భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు

వికీపీడియా నుండి
"ప్రాచీన భారత రాజ్యాల మ్యాపు" ఇతిహాసాల కాలం.

పేరు పుట్టుపూర్వోత్తరాలు : భారత దేశానికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నట్లు చెప్పుకోవచ్చు.

  • వీటిలో మొదటిది జంబూ ద్వీపము. ఇది వేదాలలో భారతదేశానికి ఇవ్వబడిన పేరు, ఇప్పటికీ హిందూ మత ప్రార్థనలలో ఈ పేరు ఉపయోగిస్తారు (ఉదా: జంబూ ద్వీపే, మేరో దక్షిణభాగే, శ్రీశైల ఉత్తర భాగే, కృష్ణా గోదావారీ మధ్య స్థానే......). జంబూ అంటే "నేరేడు" పండు లేదా "గిన్నె కాయ", ఈ దేశంలో ఎక్కువగా నేరేడు పండ్లు ఉంటాయి కనుక దీనికి ఈ పేరు వచ్చినది.
  • ఆ తరువాత వచ్చిన పేరు "భారతదేశం" లేదా "భరతవర్షం", ఈ పేరు నాటి రాజు పేరు మీదగా వచ్చినది, ఈ రాజు పేరు "భరతుడు". ఇతను విశ్వామిత్ర, మేనకల కుమార్తె అయిన శకుంతల యొక్క కుమారుడు.
  • తరువాతి పేరు హిందూదేశం, ఇది సింధునది పేరు మీదగా వచ్చినది, పూర్వపు పర్షియనులు, గ్రీకులు సింధునదికి ఆవల ఉన్న దేశం కనుక ఈ పేరుతో పిలిచారు.
  • తరువాత హిందూదేశం యొక్క రూపాంతరం ఐన ఇండియా అనే పేరు, బ్రిటీషు వారి వలన ప్రముఖ ప్రాముఖ్యతను పొందినది, ప్రస్తుతము భారత దేశానికి రెండు ప్రభుత్వ గుర్తింపు పొందిన పేర్లు కలవు, అవి ఇండియా, భారత దేశం. ఇంకా హిందూస్తాన్ అనునది కూడా హిందూ దేశం యొక్క రూపాంతరమే!

విషయ సూచిక

[మార్చు] ఇండియా

ఈ ఆంగ్ల పదము, గ్రీకు పదమైన Ἰνδία, లాటిన్ ద్వారా ఇండియా. Ἰνδία బైజాంటియన్లో సింధూనది (Ἰνδός) కి ఆవల గల రాజ్యం. క్రీ.పూ. 5వ శతాబ్దంలో హెరొడోటస్ పాలిటోనిక్ (ἡ Ἰνδική χώρη) "ఇండియన్ లాండ్" (Indian land), అవెస్తన్ నుండి "హిందుస్" (సింధూ నదిని సూచిస్తుంది) దరాయిస్ 1 (డేరియస్-1) నుండి, సంస్కృతం నుండిసింధు (సింధూనదిని సూచిస్తుంది). ఆఖరుకు సంస్కృత పదం నుండి స్థిరపడింది సింధు, లాటిన్ నుండి ఇండియా, పేర్లు స్థిరపడ్డాయి.[1]

సంస్కృత పదమైన 'ఇందు' చంద్రుడి పేరు సోమతో సంబంధంలేదు.

[మార్చు] భారత్

భూగోళిక ప్రాంతం, ఇందులో భారత ఉపఖండం చూడవచ్చును.

భారత్ అనే పేరు [2] భారత రిపబ్లిక్, లోని భారత్ సంస్కృతం నుండి స్వీకరించిన అధికారిక పదం.

సంస్కృత పదమైన 'భారత్', 'భారత' అనే పదం నుండి ఉద్భవించింది.

