సౌఖ్యం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సౌఖ్యం
సౌఖ్యం సినిమా పోస్టర్
దర్శకత్వంఏ.ఎస్. రవికుమార్ చౌదరి
రచనశ్రీధర్ సీపన్న (మాటలు)
స్క్రీన్ ప్లేకోన వెంకట్
గోపి మోహన్
కథశ్రీధర్ సీపన్న
నిర్మాతవి. ఆనంద్ ప్రసాద్
తారాగణంతొట్టెంపూడి గోపీచంద్
రెజీనా
ఛాయాగ్రహణంప్రసాద్ మూరెళ్ళ
కూర్పుగౌతంరాజు
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థ
భవ్య క్రియేషన్స్
విడుదల తేదీ
24 డిసెంబరు 2015 (2015-12-24)
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్15 crore (US$1.9 million)
బాక్సాఫీసు6.8 crore (US$8,50,000)

సౌఖ్యం 2015, డిసెంబరు 24న విడుదలైన తెలుగు చలనచిత్రం. భవ్య క్రియేషన్స్ వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో ఏ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తొట్టెంపూడి గోపీచంద్, రెజీనా, ముఖేష్ రిషి, దేవన్, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం నటించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.[1] క్రిస్టమస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.[2][3]

అనుబంధాలకు విలువనిచ్చే కుటుంబానికి చెందిన శ్రీను (గోపీచంద్) ఫ్రెండ్స్‌తో జాలీగా తిరుగుతుంటాడు. రైలు ప్రయాణంలో శైలజ (రెజీనా)ని చూసి ప్రేమిస్తాడు. శైలజ కూడా శ్రీనును ప్రేమిస్తుంది. ఒకరోజు శైలజని కిడ్నాప్ అవుతుంది. తండ్రి కృష్ణారావు (ముఖేష్ రుషి) చెప్నడంతో శ్రీను శైలజని వెతకడం మానేస్తాడు. కానీ గతంలో శ్రీనుతో ఉన్న గొడవల కారణంగా భావూజీ (ప్రదీప్ రావత్) మనుషులు శ్రీనును చంపాలనుకుంటారు. అది కుదరకపోవడంతో భావూజీ ప్లాన్ వేసి కలకత్తాలో కింగ్ మేకర్ అయిన పిఆర్ (దేవన్) కూతుర్ని లేపుకు రమ్మని శ్రీనుతో చెప్తాడు. పరిస్థితుల వల్ల భావూజీ మాట మేరకు కలకత్తా వెళ్తాడు. ఆ తురవాత ఏం జరిగిందనేది మిగతా కథ.[4][5]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఏ.ఎస్. రవికుమార్ చౌదరి
  • నిర్మాత: వి. ఆనంద్ ప్రసాద్
  • కథ, మాటలు: శ్రీధర్ సీపన్న
  • చిత్రానువాదం: కోన వెంకట్, గోపి మోహన్
  • సంగీతం: అనూప్ రూబెన్స్
  • ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ
  • కూర్పు: గౌతంరాజు
  • నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్స్

పాటలు

[మార్చు]
సౌఖ్యం
పాటలు by
Released13 డిసెంబరు 2015 (2015-12-13)
Recorded2015
Genreపాటలు
Length18:55
Labelజీ మ్యూజిక్ కంపెనీ
Producerఅనూప్ రూబెన్స్
అనూప్ రూబెన్స్ chronology
అఖిల్
(2015)
సౌఖ్యం
(2015)
సోగ్గాడే చిన్ని నాయన
(2016)

ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. 2015, డిసెంబరు 13న ఒంగోలులో జరిగిన పాటల విడుదల కార్యక్రమంలో జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[7]

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."నాకేం తోచదే (రచన: రామజోగయ్య శాస్త్రి)"రామజోగయ్య శాస్త్రిహరిహరన్4:06
2."యు ఆర్ మై హనీ (రచన: భాస్కరభట్ల రవికుమార్)"భాస్కరభట్ల రవికుమార్నకేశ్ అజిజ్, మోహన భోగరాజు3:40
3."అలారే ఆల (రచన: రామజోగయ్య శాస్త్రి)"రామజోగయ్య శాస్త్రిమనీషా ఎర్రబత్తిని, రాహుల్ పాండే3:46
4."జిగి జిగి జిందగీ (రచన: రామజోగయ్య శాస్త్రి)"రామజోగయ్య శాస్త్రిరామన్3:20
5."లాలిపాప్ (రచన: భాస్కరభట్ల రవికుమార్)"భాస్కరభట్ల రవికుమార్గీతా మాధురి4:00
మొత్తం నిడివి:18:55

మూలాలు

[మార్చు]
  1. మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.
  2. "Soukhyam (Review)". International Business Times.
  3. "Soukhyam (Trailer)". YouTube.
  4. 123 తెలుగు, రివ్యూ (27 December 2015). "సౌఖ్యం తెలుగు సినిమా రివ్యూ". www.123telugu.com. Retrieved 11 June 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. The Hindu, Movie Review (2015-12-24). "Soukhyam: Don't go by the title". Sangeetha Devi Dundoo. Archived from the original on 2020-06-11. Retrieved 2020-06-11.
  6. సాక్షి, సినిమా (20 November 2015). "అప్పుడు రకుల్... ఇప్పుడు రెజీనా". Sakshi. Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.
  7. ప్రజాశక్తి, వార్తలు (22 November 2015). "డిసెంబర్‌ 13న ఒంగోలులో సౌఖ్యం ఆడియో విడుదల". www.prajasakti.com. Archived from the original on 11 June 2020. Retrieved 12 June 2020.

ఇతర లంకెలు

[మార్చు]