వికీపీడియా:సహాయ కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 71: పంక్తి 71:
== నేను వ్యాసాలూ ఎలా సమర్పించాలి? ==
== నేను వ్యాసాలూ ఎలా సమర్పించాలి? ==


నేను వ్యాసం ఎలా సమర్పించాలో తెలపగలరు. అలాగే వ్యాసానికి సంబంధించిన ఫోటోలు ఎలా అప్ లోడు చేయాలి. పూర్తి సమాచారం తెలియ చేయగలరు.
నేను వ్యాసం ఎలా సమర్పించాలో తెలపగలరు. అలాగే వ్యాసానికి సంబంధించిన ఫోటోలు ఎలా అప్ లోడు చేయాలి. పూర్తి సమాచారం తెలియ చేయగలరు.గోపి(చర్చ)

11:55, 18 ఆగస్టు 2014 నాటి కూర్పు

కొత్త సభ్యులు వికీని త్వరగా అర్థం చేసుకునేందుకు 5 నిమిషాల్లో వికీ పేజీని చూడండి.


గమనిక: ఇక్కడ ప్రాపంచిక ప్రశ్నలు అడగరాదు (ఉదా.., మన ప్రధాన మంత్రి ఎవరు?)

సహాయ కేంద్రానికి స్వాగతం! వికీపీడియా గురించిన ప్రశ్నలు అడగటానికీ, వ్యాసాలు రాసే విషయంలో సహాయం పొందటానికి ఇదే సరియైన స్థలం. ఎక్కువగా కొత్తవారి ప్రశ్నలకు సమాధానాలిస్తాం, కాని అనుభవజ్ఞులూ అడగవచ్చు. ప్రశ్న రాసిన తరువాత, సమాధానాలు వచ్చాయేమో చూడటానికి ఈ పేజీని చూస్తూ ఉండండి.


ప్రశ్న ఎలా అడగాలి

  • ముందుగా, మీ ప్రశ్నకు ఇదివరకే సమాధానం ఇచ్చేసారేమో చూడండి. చాలా ప్రశ్నలకు తరచుగా అడిగే ప్రశ్నల లో సమాధానాలు దొరుకుతాయి.
  • ప్రశ్నలకు ఒక అర్ధవంతమైన శీర్షిక పెట్టండి, దానికి అర్ధవంతమైన సమాధానం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
  • సూటిగా, వివరంగా అడగండి.
  • ప్రశ్న చివర సంతకం పెట్టండి. మీకు వికీపీడియా లో సభ్యత్వం ఉంటే, ~~~~ అని టైపు చెయ్యండి. లేకపోతే, మీ పేరు రాయవచ్చు లేదా ఆకాశరామన్న అని రాయవచ్చు.
  • ప్రశ్నలకు ఈ-మెయిల్‌ లో సమాధానాలు ఇవ్వరు కాబట్టి, ఈ-మెయిల్‌ అడ్రసు ఇవ్వకండి. పైగా వికీపీడియాలో విషయాలు యథేఛ్ఛగా కాపీ చేసుకోవచ్చు కనుక మీ ఈ-మెయిల్‌ కు గోప్యత ఉండదు.
  • అప్పుడప్పుడూ ఈ పేజీని చూస్తూ ఉండండి. ఎందుకంటే, సమాధానం ఒక్కసారే రాకపోవచ్చు, అది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి.
  • మీ ప్రశ్నకు అనుబంధంగా ఇంకా అడగాలంటే, మీ ప్రశ్న విభాగం పక్కనే ఉండే [మార్చు] లింకును నొక్కి ప్రశ్నను రాయండి. ఒకే ప్రశ్నపై బహుళ విభాగాలు ప్రారంభించవద్దు.
  • అన్ని వయసుల పాఠకులూ ఈ పేజీ చూస్తారని గుర్తుంచుకోండి.
  • ప్రశ్న తెలుగులో లేక ఇంగ్లీషులో అడగండి. తెలుగుని ఆంగ్ల అక్షరాలతో రాయకండి, అర్ధం చేసుకోవడం కష్టమవుతుంది.
  • ప్రశ్నలకు సమాధానాలు మనుష్యులే ఇస్తారు, కంప్యూటర్లు కాదు. ఇది సెర్చ్‌ ఇంజిన్‌ కాదు.


సమాధానం ఎలా ఇవ్వాలి

  • వీలయినంత విపులమైన సమాధానం ఇవ్వండి.
  • క్లుప్తంగా ఇవ్వండి, కరకుగా కాదు. స్పష్టంగా, సులభంగా అర్ధమయ్యే విధంగా రాయండి. ప్రశ్న పరిధికి లోబడి సమాధానం ఇవ్వండి.
  • సమాధానం తెలుగులోనే ఇవ్వండి.
  • వికీపీడియా లోని పేజీలకు లింకులు ఇవ్వండి. దీనివలన మరింత సమాచారం దొరుకుతుంది.
  • వాదాలకు ఇది వేదిక కాదు. ఏ విషయంపైనైనా వాదించాలనుకుంటే, ఆ విషయపు చర్చా పేజీ వాడండి.


