రాజస్థాన్ క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజస్థాన్ క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్అశోక్ మెనారియా
యజమానిరాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్
జట్టు సమాచారం
స్థాపితం1928
స్వంత మైదానంసవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్
సామర్థ్యం30,000
చరిత్ర
రంజీ ట్రోఫీ విజయాలు2
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు0
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు0
అధికార వెబ్ సైట్Rajasthan Cricket Association

రాజస్థాన్ క్రికెట్ జట్టు, రాజస్థాన్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే క్రికెట్ జట్టు. ఈ జట్టు 2010-11, 2011-12 సీజన్లలో రంజీ ట్రోఫీని గెలుచుకుంది, 1960-61, 1973-74 మధ్య ఎనిమిది సార్లు రన్నరప్‌గా నిలిచింది. ఇది ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఎలీట్ గ్రూప్‌లో ఉంది. "టీమ్ రాజస్థాన్" అని పిలిచే ఈ జట్టును రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తుంది.

చరిత్ర

[మార్చు]

రాజపుతానా

[మార్చు]

రాజ్‌పుతానాలో మొదటి క్రికెట్‌ మ్యాచ్ 1928/29 ఢిల్లీ టోర్నమెంట్‌లో అలీఘర్‌తో జరిగింది.[1] ఆ తర్వాత 1931లో అజ్మీర్‌లో రాజ్‌పుతానా క్రికెట్ అసోసియేషన్ ఏర్పడింది.[2][n 1] రాజ్‌పుతానా ఆడిన తొలి ఫస్ట్-క్లాస్ ఆట 1933 నవంబరులో అజ్మీర్‌లోని మాయో కాలేజ్ గ్రౌండ్‌లో పర్యటనకు వచ్చిన మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్‌తో ఆడింది. అందులో భారీగా ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలైంది.[3] జట్టు 1935/36 సీజన్‌లో మొదటిసారిగా రంజీ ట్రోఫీలోకి ప్రవేశించింది. సెంట్రల్ ఇండియాతో జరిగిన పోటీలో తన మొదటి మ్యాచ్‌లో భారీ తేడాతో ఓడిపోయింది.[4][5] ఆ జట్టు తర్వాతి సీజన్లలో రంజీ ట్రోఫీలో ఆడి, మళ్లీ సెంట్రల్ ఇండియా చేతిలో ఓడిపోయింది. అయితే, ఈసారి కేవలం రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది.[6] రాజ్‌పుతానా ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మొదటి విజయాన్ని లియోనెల్ టెన్నిసన్ టూరింగ్ ఎలెవన్‌పై 1937లో రెండు వికెట్ల తేడాతో సాధించింది. జట్టు 1938/39 రంజీ ట్రోఫీలో సదరన్ పంజాబ్‌తో జరిగిన ఏకైక మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే ఆ తర్వాతి సీజన్‌లో అది ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో తన మొదటి రంజీ విజయాన్ని నమోదు చేసింది.[7] అయితే దక్షిణ పంజాబ్‌తో జరిగిన తదుపరి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 190 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంతో, భారతదేశంలో క్రికెట్‌కు కొంత అంతరాయం ఏర్పడింది, అయితే ఫస్ట్-క్లాస్ క్రికెట్ కొనసాగింది.

రాజస్థాన్

[మార్చు]

రంజీ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన

[మార్చు]
సంవత్సరం స్థానం
2010-11 విజేత
2011-12
1960–61 ద్వితియ విజేత
1961–62
1962–63
1963–64
1965–66
1966–67
1969–70
1973–74

ప్రసిద్ధ క్రీడాకారులు

[మార్చు]

భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన రాజస్థాన్ ఆటగాళ్ళు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:

ఇంగ్లండ్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన రాజస్థాన్ ఆటగాళ్ళు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:

  • కబీర్ అలీ (2003)

భారతదేశం తరపున వన్‌డేలు ఆడిన (కానీ టెస్ట్ క్రికెట్ ఆడని) రాజస్థాన్ ఆటగాళ్ళు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:

ఇంగ్లండ్ తరపున వన్‌డేలు ఆడిన (కానీ టెస్ట్ క్రికెట్ ఆడని) రాజస్థాన్ ఆటగాళ్ళు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:

  • విక్రమ్ సోలంకి (2000)

