కాక్‌చింగ్ జిల్లా
కాక్‌చింగ్ జిల్లా
కాక్‌చింగ్ | |
---|---|
జిల్లా | |
Coordinates: 24°29′N 93°59′E / 24.48°N 93.98°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మణిపూర్ |
ముఖ్య పట్టణం | కాక్‌చింగ్ |
జనాభా (2016) | |
• Total | 1,35,481 |
భాషలు | |
• అధికారిక | మీటిలాన్ (మణిపురి) |
Time zone | UTC+05:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 795103 |
Vehicle registration | ఎంఎన్ 04 |
Website | https://kakching.nic.in/ |
కాక్‌చింగ్ జిల్లా, ఈశాన్య భారత దేశంలోని మణిపూర్ రాష్ట్ర జిల్లా. ఈ జిల్లాకు ఉత్తరం వైపు తౌబాల్ జిల్లా, తూర్పు వైపు ఉఖ్రుల్ జిల్లా, చందేల్ జిల్లాలు, దక్షిణం వైపు చురచంద్‌పూర్ జిల్లా, బిష్ణుపూర్ జిల్లాలు, పశ్చిమం వైపు ఇంఫాల్ పశ్చిమ జిల్లా, ఇంఫాల్ తూర్పు జిల్లాలు ఉన్నాయి. 2016లో తౌబాల్ జిల్లా నుండి ఈ జిల్లా ఏర్పడింది.[1]
చరిత్ర
[మార్చు]2016, డిసెంబరు 8న ఈ జిల్లా ఏర్పడింది. కాక్‌చింగ్ ఉపవిభాగంలోని అన్ని పరిపాలనా విభాగాలు కొత్త జిల్లాలోకి బదిలీ చేయబడ్డాయి. తరువాత, కాక్‌చింగ్ జిల్లాను కాక్‌చింగ్, వైఖోంగ్ అనే రెండు ఉపవిభాగాలుగా విభజించారు.
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[2] ఈ పట్టణంలో 1,35,481 మంది జనాభా ఉన్నారు. వీరిలో 67,642 మంది పురుషులు కాగా, 67,839 మంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడ మొత్తం 28,572 కుటుంబాలు నివసిస్తున్నాయి. మొత్తం జనాభాలో 18,682 (14%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. జిల్లా అక్షరాస్యత రేటు 75.7% కాగా, ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 72.76% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 57.78% గా ఉంది.
ఇక్కడ షెడ్యూల్ కులాలవారు 39,351 (పురుషులు 19,522 మంది, స్త్రీలు 19,829 మంది), షెడ్యూల్ తెగలవారు 1,154 (పురుషులు 596 మంది, స్త్రీలు 558 మంది) ఉన్నారు.
నదులు, సరస్సులు
[మార్చు]ఈ జిల్లాలో సెక్మై నది ప్రవహిస్తోంది.
తపాలా కార్యాలయం
[మార్చు]ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది. పిన్ కోడ్ 795103 ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Manipur Gazette No 408 dated 9 December 2016" (PDF). Archived from the original (PDF) on 21 April 2017. Retrieved 2021-01-08.
- ↑ "Kakching Sub-Division Population, Religion, Caste Thoubal district, Manipur - Census India". www.censusindia.co.in. Archived from the original on 2021-10-19. Retrieved 2021-01-08.