ఫాజిల్కా
ఫాజిల్కా
బంగ్లా | |
---|---|
పట్టణం | |
Nickname(s): FZK, FJK | |
Coordinates: 30°24′11″N 74°01′30″E / 30.403°N 74.025°E | |
Country | India |
రాష్ట్రం | పంజాబ్ |
జిల్లా | ఫాజిల్కా |
Founded by | జె,హెచ్.ఆలివర్ |
Named for | మియా ఫాజిల్ వట్టూ |
Elevation | 177 మీ (581 అ.) |
జనాభా (2011) | |
• Total | 76,492 |
Demonym(s) | బంగ్లా, ఫజీల్‌పూరియా |
భాషలు | |
• అధికారిక | పంజాబీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 152123 |
టెలిఫోన్ కోడ్ | 01638 |
Vehicle registration | PB-22 |
లింగ నిష్పత్తి | 897/1000 |
Website | fazilka.gov.in |
ఫాజిల్కా పంజాబ్‌లోని పట్టణం. దీన్ని బంగ్లా అని కూడా పిలుస్తారు. 2011 లో కొత్తగా సృష్టించిన ఫాజిల్కా జిల్లాకు ఇది ముఖ్య పట్టణమైంది. పట్టణ పరిపలనను మునిసిపల్ కౌన్సిల్ చూస్తుంది. ప్రతిపాదిత ట్రాన్స్-ఆఫ్ఘనిస్తాన్ పైప్‌లైన్ (టాపి) ప్రాజెక్టు లోని చివరి స్టేషన్ ఫాజిల్కాలో ఉంటుంది.
చరిత్ర
[మార్చు]ఫాజిల్కా మునిసిపాలిటీని పంజాబ్ ప్రభుత్వ నోటిఫికేషన్ నంబర్ 486 కు అనుగుణంగా 1885 డిసెంబర్ 10 న ఏర్పాటైంది. ఈ పట్టణం 1884 లో ఫిరోజ్‌పూర్ జిల్లా లోకి చేర్చారు. 2011 జూలై 27 న, ఫాజిల్కాను పంజాబ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ నంబర్ 1/1 / 2011-RE-II (I) / 14554 ప్రకారం జిల్లాగా ప్రకటించింది.
ఇండో-పాకిస్తాన్ సరిహద్దులోని అనేక ఇతర పట్టణాల మాదిరిగానే ఫాజిల్కా, కూడా 1947 లో భారత విభజన సమయంలొ సమస్యలను ఎదుర్కొంది. బ్రిటిష్ వలస అధికారులు సిఫార్సు చేయబడిన సరిహద్దు రేఖ, రాడ్క్లిఫ్ రేఖ సహజ వనరులను, ఇళ్ళనూ, ప్రజలనూ విభజించింది. నీటి వనరుగా ఉన్న సత్లజ్ నది ఇరు దేశాలకూ సరిహద్దైంది.
విభజనకు ముందు, ఫాజిల్కా జనాభాలో 50% ముస్లింలు. వీరంతా 1947 లో భారతదేశం నుంచి పాకిస్తాన్‌కు వెళ్ళారు. ఫాజిల్కా చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాలలో ముస్లిం కుటుంబాలు - ప్రధానంగా బోడ్లా, వాట్టో, సాహూ రాజ్‌పూత్, కల్యా రాజ్‌పూత్, చిస్టిస్ వంశాలు - ఉన్నాయి.
ఫజిల్కా లోని చాలా మంది ప్రజలు ఏటా, సాధారణంగా ఆగస్టులో, పాకిస్తాన్లోని హిందూ పవిత్ర నగరమైన కటాస్‌రాజ్ ను సందర్శిస్తారు.
జనాభా వివరాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, [1] ఫాజిల్కా జనాభా 76,492. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు. ఫాజిల్కా సగటు అక్షరాస్యత 70.7%: పురుషుల అక్షరాస్యత 74.6%, స్త్రీ అక్షరాస్యత 66.4%. జనాభాలో ఆరేళ్ళ లోపు పిల్లలు 11% ఉన్నారు.
