Jump to content

సెంచరీ టెక్స్‌టైల్ అండ్ ఇండస్ట్రీస్

వికీపీడియా నుండి

సెంచురీ టెక్స్ టైల్స్ & ఇండస్ట్రీస్ (Century Textile and Industries) 1897 సంవత్సరంలో స్థాపించబడింది. సంస్థ ప్రధాన కార్యాలయం మహారాష్ట్ర రాజధాని ముంబై లో ఉన్నది . ఈ కంపెనీకి నూలు, డెనిమ్, విస్కోస్ ఫిలమెంట్ రేయాన్ నూలు, టైర్ కార్డులు, కాస్టిక్ సోడా, సల్ఫ్యూడ్రి క్ యాసిడ్, ఉప్పు, సిమెంట్, గుజ్జు, కాగితం తయారు చేసే విస్తృత పరిశ్రమల సముదాయంతో ఉన్న సంస్థ. ఈ సంస్థ ద్వారా కెనడా, చైనా, జపాన్, హాంగ్ కాంగ్, జోర్డాన్, కెన్యా, ఇంగ్లాండ్ , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా తో సహా 45 దేశాలలో ప్రపంచవ్యాప్తంగా తన ఉత్పత్తులను ఎగుమతులు చేసే ఉనికిని కలిగి ఉంది.

సెంచరీ టెక్స్‌టైల్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
రకంపబ్లిక్
బి.ఎస్.ఇ: 500040
NSECENTURYTEX
పరిశ్రమటెక్స్ టైల్స్ & పేపర్(వస్త్రాలు,కాగితం)
స్థాపన1897
ప్రధాన కార్యాలయంముంబై, మహారాష్ట్ర,భారతదేశం[1]
కీలక వ్యక్తులు
బి.కె.బిర్లా (చైర్మన్)
కుమార్ మంగళం బిర్లా (ఏ జి ఎం)[2] ఆర్.కె. దాల్మియా, అధ్యక్షుడు[3][4]
ఉత్పత్తులుఫ్యాబ్రిక్ లు, డిజైనర్ వేర్, డెనిమ్, కాస్మోటిక్స్,టాయిలెట్రీలు, ఇంజినీరింగ్ ఫైల్స్ & టూల్స్, ప్రొఫిలాక్టిక్స్,ఎయిర్ ఛార్టర్ సర్వీసులు
రెవెన్యూIncrease 45,431.8 మిలియను (US$570 million) (2009–2010)[5]
Increase 3,394.7 మిలియను (US$43 million) (2009–2010)[5]
మాతృ సంస్థబిర్లా గ్రూప్[6]
అనుబంధ సంస్థలుబిర్లా సెంచరీ
వెబ్‌సైట్Official Website

చరిత్ర

[మార్చు]

సెంచరీ టెక్స్ టైల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (సిటిఐఎల్) 1897సంవత్సరంలో స్థాపించబడిన టెక్స్ టైల్ తయారీ సంస్థ. ఈ కంపెనీ బికె బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చెందినది. సెంచరీ టెక్స్ టైల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రధాన వ్యాపార కార్యకలాపంలో పత్తి వస్త్రాలు, నూలు, డెనిమ్, విస్కోస్ ఫిలమెంట్ రేయాన్ నూలు, టైర్-కార్డ్స్, కాస్టిక్ సోడా, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఉప్పు, సిమెంట్, గుజ్జు, కాగితం తయారీ ఉంటుంది. అంతర్జాతీయ వస్త్ర మార్కెట్లలో సంస్థ ప్రసిద్ధిగాంచినది. సంస్థ తన ఉత్పత్తులను బహ్రయిన్, బంగ్లాదేశ్, బెల్జియం, కెనడా, చైనా, కొమొరోస్, ఈజిప్ట్, ఫ్రాన్స్, జర్మనీ, హోండురాస్, హాంగ్ కాంగ్, హంగేరీ, ఇండోనేషియా, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్, జోర్డాన్, కెన్యా, కువైట్, మడగాస్కర్, మారిషస్, మొరాకో, నేపాల్, నెదర్లాండ్స్, పనామా, పోర్చుగల్, రష్యా, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ కొరియా, సింగపూర్, స్పెయిన్, శ్రీలంక, స్వీడన్, స్విట్జర్లాండ్, తైవాన్, థాయ్ లాండ్, టర్కీ, ఇంగ్లాండ్ , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, ఉగాండా మొదలైన దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది.

