ఫరీదాబాద్ జిల్లా
ఫరీదాబాద్ జిల్లా
फरीदाबाद ज़िला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
ముఖ్య పట్టణం | ఫరీదాబాద్ |
మండలాలు | 1. ఫరీదాబాద్, 2. బల్లబ్గఢ్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,151 కి.మీ2 (831 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 17,98,954 |
• జనసాంద్రత | 840/కి.మీ2 (2,200/చ. మై.) |
Website | అధికారిక జాలస్థలి |
హర్యానా రాష్ట్ర 21 జిల్లాలలో ఫరీదాబాద్ జిల్లా (హిందీ: फरीदाबाद जिला) ; (పంజాబీ: ਫਰੀਦਾਬਾਦ ਜ਼ਿਲ੍ਹਾ) ఒకటి. ఫరీదాబాద్ నగరం ఈ జిల్లాకు కేంద్రం. ఢిల్లీ- మథుర (షేర్షా - సూరీ మార్గ్) రహదారి జిల్లా మద్యగా పోతుంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా వైశాల్యం 2151 చ.కి.మీ. జనసంఖ్య 21,93,276. ఈ జిల్లా గుర్గావ్ డివిజన్లో భాగంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి ఫరీదాబాద్ జిల్లా హర్యానా రాష్ట్రం లోని జిల్లాలలో అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లా.[1]
పేరు వెనుక చరిత్ర
[మార్చు]జిల్లా కేంద్రం పేరే జిల్లా పేరుగా నిర్ణయించారు. జహంగీర్ కోశాధికారి షైక్ఫరీద్ ఫరీదాబాద్ నగరాన్ని స్థాపించి దీనికి ఫరీదాబాద్ అని పేరు నిర్ణయించాడు. ఈ ప్రాంతం సందర్శించిన షైద్ఫరీద్ ఇక్కడ నగరాన్ని నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. తరువాత ఇక్కడ నిర్మించబడిన నగరానికి ఫరీద్ పేరు నిర్ణయించబడింది. గోపాల్ కాలనీ తలాబ్ రోడ్డు మీద ఫరీద్ సమాధి (మక్బరా) నిర్మించబడింది. దానిని ఇపాటికీ ప్రజలు సందర్శింస్తుంటారు.
చరిత్ర
[మార్చు]1979 ఆగస్టు 15 గుర్గావ్ జిల్లా నుండి కొంతభాగం వేరుచేసి ఫరీదాబాద్ జిల్లా రూపొందించబడింది.
ఆర్ధికం
[మార్చు]హర్యానా రాష్ట్రంలో ఫరీదాబాద్ ప్రధాన పారిశ్రామిక నగరంగా గుర్తించబడుతుంది. ఢిల్లీ - మథుర మార్గంలో ఢిల్లీకి సమీపంలో ఉండడం కారణంగా ఫరీదాబాద్ పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉంది. పరిశ్రమల స్థాపకులకు ఫరీదాబాద్ అభిమాన నగరంగా ఉంది. ఫరీదాబాద్ ట్రాక్టర్, మోటర్ సైకిల్, స్విచ్ గీర్, రిఫ్రిజిరేటర్స్, షూస్ , టైర్లు , ఇతర ఉత్పత్తులకు ప్రాముఖ్యత వహించింది.అయినప్పటికీ ప్రస్తుత కాలంలో నోయిడా, ఒఖ్లా , గుర్గావ్లు పారిశ్రామికంగా ఫరీదాబాద్ను అధిగమించాయి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,798,954, [1] |
ఇది దాదాపు. | గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 266వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 2269 .[1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 31.75%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 871:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 83%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. |
ఫరీదాబాద్ , పాల్వాల్ జాట్ జాతికి చెందిన ప్రజలు అధికంగా ఉన్నారు. మొత్తం ప్రజలలో వీరు 21%, 1947లో దేశ విభజన సమయంలో పాకిస్థానీ వలస పంజాబీ ప్రజలు 16%, బ్రాహ్మణులు 11% ఉన్నారు.
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Gambia, The 1,797,860 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Nebraska 1,826,341