నరసాపురం (పశ్చిమ గోదావరి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


నరసాపురం
—  మండలం  —
పశ్చిమ గోదావరి జిల్లా పటములో నరసాపురం మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో నరసాపురం మండలం యొక్క స్థానము
నరసాపురం is located in ఆంధ్ర ప్రదేశ్
నరసాపురం
నరసాపురం
ఆంధ్రప్రదేశ్ పటములో నరసాపురం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°27′00″N 81°40′00″E / 16.45°N 81.6667°E / 16.45; 81.6667
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండల కేంద్రము నరసాపురం
గ్రామాలు 15
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,39,084
 - పురుషులు 69,681
 - స్త్రీలు 69,403
అక్షరాస్యత (2001)
 - మొత్తం 77.31%
 - పురుషులు 82.59%
 - స్త్రీలు 72.02%
పిన్ కోడ్ 534275

నరసాపురం (Narsapuram), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక పట్టణము, మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రము. పిన్ కోడ్: 534275. దీని అక్షాంశ రేఖాంశాలు 16° 27' 0" ఉత్తరం, 81° 40' 0" తూర్పు. 'నృసింహపురి', 'అభినవభూతపురి' అన్న పేర్లు కూడా కొన్ని (సాహితీ) సందర్భాలలో వాడుతారు.

జనవిస్తరణ[మార్చు]

బస్టాండ్ సెంటర్

2001 జనాభా లెక్కల ప్రకారం నరసాపురం పట్టణం జనాభా 58,508. ఇందులో పురుషుల సంఖ్య 49%, స్త్రీల సంఖ్య 51% ఉన్నారు. నరసాపురం అక్షరాస్యత 75% (దేశం సగటు అక్షరాస్యత 59.5%). పురుషులలో అక్షరాస్యత 78%, స్త్రీలలో 71%. మొత్తం పట్టణ జనాభాలో 11% వరకు 6 సంవత్సరాల లోబడిన వయసువారు. నరసాపురం లేసు పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. జనాభా ప్రధానంగా హిందువులు ఉన్నారు గాని ముస్లిం, క్రైస్తవ, జైన మతాలవారు కూడా గణనీయంగా ఉన్నారు. కనుక వివిధ సంస్కృతుల ప్రభావం ఈ పట్టణంలో కనిపిస్తుంది.

దేవాలయాలు[మార్చు]

ఎంబర్ మన్నార్ దేవాలయము
శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్యామి బ్రహ్మోత్సవం

నరసాపురంలో ప్రసిద్ధి చెందిన దేవాలయము శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ కోవెల. ఇది భారతదేశ ప్రసిద్ధ వైష్ణవాలయాలలో ఒకటి. దీని నిర్మాణము మూడు వందల సంవత్సరాలకు మునుపు జరిగింది. ప్రసన్నాగ్రేసర పుప్పల రమణప్పనాయుడు తన గురువుగారి కోరికను తీర్చే నిమిత్తం ఈ ఆలయాన్ని కట్టించాడు. దీని నిర్మాణ శైలి తమిళనాడు లోని పెరంబుదూర్ లోని వైష్ణవదేవాలయమును పోలి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఆదికేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు, రామానుజాచార్యుల తిరునక్షత్ర ఉత్సవానికి దేశంలోని వివిధ ప్రాంతాలనుండి చాలామంది వైష్ణవ గురువులు, భక్తులు తరలి వస్తారు.

లూథరన్ చర్చి
1929లో నిర్మించిన లూథరన్ చర్చి
జగన్నాథస్వామి దేవాలయము,
స్టీమర్ రోడ్ అని పిలిచే మెయిన్ రోడ్

ఈ దేవాలయము రుస్తుంబాదలో కలదు, ఒరిస్సాలోని పూరి తర్వాత జగన్నాథునికి ఆలయము ఇక్కడనె కలదు, ఈ ఆలయము గంధర్వులు నిర్మించినట్టు స్థలపురాణం చెబుతుంది.

కొండాలమ్మ దేవాలయము.

