Jump to content

కె.కె.సెంథిల్ కుమార్

వికీపీడియా నుండి
కె. కె. సెంథిల్ కుమార్
కె.కె.సెంథిల్ కుమార్ చిత్రం
జననం
విద్యాసంస్థఫిల్ం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా
వృత్తిఛాయాగ్రహణం
బిరుదుఇండియన్ సొసైటీ ఫర్ సినిమాటోగ్రాఫర్స్ (ISC)
జీవిత భాగస్వామిరూహీ

కె.కె.సెంథిల్ కుమార్ భారతీయ సినిమా ఛాయాగ్రాహకుడు. ఈయన ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేస్తున్నాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

కె.కె.సెంథిల్ కుమార్ 1998లో డిగ్రీ చేసాడు. అతనికి కళాశాలలో క్రికెట్ ఆటపై ఆసక్తి ఉండేది. అతడు మంచి క్రికెట్ ఆటగాడు. కపిల్ దేవ్ను ఆయన రోల్ మోడల్ గా భావించాడు. తరువాత అతడు సివిల్ సర్వీసులలో చేరాలని అనుకున్నాడు. సివిల్ సర్వీసులకు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో అయన స్నేహితుడు సలహా మేరకు FTII (ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా) కు దరఖాస్తు చేసాడు. పూణె ఫిలిం ఇనిస్టిట్యూట్ 3 సంవత్సరాల కోర్సును దర్శకత్వం, సౌండ్ రికార్డింగ్, ఎడిటింగ్, ఛాయాగ్రహణం విభాగాలలో ఇచ్చేది. అతడు చాయాగ్రహణం కోర్సులో దరఖాస్తు చేసాడు. వారు సంవత్సరానికి10 మంది విద్యార్థులను తీసుకొనేది. రెండు సీట్లు మూడవ ప్రపంచ దేశాలకు రిజర్వు చేసేవారు. ఈ సెలక్షన్ ఇంటర్వ్యూకు 40 మంది హాజరితే ఎంపిక కాబడిన 8 మందిలో అతను ఒకరు.[1]

అతను పూణె లోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి ఛాయాగ్రహణంలో డిగ్రీ పొందాడు.[2]

తరువాత ఆయనసినిమాటోగ్రాఫర్ గా ప్రస్థానాన్ని ఎంచుకున్నాడు. అతనికి సినీరంగ నేపథ్యం లేనందువల్ల కొంతకాలం ఖాళీగా ఉన్నాడు. అపుడు సినిమా చిత్రకారుడైన పున్నయ్య సలహాతో సినిమా ఛాయాగ్రాహకుడు శరత్ వద్ద అసిస్టెంటుగా చేరాడు.

అతడు అసిస్టెంట్ గా మొదటి చిత్రం 1999 లో విదుదలైన ప్రేమకు వేళాయెరా. తరువాత జాబిలి సినిమాలో అసిస్టెంట్ ఛాయాగ్రాహకునిగా పనిచేసాడు. అతడు టెలివిజన్ సీరియల్ అమృతం లో కెమేరామన్ గా అవకాశాన్ని ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఇచ్చాడు. ఇది సినిమా పరిశ్రమలో ఛాయాగ్రాహకునిగా ఎదగడానికి దోహదపడింది.[1]

అతడు 2003లో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన తెలుగు సినిమా ఐతే ద్వారా సినీ రంగప్రవేశం చేసాడు. ఆ చిత్రం తెలుగులో జాతీయ ఉత్తమ సినిమా పురస్కారాన్ని పొందింది. తరువాత ఆరునెలలు ఏ సినిమా కూడా లేకుండా ఎస్. ఎస్. రాజమౌళి తన సినిమా సైలో పనిచేసేందుకు ఆహ్వానించే వరకు ఖాళీగా ఉన్నారు.

అతనికి ఎక్కువగా ఎస్. ఎస్. రాజమౌళి చిత్రాలతో అనుబంధం ఉంది. ఆయన బాక్సాఫీస్ హిట్ చిత్రాలైన సై (2004), ఛత్రపతి (2005), యమదొంగ (2007), మగధీర (2009), ఈగ (2012), బాహుబలి:ద బిగినింగ్ (2015) లలో పనిచేసాడు.[3] 2012లో ఆయన ఛాయాగ్రహణం చేసిన ఈగ సినిమాకు SIIMA అవార్డ్ ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ పురస్కారం వచ్చింది.[4][5] జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించిన బాహుబలి సినిమాలకు సెంథిల్ కుమార్ ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అతడు తెలంగాణ లోని బొల్లారం,సికింద్రాబాదులో జన్మిచాడు. అతనికి గల ముగ్గురు సహోదరులలో అతడు పెద్దవాడు. అతని తండ్రి కృష్ణమూర్తి.