How to update home page daily

Your cann't update home page & also add telugu calendar in home page

ప్రస్తుతం చరిత్రలో ఈరోజు శీర్షిక రోజువారిగా తాజాకరించబడుతుంది. తెలుగు కేలెండర్ సమాచారం వికీలో చేర్చితే అది మొదటి పేజీలో రోజూమారేటట్లు చేయవచ్చు. ఆ సమాచారం చేర్చటానికి మీరు సహాయపడవచ్చు.--అర్జున (చర్చ) 09:35, 25 సెప్టెంబర్ 2013 (UTC)

డీ ఎస్ ఎల్ ఆర్ కెమెరా ల లో ఉన్న సౌకర్యాల గురించి

డీ ఎస్ ఎల్ ఆర్ కెమెరాల యూజర్ గైడ్ లు ఇంటర్నెట్ లో శోధించి ఉచితంగా డౌన్లోడ్ చేసుకొనవచ్చును. వీటిని ఆధారంగా చేసుకొని వీటిలో ఉన్న సౌకర్యాల గురించి ఆయా కెమెరాల వ్యాసాలలో వ్రాయవచ్చునా? ఉదాహరణకి నికాన్ డి3100 చూడగలరు. (తీరా కష్టపడి అనువదించిన తర్వాత, కాపీ రైటు సమస్య వస్తే డిలీట్ చేయవలసి వస్తుందని భయం.) కాపీ రైటు సమస్య రాకుండా, వాటి లోని సౌకర్యాల గురించి ఎలా ప్రస్తావించవచ్చును? సూచించగలరు - శశి (చర్చ) 13:38, 26 సెప్టెంబర్ 2013 (UTC)

వికీపీడియా శైలి ప్రకారం వ్రాయవచ్చు. అయితే యథాతథంగా రాస్తే నకలుహక్కులసమస్య వుంటుంది కాబట్టి అలాచేయకుండా సౌలభ్యాలను క్లుప్తంగా వివరించవచ్చు. --అర్జున (చర్చ) 06:52, 27 సెప్టెంబర్ 2013 (UTC)

Essay writing competition

Good evening sir,this is wikipedia essay writing compitition second prize winner.మీరు money and certificate పంపించామని చెప్పారు. కానీ అవి ఇంతవరకు మాకు చేరలేదు. This is my address:

           NAME :BANDI MOJESH,
           YEAR: B.Tech 1st year,
          ID NUMBER: N110043,
          CLASS ROOM: CG-01,
                                                AP IIIT,
                                               NUZVID,
                                                 krishna (dist).-- 2013-10-04T21:55:39‎ Mojesh.bandi
వాడుకరి: Rajasekhar1961గారిని సంప్రదించండి. --అర్జున (చర్చ) 12:30, 23 అక్టోబర్ 2013 (UTC)

కవితా ప్రచురణ

నేను కొన్ని కవిత లు వ్రాసాను వాటిని ఇందులో చేర్చే అవకాశమున్నదా ?--2013-10-23T15:45:04‎ 183.82.33.34

లేదండి స్వంత కృతుల కు వికీపీడియా సరియైనది కాదు. మీబ్లాగ్ లో రాసుకోవచ్చు, అంతర్జాల పత్రికలలో ప్రయత్నించవచ్చు--అర్జున (చర్చ) 12:30, 23 అక్టోబర్ 2013 (UTC)

plz telugu bitts awaraina wakipidia lo pettara plz ; ; ; ; ; ; ; ; ; srinivas.k

తెలుగు సినిమా ప్రాజెక్టు - తెలుగు పాటలు

వర్గం:తెలుగు పాటలు తెలుగు సినిమా ప్రాజెక్టు లో భాగంగా పరిగణించవచ్చునా? - శశి (చర్చ) 14:35, 26 నవంబర్ 2013 (UTC)

మీరనేది తెలుగు సినిమా పాటలా ? లేక తెలుగు పాటలా ?...విశ్వనాధ్ (చర్చ) 04:31, 27 నవంబర్ 2013 (UTC)
తెలుగు సినిమా పాటలన్నీ తెలుగు పాటలు వర్గం లోనే ఉన్నవి. వర్గం:తెలుగు సినిమా పాటలు లో లేవు. కావున నేనడిగేది తెలుగు సినిమా పాటల గురించే - శశి (చర్చ) 07:02, 29 నవంబర్ 2013 (UTC)
తెలుగు సినిమా పాటలు వర్గాన్ని తయారుచేసి తెలుగు సినిమా ప్రాజెక్టు లో భాగంగా నిర్వహిస్తే బాగుంటుంది. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 07:11, 29 నవంబర్ 2013 (UTC)