ఈ ఆలయం గోదావరి వడ్డున పాతరేవు, కొత్తరేవుల మధ్య ఉంది. ఇక్కడి విగ్రహము గోదావరిలో దేవాలయము కలప్రాంతములోనే దొరకినది. విగ్రహము దాదాపు నాలుగు ఐదు అడుగుల మధ్య ఎత్తులో అందముగానూ, గంభీరముగానూ ఉంటుంది. నరసాపురం వెళ్ళిన వారు తప్పక దర్శించే దేవాలయాలలో ఇది ఒకటి. పుష్కరాల సందర్భంలో గుడిని మరింత ఆదునీకరించారు.

కపిల మల్లేశ్వరస్వామి దేవాలయము

ఇది నరసాపురం మెయిన్ రోడ్డు చివరన ఉంది. ఈ దేవాలయములో శివలింగము శ్రీశైలము లోని లింగమును పోలి ఉంటుంది. మదన గోపాల స్వామి ఆలయం ఈ గుడి ఎదురుగా ఉంటుంది.

రాజగోపాలస్వామి మందిరం.

ఇది కూడా సఖినేటి పల్లె వెళ్ళే గోదావరి రేవుదారిలో ఉంది. ఆరంతస్తుల గోపురముఖద్వారము కలిగి, మంచి శిల్పకళ కలిగిన ఆలయము. ఇవే కాక పట్టణములో మదన గోపాల స్వామి మందిరం, లలితాంబ గుడి, కనక దుర్గ గుడి వంటి పలు ఆలయాలున్నాయి. ఇటీవల కాలంలో ఒక జైన మందిరం నిర్మించబడింది.

పెద్ద మస్జిద్

ఇది నరసాపురం పిచ్జుపల్లె వెళ్ళే దారిలో ఉంది.

విశేషాలు[మార్చు]

పర్యాటకులకు ఆకర్షణలు[మార్చు]

గోదావరి వలంధర్ రేవు వద్ద సూర్యోదయం
 • చుట్టుప్రక్కల పచ్చని వరి పొలాలు కలిగిన ఈ ప్రాంతం పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉంటుంది.
 • గోదావరి నది, తీరప్రాంతం. నరసాపురం దగ్గరలోనే గోదావరి నది సముద్రంలో కలుస్తుంది.
 • సముద్రతీరం నరసాపురం దగ్గరలో అనేక సముద్ర తీర ప్రాంతములు ఉన్నాయి. వాటిలో మంచి పేరు కలిగినది పేరుపాలెం బీచ్. పేరుపాలెం బీచి ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఇక్కడ సముద్రపు తీరమున వేలాంకిణీ మాత మందిరం కూడా చూడదగింది.
 • అల్పాహారము. నరసాపురం పట్టణమైనా ఇక్కడి వాతావరణం పల్లెను పోలి ఉంటుంది. ఇక్కడ దాదాపు కోస్తాఆంధ్రాలో దొరికే ప్రతీ అల్పాహారము కనిపిస్తుంది. మసాలా బజ్జి, అల్లం పెసరట్టు, (శారదా థియేటర్ వద్ద) పరాఠా ఆమ్లెట్, రకరకాల చట్నీలతో వేడి వేడి ఇడ్లీ నరసాపురంలో నోరూరించే పదార్ధాలు.
 • పర్యాటకులకు పెక్కు వసతి గృహాలున్నాయి.

లేసు పరిశ్రమ[మార్చు]

నరసాపురం లేసు ఉత్పాదనలకు (crochet lace products) ప్రసిద్ధి చెందింది. పట్టణంలో సుమారు 50 లేసు ఎగుమతిదారులున్నారు. పట్టణంలోను, దాని చుట్టుప్రక్కల సీతారాంపురం, పాలకొల్లు, వెంకటరాయపాలెం, అంతర్వేది. రాయపేట, మొగల్తూరు వంటి పట్టణాలు, గ్రామాలలోను 2 లక్షల పైగా మహిళలకు ఇది జీవనాధారమైన వృత్తిగా ఉంది. dollies, furnishings, garments, tablemats వంటి అల్లికలను తయారు చేసే ఈ పరిశ్రమ 168 సంవత్సరాలనుండి ఇక్కడ నడుస్తున్నది. 1844లో ఇక్కడికి సేవా కార్యక్రమాలకోసం వచ్చిన మాక్రియా అనే స్కాటిష్ యువతి ఇక్కడి గృహిణులకు ఈ అల్లికను నేర్పింది. అప్పటి నుండి ఈ నైపుణ్యత తరతరాలుగా ఇక్కడ కుటీర పరిశ్రమగా వృద్ధిచెందింది.

