Jump to content

పాటణ్ జిల్లా

వికీపీడియా నుండి
Districts of Northern Gujarat
Rani-Ki Vav in Patan

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో పాటణ్ జిల్లా (గుజరాతీ:પાટણ જિલ્લો) ఒకటి. పాటణ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.జిల్లా గుజరాత్ రాష్ట్ర ఉత్తర భూభాగంలో ఉంది. జిల్లా వైశాల్యం 5740 చ.కి.మీ. జిల్లాలోని హర్జి, సమి కచ్ సరిహద్దు ప్రాంతం చాలా సున్నితమైనవి. ఇక్కడి నుండి పాకిస్థాన్ సరిహద్దు వరకు నివాసాలు లేకపోయినప్పటికీ దేశ సరిహద్దు మాత్రం దూరంగానే ఉంది.

సరిహద్దులు

[మార్చు]

పాటణ్ జిల్లా ఉత్తర, ఈశాన్య సరిహద్దులో బనస్ కాంతా జిల్లా, తూర్పు, ఆగ్నేయ సరిహద్దులో మహెసనా జిల్లా, తూర్పు, దక్షిణ సరిహద్దులో సురేంద్రనగర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో కచ్ జిల్లా, కచ్ ను నాను రాన్ ఉన్నాయి.

పేరువెనుక చరిత్ర

[మార్చు]

జిల్లాకేంద్రం అయిన పాటణ్ పేరు జిల్లాకు పెట్టబడింది. గుజరాత్ ప్రాంతానికి పురాతన, మధ్యయుగ ప్రారంభంలో ఇది రాజధానిగా ఉండేది. కె.ఎం ముంషీ నవలలలో ఈ ప్రాంతం ప్రస్తావన ఉంది. రాజా వనరాజ్ చవదా ఈ నగరాన్ని స్థాపించి దీనికి తన విశ్వసపాత్రుడు రాజ్యస్థాపనకు మారదర్శి, ప్రాణ మిత్రుడు అయిన అనహిల్‌పూర్ పాటణ్ (అనహిల్‌వద్ పాటణ్) పేరు పెట్టాడు. అప్పటి దక్షిణ దేశపు రాజు ఆధినంలో ఉన్న రాజును ఎదిరిస్తూ ప్రాంతీయ గిరిజనులు, పౌరులు, పంచసారా రాజు వనరాజు చవద తండ్రి సైన్యంలోని యుద్ధవీరుల సాయంతో దీర్ఘకాలం యుద్ధం చేసి ఈ ప్రాంతం మీద విజయం సాధించి పాటణ్ రాజ్యస్థాపన చేసాడు. తరువాత ఈ ప్రాంతాన్ని భీందేవ్, కుమర్‌పాల్, సిద్ధరాజ్, కామదేవ్ వంటి పలువురు పాలించారు. .

చరిత్ర

[మార్చు]

పాటణ్ జిల్లా 2000లో రూపొందించబడింది. మునాటి మహెసనా జిల్లాలోని సమి, హరిజ్, చనాస్మ, సిధ్పూర్, పాటణ్ తాలూకాలనూ, మునుపటి బనస్ కాంతా జిల్లాలోని రాధన్‌పూర్, సాంతల్‌పూర్ తాలూకాలను కలిపి పాటణ్ జిల్లా రూపొందించబడింది.

విభాగాలు

[మార్చు]

జిల్లాలో 7 తాలూకాలు ఉన్నాయి : పాటణ్, సంతల్పుర్, ఉన్నరధన్పూరు, సిద్ధ్పుర్, హరిజ్, సామీ, చనస్మ.

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]

జీల్లాప్రధాన కార్యాలయం పాటణ్ (గుజరాత్) నగరంలో ఉంది. పాటణ్, మొదెర పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి. పాటణ్ నగరంలో పలు సంప్రదాయ వారసత్వం, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలు ఉన్నాయి. సహస్రలింగాల సరసు, రణకై వావ్ (లోతైన బావి), పంచసర్ జైన్ ఆలయంలో జైన్ సంప్రదాయానికి సంబంధించిన పలు పురాతన వ్రాతపతులు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటికీ 150 కంటే అధికమైన జైన్ ఆలయాలు ఉన్నాయి. వీటిలో పంచసర్ పర్స్వనాథ్, షమ్ల ఆలయాలు చాలా ఖ్యాతి గడించాయి. పాటణ్‌లో పలు వైద్యకేంద్రాలు ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రానికి పాటణ్ మెడికల్ కేంద్రమని నిస్సహాయంగా చెప్పవచ్చు.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,342,746,[1]
ఇది దాదాపు. స్విడ్జర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. మైనే నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 359వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 234 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.53%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే. 935:1000 [1]
అక్షరాస్యత శాతం. 73.47%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

సోలార్ ప్రాజెక్ట్

[మార్చు]

గుజరాత్‌లో ఆసియాలోనే 500 మె.వా విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగిన అతిపెద్ద సోలార్ ఎనర్జీ పార్క్ స్థాపినాచాలని ప్రతిపాదించారు.

జిల్లా ప్రముఖులు

[మార్చు]

సరిహద్దు ప్రాంతాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Swaziland 1,370,424
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Maine 1,328,361

వెలుపలి లింకులు

[మార్చు]