గ్రెగర్ జోహన్ మెండల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 40: పంక్తి 40:
[[వర్గం:శాస్త్రవేత్తలు]]
[[వర్గం:శాస్త్రవేత్తలు]]
{{ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు}}
{{ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు}}
[[af:Gregor Mendel]]
[[ar:غريغور يوهان مندل]]
[[az:Qreqor Yohan Mendel]]
[[bn:গ্রেগর ইয়োহান মেন্ডেল]]
[[zh-min-nan:Gregor Mendel]]
[[be:Грэгар Іаган Мендэль]]
[[bg:Грегор Мендел]]
[[bs:Gregor Mendel]]
[[br:Gregor Mendel]]
[[ca:Gregor Mendel]]
[[cs:Gregor Mendel]]
[[cy:Gregor Mendel]]
[[da:Gregor Mendel]]
[[de:Gregor Mendel]]
[[et:Gregor Mendel]]
[[el:Γκρέγκορ Μέντελ]]
[[es:Gregor Mendel]]
[[eo:Johann Gregor Mendel]]
[[eu:Gregor Mendel]]
[[fa:گرگور مندل]]
[[hif:Gregor Mendel]]
[[fr:Gregor Mendel]]
[[ga:Gregor Mendel]]
[[gd:Mendel, Gregor]]
[[gl:Gregor Mendel]]
[[ko:그레고어 멘델]]
[[hi:ग्रेगर जॉन मेंडल]]
[[hr:Gregor Mendel]]
[[io:Gregor Mendel]]
[[ilo:Gregor Mendel]]
[[id:Gregor Mendel]]
[[is:Gregor Mendel]]
[[it:Gregor Mendel]]
[[he:גרגור מנדל]]
[[jv:Gregor Mendel]]
[[ka:გრეგორ მენდელი]]
[[la:Gregorius Mendel]]
[[lv:Gregors Mendelis]]
[[lt:Gregor Mendel]]
[[hu:Gregor Mendel]]
[[mk:Грегор Мендел]]
[[ml:ഗ്രിഗർ മെൻഡൽ]]
[[mr:ग्रेगोर मेंडेल]]
[[ms:Gregor Mendel]]
[[nah:Gregor Mendel]]
[[nl:Gregor Mendel]]
[[ne:ग्रेगर जोन मेन्डल]]
[[ja:グレゴール・ヨハン・メンデル]]
[[no:Gregor Johann Mendel]]
[[oc:Gregòr Mendel]]
[[pl:Gregor Mendel]]
[[pt:Gregor Mendel]]
[[ro:Gregor Mendel]]
[[qu:Gregor Mendel]]
[[ru:Мендель, Грегор Иоганн]]
[[sah:Грегор Иоганн Мендель]]
[[sa:ग्रिगोर् जान् मेण्डेल्]]
[[sq:Gregor Mendeli]]
[[scn:Grigòriu Mendel]]
[[si:ග්‍රෙගර් මෙන්ඩල්]]
[[simple:Gregor Mendel]]
[[sk:Gregor Mendel]]
[[sl:Gregor Mendel]]
[[sr:Грегор Мендел]]
[[sh:Gregor Mendel]]
[[fi:Gregor Mendel]]
[[sv:Gregor Mendel]]
[[tl:Gregor Mendel]]
[[ta:கிரிகோர் மெண்டல்]]
[[th:เกรเกอร์ เมนเดล]]
[[tr:Gregor Mendel]]
[[uk:Ґреґор Мендель]]
[[za:Gregor Mendel]]
[[vi:Gregor Mendel]]
[[war:Gregor Mendel]]
[[yo:Gregor Mendel]]
[[zh:孟德爾]]