మరికొన్నివిశేషాలు[మార్చు]

 • పట్టణంలో పెద్దయెత్తున బియ్యం మిల్లులు, ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. చుట్టుప్రక్కల వరి వ్యవసాయం, చేపల పెంపకం బాగా వృద్ధి చెందింది.
 • సమీప ప్రాంతాలకు నరసాపురం ముఖ్యమైన విద్యాకేంద్రంగా ఉంది. రెండు ఇంజినీరింగ్ కళాశాలలు, మరెన్నో ఇతర విద్యా సంస్థలు ఉన్నాయి. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు ఇక్కడ టెయిలర్ ఉన్నత పాఠశాలలో చదివారు. సాహితీవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం ఇక్కడి మిషన్ ఉన్నత పాఠశాలలో చదివారు.
 • పట్టణంలో ఇప్పుడు ఉన్న బాలికోన్నత పాఠశాల 1942 లో స్త్రీల హైయ్యర్ గ్రేడ్ ట్రైనింగ్ స్కూలుగా స్థాపించబడి 1968 లో బాలికల ఉన్నత పాఠశాలగా మార్చబడింది.
 • బాపు, కృష్ణంరాజు, చిరంజీవి వంటి ప్రసిద్ధులు ఈ చుట్టుప్రక్కలవారే.
 • ప్రఖ్యాత హరికథ విద్వాంసులు శ్రీ పెద్దింటి సూర్య నారాయణ దీక్షితదాసు భాగవతార్ గారు నర్సాపురం వాస్తవ్యులే.
 • డఛి వారు వ్యపారానికి నరసాపురంలో ఒక స్థవరం ఏర్పాటు చేసుకున్నారు.ప్రస్తుతం శ్రీ Y.N college లో ఉంది.

రవాణా సౌకర్యాలు[మార్చు]

పశ్చిమగోదావరి జిల్లాలోనే అత్యధిక బస్సులు, ఎక్కువ రూట్లతో కల డిపో నరసాపురం బస్ డిపో. ఇక్కడి నుండి ప్రధాన నగరాలైన భీమవరం, నిడదవోలు, తణుకు, రాజమండ్రి, రావులపాలెం, ఏలూరు, తాడేపల్లిగూడెం మొదలగు దగ్గర సర్వీసులే కాక హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లాంటి దూర సర్వీసులు కూడా ప్రతిరోజూ ఉన్నాయి.

ప్రముఖులు[మార్చు]

రైలు వసతి[మార్చు]

బస్సు సౌకర్యం[మార్చు]

 • ఇటీవలే భద్రాచలమునకు 2 సర్వీసులను ఆర్టీసీ వారు ప్రారంభించారు.
 • గోదావరిపై వంతెన నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. అలాగైతే ఈ పట్టణానికి తూర్పుగోదావరి జిల్లాతో ప్రత్యక్ష రోడ్డు మార్గం లభిస్తుంది.
 • పశ్చిమగోదావరి జిల్లా చించినాడ వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మించారు. ఇది తూర్పు గోదావరి జిల్లాలోని శివకోడు గ్రామం వద్ద కలుస్తుంది. దీని వలన రావులపాలెం చుట్టి వచ్చే అవసరం లేకుండా రాజోలు, అమలాపురం లకు దగ్గర మార్గం ఏర్పడింది.
 • ఏప్రిల్ 15, 2008న నరసాపురానికి సఖినేటిపల్లికి గోదావరి నదిపై వంతెన నిర్మాణం ప్రారంబించారు. ఉభయ గోదావరి జిల్లాలను నరసాపురం - సఖినేటిపల్లి మధ్య కలిపే ఈ వంతెన నదిపై 391.50 మీటర్ల పొడవు, 7.5 మీటర్ల వెడల్పుఉంటుంది.,
 • నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ ఈ పట్టణానికి రాజధాని హైదరాబాదుతో ప్రయాణ సౌకర్యం కలుగజేస్తున్నది.
 • కోటిపల్లి-నరసాపురం రైల్వే లైను పని ప్రతిపాదనలో ఉన్నా చాలా జాప్యం జరిగింది. ఇది పట్టణ వాసులకు తీవ్రమైన నిరాశ కలుగజేస్తుంది.

