర టి.ఎస్.ఏ.కృష్ణమూర్తి
తృతీయ హింస రచన సి.హెచ్.శర్మ
ఉత్తమ మేన్ మేకర్స్ డి.వి.వి.ఎస్.నారాయణ
ఉత్తమ సీనియర్ సిటిజన్స్ రిక్రియేషన్ క్లబ్ జి.మేరీకృపాచారి
ఉత్తమ వచ్చినవాడు ఫల్గుణుడు మంతెన సత్యనారాయణ రాజు
ఉత్తమ భూతం పాలపర్తి జ్యోతిష్మతి

తృతీయ పురస్కారాలు-2010[మార్చు]

తృతీయ పురస్కారాలు విజయవాడలో రమ్యభారతి త్రైమాస పత్రిక ఆధ్వర్యంలో ప్రదానం చేశారు. ముఖ్య అథిదిగా ప్రముఖ రచయిత్రి వి.ప్రతిమ పాల్గొన్నారు. ప్రముఖ పత్రికా సంపాదకులు కొల్లూరి అధ్యక్ష్యతన జరిగిన కార్యక్రమంలో సర్వజిత్,రచయిత తోటకూర వెంకటనారాయణ,రమ్యభారతి సంపాదకులు చలపాక ప్రకాష్ పాల్గొన్నారు.[4]

స్థానం కథ రచయిత
ప్రథమ ఖాళీ యం.రమేష్ కుమార్
ద్వితీయ ఇంకా ఎంత కాలం రంగనాథ రామచంద్రరావు
తృతీయ పదహారు గంటల మనిషి గుండాన జోగారావు
ఉత్తమ చిన్ని కృష్ణుడు పాలపర్తి జ్యోతిష్మతి
ఉత్తమ డైరీ జోస్యము విద్యాసాగర్
ఉత్తమ కాదేదీ వాడికసాద్యం బొడ్డుపల్లి కృష్ణావధాని

నాల్గవ పురస్కారాలు-2011[మార్చు]

నాల్గవ పురస్కారాలు నర్సాపురం శ్రీ వై ఎన్ కళాశాలలో డిసెంబరు 18న రమ్యభారతి త్రైమాస పత్రిక ఆధ్వర్యంలో ప్రదానం చేశారు. ముఖ్య అథిదిగా ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు అద్దేపల్లి రామమోహనరావు పాల్గొన్నారు. చక్రవధానుల రెడ్డప్ప ధవేజి అధ్యక్ష్యతన జరిగిన కార్యక్రమంలో సినీ కవి రసరాజు,డా. చినమిల్లి సత్యనారాయణరావు, డా.కడిమిళ్ళ వరప్రసాద్, న్యాయ నిర్ణేత గుత్తుల భాస్కరరావు, మున్సిపల్ కమీషనర్ పి యం సత్యవేని, రమ్యభారతి సంపాదకులు చలపాక ప్రకాష్ పాల్గొన్నారు.[4]

స్థానం కథ రచయిత
ప్రథమ హత్య చెయ్యనవసరంలేదు మాకినీడి సుర్యభాస్కర్
ద్వితీయ తొలిగిన తెర ఎస్వీ.కృష్ణజయంతి
తృతీయ నాన్నకోసం పాతూరి అన్నపూర్ణ
ఉత్తమ మానవ పరిమళం నడిపల్లి శైలజ
ఉత్తమ తస్మాత్ జాగ్రత్త యలమర్తి అనూరాధ
ఉత్తమ నీడ వెన్నెల కొత్తపల్లి ఉదయబాబు
ఉత్తమ కొంచెం చేదు – కొంచెం వగరు ఎన్వీ ఎస్ నాయుడు

ఐదవ పురస్కారాలు-2012[మార్చు]

ఐదవ పురస్కారాలు విజయవాడ ప్రెస్లో క్లబ్ లో 2013 ఫెబ్రవరి 24న రమ్యభారతి త్రైమాస పత్రిక ఆధ్వర్యంలో ప్రదానం చేశారు.న్యాయ నిర్ణేతగా ప్రముఖ కథా రచయిత విహారి వ్యవహరించారు.[4]