17:45, 13 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

గ్రెగర్ జోహన్ మెండల్
జననంజోహాన్ మెండల్
జూలై 22, 1822
హీన్ జెన్ డోర్ఫ్, ఆస్ట్రియా సామ్రాజ్యము
మరణంజనవరి 6,1884
Brno (Brünn), Austria-Hungary (now Czech Republic)
జాతీయతEmpire of Austria-Hungary
జాతిSilesian-German
రంగములుజన్యు శాస్త్రము
వృత్తిసంస్థలుAbbey of St. Thomas in Brno
చదువుకున్న సంస్థలుUniversity of Olomouc
University of Vienna
ప్రసిద్ధిCreating the science of genetics

జన్యుశాస్త్రము యీనాడు ఎంతగానో విస్తరించింది. అయితే జన్యు భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన వాడు గ్రెగల్ మెండల్. యీయన ఏ పరికరాలూ లేకుండానే బఠానీ మొక్కలను పెరటిలో పెంచి. అతి సున్నితమైన ప్రయోగాలు చేసి, అద్భుతమైన వివరాలను, ఫలితాలను ఆధారంగా చేసుకొని పెల్లడించాడు. ఇది ఎంతో గొప్ప విషయంగా అంగీకరించక తప్పదు.

బాల్యం

మెండల్ ఆస్ట్రియా కు చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు, ఒక సన్యాసి. జూలై 22, 1822 న హీన్ జెన్ డోర్ఫ్ లో పుట్టాడు. వియెన్నా విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. చెకోస్లోవేకియాకి చెందిన బ్రన్ (ఇప్పుడు బ్ర్నో అని పిలుస్తున్నారు) లో స్థిరపడ్డాడు.

పరిశోధనలు

ఆయన పరిశోధనలు, ప్రయోగాలు చాలా సామాన్యంగా ఉంటాయి. కాని వీటిద్వారా వచ్చిన ఫలితాలను ఆధారంగా చేసుకుని ఈయన వెలువరించిన పరి కల్పనలు మాత్రం చాలా గొప్పవి. బఠానీ మొక్కలను ప్రాయోగిక సామాగ్రిగా ఈయన స్వీకరించాడు. పొడుగు రకం, పొట్టిరకం, మధ్య సంకరం జరిపించాడు. మొదటి తరంలో అన్నీ పొడుగు మొక్కలే వచ్చాయి. మాతృతరానికి, మొదటి తరానికి మధ్య మళ్లీ సంకరం జరిపించాడు. రెండవ తరంలో పొడుగు, పొట్టి మొక్కల నిష్పత్తి 3:1 లో వచ్చింది. పొడుగును నిర్దేశించిన కారకం ప్రభావాన్ని ఎక్కువగా చూపుతుంది. పొట్టిని నిర్దేశించే కారకం ఉన్నప్పటికీ పొడుగును నిర్దేశించిన కారకానిదే పై చేయి అని తెలిసింది.

అలాగే మెండల్ రెండు లక్షణాలను, గుండ్రంబి విత్తనాలు, పసుపు రంగు ఒక రకం మొక్క లో, ముడతలు పడ్డ విత్తనాలు, ఆకుపచ్చ రంగు ఇంకో మొక్కలో ఎన్నుకుని రెండు తరాల వరకు పరిశోధించాడు. మొదటి తరంలో ప్రభావ కారకాలదే పై చేయి అయింది. అంటే అన్ని మొక్కలకూ గుండ్రని విత్తనాలు, పసుపు రంగే ఉంది. కాగా ఈ తరాన్ని, మాతృతరంతో సంకరం చెందించగా రూపొందిన రెండవ తరం నిష్పత్తి 9:3:3:1 లో ఉంది. గుండ్రని పసుపు పచ్చని విత్తనాలవి తొమ్మిది మొక్కలైతే, గుండ్రని ఆకుపచ్చ విత్తనాలవి మూడు మొక్కలైతే,ముడతలు పడ్డ పసుపుపచ్చ విత్తనాలు మూడు మొక్కలైతే, ముడతలు పడ్డ ఆకుపచ్చ విత్తనాలు గలది ఒకమొక్క రూపొందింది. ఈ నిష్పత్తుల ఆధారంగా మెండల్ కొన్ని పరికల్పనలు వెల్లడించాడు.