సెంచరీ టెక్స్ టైల్స్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ IS/ISO 9001:2000 ,ISO 14001 కంపెనీ. అంతేకాక, ఈ సంస్థకు భారత ప్రభుత్వం 'త్రీ స్టార్ ఎక్స్ పోర్ట్ హౌస్' హోదాను ప్రదానం చేసింది. సెంచురీ టెక్స్ టైల్స్ ఒక అత్యాధునిక ఇన్-హౌస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ తో ఉండి, నిరంతరం కొత్త టెక్స్ టైల్ మాన్యుఫాక్చరింగ్ టెక్నిక్ లను ఆవిష్కరిస్తుంది. సంస్థ "ఈ ఇన్-హౌస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్" ను డిపార్ట్ మెంట్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, భారత ప్రభుత్వం గుర్తించింది. సంస్థకు కంపెనీ ఛైర్మన్ గా బి.కె.బిర్లా ఉన్నాడు.[7]

అభివృద్ధి-ఇతర సంస్థలు

[మార్చు]

సంస్థ కాటన్ టెక్స్ టైల్స్, నూలు, డెనిమ్ - సత్రాతి వద్ద ఉన్న కంపెనీ నూలు విభాగం ఇండోర్ (మధ్యప్రదేశ్) దగ్గరఉంది. ఇక్కడ నూలు తయారీ కోసం 24960 స్పిండిల్స్ ను కలిగి ఉంది, 2009-2010 మధ్యకాలంలో సుమారు 3,992 టన్నుల నూలును ఉత్పత్తి చేసింది. కంపెనీ డెనిమ్ డివిజన్ కూడా ఇక్కడే ఉంది సంవత్సరానికి 21 మిలియన్ మీటర్ల డెనిమ్ బట్టలను ఉత్పత్తి చేయగలదు.

సెంచురీ రేయాన్ – VFY, CSY & రేయాన్ టైర్ యార్న్: 1956లో, విస్కోస్ ఫిలమెంట్ రేయాన్ నూలును తయారు చేయడానికి కంపెనీ ముంబై సమీపంలోని కళ్యాణ్ వద్ద తన రేయాన్ డివిజన్ ను ప్రారంభించింది. ప్రస్తుతం భారతదేశంలో విస్కోస్ ఫిలమెంట్ యార్న్ (VFY) అతిపెద్ద ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఉంది. 1963లో, ఇది విస్కోస్ టైర్ యార్న్/ఇండస్ట్రియల్ యార్న్ ఉత్పత్తిని కూడా ప్రారంభించింది, తరువాత 1964లో కాస్టిక్ సోడా, ఇతర రసాయనాల ఉత్పత్తిని ప్రారంభించింది. సెంచరీ కెమికల్స్, జామ్ నగర్ వద్ద, కంపెనీ ప్రధానంగా క్యాప్టివ్ వినియోగం కోసం పారిశ్రామిక ఉప్పును ఉత్పత్తి చేస్తోంది. సెంచరీ సిమెంట్ కంపెనీ పోర్ట్ ల్యాండ్ సిమెంట్ 1974 సంవత్సరంలో సంవత్సరానికి 0.60 మిలియన్ టన్నులు (టిపిఎ) ఉత్పత్తి చేయడానికి రాయ్ పూర్ (చత్తీస్ గఢ్) సమీపంలోని బైకుంత్ వద్ద తన మొదటి సిమెంట్ కర్మాగారాన్ని స్థాపించడం ద్వారా సిమెంట్ ఉత్పత్తిలోకి ప్రవేశించింది. దీని ప్రస్తుత సామర్థ్యం సంవత్సరానికి 2.10 మిలియన్లు.