స్థానిక నృత్యరీతి
[మార్చు]బాబా పోఖర్ సింగ్ (1916-2002) ప్రాచుర్యం కల్పించిన ఝూమర్ నృత్య శైలికి ఫాజిల్కా ప్రసిద్ది చెందింది. పోఖర్ సింగ్ కుటుంబం పశ్చిమ పంజాబ్‌లోని మోంట్‌గోమరీ జిల్లా నుండి వలస వచ్చింది. వారు రావి శైలి ఝూమర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఫాజిల్కాలో దాని స్వంత శైలి ఝూమర్ ఉంది. దీనిని సత్లజ్ శైలి ఝూమర్ అంటారు. అంటే, రోజువారీ జీవితంలో కనీసం రెండు నృత్యరీతులు కలిసిపోయాయి. [2]
రవాణా
[మార్చు]రైల్వే
[మార్చు]విక్టోరియా రాణి సింహాసనం అధిరోహించిన డైమండ్ జూబ్లీ సందర్భంగా 1898 లో పట్టణం గుండా మొదటి రైల్వే మార్గాన్ని నిర్మించారు. ఫాజిల్కా నుండి రైలు మార్గం ప్రస్తుత పాకిస్తాన్ లోని బహావల్ నగర్, బహావల్ పూర్ కు పోతుంది. మరొకటి పాక్‌లోని అంరూకాకు పోతుంది. ఈ మార్గాలు ఇప్పుడు మూతబడ్డాయి. బహుశా పట్టాలను తొలగించి ఉంటారు.
ఫాజిల్కా జంక్షన్ రైల్వే స్టేషను, నగరాన్ని ఉత్తర రైల్వేలోని ఫిరోజ్‌పూర్, భటిండా జంక్షన్లకు కలుపుతుంది. కొత్తగా దక్షిణాన అబోహర్‌కు వేసిన 43 కిలోమీటర్ల పొడవైన రైల్వే మార్గం వలన, బికనీర్‌కు దూరం 100 కి.మీ. కు పైగా తగ్గిపోయింది. ఈ కొత్త రైల్వే మార్గంలో రైళ్లు జూలై 2012 లో ప్రారంభమయ్యాయి. [3]
జాతీయ రహదారి 7 ఫాజిల్కా గుండా వెళుతుంది. NH 7 మలాట్ వద్ద NH 9 తో కలుస్తుంది. ఇది హిస్సార్, రోహ్తక్ ద్వారా ఢిల్లీకి వెళుతుంది. రాష్ట్ర రహదారి ఫాజిల్కా నుండి ఫిరోజ్‌పూర్ వరకు, ఫాజిల్కా నుండి మాలౌట్ వరకూ నడుస్తుంది.
అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయం, భటిండా దేశీయ విమానాశ్రయం, పట్టణానికి సమీపం లోని విమానాశ్రయాలు.
పట్టణ ప్రముఖులు
[మార్చు]- కపిల్ దేవ్, భారత క్రికెటర్
- మందిరా బేడి, నటి, ఫ్యాషన్ డిజైనర్
- గుర్నామ్ భుల్లార్, ప్రసిద్ధ పంజాబీ గాయకుడు, నటుడు
మూలాలు
[మార్చు]- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
- ↑ Dr. Nahar Singh (1988). Panjaabi Lok-Naach: Sabhiaachaarak Bhoomika te Saarthakta ["Punjabi Folk-Dance: Cultural Role and Significance"], Lokgit Prakashan. Translated, with editorial remarks, by Gibb Schreffler (2003)
- ↑ "Abohar-Fazilka railway link operational - Times Of India". Articles.timesofindia.indiatimes.com. 2012-07-17. Archived from the original on 2013-12-13. Retrieved 2013-12-08.
- Pages using the JsonConfig extension
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Articles containing OSM location maps
- Pages using infobox settlement with possible nickname list
- Pages using infobox settlement with possible demonym list
- పంజాబ్ జిల్లాల ముఖ్యపట్టణాలు
- Pages using the Kartographer extension