హజ్ర్ ఎ అస్వద్
హజ్ర్-ఎ-అస్వద్ : ఈ పదానికి మూలం అరబ్బీ భాష పదాలు ; హజ్ర్ = రాయి ; అస్వద్ = నల్లని; నల్లని రాయి. ఈ రాయి ఒక "ఉల్క రాయి". ఇబ్రాహీం ప్రవక్తకు అల్లాహ్ ఈ రాయి గురించి చెప్పాడు. కావున ఈ రాయి గౌరవం పొందింది. ఈ రాయి నేడు కాబా గోడలో అమర్చ బడి యున్నది. ముహమ్మదు గారు ఈ నల్లని రాయిని హజ్ యాత్రలోభాగంగాముద్దుపెట్టుకున్నారు. దీనిని పరలోకం నుండి వచ్చిన రాయి (భూమికి సంబంధించినది గాదు, అనగా స్వర్గసీమ "ఆకాశం" లేదా జన్నత్ నుండి రాలినది, గా భావించి ముస్లిములుకూడా అలాగే ముద్దు పెట్టుకుంటారు.
ఉమ్రా చేసే ప్రతి వ్యక్తీ ఆ నల్ల రాయిని తాకే వరకు తల్బియా బిగ్గరగా చెబుతూ ఉండాలి అన్నారు దైవ ప్రవక్త. (అబూ దావూద్ : 734)
మక్కాను జయించిన ఏడాది దైవ ప్రవక్తకు కొంత విశ్రాంతి దొరికింది. అప్పుడాయన ఒక ఒంటె మీద ప్రదక్షిణలు చేసి మూలనున్న నల్ల రాయిని తన చేతిలోని వంకె కర్రతో తాకారు. (అబూ దావూద్:752)
ప్రవక్త నల్లారాయిని తాకి తక్బీర్ "అల్లా అతిగొప్పవాడు" (అల్లాహు అక్బర్) అని నినదిస్తూ 3 ప్రదక్షిణలు చేశారు. (అబూ దావూద్ : 757).
ఉమర్ ఆ నల్ల రాయి వద్దకొచ్చి దాన్నిముద్దు పెట్టుకొని " ఏ మాత్రం అనుమానం లేదు, నీవు ఒక రాయివి మాత్రమే! నీవు ఎవరికీ అపకారం చేయలేవు, మేలుకూడా చేయలేవు. దైవ ప్రవక్త గనుక నిన్ను ముద్దు పెట్టుకోకపోతే నేనూ నిన్ను ముద్దు పెట్టుకునే వాడిని కాదు " అన్నారు. (బుఖారీ 2:667)