వివాహం

[మార్చు]

మగధీర సినిమా షూటింగ్ సమయంలో సెంథిల్‌, రూహీ మొదటి సారి కలుసుకొని ఆ తరువాత 2009లో వీరిద్దరూ పెద్దల అంగీకారంతో జూన్ 25న ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రూహి కొవిడ్-19 సమయం నుండి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆమె ఆరోగ్యం క్షీణంచడంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయి 2024 ఫిబ్రవరి 15న మరణించింది.[6][7]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా భాష దర్శకుడు
2003 ఐతే తెలుగు చంద్రశేఖర్ యేలేటి
2004 సై తెలుగు ఎస్. ఎస్. రాజమౌళి
2005 ఛత్రపతి తెలుగు ఎస్. ఎస్. రాజమౌళి
2006 అశోక్ తెలుగు సురేందర్ రెడ్డి
2007 యమదొంగ తెలుగు ఎస్. ఎస్. రాజమౌళి
2008 త్రీ తెలుగు శేఖర్ సూరి
2009 అరుంధతి తెలుగు కోడి రామకృష్ణ
2009 మగధీర తెలుగు ఎస్. ఎస్. రాజమౌళి
2010 తకిట తకిట తెలుగు శ్రీహరినాయుడు
2011 గోల్కొండ హైస్కూల్ తెలుగు ఇంద్రగంటి మోహన కృష్ణ
2012 ఈగ తెలుగు ఎస్. ఎస్. రాజమౌళి
2013 రఫ్ తెలుగు సి.హెచ్.సుబ్బారావు
2015 బాహుబలి:ద బిగినింగ్ తెలుగు ఎస్. ఎస్. రాజమౌళి
2017 బాహుబలి ద కంక్లూజన్ తెలుగు ఎస్. ఎస్. రాజమౌళి
2018 మామాంకం మలయాళం సంజీవ్ పిళ్లై
2019 కర్ణన్ మలయాళం ఆర్.ఎస్.విమల్
2022 ఆర్.ఆర్.ఆర్ తెలుగు ఎస్. ఎస్. రాజమౌళి

పురస్కారాలు

[మార్చు]
దక్షిణ భారతదేశ అంతర్జాతీయ సినిమా పురస్కారాలు
ఫిలింఫేర్ పురస్కారం - దక్షిణం
సిని'మా' పురస్కారాలు
  • సిని'మా' అవార్డు ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ - మగధీర (2010)
  • సిని'మా' అవార్డు ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ - యమదొంగ (2008)
ప్రెంచ్ పురస్కారం
ఫ్రెంచి సినిమాటోగ్రాఫిక్ ఎక్విప్‍‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (AFFECT) వారు అందించే రవి కె.పోట్డార్ అవార్డును ఈ సారి సెంథిల్ కుమార్ అందుకున్నారు. 2015 అక్టోబరు 13న జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. ఇండియన్ సినిమా పరిశ్రకు విశేషమైన సేవలు అందించినందుకు గాను ఈ అవార్డు అందజేసారు. గతంలో గోవింద నిహలానీ, ఆర్ ఎం. రావు లాంటి ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు.[9]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Senthil Kumar interview - Telugu Cinema interview - Telugu film cinematographer". www.idlebrain.com. Retrieved 2018-03-30.
  2. "Telugu Cinematographer K K Senthil Kumar | Nettv4u". nettv4u. Retrieved 2018-03-30.
  3. "KK Senthil Kumar - Celebs At Samsung Galaxy Tab 2 Mirchi Music Awards Gallery - Gallery 1 Pic 75 - cinegoer.net". cinegoer.net. Archived from the original on 2016-03-04. Retrieved 2018-03-30.
  4. "SIIMA Day 1 Winners of Technical, Music & Gen Next Awards - Telugu cinema news". idlebrain.com.
  5. "'Eega is one of the most difficult films I have shot'". Rediff. 5 July 2012. Archived from the original on 6 ఏప్రిల్ 2016. Retrieved 30 మార్చి 2018.
  6. Chitrajyothy (15 February 2024). "సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య మృతి | Cinematographer Senthil Kumar Wife Roohi Passed Away KBK". Archived from the original on 16 February 2024. Retrieved 16 February 2024.
  7. Eenadu (15 February 2024). "సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్ ఇంట విషాదం." Archived from the original on 16 February 2024. Retrieved 16 February 2024.
  8. Andhra Jyothy (17 September 2023). "దక్షిణాది చిత్రాల ప్రతిభ పట్టం..!". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  9. "'బాహుబలి' సినిమాటోగ్రాఫర్‌కు ఫ్రెంచి పురస్కారం". telugu.filmibeat.com. 2015-10-16. Retrieved 2018-03-30.

ఇతర లింకులు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కె.కె.సెంథిల్ కుమార్ పేజీ