అక్షాంశ రేఖాంశాలు: 16°29′00″N 80°36′00″E / 16.48333°N 80.6°E / 16.48333; 80.6

తాడేపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్టణం
పటం
Coordinates: 16°29′00″N 80°36′00″E / 16.48333°N 80.6°E / 16.48333; 80.6
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు జిల్లా
మండలంతాడేపల్లి మండలం
విస్తీర్ణం
 • మొత్తం25.45 కి.మీ2 (9.83 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం64,149
 • జనసాంద్రత2,500/కి.మీ2 (6,500/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1004
ప్రాంతపు కోడ్+91 ( 8645 Edit this on Wikidata )
పిన్(PIN)522501 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata


తాడేపల్లి, గుంటూరు జిల్లాలో, కృష్ణా నది ఒడ్డున ఉన్న పట్టణం, అదేపేరుగల మండలానికి కేంద్రం. ఈ పట్టణం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలొ ఉంది, కొద్ది భాగం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగరంలో భాగంగా ఉంది.[2]

భౌగోళికం

[మార్చు]
తాడేపల్లి నివాస ప్రాంతం, జాతీయ రహదారి 16

విజయవాడ నగరానికి సమీపాన 3 కి.మీ.దూరంలో కృష్ణకు అవతలి (కుడి) గట్టున ఉన్నది.

జనగణన

[మార్చు]

2011 జనగణన ప్రకారం పట్టణ జనాభా 64,149.

పరిపాలన

[మార్చు]

తాడేపల్లి పురపాలక సంఘం 2009లొ స్థాపించారు. ఇది 23 వార్డులు కలిగి ఉన్న మూడవ గ్రేడ్ పురపాలక సంఘం.[3] ఉండవల్లి గ్రామం, తాడేపల్లి పురపాలక సంఘంకు ఔట్ గ్రొత్. ఈ రెండు విజయవాడ పట్టణ ప్రాంతంలోకి వస్తాయి.[4]

రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఈ గ్రామంలో కృష్ణా కెనాల్ జంక్షను పేరుతో రైల్వే జంక్షను ఉంది. విజయవాడ నుండి గుంటూరు, చెన్నై వైపు వెళ్ళే రైలు మార్గాలు చీలేదిక్కడే.

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

ఒకప్పుడు ఇక్కడ ఎసిసి సిమెంటు కర్మాగారం ఉండేది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషను వారి చమురు ఉత్పత్తుల నిల్వ కేంద్రం ఇక్కడ ఉంది.

దర్శనీయప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  • శ్రీ మద్వీరాంజనేయ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఆలయం.
  • శ్రీ లక్ష్మీగణపతిస్వామివారి ఆలయం:- శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న ఈ ఆలయం, విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి దత్తత దేవాలయం.
  • శ్రీ రాధాకృష్ణ ఆలయం
  • ఇస్కాన్ మందిరం: ఈ మందిరం, తాడేపల్లిలో కరకట్ట మార్గం మీద ఉంది.

ప్రముఖులు

[మార్చు]
కళ్ళం అంజిరెడ్డి
  • కల్లం అంజిరెడ్డి - డా. రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు.
  • శ్రీ గంగ్రోత్రిసాయి: ఇతను నాటకరంగానికి 30 సంవత్సరాలుగా చేయుచున్న కృషికి గుర్తింపుగా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 2015వ సంవత్సరానికి గాను, ప్రతిష్ఠాత్మక కీర్తి పురస్కారం ప్రకటించింది. వీరికి ఈ పురస్కారాన్ని 2017, మార్చి-30, 31 వతేదీలలో తెలుగు విశ్వవిద్యాలయంలో అందజేసెదరు.వీరు, రెండు దశాబ్దాలుగా భారత స్వాతంత్ర్య చరిత్రను పరిశోధించుచూ తెలుగు భాషలోనికి రాని విశిష్ట సమాచారాన్ని వెలికితీసి, వందలాది వ్యాసాలు వ్రాసారు. 13 పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలను ప్రచురించారు. ఎంతో విలువైన సమాచారాన్ని తెలుగు ప్రజలకు అందించుచున్నందుకు గుర్తింపుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 2015వ సంవతరానికి గాను, వీరికి ప్రతిష్తాత్మక పురస్కారాన్ని ప్రకటించింది. తెలుగు నాటకరంగానికి చెందిన ప్రముఖుల ఛాయాచిత్రాలను సేకరించి, వాటిని పలుప్రాంతాలలో ప్రదర్శించటం ద్వారా అనేకమంది కళాకారులను పరిచయం చేసారు. వీరు అనేక నాటకాలలో నటించడమే గాకుండా దర్శకత్వం వహించారు. నంది నాటకోత్సవాలలో బంగారు నందులు ఆయనకు ఈ పురస్కారంగా లభించినవి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. "Declaration of A.P. Capital City Area–Revised orders" (PDF). Andhra Nation. Municipal Administration and Urban Development Department. 22 September 2015. Archived from the original (PDF) on 24 June 2016. Retrieved 21 February 2016.
  3. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 8 August 2016. Retrieved 23 June 2016.
  4. "Name of Urban Agglomeration and its State constituent Units-2011" (PDF). Census of India. p. 23. Retrieved 21 September 2015.

వెలుపలి లంకెలు

[మార్చు]