స్థానం కథ రచయిత
ప్రథమ అర్హత రాచమళ్ళ ఉపేందర్
ద్వితీయ ట్రంకు పెట్టె షేక్ బషీరున్నీసా బేగం
తృతీయ సాదృశ్యం బి వి శివప్రసాద్
ఉత్తమ ఏరుకు దాహం వేసింది పోలాప్రగడ జనార్ధనరావు (జెన్నీ)
ఉత్తమ మెరిసేటి బంగారమా వాయుగుండ్ల శశికళ
ఉత్తమ క్షణం...జీవితం శ్రీ కంఠ స్ఫూర్తి
ఉత్తమ తోడు సి హెచ్ వి బృందావన రావు
ఉత్తమ మాకు ఒక పిచ్చి అయ్య కావాలి ఆర్.దమయంతి
ఉత్తమ శేష ప్రశ్న కొలిపాక శోభారాణి
ఉత్తమ మనస్సాక్షి సాహిత్య ప్రకాశ్
ఉత్తమ సేవే కదా జీవిత పరమార్థం అమూల్య తెర్లి

ఆరవ పురస్కారాలు-2013[మార్చు]

ఆరవ పురస్కారాలు విజయవాడ ప్రెస్ క్లబ్ లో 2014 ఫిబ్రవరి 9న రమ్యభారతి త్రైమాస పత్రిక ఆధ్వర్యంలో ప్రదానం చేశారు. ముఖ్య అథిది, న్యాయ నిర్ణేతగా ప్రముఖ కథా రచయిత వేదగిరి రాంబాబు పాల్గొన్నారు. గౌరవ అథిదిగా సోమేపల్లి వెంకటేశ్వర్లు, సభా నిర్వాహకుడు రమ్యభారతి సంపాదకులు చలపాక ప్రకాష్ పాల్గొన్నారు.[4][5]

స్థానం కథ రచయిత
ప్రథమ వ్యక్తావ్యక్తం మంత్రవాది మహేశ్వర్
ద్వితీయ ఆశల పల్లకి వియోగి
తృతీయ నేను సైతం మాడుగుల రామకృష్ణ
ఉత్తమ తోడు నీడ పోలాప్రగడ జనార్ధనరావు (జెన్నీ)
ఉత్తమ దాడి తటవర్తి నాగేశ్వరి

ఏడవ పురస్కారాలు-2014[మార్చు]

ఏడవ పురస్కారాలు విజయవాడ ప్రెస్ క్లబ్ లో 2015 ఫిబ్రవరి 1న రమ్యభారతి త్రైమాస పత్రిక ఆధ్వర్యంలో ప్రదానం చేశారు. ముఖ్య అథిదిగా ఆకాశవాణి సంచాలకులు మంజులూరి కృష్ణకుమారి పాల్గొన్నారు. జి.వి. పూర్ణచంద్ అధ్యక్ష్యతన కార్యక్రమం జరిగింది. న్యాయ నిర్ణేతగా ప్రముఖ రచయిత మాడుగుల రామకృష్ణ వ్యవహరించారు. కార్యక్రమంలో రమ్యభారతి సంపాదకులు చలపాక ప్రకాష్ పాల్గొన్నారు.[4]

స్థానం కథ రచయిత
ప్రథమ ఆత్మశాంతి సి.కృష్ణకుమారి శాస్త్రి
ద్వితీయ ఇంకెక్కడి బాల్యం జి.రంగబాబు
తృతీయ నిజాయితీ ప్రతాప వెంకట సుబ్బారాయుడు
ఉత్తమ కొలబద్ద వాలి హిరణ్మయీ దేవి
ఉత్తమ తరువు తలారీ మాధవరపు కృష్ణ
ఉత్తమ కోరిక సి.ఎస్.రాంబాబు
ఉత్తమ ట్రంకు పెట్టె ఎం.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి
ఉత్తమ చాకి రేవు సాహిత్య ప్రసాద్

ఎనిమిదవ పురస్కారాలు-2015[మార్చు]

ఎనిమిదవ పురస్కారాలు విజయవాడ ప్రెస్ క్లబ్ లో 2016 జనవరి 24న రమ్యభారతి త్రైమాస పత్రిక ఆధ్వర్యంలో ప్రదానం చేశారు. ముఖ్య అథిదిగా గజల్ మాస్ట్రో గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. గుమ్మా సాంబశివరావు అధ్యక్ష్యతన జరిగిన కార్యక్రమంలో గౌరవ అథిదిగా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్ష్యులు పెనుగొండ లక్ష్మీనారాయణ, న్యాయ నిర్ణేత ప్రముఖ కథారచయిత కాట్రగడ్డ దయానంద్, రమ్యభారతి సంపాదకులు చలపాక ప్రకాష్ పాల్గొన్నారు.[4]

