హంసలదీవి

వికీపీడియా నుండి

హంసలదీవి, కృష్ణా జిల్లా, కోడూరు మండలానికి చెందిన గ్రామము

హంసల దీవి వద్ద కృష్ణానది బంగాళాఖాతంలో కలుస్తుంది.
హంసలదీవిలోని వేణుగోపాల స్వామి మందిరం శ్రీ వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటి.

బంగాళాఖాతం ఇక్కడి నుండి 5 కి.మీ. దూరంలో ఉంది. అవనిగడ్డ దగ్గర పులిగడ్డ వద్ద కృష్ణానది రెండు పాయలుగా చీలుతున్నది. వాటిలో తూర్పు శాఖ పాలకకాయి తిప్ప దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది హంసల దీవికి 5 కిలోమీటర్లు దూరంలో ఉంది. పశ్చిమ శాఖ మళ్ళీ మూడు పాయలుగా చీలుతుంది - లంకవానిదిబ్బ కృష్ణ, నాసగుంట కృష్ణ, వేణీసాగరం కృష్ణ - ఈ మూడు పాయలూ సముద్రంలో కలుస్తాయి.

పాలకాయి తిప్ప వద్ద నది సాగరంలో కలిసే చోట (సాగర సంగమం) సుందరమైన ప్రదేశం. ఇక్కడికి రోడ్డు మార్గం ఉంది. చివరిలో బీచి వెంట ఉన్న కాలిమార్గం సముద్రం పోటు సమయంలో అంత క్షేమం కాదు. సందర్శకులు నీటిలో ఎక్కువ దూరం వెళ్ళవద్దని హెచ్చరించే బోర్డు ఉంది. సురక్షితమైన ప్రాంతాన్ని సూచించే సిమెంటు స్తంభాల హద్దులు కనిపిస్తాయి. దగ్గరలో ఉన్న ఒక భవంతి పైనుండి సుందరమైన సాగర సంగమం దృశ్యాన్ని చూడవచ్చును.


ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఒక పవిత్ర పుణ్య స్థలం. పూర్వం దేవతలు ఈ గుడిని నిర్మించారు అని ఇక్కడి ప్రజలు నమ్మకము. ఇక్కడ మాఘ పౌర్ణమి నాడు ప్రత్యేకమైన పూజలుమ ఉత్సవాలుమ అన్నదానం జరుగుతాయి.

హంసల దీవికి విజయవాడ నుండి, గుడివాడ నుండి బస్సు ద్వారా చేరుకోవచ్చును.

[[వర్గం:కృష్ణా జిల్లా గ్రామాలు]

"http://te.wikipedia.org/w/index.php?title=హంసలదీవి&oldid=810724" నుండి వెలికితీశారు