ప్రస్తుత స్క్వాడ్

[మార్చు]
  • అంతర్జాతీయ క్యాప్‌లు ఉన్న ఆటగాళ్లు బోల్డ్‌లో జాబితా చేయబడ్డారు.
Name Birth date Batting style Bowling style Notes
Batters
మహిపాల్ లోమ్రోర్ (1999-11-16) 1999 నవంబరు 16 (వయసు 24) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ Plays for Royal Challengers Bangalore in IPL
అశోక్ మెనారియా (1990-10-29) 1990 అక్టోబరు 29 (వయసు 34) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ Captain
యష్ కొఠారి (1995-10-06) 1995 అక్టోబరు 6 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్
అభిజీత్ తోమర్ (1995-03-14) 1995 మార్చి 14 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
సల్మాన్ ఖాన్ (1998-12-26) 1998 డిసెంబరు 26 (వయసు 25) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
ఆదిత్య గర్వాల్ (1996-04-15) 1996 ఏప్రిల్ 15 (వయసు 28) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్
కరణ్ లాంబా (2004-11-28) 2004 నవంబరు 28 (వయసు 19) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్
దీపక్ హుడా (1995-04-19) 1995 ఏప్రిల్ 19 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ Plays for Lucknow Super Giants in IPL
అర్జిత్ గుప్తా (1989-09-12) 1989 సెప్టెంబరు 12 (వయసు 35) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం-fast
All-rounders
అనిరుధ్ చౌహాన్ (2002-10-15) 2002 అక్టోబరు 15 (వయసు 22) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
Wicket-keepers
కునాల్ రాథోడ్ (2002-10-09) 2002 అక్టోబరు 9 (వయసు 22) ఎడమచేతి వాటం Plays for Rajasthan Royals in IPL
సమర్పిత జోషి (1999-09-19) 1999 సెప్టెంబరు 19 (వయసు 25) కుడిచేతి వాటం
మనేందర్ సింగ్ (1996-01-02) 1996 జనవరి 2 (వయసు 28) కుడిచేతి వాటం
Spinners
రవి బిష్ణోయ్ (2000-09-05) 2000 సెప్టెంబరు 5 (వయసు 24) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ Plays for Lucknow Super Giants in IPL
మానవ్ సుతార్ (2002-08-03) 2002 ఆగస్టు 3 (వయసు 22) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
రాహుల్ చాహర్ (1999-08-04) 1999 ఆగస్టు 4 (వయసు 25) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ Plays for Punjab Kings in IPL
శుభం శర్మ (1997-03-26) 1997 మార్చి 26 (వయసు 27) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
మోహిత్ జైన్ (1999-03-29) 1999 మార్చి 29 (వయసు 25) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
Fast Bowlers
అనికేత్ చౌదరి (1990-01-28) 1990 జనవరి 28 (వయసు 34) కుడిచేతి వాటం ఎడమచేతి మీడియం Vice-captain
కమలేష్ నాగరకోటి (1999-12-28) 1999 డిసెంబరు 28 (వయసు 24) కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ Plays for Delhi Capitals in IPL
అరాఫత్ ఖాన్ (1996-12-27) 1996 డిసెంబరు 27 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
తన్వీర్-ఉల్-హక్ (1991-12-03) 1991 డిసెంబరు 3 (వయసు 32) కుడిచేతి వాటం ఎడమచేతి మీడియం fast
రితురాజ్ సింగ్ (1990-10-19) 1990 అక్టోబరు 19 (వయసు 34) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
ఖలీల్ అహ్మద్ (1997-12-05) 1997 డిసెంబరు 5 (వయసు 26) కుడిచేతి వాటం ఎడమచేతి మీడియం Plays for Delhi Capitals in IPL

24 జనవరి 2023 నాటికి నవీకరించబడింది

కెప్టెన్లు

[మార్చు]

రికార్డులు

[మార్చు]

{{ ఈ అంశంపై మరిన్ని వివరాల కోసం, రాజస్థాన్ ఫస్ట్-క్లాస్ క్రికెట్ రికార్డుల జాబితా, రాజస్థాన్ లిస్ట్ A క్రికెట్ రికార్డుల జాబితా, రాజస్థాన్ ట్వంటీ20 క్రికెట్ రికార్డుల జాబితా }}

మైదానాలు

[మార్చు]

సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం

[మార్చు]

రాజస్థాన్ సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో తమ హోమ్ మ్యాచ్‌లలో ఎక్కువ భాగం ఆడుతుంది.

గమనికలు

[మార్చు]
  1. What is today the modern state of Rajasthan was then a part of the British Raj and was known as Rajputana.

మూలాలు

[మార్చు]
  1. "Other Matches played by Rajputana". CricketArchive. Archived from the original on 10 November 2013. Retrieved 1 November 2012.
  2. "RCA History". Rajasthan Cricket Association. Retrieved 1 November 2012.
  3. "First-Class Matches played by Rajputana". CricketArchive. Retrieved 1 November 2012.
  4. "RCA History". Rajasthan Cricket Association. Retrieved 1 November 2012.
  5. "First-Class Matches played by Rajputana". CricketArchive. Retrieved 1 November 2012.
  6. "First-Class Matches played by Rajputana". CricketArchive. Retrieved 1 November 2012.
  7. "Delhi v Rajputana, 1939/40 Ranji Trophy". CricketArchive. Retrieved 2 November 2012.