పార్లమెంటు సభ్యులు[మార్చు]

లోక్ సభకాలంఎమ్.పి. పేరుపార్టీ
2వ1957-62ఉద్దరాజు రామంభారతీయ కమ్యూనిస్టు పార్టీ
3వ1962-67డి.బలరామరాజుభారత జాతీయ కాంగ్రెస్
4వ1967-71డి.బి.రాజుభారత జాతీయ కాంగ్రెస్
5వ1971-77ఎమ్.టి.రాజుభారత జాతీయ కాంగ్రెస్
6వ1977-80అల్లూరి సుభాష్ చంద్రబోస్భారత జాతీయ కాంగ్రెస్
7వ1980-84అల్లూరి సుభాష్ చంద్రబోస్భారత జాతీయ కాంగ్రెస్
8వ1984-89భూపతిరాజు విజయకుమార రాజుతెలుగుదేశం పార్టీ
9వ1989-91భూపతిరాజు విజయకుమార రాజుతెలుగుదేశం పార్టీ
10వ1991-96భూపతిరాజు విజయకుమార రాజుతెలుగుదేశం పార్టీ
11వ1996-98కొత్తపల్లి సుబ్బారాయుడుతెలుగుదేశం పార్టీ
12వ1998-99కనుమూరి బాపిరాజుభారత జాతీయ కాంగ్రెస్
13వ1999-2004ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజుభారతీయ జనతా పార్టీ
14వ2004-09చేగొండి వెంకట హరిరామ జోగయ్యభారత జాతీయ కాంగ్రెస్
15వ2009-2014కనుమూరి బాపిరాజుభారత జాతీయ కాంగ్రెస్
16వ2014ప్రస్తుతంగోకరాజు గంగరాజుభారతీయ జనతా పార్టీ

శాసనసభ నియోజకవర్గం[మార్చు]

నరసాపురం ఇతర సంస్థలు[మార్చు]

విద్యా సంస్థలు[మార్చు]

 • శ్రీ వై.ఎన్.కళాశాల
 • శ్రీ సూర్య జూనియర్ కళాశాల
 • టైలర్ ఉన్నత పాఠశాల
 • భగవంతం గుప్తా బంగారు శేషావతారం మహిళా కళాశాల - ప్రముఖ సంఘ సంస్కర్త అద్దేపల్లి సర్విచెట్టి 1962 ప్రాంతాల్లో ఈ కళాశాలను స్థాపించారు.
 • గౌతమి జూనియర్ కళాశాల
 • సన్‌షైన్ స్కూల్
 • శ్రీ నూకల సోమసుందరం మునిసిపల్ ఉన్నత పాఠశాల
 • మిషన్ ఉన్నత పాఠశాల
 • జె.సికిలె ఉన్నత పాఠశాల
 • వశిష్ట స్కూలు
 • పీచుపాలెం ఉన్నత పాఠశాల
 • ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల
 • స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల
 • అంధ్రా బ్లయిండ్ మోడల్ స్కూలు
 • వివేక బాల భారతి
 • కె వి కె బి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల
 • విద్య పబ్లిక్ స్కూల్
MATOSORRI- NEAR JAGANADHA SWAMY TEMPLE
ALEX EM SCHOOL - NEAR SUBBARAYUDU HOUSE

బ్యాంకులు[మార్చు]

 • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,నరసాపురం
 • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,రాయపేట
 • స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్,నరసాపురం
 • ఆంధ్రాబ్యాంక్,నరసాపురం
 • ఆంధ్రాబ్యాంక్,రాయపేట
 • కెనరా బ్యాంక్
 • బ్యాంక్ ఆఫ్ ఇండియా
 • విజయా బ్యాంక్
 • డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్
 • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
 • Hdfc bank

సేవా సంస్థలు[మార్చు]

 • వరల్డ్ విజన్

వైద్యశాలలు[మార్చు]

ఇతర ప్రభుత్వ సంస్థలు[మార్చు]

 • సబ్ కలెక్టర్ ఆఫీస్
 • మండల రెవెన్యూ ఆఫీస్
 • మండల ప్రజాపరిషత్ ఆఫీస్
 • మండల వైద్యవిధాన పరిషత్
 • డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీస్
 • లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా శాటిలైట్ ఆఫీస్న్
 • 7 (ఎ)ఎన్. సీ. సీ
 • ఒ.ఎన్.జి.సి
 • బి.యస్.ఎన్.యల్

మూలాలు, వనరులు[మార్చు]