విష్ణు పురాణం (2.3.1) నుండి. [1][2]

uttaraṃ yatsamudrasya himādreścaiva dakṣiṇam
varṣaṃ tadbhārataṃ nāma bhāratī yatra santatiḥ
उत्तरं यत्समुद्रस्य हिमाद्रश्चैव दक्षिणम् ।
वर्षं तद् भारतं नाम भारती यत्र संततीः ।।
"వర్షం" (దేశం) సముద్రానికి ఉత్తరాన ఉన్న, హిమములతో కూడిన పర్వతాలకు దక్షిణాన గల, దీనిని భారతం అని, ఇక్కడ భారత సంతతి నివసిస్తుంది."

సంస్కృత సాహిత్యం నుండి తీసుకున్న పేరు, భారత రిపబ్లిక్ ప్రాంతాన్ని, భారతదేశము, పాకిస్తాన్, నేపాల్ మరియు బంగ్లాదేశ్ ల కొరకే గాక ఆఫ్ఘనిస్తాన్ లోని అనేక ప్రాంతాల కొరకు ఉపయోగించబడినది. ఈ ప్రాంతం 4-3వ శతాబ్దాలు క్రీ.పూ. మౌర్య సామ్రాజ్యము, మొఘల్ సామ్రాజ్యం, మరాఠా సామ్రాజ్యము మరియు బ్రిటిష్ సామ్రాజ్యము మున్నగు వాటి కొరకునూ ఉపయోగించబడినది.

అఖండ భారతదేశం అనే పదజాలమునూ సమకాలీన రాజకీయాలలో కానవస్తున్నది, దీని ముఖ్య ఉద్దేశ్యము, ఈ ప్రాంతాలన్ని ఏకీకరించి ఒక అఖండ ప్రాంతంగా అభివృద్ధి పరచాలి.

[మార్చు] హిందూస్తాన్ మరియు హింద్

ప్రధాన వ్యాసం: హిందుస్తాన్
అశోకుని మౌర్య సామ్రాజ్యం నందలి . [3] అశోకుని శిలాశాసనాలు. గ్రీకు మరియు అరామిక్ భాషలలో వ్రాయబడినవి. మరియు 'అయి ఖోనూమ్' వరకు వ్యాపించినవి.


హింద్ అనే పేరు ఇరానియన్ భాషనుండి ఉద్భవించింది, దీని సమానార్థం ఇండో-ఆర్యన్ సింధ్. మరియు అవెస్తన్ యొక్క -స్థాన్ అనగా దేశము లేదా ప్రాంతం (సంస్కృతంలో 'స్థాన' ప్రదేశం లాగా).

ఇండియాను, పర్షియన్ లో హిందుస్తాన్, అరబ్బీ లో అల్-హింద్(الهند) అని పిలుస్తారు (జై హింద్ లోని 'హింద్' లా).

ఈ 'హింద్' మరియు 'హిందుస్తాన్' అనే పేర్లు అరబ్బీ మరియు పర్షియన్ భాషలలో 11వ శతాబ్దం నుండి 'ముస్లింల పరిపాలనా' కాలం నుండి ఉపయోగంలో యున్నది. సల్తనత్ మరియు మొఘల్ కాలంనుండి విరివిగా ఉపయోగంలో వున్నది.

'హిందూ' (हिन्दू) అనే సంస్కృత పదం మరియు పర్షియన్ పదం 'హిందూ' అనే పదాలు సమానం.

హింద్ (हिन्द) అనే హిందీ పదం హిందీ-ఉర్దూ భాషలలో ఇప్పటికీ వున్నది. ఇచ్చట చక్కటి విషయమేమంటే, అరబ్బీ, పర్షియన్, సంస్కృతం, హిందీ మరియు ఉర్దూ, ఈ భాషలలో 'హింద్' అనే పదం సాధారణం. దీని వల్ల గోచరమయ్యే విషయం ఒకటి, ఈ భాషలన్నింటికీ మూలం ఒక్కటేనని, ఈ భాషలు మాట్లాడే వారి పూర్వీకులు ఒక్కరేనని.