సెంచురీ పల్ప్ అండ్ పేపర్ కంపెనీ రేయాన్ / పేపర్ గ్రేడ్ పల్ప్ అండ్ రైటింగ్ & ప్రింటింగ్ పేపర్ యూనిట్ ను 1984లో నైనితాల్ (ఉత్తరాఖండ్) సమీపంలోని లాల్కువా వద్ద 1984 సంవత్సరంలో సంస్థ స్థాపించినారు. ఈ కంపెనీ ప్రస్తుతం సంవత్సరానికి 39,000 టన్నులకు పైగా రైటింగ్ & ప్రింటింగ్ పేపర్ (కలప ఆధారిత), 37,000 టన్నుల రేయాన్ /లేదా పేపర్ గ్రేడ్ గుజ్జును ఉత్పత్తి చేస్తోంది.[8]

ఆర్ధిక పలితాలు

[మార్చు]

2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఎగుమతులు రూ.345.85 కోట్లు కాగా, (2020 సంవత్సరంలో రూ.598.72 కోట్లుగా ఉండగా) మొత్తం ఆదాయంలో ఈ ఎగుమతుల విలువ 12.91%. 2020-21 సంవత్సరంలో ప్రైమ్ గ్రేడ్ టిష్యూ పేపర్ను రోజుకు 100 టన్నుల సామర్థ్యంతో తయారు చేయడానికి కొత్త టిష్యూ ప్లాంట్ ఏర్పాటు చేశారు, ప్లాంట్ ట్రయల్ రన్ 14 మార్చి 2021 న ప్రారంభించబడింది.[9]

అవార్డులు

[మార్చు]

సెంచురీ టెక్స్ టైల్స్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేక అవార్డులు,ప్రశంసలు లభించాయి, వీటిలో కొన్ని దిగువ పేర్కొన్నవిధంగా ఇవ్వబడ్డాయి[7]:

  • రాజీవ్ గాంధీ నేషనల్ క్వాలిటీ అవార్డు( IS/ISO9001:2000 క్వాలిటీ సిస్టమ్ ;లో సర్టిఫై చేయబడింది )
  • ఎనర్జీ కన్జర్వేషన్ లో వివిధ అవార్డుల విజేత (ఎన్విరాన్ మెంటల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ లో ISO 14001)
  • కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు, టెక్స్ ప్రోసిల్ , ఇండో-జర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి అసాధారణ ఎగుమతులకు గాను 67 అవార్డులను సంస్థకు లభించింది.

మూలాలు

[మార్చు]
  1. "Century Textiles and Industries Ltd". Centurytextind.com. Archived from the original on 26 February 2011. Retrieved 2010-12-02.
  2. "Kumar Birla to lead Century Textiles". The Times of India. 7 April 2006. Retrieved 2010-12-02.
  3. Sharad Vyas (17 November 2010). "BMC may take back mill land". The Times of India. Retrieved 2010-12-02.
  4. "Century Textiles sees margin pressure as cotton zooms". The Economic Times. 22 September 2010. Retrieved 2010-12-02.
  5. 5.0 5.1 "BSE Plus". Bseindia.com. Archived from the original on 2010-07-06. Retrieved 2010-12-02.
  6. Udit Prasanna Mukherji (13 January 2010). "B K Birla plans to hike stake in group companies". The Times of India. Retrieved 2010-12-02.
  7. 7.0 7.1 "Century Textiles Ind". business.mapsofindia.com. Retrieved 2022-07-15.
  8. "Century Textile &Ind: Reports, Company History, Directors Report, Chairman's Speech, Auditors Report of Century Textile &Ind - NDTVProfit.com". www.ndtv.com (in ఇంగ్లీష్). Retrieved 2022-07-15.
  9. "Century Textiles & Industries Ltd". Business Standard India. Retrieved 2022-07-15.