పొట్టి ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 24: పంక్తి 24:


==నటించిన సినిమాలు==
==నటించిన సినిమాలు==
*[[ఈనాటి బంధం ఏనాటిదో]] (1977)<ref name="Eenaati Bandam Yenaatido (1977)">{{cite web |last1=Indiancinema |first1=Movies |title=Eenaati Bandam Yenaatido (1977) |url=https://indiancine.ma/SFD/info |website=www.indiancine.ma. |accessdate=12 August 2020}}</ref>
*[[చంటబ్బాయ్]]
*[[చంటబ్బాయ్]]
*[[సాగర సంగమం]]
*[[సాగర సంగమం]]

15:18, 12 ఆగస్టు 2020 నాటి కూర్పు

పొట్టి ప్రసాద్
జననం
కవివరపు ప్రసాదరావు

(1929-01-05)1929 జనవరి 5
ఆటపాక, కృష్ణా జిల్లా
వృత్తినటుడు
జీవిత భాగస్వామిరాజ్యలక్ష్మి
పిల్లలుజగన్నాథ రావు

పొట్టి ప్రసాద్ పేరుతో సుపరిచితుడైన కవివరపు ప్రసాదరావు ప్రముఖ తెలుగు హాస్య నటుడు. ఈయన ప్రముఖ హాస్య నటుడు రాజబాబుకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. ఇద్దరు కలిసి ఎన్నో నాటకాలు కలిసి వేశారు. ఆయన సినీ ప్రస్థానం అప్పుచేసి పప్పుకూడు సినిమాలో ఒక చిన్న పాత్రతో ప్రారంభమైంది. ఇందులో నటి గిరిజను పెళ్ళి చూపులు చూడ్డానికి వచ్చే ఇద్దరిలో ఈయన ఒకడు, మరొకరు పద్మనాభం. ఇందులో ఒక్క సీన్ లో నటించినందుకు గాను నిర్మాతలు బి. నాగిరెడ్డి, చక్రపాణి ఆయనకు 1116/- రూపాయలు పారితోషికం ఇచ్చారు. అందుకు ఆయన చాలా సంతోషపడ్డాడు. [1] చివరిసారిగా ఆయన నటించిన చిత్రం 1992లో వచ్చిన బృందావనం.

వ్యక్తిగత జీవితం

పొట్టి ప్రసాద్ అసలు పేరు కవివరపు ప్రసాదరావు. ఆయన భార్య రాజ్యలక్ష్మి. కుమారుడు జగన్నాథ రావు. మెదడు సంబంధిత వ్యాధితో మరణించాడు.

కెరీర్

పొట్టి ప్రసాద్ నాటకరంగం నుంచి వచ్చినవాడు. రంగస్థలంలో హాస్యం ఆయన ప్రత్యేకత. ఒకసారి మద్రాసులో కె. వెంకటేశ్వరరావు బృందంలో బెల్లంకొండ రామదాసు రాసిన ఆకాశరామన్న అనే నాటకంలో నటించడానికి వచ్చాడు. ఈ ప్రదర్శనను చక్రపాణి చూడటం తటస్థించింది. చక్రపాణి ఆయన చిరునామా తీసుకుని పంపేశారు. ఇవన్నీ మామూలనుకున్న ప్రసాద్ కు ఒక నెల రోజుల తర్వాత సినిమాలో అవకాశం వచ్చింది. అలా వచ్చిన అవకాశమే ఆయన మొదటి సినిమా అప్పుచేసి పప్పుకూడు. ఈ సినిమా తర్వాత కూడా నాటకాలు వేస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు.[2]

చంటబ్బాయ్ సినిమాలో పత్రికా సంపాదకుడి పాత్ర, సాగర సంగమం లో పనివాడి పాత్ర, హై హై నాయక సినిమాలో అవధాని పాత్ర ఆయన పోషించిన కొన్ని ముఖ్యమైన పాత్రలు.

నటించిన సినిమాలు

పేరు తెచ్చిన పాత్రలు

  • చంటబ్బాయ్ సినిమాలో శ్రీలక్ష్మి రాసే కవితలు విని పిచ్చెక్కినట్లయిపోయే పత్రికా సంపాదకుడి పాత్ర

మూలాలు

  1. M. L., Narasimham. "Appu Chesi Pappu Koodu". thehindu.com. Kasturi and Sons. Retrieved 7 July 2016.
  2. రావి, కొండలరావు. "అమాయకంగా నవ్వించడంలో దిట్ట". సితార. Retrieved 2020-06-08.
  3. Indiancinema, Movies. "Eenaati Bandam Yenaatido (1977)". www.indiancine.ma. Retrieved 12 August 2020.