[మార్చు] ఆర్యదేశము

కొన్ని హిందూ గ్రంధాలలో, ఉదాహరణకు మనుస్మృతి మరియు కొన్ని బౌద్ధధర్మ గ్రంధాలు, 'ఆర్యదేశ్' అనే పదము ఉపయోగంలో కానవస్తుంది. భారతదేశాన్ని 'ఆర్యవర్త', 'ఆర్యవర్తం' అని పిలువబడింది. ఆర్య, ఆర్యధర్మ, ఆర్యన్ ఈ పదాలన్నీ ఆర్య తెగ కొరకు ఉపయోగించబడినది. తమిళ కవి తన కవితలో భారతదేశాన్ని ఆర్యనాడు అని సంబోధించాడు.[4] 'ఆర్య' అనగా 'ఉన్నతుడు', 'దేశ' లేదా 'నాడు' అనగా ప్రాంతము.

[మార్చు] కొన్ని చారిత్రాత్మక వివరణలు

క్రీ.శ. 1500 నకు పూర్వానికి చెందిన కొన్ని చారిత్రక వివరణలు క్రింద ఇవ్వబడినవి. [5]

సంవత్సరం పేరు వనరు వివరణ
క్రీ.పూ. 486 హిందుష్ నఖ్ష్ ఎ రుస్తం "దరాయిస్ డేరియస్ రాజు ఈవిధంగా చెప్పాడు : 'ఓర్మజ్ద్' కృపతో, పర్షియా కు ఆవల నేను స్వాధీన పరచుకున్నాను. నేను నా రాజ్యంలో ఆ ప్రాంతాలను కలుపుకున్నాను. అవి నా సామంతాలయ్యాయి, అవి నేను చెప్పినట్టు వింటున్నాయి. మెడియా.. అరచోటియా (హరౌవాటిష్), సట్టాజిడియా (తటాగుష్), గందారియా (గదార), ఇండియా (హిదుష్) . . ."
క్రీ.పూ. 440 ఇండియా హెరొడోటస్ "ఇండియాకు తూర్పున ఎడారి ప్రాంతంవున్నది. ఇండియన్లు తూర్పు ముఖానికి చాలా దగ్గరగా వున్నారు. సూర్యోదయ ముఖానికి అతిదగ్గరలో వున్నారు. "
క్రీ.పూ. 300 ఇండియా/ఇండికే (Indikē) మెగస్థనీస్ "ఇండియాకు గల ఎల్లలలో, తూర్పు మరియు దక్షిణాన మహాసముద్రం గలదు; ఉత్తరాన పర్వతశ్రేణులు మరియు పశ్చిమాన మహా ప్రాంతం, నైలు నదికి ఆవలి నదుల ప్రాంతం."
క్రీ.పూ. 140. ఇండోయి, ఇండౌ అర్రియన్ "ఈ ప్రాంతపు ఉత్తర సరిహద్దు టారస్ పర్వతాలు, ఈ టారస్ పర్వతాలెక్కడున్నాయనే చర్చ చాలా జరిగింది. మూలంగా అలెగ్జాండర్ పయనించిన మార్గాలు, గ్రీకుల వ్రాతలను బట్టి గంగానది, దాని ఒడ్డున విలసిల్లిన నగరాలు, వాటి వర్ణనలను పరిశీలించిన పిదప, ఈ ప్రాంతం ఇండోయి, మరియు ఇండౌ గా అభివర్ణింపబడినట్లు రుజువౌతుంది.
క్రీ.శ. 590. హింద్ ఇస్తఖ్రి " పర్షియా సముద్రానికి తూర్పున (హిందూ మహాసముద్రం), ఇస్లామీయ దేశాల పశ్చిమం మరియు దక్షిణాన, మరియు ఈ ప్రాంతపు ఉత్తరాన చైనా గలదు. ఈ 'హింద్' ప్రాంతపు పొడవు మక్రాన్ నుండి మన్సూరా వరకూ, బోద్ధా మరియు మితగా సింధ్ ప్రాంతం, కనౌజ్ వరకు, టిబెట్ వరకూ, నాలుగు నెలల ప్రయాణం, దీని వెడల్పు కనౌజ్ నుండి హిందూ మహాసముద్రం వరకు మూడు నెలల ప్రయాణం.
