నూతన్ ప్రసాద్
నూతన్ ప్రసాద్ | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||
జననం | తడినాధ వర ప్రసాద్ డిసెంబర్ 12, 1945 కైకలూరు,కృష్ణా జిల్లా,ఆంధ్రప్రదేశ్ | ||||||||||
మరణం | 2011 మార్చి 30 హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | (వయసు 65)||||||||||
వృత్తి | నటుడు టీవీ వ్యాఖ్యాత | ||||||||||
ముఖ్య_కాలం | 1973–2009 | ||||||||||
|
నూటొక్క జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెందిన నూతన్ ప్రసాద్ (డిసెంబర్ 12, 1945 - మార్చి 30, 2011) అసలు పేరు తడినాధ వరప్రసాద్. 1970, 80 పడుల్లో తెలుగు సినిమా రంగములో ప్రసిద్ధి చెందిన హాస్య నటుడు, ప్రతినాయకుడు.
జీవిత విషయాలు
[మార్చు]నూతన్ ప్రసాద్ 1945, డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించాడు. బందరులో ఐటిఐ చదివిన ప్రసాద్, నాగార్జునసాగర్, హైదరాబాదులో ఉద్యోగాలు చేశాడు.
నాటకరంగ ప్రస్థానం
[మార్చు]ఎచ్ఎఎల్ లో ఉద్యోగం చేస్తున్న సమయంలో రంగస్థల నటుడు, దరశ్శకుడైన భాను ప్రకాష్ పరిచయం అయ్యాడు. భాను ప్రకాష్ స్థాపించిన ‘కళారాధన’ సంస్థ తరపున ప్రదరర్శించిన ‘వలయం’, ‘ గాలివాన’, ‘కెరటాలు’ వంటి నాటకాలు ద్వారా నూతన్ ప్రసాద్ నాటకరంగానికి పరిచయమయ్యాడు. ఎ.ఆర్.కృష్ణ దర్శకత్వంలో మాలపల్లి 101 సార్లు ప్రదర్శించాడు.
సినిమారంగం
[మార్చు]1973 లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు చిత్రంతో చిత్రరంగ ప్రవేశము చేశాడు. ఆ తరువాత నీడలేని ఆడది మొదలైన చిత్రాలలో నటించినా, ఈయనకు తొలి గుర్తింపు ముత్యాల ముగ్గు చిత్రంలో రావుగోపాలరావుతో పాటు ప్రతినాయకునిగా నటించడముతో వచ్చింది. ఈ చిత్రము విజయముతో తదుపరి అనేక చిత్రాలలో ప్రతినాయకుని పాత్రలు వచ్చాయి. అవన్నీ ఈయన తనదైన శైలిలో పోషించాడు. ఈయన తనదైన శైలిలో పలికే సంభాషణలతో ప్రతినాయక పాత్రలకు హాస్యవన్నె లద్దారు. అనేక చిత్రాలలో అగ్ర నటులైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, చిరంజీవి సరసన హాస్య, ప్రతినాయక, సహాయ మొదలైన విభిన్న పాత్రలు పోషించాడు. ఒక చిత్రంలో కథానాయకునిగా కూడా నటించాడు.
నూతన్ ప్రసాద్ సైతాన్గా నటించిన రాజాధిరాజు చిత్రముతో ఈయన నట జీవితము తారాస్థాయికి చేరుకొన్నది. 1984 లో సుందరి సుబ్బారావు చిత్రంలో నటనకు ఆయనకు నంది పురస్కారం లభించింది. 2005 లో ఎన్టీఆర్ పురస్కారం లభించింది. తన 365వ సినిమా 'బామ్మమాట బంగారుబాట' చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో గాయపడి కొంతకాలం నటజీవితామనికి దూరంగా ఉన్నా తిరిగి కోలుకుని నటించడం మొదలెట్టి, 112 సినిమాలలో నటించాడు. కాళ్ళు అచేతనావస్థలో ఉండిపోయిన కారణంగా పరిమితమైన పాత్రలనే పోషించగలిగాడు. ‘దేశం చాలా క్లిష్టపరిస్థితిలో ఉంది’ ‘నూటొక్క జిల్లాల అందగాడిని’ అనే డైలాగులు ప్రేక్షకాదరణ పొందాయ. ఎన్ని వైవిధ్యమైన పాత్రలు, ఏ ప్రాత పోషించినా ప్రాణం పోసేవాడు. ముఖ్యంగా ప్రసాద్‌లో ధారణశక్తి గొప్పది. ఎంత పెద్ద డైలాగ్ చెప్పినా ఒకే టేక్‌లో 1200 అడుగులు షాట్ ఒకే చేసి ఆ రోజుల్లో సంచలనం సృష్టించాడు. అప్పటికీ ప్రసాద్ కొత్త తరం నటుడే అయినా పాతతరం పోకడల్ని తూ.చ. తప్పకుండా అనుసరించేవాడు. దర్శకుల మనోభావాలను అర్ధం చేసుకొని ఎంతటి క్లిష్టమైనా సన్నివేశానికైనా జవసత్వాలు నింపి ఆ సన్నివేశాన్ని పండించేవాడు. అందరిలో కలుపుగోలు తనంగా వుంటూ ముఖ్యంగా సంభాషణల్లో తనలో ఉన్న నటుడ్ని ఆవిష్కరించేవాడు[1] ప్రసాద్ దాదాపు 365 సినిమాల్లో నటించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.[2]
కొద్ది రోజులు రవీంద్ర భారతికి ఇన్‌ఛార్జ్ గా ఉన్నాడు. వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ అభిమాని.[3]
పేరు తెచ్చిన సంభాషణలు
[మార్చు]- దేశం చాలా క్లిష్ట పరిస్థుతులలో ఉంది.