స్థానం కథ రచయిత
ప్రథమ ఇది కథ కాదు సి.ఎన్.చంద్రశేఖర్
ద్వితీయ ఫలక్ బి. కళాగోపాల్
తృతీయ కొత్త బంధం రాచమళ్ళ ఉపేందర్
ఉత్తమ అలజడి వాన మొలుగు కమలాకాంత్
ఉత్తమ ఆశావహం సి.వి.ఎన్.ప్రసాద్
ఉత్తమ పొడుగు చేతులు అల్లంశెట్టి చంద్రశేఖరరావు
ఉత్తమ మేఘసందేశం కె.రామమోహన్

తొమ్మిదవ పురస్కారాలు-2016[మార్చు]

తొమ్మిదవ పురస్కారాలు ప్రకాశం జిల్లా మార్టూరులో వెక్ట్రా స్కూల్ లో రమ్యభారతి త్రైమాస పత్రిక ఆధ్వర్యంలో ప్రదానం చేశారు.[4]

స్థానం కథ రచయిత
ప్రథమ మనుష్య ఋణం సింహప్రసాద్‌
ద్వితీయ రఘుపతి రాఘవ రాజారాం తటవర్తి నాగేశ్వరి
తృతీయ నాలుగు ఉత్తరాలు – ఒక సమాధానం రంగనాథ రామచంద్ర రావు
ఉత్తమ పండుగ జరుపుకుందాం ఎం. ఎస్ సాయిబాబు
ఉత్తమ తాపత్రయం వియోగి
ఉత్తమ మాటకందని మౌనం మంత్రవాది మహేశ్వర్

పదవ పురస్కారాలు-2017[మార్చు]

పదవ పురస్కారాలు ప్రకాశం జిల్లా గన్నవరం గ్రామంలో 2018 ఫిబ్రవరి 17న రమ్యభారతి త్రైమాస పత్రిక ఆధ్వర్యంలో ప్రదానం చేశారు. ముఖ్య అథిదిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. రమ్యభారతి సంపాదకులు చలపాక ప్రకాష్ పాల్గొన్నారు.[4]

స్థానం కథ రచయిత
ప్రథమ నిమజ్జనం వడలి రాధాకృష్ణ
ద్వితీయ బిచ్చగాడు జి.ఎస్.కె.సాయిబాబా
తృతీయ వార్డెన్ శిoగరాజు శ్రీనివాసరావు
ఉత్తమ సమీనా జి అనసూయ
ఉత్తమ చీకటి దారిలో తాటికోల పద్మావతి
ఉత్తమ దేవుడు వరమిచ్చినా కోపూరి పుష్పాదేవి
ఉత్తమ వారధి సి యమునా

ప్రచురణలు[మార్చు]

మొదటి నాలుగు సంవత్సరాల పోటీలలో పురస్కారం పొందిన కథలను కలిపి 'సోమేపల్లి వురస్కార కథలు' అనే పుస్తకం ప్రచురించటం అయ్యింది[6]. తరువాతి నాలుగు సంవత్సరాల పురస్కారాలు పొందిన కథలు 'సోమేపల్లి పురస్కార కథలు -2'గా ప్రచురించారు.[7][8]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.andhrajyothy.com/artical?SID=4941&SupID=26
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-04. Retrieved 2016-12-01.
  3. http://vasumdhara.com/2011/12/%E0%B0%B8%E0%B1%8B%E0%B0%AE%E0%B1%87%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%80-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE/[permanent dead link]
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 4.9 "సోమేపల్లి సాహితీ పురస్కార విజేతలు".[permanent dead link]
  5. https://sarasabharati-vuyyuru.com/2014/02/02/%E0%B0%86%E0%B0%B0%E0%B0%B5-%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%95%E0%B0%A7%E0%B0%B2-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%9F%E0%B1%80-%E0%B0%B5/
  6. https://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=13432[permanent dead link]
  7. http://www.andhrabhoomi.net/content/akshara-483
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-06-28. Retrieved 2018-02-06.