అభివ్యక్తీకరణ ప్రభావ సిద్ధాంతం(లా ఆఫ్ డామినెన్స్)

ఒక లక్షణాన్ని నిర్దేశించే కారకాలు రెండు ఉంటాయి. ఉదాహరణకు పొడుగు,పొట్టి అనుకుందాము. పొడుగును నిర్దేశించే కారకాలు రెండు, పొట్టిని నిర్దేశించే కారకాలు రెండు ఉంటాయి. అందులో పొడుగు లక్షణానికి అభివ్యక్తీకరించే ప్రభావం ఎక్కువ. కాబట్టి పొడుగు కారకం ఒకటి పొట్టి కారకం ఒకటి జతగా యేర్పడితే పొడుగుకే ప్రభావం ఎక్కువ. పొట్టి లక్షనం బయట పడాలంటే రెండు కారకాలూ పొట్టిని సూచించేవి అయి ఉండాలి. ఎదే అభివ్యక్తీకరణ ప్రభావ సిద్ధాంతంలోని ప్రధానాంశం.

విశిష్ట ప్రతిపత్తి సిద్ధాంతం(లా ఆఫ్ సెగ్రెగేషన్)

జతగా ఏర్పడిన కారకాలు రెండూ ఒకే లక్షణాన్ని నిర్దేశించేవి అయితే పేచీయే లేదు. అలాకాక రెండు కారకాలూ రెండు వేరు వేరు లక్షణాలను నిర్దేశించేవి అయితే ఆ రెండింటిలో ఒక లక్షణం బహిర్గతమైనప్పటికీ ఆ రెండో కారకం తన లక్షణాన్ని కోల్పోదు. అంటే కారకాల లక్షణాలు విశిష్టంగా ఉంటాయే కాని ఎప్పటికీ కలవవు. వేటి ప్రతిపత్తిని అవే నిలుపుకుంటాయి.

స్వయం ప్రతిపత్తి సిద్ధాంతం(లా ఆఫ్ ఇండెపెండెంట్ అసార్ట్ మెంట్)

విశిష్ట లక్షణాలను ప్రదర్శించే కారకాలు స్వయం ప్రతిపత్తిని కూడా కలిగి ఉంటాయి. కారకం విశిష్టంగ ప్రవర్తించడంలో ఏదీ అడ్దురాదు. మూడు, నాలుగు లక్షణాలను ప్రదర్శించే కారకాలు కలసినప్పుడు కూడా వేటికవే స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటాయి.

జన్యువులు

ఈ కారకాలను ఇప్పుడు జన్యువులుగా గుర్తిస్తున్నారు. 1865 లోనే మండల్ యీ ప్రతిపాదనలు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. ఈయన జనవరి 1884 న ఒక గొప్ప శాస్త్రజ్ఞుడనే విషయం లోకానికి తెలియకుండానే మరణించాడు. 1900 ప్రాంతంలో మెండల్ ప్రతిపాదలలు సరైనవేనని ఎంతో మంది ధృవీకరించారు. సంతానం తల్లి దండ్రులనే పోలి ఉన్నా కొన్ని విషయాలలో తేడాలను చూపుతుంది. ఈ లక్షణం వైవిధ్యంగా రూపొందుతుంది. ఈ వైవిధ్యానికి జన్యువులే కారణం. అంతే కాదు యీ వైవిధ్యం వల్లే పరిణామం సంభవం ఇవన్నీ ఇప్పుడు తేలికగా చెప్పేస్తున్నారు కాని మెండల్ కాలానికి ఏమీ తెలియదు. అలాంటి పరిస్థితిల్లో అమూల్యమైన విషయాలను మెండల్ చెప్పినప్పటికీ మనం పట్తించుకోకపోవటం దురదృష్టం. ఏదీ ఏమైనా ఆయన ప్రతిపాదనలు నిత్య సత్యాలుగా జీవం పోస్తున్నాయి. ఈయనను చరితార్థుడ్ని చేశాయి.

యివి కూడా చూడండి