- దేవుడో.. దేవుడా (పిచ్చిపంతులు)
చిత్ర సమాహారం
[మార్చు]- నేరము - శిక్ష (2009)
- 9 నెలలు (2001)
- ఆవారాగాడు (2000)
- ఆవారాగాడు (1998)
- మాస్టర్ (1997 సినిమా) (1997)
- బిగ్ బాస్ (1995)
- ఘరానా బుల్లోడు (1995)
- తాజ్ మహల్ (1995)
- కర్తవ్యం (1991) .... (ఎ.ఎస్.పి. రామమోహనరావు)
- బామ్మమాట బంగారుబాట (1990)
- రుద్రనేత్ర (1989)
- విజయ్ (1989)
- చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం (1989)
- ఆదర్శవంతుడు (1989)
- యుద్ధభూమి (1988)
- త్రినేత్రుడు (1988)
- ఖైదీ నెం. 786 (1988)
- ఆఖరి పోరాటం (1988)
- చిన్నోడు పెద్దోడు (1988)
- చూపులు కలసిన శుభవేళ (1988) .... (నాగలింగం)
- దొంగ కోళ్ళు (1988)
- ఘాయల్ షేరినీ (1988)
- కానూన్ కీ హథకడీ (1988)
- అహ! నా పెళ్ళంట! (1987 సినిమా) (1987)
- నాకూ పెళ్ళాం కావాలి (1987)
- ప్రెసిడెంటు గారి అబ్బాయి (1987)
- సంసారం ఒక చదరంగం (1987)
- శాంతినివాసం (1986)
- వేట (1986)
- కిరాతకుడు (1986) .... Baby
- కారు దిద్దిన కాపురం (1986)
- కృష్ణ గారడీ (1986)
- అనసూయమ్మ గారి అల్లుడు (1986)
- విజేత (1985) .... (నారాయణరావు, నరసింహరావు రెండవ కొడుకు)
- అడవి దొంగ (1985)
- ఒక రాధ ఇద్దరు కృష్ణులు (1985)
- రక్త సింధూరం (1985) .... (దామోదరం)
- చిరంజీవి (1985)
- దొంగ (1985)
- చట్టంతో పోరాటం (1985) .... (జైలర్ హిట్లర్ శర్మ)
- ముచ్చటగా ముగ్గురు (1985)
- రుస్తుం (1984)
- ఇంటిగుట్టు (1984)
- మహానగరంలో మాయగాడు (1984)
- రోజులు మారాయి (1984)
- గూండా (1984)
- బొబ్బిలి బ్రహ్మన్న (1984)
- శ్రీవారికి ప్రేమలేఖ (1984) .... (భాస్కరం)
- ప్రేమజ్వాల (1983)
- మంత్రిగారి వియ్యంకుడు (1983)
- ఖైదీ (1983) .... (మునసబు)
- మగ మహారాజు (1983)
- ఆడవాళ్లే అలిగితే (1983)
- పట్నం వచ్చిన పతివ్రతలు (1982)
- కోరుకున్న మొగుడు (1982)
- కదలివచ్చిన కనకదుర్గ (1982)
- ఇల్లంతా సందడి (1982)
- ఇంద్రుడు చంద్రుడు (1982)
- గడసరి అత్త సొగసరి కోడలు (1981)
- అమ్మాయికి మొగుడు మామకు యముడు (1980)
- తాతయ్య ప్రేమలీలలు (1980)
- రాజాధిరాజు (1980) .... (సైతాన్)
- ఇంటింటి రామాయణం (1979)
- ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
- నా ఇల్లు నా వాళ్ళు (1979)
- సమాజానికి సవాల్ (1979) .... (నిలన్)
- ప్రాణం ఖరీదు (1978) .... (కరణం బుల్లబ్బాయి)
- ముత్యాల ముగ్గు (1975) .... (కృష్ణ - నిత్య పెళ్ళికొడుకు)
- అందాల రాముడు (1973) .... (గిరిబాబు)
పురస్కారాలు
[మార్చు]సీరియళ్ళు
[మార్చు]- నాన్న (జెమిని టివి)
మరణం
[మార్చు]మార్చి 30, 2011 బుధవారం హైదరాబాదులో అనారోగ్యంతో కన్నుమూశాడు.
మూలాలు
[మార్చు]- ↑ "'నూటొక్క జిల్లాల అందగాడు' నూతన్ ప్రసాద్". Archived from the original on 2020-10-24. Retrieved 2020-04-21.
- ↑ "నూతన్ ప్రసాద్ కన్నుమూత". Archived from the original on 2014-04-06. Retrieved 2013-12-28.
- ↑ http://www.indiaglitz.com/channels/telugu/article/65377.html