క్రీ.శ. 650 ఐదు ఇండీస్ జుఆన్‌జాంగ్ "ఐదు ఇండీస్ ల చుట్టుకొలత దాదాపు 90,000 లి.; మూడు వైపుల సముద్రం, ఉత్తర భాగాన హిమముతో కూడిన పర్వతాలు. ఉత్తర భాగాన వెడల్పుగాను, దక్షిణ భాగాన సన్నగాను, అగ్రము గాను; దీని ఆకారం అర్ధ చంద్రాకారం."
క్రీ.శ. 944. హింద్, సింధ్ మసూది "సింధ్ మరియు హింద్ కు చెందిన రాజులు మరియు భాష గురించి చర్చిద్దాం. సింధ్ భాష హింద్ భాషకంటే వేరు. . . ."
క్రీ.శ. 1020 హింద్ అల్ బెరూని "హింద్, తూర్పున 'చిన్ మరియు మచిన్, పశ్చిమాన సింధ్ మరియు కాబూల్, మరియు దక్షిణాన సముద్రం."-
క్రీ.శ. 1205 హింద్ హసన్ నిజామీ "హింద్ కు చెందిన మొత్తం దేశం, ఉత్తరం పెషావర్ నుండి, దక్షిణం హిందూ మహాసముద్రం వరకూ; పశ్చిమాన షెవాన్ (ఇండస్ పశ్చిమ ఒడ్డు) నుండి చైనానుండి వేరు చేసే పర్వతాల వరకు."
క్రీ.శ. 1298 ఇండియా ద గ్రేటర్
ఇండియా ద మైనర్
మిడిల్ ఇండియా
మార్కోపోలో "గ్రేటర్ ఇండియా, మాబార్ నుండి కెస్మకోరాన్ (కోరమాండల్ నుండి మక్రాన్ వరకు మరియు దీనిలో 13 ప్రసిద్ధ రాజ్యాలున్నాయి, చంపానుండి ముత్ఫిల్ (చైనా నుండి కిస్త్నా డెల్టా వరకు) ఇందులో ప్రసిద్ధమైన 13 రాజ్యాలు గలవు. హబష్ (అబిసీనియా) ఇది మధ్య ఇండియాలో గలదు."
క్రీ.శ. 1328. ఇండియా ఫ్రయర్ జోర్డానస్ "ఎలా వర్ణించను? ఇండియా యొక్క ప్రాశస్తం, వర్ణణాతీతం. కానీ నేను చూడకపోయిననూ ఇండియా ప్రసిద్ధమైనదని చెప్పగలను. . ."
క్రీ.శ. 1404 ఇండియా మైనర్ క్లేవియో "ఈ గురువారమే, ఒక రాయబారి ప్రసిద్ధమైన నది (ఓక్సస్ నది) వద్దకు వచ్చాడు, వారు ఆవలి ఒడ్డును దాటారు. అదేరోజు... సాయంత్రం 'టెర్మెజ్' నగరానికి విచ్చేశాడు, ఈ ప్రాంతం ఇండియా మైనర్ కు చెందినది, కాని ఇది ఇప్పుడు అది సమర్ఖండ్ కు చెందినది, దీనిని తముర్బెక్ జయించాడు."

[మార్చు] రిపబ్లిక్ ఆఫ్ ఇండియా

[మార్చు] అధికారిక నామాలు

నేటి భారత్, ఢిల్లీ లోని, మంత్రాలయ భవన ఉత్తర ముఖం, ప్రభుత్వ ప్రధాన కార్యాలయం.