తెలుగు కళాకారులు, ఆంధ్ర కళాకారులు

వర్గం:తెలుగు కళాకారులు, వర్గం:ఆంధ్ర కళాకారులు లకి ఏదైనా తేడా ఉన్నదా? రెంటినీ తెలుగు కళాకారులంటే సరిపోతుంది కదా? - శశి (చర్చ) 08:26, 2 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు కళాకారులు ఏ రాష్ట్రం లేదా దేశంలోనైనా ఉండొచ్చు. ఆంధ్ర కోసం ప్రస్తుతం అలా వదిలేస్తే తరువాత తెలంగాణా విడ్గొడితే దానికైనా ఉపయోగించుకోవచ్చు...విశ్వనాధ్ (చర్చ) 11:24, 2 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు, నేను కూడా ఇలానే ఆలోచించాను. - శశి (చర్చ) 16:03, 2 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

టైపింగు సమస్య

కార్యాలయంలో నాకు కేటాయించబడిన డెస్క్ టాప్ లో వెతుకు, ఎడిట్ సమ్మరీ లవద్ద తెలుగు సరిగానే టైపు అవుతున్నది. కానీ దిద్దుబాటు చేసే చోట మాత్రం అక్షరాలు విడిపోతున్నాయి. ఉదా: నేను అని వ్రాస్తే అది న్ఏన్ఉ అని టైపు అవుతున్నది. ఈ సమస్య నేను ఇంట్లో వాడే నా వ్యక్తిగత ల్యాప్ టాప్ లో లేదు. దీనిని ఎలా నివారించాలి? - శశి (చర్చ) 11:57, 9 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

how to get the option to type in telugu

i know that while we want to type in telugu ,on the right hand side below the search option there will be a small icon toselect the language and input methods but i am not able to get that option please help me pleaseeeeeeeeeeeeeeeeeeeeeeeeee -- 2014-02-02T14:02:55‎ Sandhyarani20p

కోస్తాంధ్ర ప్రాంతాలు

వర్గం:కోస్తా ని సృష్టించి, కోస్తా జిల్లాలని, మరియు ఉత్తరాంధ్ర, కోనసీమ మరియు పల్నాడు ప్రాంతాలని ఈ వర్గం క్రింద చేర్చాను. అయితే గోదావరి జిల్లాలు అనే ప్రాంతం కూడా ఉన్నదా? ఉంటే తూ.గో, ప.గో లని మాత్రమే గోదావరి జిల్లాలు అంటారా? కృష్ణా జిల్లా, గుంటూరు లకి ఇలాంటి పేరు ఏదయినా ఉన్నదా? దక్షిణ కోస్తా అనగా కేవలం ప్రకాశం, నెల్లూరు లేనా? దీనిపై తగు సమాచారమివ్వగలరు - శశి (చర్చ) 14:23, 14 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

చిత్రలేఖనం విస్తరణ

చిత్రలేఖనం వ్యాసాన్ని విస్తరించదలచుకొన్నాను. అయితే, చిత్రానికి రంగులని అద్దే ప్రక్రియకి ముందు వేసే స్కెచింగ్ (రేఖా చిత్రాలు) నుండి మొదలు పెట్టి అటు పై చిత్రలేఖనాన్ని విస్తరిస్తే బావుంటుంది అని నా అభిప్రాయం. ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చినది. ఆంగ్లంలో స్కెచింగ్ కి వేరుగా, డ్రాయింగ్ కి వేరుగా వ్యాసాలు ఉన్నవి. నాకు తెలిసి డ్రాయింగ్ అన్ననూ స్కెచింగ్ అన్ననూ తెలుగులో రేఖాచిత్రాలే. దీని పై తగు సూచన చేయగలిగినచో, ఈ వ్యాసాల విస్తరణకి ఉపక్రమిస్తాను. - శశి (చర్చ) 14:39, 7 జూన్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి పని మొదలుపెట్టారు. తెలుగులో స్కెచింగ్, డ్రాయింగ్ రెంటికీ రేఖాచిత్రం అని వున్నది. స్కెచింగ్ ను వేరుచేయాలంటే చిత్తు నమూనా అని వేరుచేయండి.Rajasekhar1961 (చర్చ) 18:04, 7 జూన్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నేను వ్యాసాలూ ఎలా సమర్పించాలి?

 నేను వ్యాసం ఎలా సమర్పించాలో తెలపగలరు. అలాగే వ్యాసానికి సంబంధించిన ఫోటోలు ఎలా అప్ లోడు చేయాలి. పూర్తి సమాచారం తెలియ చేయగలరు.గోపి(చర్చ)