భారత రాజ్యాంగం లోని మొదటి అధికరణ ప్రకారం అధికారిక నామాలు :

ఆంగ్లం : India; Bharat : (ఇండియా; భారత్)
హిందీ : भारत : (భారత్)

[మార్చు] ఎనిమిదవ షెడ్యూల్ లోని భాషల నందు పేర్లు

భారత రాజ్యాంగములోని 8వ షెడ్యూల్ లో ప్రస్తావింపబడిన 23 అధికారిక భాషలలో 'భారతదేశం' పేరు ఇలా వుంది.[6]. హిందీ మరియు ఆంగ్లం, భారత అధికారిక భాషలు [7]

భాష భాషారూపం సూక్ష్మరూపం
అస్సామీ ভাৰত গণৰাজ্য భారోత్ గొణొరాజ్యో ভাৰত భారోత్
బెంగాలీ ভারত গণরাজ্য భారోత్ గోనోరాజ్యో ভারত భారోత్
బోడో
డోగ్రి
ఇంగ్లీషు[8] రిపబ్లిక్ ఆఫ్ ఇండియా (Republic of India) ఇండియా (India)
గుజరాతీ ભારતીય પ્રજાસત્તાક ભારત
హిందీ भारत गणराज्य భారత గణ రాజ్య भारत భారత్
కన్నడ ಭಾರತ ಗಣರಾಜ್ಯ భారత గణరాజ్య ಭಾರತ భారత
కాశ్మీరి
కొంకణి भारोत गोणराज (భారోత్ గోణరాజ్) भारोत (భారోత్)
మైథిలి
మలయాళం ഭാരതം భారతం ഭാരതം భారతం
మణిపురి (మరియు మెయిథీ) ভারত গণরাজ্য ভারত
మరాఠీ भारतीय प्रजासत्ताक భారతీయ ప్రజాసత్తాక్ भारत భారత్
నేపాలీ भारत गणराज्य భారత్ గణరాజ్య भारत భారత్
ఒరియా ଭାରତ భారత
పంజాబి ਭਾਰਤ ਗਣਰਾਜ భారత్ గణరాజ్
ਭਾਰਤ ਗਣਤੰਤਰ భారత్ గణ్‌తంతర్
ਭਾਰਤ భారత్
సంస్కృతం भारत गणराज्य భారత గణరాజ్య भारत భారత
సంథాలీ
సింధి
తమిళం பாரத கனரஜ்ய భారత గణరాజ్య பாரத భారత
తెలుగు భారత్ గణరాజ్యము భారత్
ఉర్దూ جمہوریہ بھارت జమ్‌హూరియత్ ఎ భారత్ بھارت భారత్

[మార్చు] ఇతరనామములు

[మార్చు] జంబూద్వీపము

హిందూ, జైన, బుద్ధ మత గ్రంధాలలోని అనేక కథలలో జంబూ ద్వీపము అనే ప్రస్తావన కానవస్తుంది. ఈ ద్వీపం 7 దీవుల/ఖండాలలో ఒకటి. [9]

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] మూలాలు

  1. India Oxford English Dictionary, 2nd edition: 1989.
  2. భారత రాజ్యాంగం లోని మొదటి అధికరణ ప్రకారం : ఇండియా అనబడు భారత్, రాష్ట్రాల సమాఖ్య ,"
  3. Reference: "India: The Ancient Past" p.113, Burjor Avari, Routledge, ISBN 0-415-35615-6
  4. P. 88 A Comparative Study of Bharati and Vallathol By Cir̲pi
  5. Hobson Jobson Dictionary
  6. Eighth Schedule. National Informatics Centre (NIC) (2007). తీసుకొన్న తేదీ: 2007-06-26.
  7. The Union: Official Language. National Informatics Centre (NIC) (2007). తీసుకొన్న తేదీ: 2007-06-24.
  8. CIA Factbook: India. CIA. తీసుకొన్న తేదీ: 2007-03-10.
  9. Two Kinds of Faith

[మార్చు] బయటి లింకులు

Wiktionary-logo-en.png
India గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు