వాడుకరి చర్చ:C.Chandra Kanth Rao

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search



పాలమూరు 'చంద్ర ' కిరణాలకి శుభాకాంక్షలు

ఈనాడు దినపత్రికలో ఈ రోజు(26.01.2015)మీ గురించి వచ్చిన ఆర్టికల్ చూశాను. బాగుంది. మీ జీవన ప్రస్థానాన్ని,కృషిని సవివరంగా తెలియజేసింది. ఈ ప్రయత్నం ఇలాగే కొనసాగుతూ...ఈ చంద్ర కిరణాలు మరెంతో మందికి జ్ఞాన కిరణాలు పంచాలని ఆశిస్తూ..మీ _Naidugari Jayanna (చర్చ) 17:26, 26 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మీ వ్యాఖ్యకు చాలా కృతజ్ఞతలండి జయన్నగారూ. నేను గత 20 సంవత్సరాలుగా విజ్ఞాన సర్వస్వంకై కృషిచేస్తున్నాను. అంటే తెవికే కాదు ఆంగ్ల వికీ కూడా ప్రారంభం కాక ముందే నాకు స్వంత విజ్ఞానసర్వస్వం ఉంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల సమాచారం సేకరించాను. పాలమూరు జిల్లాకు సంబంధించి జిల్లాలోని ఒక్కో మండలంపై ఒక్కో పుస్తకాన్ని విడుదల చేసే సమాచారం నా వద్ద ఉంది. ఇతర జిల్లాలకు సంబంధించి మండల స్థాయివరకు సమాచారం ఉంది. బ్లాగులో ఉంచినది అందులో అతికొద్ది శాతం మాత్రమే. సమగ్ర సమాచారంతో అత్యంత నాణ్యతతో విజ్ఞానసర్వస్వాన్ని తయారుచేసి వెలువరించడమే నా తొలి లక్ష్యం. నా మరో లక్ష్యం లక్షప్రశ్నలు. దీనిలో ఇప్పటివరకు సుమారు 65%-70% సాధించాను. దీనికై రోజూ కనీసం 4-5 గంటల సమయం వెచ్చిస్తున్నాను. జికె బ్లాగు , ఫేస్‌బుక్ జికె పేజీ లు మంచి ఆదరణ పొందుతున్నాయి. నేణు చేస్తున్న రెండు ప్రాజెక్టు పనులు పూర్తయి సమాచారం బయటపడితే నా ప్రయత్నం నెరవేరినట్లవుతుంది. మరోసారి ధన్యవాదాములతో ... సి. చంద్ర కాంత రావు- చర్చ 18:53, 26 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంతులవారి కృషికి తగిన గుర్తింపు. అందుకోండి శుభాభివందనాలు --వైజాసత్య (చర్చ) 00:33, 27 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారూ, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు. అసలైన గుర్తింపుకు అదే సమయంలో తెలుగు పాఠకుల ప్రయోజనాలకు నేను చేయాల్సింది చాలా ఉంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:19, 27 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మీ బ్లాగు

చంద్రకాంతరావు గారూ, నేను నిన్ననే మీ బ్లాగు చూసాను (తొలిసారిగా), అద్భుతం, చాలా చాలా బాగుంది, అభినందనలు. గాడ్ బ్లెస్ యు. అహ్మద్ నిసార్ (చర్చ) 06:44, 27 అక్టోబర్ 2013 (UTC)

మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు. మీరుచూసినది తెవికీ నిర్వహణ బ్లాగేనా? ఎందుకంటే నేను ఇతర బ్లాగులు కూడా నిర్వహిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:44, 27 అక్టోబర్ 2013 (UTC)
కాదండి, ఇతర బ్లాగు, అందులో జిల్లా సమాచారాలున్నాయి. అహ్మద్ నిసార్ (చర్చ) 10:47, 27 అక్టోబర్ 2013 (UTC)
అలాగా, అయితే అది పాలమూరు జిల్లా విజ్ఞానసర్వస్వం బ్లాగు అయి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:04, 27 అక్టోబర్ 2013 (UTC)

అంతర్వికీ లింకులు

చంద్రకాంతరావు గారికి నమస్కారం,

వికీ డేటా అనే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టినప్పటికి, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుట్టపర్తి పేజీ 18 భాషలలో ఉన్నప్పటికి, తెలుగు భాషలో ఉన్న పుట్టపర్తికి నేపాలీ భాషలో ఉన్న పేజీతో మాత్రమే లింకు ఉన్నది, వికీ డేటా ద్వారా నేను ఇతర భాషలతో లింకులు కలిపేందుకు ప్రయత్నించినపుడు ఎర్రర్ వస్తుండటంతో నేరుగా అంతర్వికీ లింకు ఇచ్చాను. అలాగే తెలుగు మరియు ఆంగ్ల వికీలలో అనేక పేజీలలో వికీ డేటాతో లింకులు లేని వాటికి అంతర్వికీ లింకులు ఇచ్చాను. మీరు విడవలూరు, ముత్తుకూరు, తాడ్వాయి (నిజామాబాదు జిల్లా మండలం) వ్యాసాలలో అంతర్వికీలింకులు రద్దుచేసి వికీడేటాలో కలిపాను అంటున్నారు, ఇటువంటివి అనేకం ఉన్నందున రద్దు చేయకుండా సరిచేయగల మార్గం ఏదైనా ఉంటే ఆ విధంగా చేయండి, లేదా సూచించండి. YVSREDDY (చర్చ) 10:29, 27 అక్టోబర్ 2013 (UTC)
తెలుగు భాషలో ఉన్న పుట్టపర్తి పేజీని వికీ డేటాలో కలిపినట్లు, నేపాలీ భాషలో ఉన్న పుట్టపర్తి పేజీని కూడా వికీ డేటాలో కలపితే బాగుండేది. నేను చాగల్లు పేజీని వికీ డేటాలో కలిపేటప్పుడు తెలుగు మరియు నేపాలీ భాషలలోని రెండిటిని వెంటవెంటనే కలిపాను, ఇలా కలపక పోతే మళ్ళీ వెదకి కలపడం కష్టం, నేపాలీ భాష వంటి ఇతర భాషల వాటిని వెదకి కలపడం మరీ కష్టం. YVSREDDY (చర్చ) 12:23, 27 అక్టోబర్ 2013 (UTC)
రెడ్డిగారూ, సందేహాలు అడిగినందుకు సంతోషం. అన్నింటికీ వివరంగా తెలుపుతాను. ముందుగా 1) పుట్టపర్తి వ్యాసం 18 భాషలలో ఉంది కాని తెవికీ వ్యాసంలో నేపాలీ భాషలో మాత్రమే లింకు ఉందన్నారు. అవును తెవికీకి చెందిన చాలా వ్యాసాలలో ఇలానే ఉంది. ఇప్పుడు పుట్టపర్తి వ్యాసం చూడండి సరిగ్గానే ఉందికదూ! వికీడేటాలో చరితం చూడండి. రమణగారు తెలుగువ్యాసం లింకు చేర్చారు. కాబట్టి నేనిప్పుడు మీరు చేర్చిన అంతర్వికీ లింకు దిద్దుబాటును రద్దుచేసిననూ అన్ని భాషాలింకులు కనిపిస్తున్నాయి కదా! మీరు కూడా ఇలా చేయవచ్చు. 2) ఎర్రర్ రావడానికి చాలా కారణాలుండవచ్చు. అందులో ముఖ్యమైనదేమిటంటే తెవికీ వ్యాసం నుంచి వికీడేటాకు ఒకపేజీ, ఆంగ్లవికీ నుంచి మరో పేజీ ఏర్పడియుంటే, మనం మళ్ళీ తెవికీ నుంచి ఆంగ్లవికీ లింకు ఇద్దామంటే ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఒకే వ్యాసం కొరకు వికీడేటా 2 పేజీలు కేటాయించదు. అంతకుక్రితమే రెండూ పేజీలున్ననూ అది వికీడేటా పసిగట్టపోవడానికి కారణం రెండిట్లోనూ వేర్వేరు భాషలుండటం. 3) వికీడేటాలో అంతర్వికీ లింకు ఇవ్వడమే సరైనదికాబట్టి తెవికీలో మీరిచ్చిన అంతర్వికీ లింకులు రద్దు చేయడం లేదా తొలగించడము సరైనదే. అది మేము కాకున్నా వికీడేటాకు చెందిన బాటులైనా తొలగిస్తాయి. 4) ఎర్రర్ వస్తుందని భావించి వికీడేటాలో అంతర్వికీ లింకులు చేర్చకుండా తెవికీలో చేర్చడం సులభమని ఆ పనిచేయకండి. మనకు కష్టమైన పని అయిననూ సరైన పనే చేయాలి కదా, లేకుంటే ఆ దిద్దుబాట్లు వృధాఅయ్యే అవకాశాలుంటాయి. ఇంకనూ ఏవైనా సందేహాలుంటే తప్పకుండా అడగవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:45, 27 అక్టోబర్ 2013 (UTC)
వికీడేటాలో నేపాలీ భాషకు చెందిన లింకు కూడా పుట్టపర్తి పేజీలో ఉందికదా! చూడండి సి. చంద్ర కాంత రావు- చర్చ 12:51, 27 అక్టోబర్ 2013 (UTC)

వికీకోట్

వికీఖోట్ లో కొంత సమాచారం చేర్చాను. ఒకసారి చూడండి. సరిచేయండి.Rajasekhar1961 (చర్చ) 13:59, 27 అక్టోబర్ 2013 (UTC)

మీరు చేసిన కొన్ని మార్పులు పరిశీలించాను, బాగాచేశారు. తెవికోట్‌లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కొంతకాలం నేనక్కడ చురుకుగానే పనిచేశాను. సమయం సరిపోకపోవడంతో ప్రస్తుతం అక్కడ ఎక్కువ మార్పులు చేయడం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:32, 27 అక్టోబర్ 2013 (UTC)
ధన్యవాదాలు. ఇద్దరం కలిసి పనిచేద్దాము.Rajasekhar1961 (చర్చ) 14:41, 27 అక్టోబర్ 2013 (UTC)
సరే, అలాగే చేద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:46, 27 అక్టోబర్ 2013 (UTC)

వ్యాస చరిత్ర

"ఒలిక్ ఆమ్లం" వ్యాస ప్రారంభకులుగా దానిలో ఏ సమాచారాన్ని చేర్చని నా పేరు ఉండుట నా మనసును కలచి వేస్తుంది. దానిపై సంపూర్ణ కృషిచేసిన పాలగిరి గారి పేరుకు మార్చే వీలుందా? ఆ మార్పుకు సహియం చేయండి.--K.Venkataramana (talk) 15:53, 9 నవంబర్ 2013 (UTC)

తప్పకుండా వీలుంటుంది. దానికి రెండు దారులున్నాయి. పాలగిరి గారి ప్రమేయంతో మార్చడం ఒక విధానమైతే, వారి ప్రమేయం లేకుండా కూడా మార్చడం రెండో పద్దతి. అది చేయడం కూడా సులభమే. అయిననూ పాలగిరి గారి ప్రమేయంతోనే మార్చడానికి ప్రయత్నిద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:58, 9 నవంబర్ 2013 (UTC)

ఒలిక్ ఆమ్లం

C.Chandra Kanth Rao గార్కి,విషయ పరిష్కారం కై మీ చొరవకు ధన్యవాదం.ఈ విషయం పై ఏవిధంగా స్పందించాలో తెలియనందున మౌనంగా వున్నాను. నన్ను క్షమించాలి.04:23, 10 నవంబర్ 2013 (UTC)

తప్పనిసరిగా ఆ వ్యాస ప్రారంభకులుగా పాలగిరి గారి పేరుకు మార్చండి. తెవికీలో విశేష కృషి చేస్తున్న ఆయన కృషి సాంకేతిక కారణాల వలన వేరొకరి పేరుకు మారటం భావ్యంకాదు. --K.Venkataramana (talk) 05:00, 10 నవంబర్ 2013 (UTC)
చేశాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:11, 10 నవంబర్ 2013 (UTC)
రావుగారు, మీ సహకారానికి ధవ్యవాదం,వ్యాసాన్ని చేర్చాను.మీ సహకారానికి ధవ్యవాదం.పాలగిరి (చర్చ) 18:43, 10 నవంబర్ 2013 (UTC)
మీ నుంచి మరిన్ని విలువైన వ్యాసాలను తెవికీలో రావాలని ఆశిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:51, 10 నవంబర్ 2013 (UTC)

అక్టోబరు 2013 మాసపు తెవికీ గణాంకాలు

అక్టోబరు 2013 మాసపు తెవికీ గణాంకాలు విడుదలైనాయి. విశ్లేషణ వ్యాసంకై తెవికీ నిర్వహణ బ్లాగు చూడండి సి. చంద్ర కాంత రావు- చర్చ 15:32, 22 నవంబర్ 2013 (UTC)

ధన్యవాదాలు

గురువులకు ధన్యవాదాలు (సంతకం లేకుండా ఈ సమాచారం చేర్చినది నాయుడిగారి జయన్న)

మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు. కాని ఇక్కడ గురువులు, శిష్యులు ఉండరండి. అందరూ సమానులే. కాకుంటే అనుభవమున్నవారు కొత్తవారికి సహాయ సహకారాలు మాత్రం అందించగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:18, 30 నవంబర్ 2013 (UTC)

ధన్యవాదాలు సార్! Naidugari Jayanna (చర్చ) 17:16, 30 నవంబర్ 2013 (UTC)

ఇంకనూ ఏవేని సందేహాలుంటే అడగవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:19, 30 నవంబర్ 2013 (UTC)

కొలరావిపుప్ర పురష్కారం

C.Chandra Kanth Rao గారు, పురష్కారం కై మీ పేరును ప్రతిపాదించాను.దయచేసి మీ సమ్మతి తెలుపగలరుPalagiri (చర్చ) 10:21, 2 డిసెంబర్ 2013 (UTC)

రెండు ప్రతిపాదనలు ఉన్నాయి. మీరు ఒకదానికి సమ్మతిస్తే మరొకటి తొలగిస్తాను..వికీపీడియా:కొలరావిపుప్ర2013/C.Chandra Kanth Rao, వికీపీడియా:కొలరావిపుప్ర2013/సి. చంద్ర కాంత రావు...విశ్వనాధ్ (చర్చ) 10:43, 2 డిసెంబర్ 2013 (UTC)
చిత్తు ప్రతిపాదన తొలగించి,క్రొత్త ప్రతిపాదన పెట్టిన తరువాత మీ పేరును ప్రతిపాదించటం జరిగినది.క్రొత్త ప్రతిపాదన లో మీ సమ్మతి తెలుపుతూ సంతకం చెయ్యండి.Palagiri (చర్చ) 14:44, 2 డిసెంబర్ 2013 (UTC)14:43, 2 డిసెంబర్ 2013 (UTC)
నా పేరు ప్రతిపాదించిన పాలగిరి గారికి, సమర్థించిన రమణ, అహ్మద్ నిసార్ గార్లకు కృతజ్ఞతలు. గత రెండు దశాబ్దాల నుంచి నా జీవితమే తెలుగు "విజ్ఞానా"నికై ధారబోస్తున్నాను. అది తెవికీ కావచ్చు, బ్లాగులు కావచ్చు, నా స్వంత విజ్ఞాన చంద్రస్వం కావచ్చు, జికె ప్రశ్నలు కావచ్చు, సలహా-సంప్రదింపులు కావచ్చు. తెలుగుకు సంబంధించి రెండు పెద్ద ప్రాజెక్టు పనులలో ఉన్నాను. విధినిర్వహణలో భాగంగా ఉన్నప్పుడు కూడా సమాచార సేకరణకై ప్రయత్నిస్తున్నాను. మండల మరియు జిల్లా స్థాయికి సంబంధించిన అన్ని గణాంకాలను సేకరించియున్నాను. తెలుగు విజ్ఞానానికి సంబంధించి రోజూ కనీసం ఐదారు గంటలు విజ్ఞానానికై సమయం వెచ్చించడంలో భాగంగా తెవికీలో కూడా నేను ఆరేళ్ళ నుంచి కొంతవరకు కృషిచేసి ఉన్నానేమో! ఇన్నేళ్ళ తెవికీ కృషిలో భాగంగా పురస్కారం పొందడానికి నాకేమీ అభ్యంతరం లేదు కాని పోటీపడటం నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రతిపాదనకు సమ్మతి తెలపడం లేదని చెప్పదలుచుకున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:58, 3 డిసెంబర్ 2013 (UTC)
  • చంద్రకాంతరావు గారూ ఇది పోటీ కాదు, కేవలం అర్హులైన వారిలో పదిమందిని గుర్తించేందుకు జరుగుతున్న కసరత్తు మాత్రమే. ఏదో పక్షపాతంతో కొంత మంది సభ్యులను ఎంపిక చేసారన్న అపవాదు రాకుండా ఉండటానికే కొన్ని సంఖ్యలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాము. అంతమాత్రాన ఇది పోటీ కాదు. ప్రతిపాదితులు ఇలా తప్పుకుంటే ఈ ఉత్సవాన్ని నీరుగార్చినట్టు ఉంటుంది. దయచేసి మీ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని అభ్యర్ధిస్తున్నాను. --వైజాసత్య (చర్చ) 03:00, 4 డిసెంబర్ 2013 (UTC)
  • చంద్రకాంతరావుగారూ, నేనూ మొదట మీలాగే ఆలోచించాను, మీ ఆలోచన నిజమే అనిపించింది. ఉత్సవ కమిటీ, ప్రతిపాదిత సభ్యుల గురించి మరీ క్షుణ్ణంగానూ సూక్ష్మంగాను చూసి వారే నిర్ణయించి పురస్కారం ప్రకటించి వుంటే బాగుండేది. కాని ఇక్కడ ఒక మెలిక పెట్టారు, అది "ప్రతిపాదిత సభ్యుడు" తమ సంమతాన్ని లేదా అంగీకారాన్ని తెలపాలి. కరెక్టుగా ఇక్కడే "పోటీ" ఏమో లాంటి భావన వస్తుందనే భావన పుట్టుకొస్తుంది. ఉదాహరణకు నేను ఉపాధ్యాయునిగా పనిచేసే రోజుల్లో, (ఐచ్చిక పదవీ విరమణ పొందాను) ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ఇచ్చేవారు, విద్యాశాఖయే గుర్తించి పురస్కారం ప్రకటిస్తుందేమో అని అనుకొనే వాడిని. కాని, దానికీ దరఖాస్తు చేసుకోవాలని చాలాకాలం తరువాత తెలియ వచ్చింది. తెలిసిన తరువాత ఆ పురస్కారాల విషయం గురించి మనసు నుండి పూర్తిగా తీసివేసాను. పురస్కారం కోసం దరఖాస్తు చేసుకోవడం ఏమిటి? అనే భావన బలంగా వుండేది. నేను అలాగే ఉండిపోయాను, నా కన్నా అతి తక్కువ సేవ చేసిన వారు (ఈ వాక్యం వ్రాయడం అసభ్యమని తెలిసినా వ్రాసాను - సభ్యులు అన్యదా భావింపక మన్నించండి) జాతీయ పురస్కారాలు, రాష్ట్ర, జిల్లా పురస్కారాలు పొందారు. అది వేరే మైదానం. కాని ఇక్కడ విషయం వేరు. ఇక్కడ ప్రభుత్వ శాఖ లేదు, ప్రభుత్వ మెకానిజం లేదు. ఇక్కడ మనందరం ఒక కుటుంబం లాంటి వారము, మనలో కొందరిని, మనమే గుర్తుంచుకోవాలి. మీ మనసు మరియు భావాలు, ఎమోషన్స్ నాకు అర్థమయ్యాయి. స్పోర్టివ్ గా తీసుకుని మీరు సమ్మతిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి పురస్కార ప్రక్రియలు రాబోయే తరానికి మార్గదర్శకం కావాలి. ఈ ఉత్సవాలలో మీ పాత్ర మరియు పాల్గొనడం ఎక్కువగా ఉంటుందనే భావించాను. సత్యగారన్నట్టు మీలాంటివారిలా తప్పుకుంటే ఉత్సవాన్ని నీరుగార్చినట్టు ఉంటుంది. సత్యగారూ తెవికీ అధికార హోదా నుండి తప్పుకుని తెవికీని వీక్ చేశారు (నా స్వంత భావన). మీరూ ఈ పోటీల నుండి విరమించకండి. నిర్ణయం మార్చుకోండి. ప్రతిపాదిత సభ్యుల లిస్టులో అగ్రస్థానం మీదే. అహ్మద్ నిసార్ (చర్చ) 04:46, 4 డిసెంబర్ 2013 (UTC)
చంద్రకాంతరావు గారూ, ఈ విషయమై పునరాలోచించారా ?? మీరు, సత్య గారూ ఘటికులండీ. వారు అధికారి పదవినుండి తప్పించుకున్నారు. మీరు అధికారి బాధ్యతను తిరస్కరించారు. ఈ పురస్కారాల విషయమై తిరస్కరించారు. రాబోయే కాలం తెవికీ కొరకు ఉజ్వలంగా వున్నది. సభ్యులు పెరుగుతున్నారు. వ్యాసాల స్థాయీ పెరుగుతున్నది. మీరిలా స్తబ్దుగా ఉండిపోవడం ఏమీ బాగాలేదు. కార్యక్రమాలన్నీ సజావుగానే జరుగుతున్నాయి. కాదనను. మరీ ముఖ్యంగా, అర్జున గారు, లోహిత్ గారు, సుజాత గారు, రహ్మానుద్దీన్ గారు, సత్యగారూ, రాజశేఖర్ గారు, విశ్వనాథ్ గారూ మిగతా అందరు సభ్యులూ నిరంతరం శ్రమిస్తున్నారు. ఇదే అదునైన సమయం. వికీ స్పీడు పెంచి, భారత్ లోనే నెంబర్ ఒన్ కావడానికి. ఈ రోజు కోసమే మేమందరమూ సంవత్సరాల తరబడీ శ్రమించాం. స్తబ్దుగా వుండే సభ్యులందరికీ మేల్కొలపండి. అహ్మద్ నిసార్ (చర్చ) 15:35, 4 డిసెంబర్ 2013 (UTC)
నిసార్ గారూ, నేను పురస్కారాన్ని తిరస్కరించడం లేదండి. పోటీ మాత్రం వద్దంటున్నాను. ఒక సభ్యుడు పేరు ప్రతిపాదిస్తే చాలు మళ్ళీ ప్రతిపాదిత సభ్యుడు అంగీకారం తెలపడం నాకు నచ్చడం లేదు. తెవికీలో ఎవరేమీ చేసిననూ బహిర్గతమే. అలాంటప్పుడు మళ్ళీ ఒక్కో సభ్యుడికి పేజీలు సృష్టించి వాళ్ళ సంతకాలు తీసుకోవడం, ఇతర సభ్యుల మద్దతులు (అవసరమా? ఇది ఓటింగు కాదు కదా!) అనవసరమని నా అభిప్రాయం. మిగితా విషయాలు రచ్చబండలో వ్రాస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:50, 4 డిసెంబర్ 2013 (UTC)
వైజాసత్య గారూ, మీరు తెలిపినట్లు నేను పునఃసమీక్షించుకోవడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే ఉత్సవాన్ని నీరుగార్చిన అపవాదు నాపై రాకుండా చేస్తాను. కాని ఈ ప్రక్రియ అంతా నాకు పోటీలాగానే కనిపిస్తోంది. ఒక సభ్యుడు ప్రతిపాదించిన తర్వాత మళ్ళీ ప్రతిపాదిత సభ్యుడి అంగీకారం అవసరమేనా? ఇతర సభ్యుల మద్దతులు ఎందుకు అనేది అర్థం కావడం లేదు. తెవికీలో ఎవరి కృషి ఏమిటో మొదటి నుంచీ పరిశీలిస్తున్న మీకు బాగా తెలుసు, దాని ఆధారంగానే ఎంపిక చేస్తే బాగుండేది. పది మందిని ఎంపిక చేయడానికి పలువురి సంతకాలు తీసుకొంటే కొందరిని ఉత్సాహపర్చిననూ మరెందరినో నిరుత్సాహానికి గురిచేయలేమా? ఇక్కడ ఎవరికి వారు తాము మంచి కృషి చేస్తున్నామనే అనుకుంటారు, ఇలాంటప్పుడు తమకు గుర్తింపు రాలేదన్న నిరుత్సాహాన్ని దశాద్బి ఉత్సవ శుభవేళ కొందరికి కలిగించకపోవడమే మంచిది. ఆంగ్లవికీ లాగా మనది పరిణతి చెందినది కాదు, చిన్న సమూహం పెద్ద ఆటుపోట్లను తట్టుకోజాలదు. దశమ వార్షికోత్సవ సందర్భంగా కొందరికి తేనెను పంచాలనే నిర్ణయాన్ని నేను కాదనను కాని దీనికై తేనెతుట్టెనే కదిలించడం ప్రమాదమే. అర్హులు ఎంపిక కాకపోయినా, అనర్హులు ఎంపికైనా తర్వాత వాదవివాదాలు షరామామూలే. అయితే ఎవరికీ ప్రమాదం లేకుండా మధురాన్ని పంచే సత్తా మీకుందనే అనుకుంటున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:04, 4 డిసెంబర్ 2013 (UTC)
బైగాడ్ ఈవిషయమై "ఒక సభ్యుడు ప్రతిపాదించిన తర్వాత మళ్ళీ ప్రతిపాదిత సభ్యుడి అంగీకారం అవసరమేనా? ఇతర సభ్యుల మద్దతులు ఎందుకు అనేది అర్థం కావడం లేదు", నా మనస్సులొనూ ఇదే భావన వచ్చింది. అందుకే నేను నా ప్రతిపాదిత పేజీలో సంతకం చేయలేదు. రహమతుల్లా గారు కూడా ఇదే విషయమై సంతకం చేయలేదేమో అనే సందేహమూ వచ్చింది. వారి చర్చాపేజీ చూడండి.

కానీ, తోటి సభ్యులూ మాలాంటివారేగదా. వారి ఉద్దేశ్యాలూ మంచివే గదా. బహుశా, తొలుత ప్లానింగ్ జరిగేటపుడే కొద్దిగా దారిమల్లినట్లున్నది. ప్లానింగ్ జరిగేటపుడు సూచనలివ్వకపోవడంలో మా పొరపాటూ వున్నట్లేకదా. ఏది ఏమైనా, సోదర సభ్యులు చాలా శ్రమిస్తూ పనిచేస్తున్నారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. వారిని ప్రోత్సహిద్దాం. పురస్కారాల విషయమై నేను చాలా ఆలోచనలలో పడ్డాను. పురస్కార సంఘం, ఇంకో సంఘం అని, సత్య గారిని, రాజశేఖర గారిని, సోదరి సుజాత గారిని, అర్జున గారిని, విశ్వనాథ్ గారిని, ప్రసాద్ గారిని, ఇంకా ఇతర సభ్యులనూ పక్కన పడేశామోనని గిల్టీ గానూ ఫీల్ అయ్యాను. దశాబ్దాంతం చేసుకుంటున్న ఉత్సవాలలో మూలస్తంభాలైన వారిని పక్కన పెట్టేశామోనని భావన కలిగినది. సాధారణముగా సాంవత్సరిక ఉత్సవాలలోని సంఘాలలో వీరిని పక్కన బెట్టి, వీరి ద్వారా కొత్త వారికి పురస్కరిస్తే బాగుంటుంది. అయినా సమయం మించి పోలేదు, పురస్కారాలు పదికి బదులుగా ఇరవై ఐన పరవాలేదు, వీరినీ పురస్కరిస్తే బాగుంటుంది. మనసులోని మాట పెట్టాను. దీనిని అమలు చేయక పోయినా పరవాలేదు. అహ్మద్ నిసార్ (చర్చ) 18:39, 4 డిసెంబర్ 2013 (UTC)

నిసార్ గారూ, అసలు 10 మందికి పురస్కారాలు ఇవ్వడం కంటే కృషిచేసిన వారందరికీ సన్మానం చేస్తే సరిపోయేది. పదిమందికి ఇచ్చిననూ రహస్యంగా జాబితా ఉంచి ఉత్సవాల ముందు ప్రకటించినా బాగుండేది. ఇప్పుడు నడుస్తున్న ప్రక్రియవల్ల సభ్యులకు అనవసరంగా ఆశలు కల్పించినట్లవుతుంది. ప్రతిపాదిత పేజీలో తమ కృషిని వ్రాసుకోవడానికి అందరూ సిద్ధపడరు, మరికొందరు కొండంతగా చూపిస్తారు. వ్రాసినా వ్రాయకపోయినా ఇక్కడ జరుగుతున్న, సభ్యులు చేస్తున్న కృషి గమనించే ప్రతి ఒక్కరికీ తెలుసు, కాబట్టి దీన్నే ఆధారంగా చేసుకొని ఎంపిక చేస్తే బాగుండేది. తమకు పురస్కారం వస్తుందని భావించినవారు చివరకు అది రానప్పుడు నిరుత్సాహంకు గురికావడం సాధారణమే. అదే విధంగా ఎంపికకు, ఎన్నికకు తేడా ఉంటుంది. ఎంపిక అన్నప్పుడు సభ్యుల ఒప్పుకోలు అవసరం ఉండదు. ఉన్నవారి నుంచి కొందరిని గుర్తించడమే ఎంపిక. ఇదివరకు జరిగిన స్కైప్ సమావేశాలలో సమయం నాకు అనుకూలంగా లేదు, లేకుంటే నేనూ పాల్గొని నా అభిప్రాయాలు చెప్పేవాడిని. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:00, 4 డిసెంబర్ 2013 (UTC)
అవునండి, జరిగిందేదో జరిగిపోయింది, సహ్రుద్భావంతో మెలిగి తెవికీని కీర్తి-పతాకాలకు తీసుకు వెళదాం. మీరు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించారు, మా కోరికను మన్నించారు, ధన్యవాదాలు. అలాగే, అధికారి హోదానూ అలంకరించండి, వైజాసత్య గారికి కూడా కోరుదాం, అధికారి హోదాను తిరిగి స్వీకరించమని. ఇప్పుడుండే అధికార టీం చాలా చాలా బాగుంది, నిర్వాహకుల టీం కూడా బాగుంది, ఒకరిద్దరు నిర్వాహకులనూ పెంచండి, అధికారులూ నిర్వాహకులూ వ్యాసాలూ వ్రాయటం లోనూ, దిద్దుబాట్లలోనూ దిట్టలు. వారిని ప్రోత్సహిద్దాం. కొత్త వారికినీ నిర్వాహకాలిద్దాం. చక్కటి ఔత్సాహికులు కొత్తవారిలో వున్నారు. పతకాలివ్వండి, పరస్పర గౌరవాలు, ప్రోత్సాహకాలు, తెవికీని ఇంకా ముందుకు నడిపిస్తాయి. మీరు అంతా తెలిసినవారు, చట్టాపట్టాలేసుకుని నడిచే - నడిపించే గుణం మీలో వుంది. అహ్మద్ నిసార్ (చర్చ) 20:05, 4 డిసెంబర్ 2013 (UTC)
నిసార్ గారు, నేను అధికారి అవటం వళ్ళ పెద్దగా ఒరిగేదేమీ లేదు. మీరు అంతగా కోరుతున్నారు కాబట్టి మీరే నన్ను అధికారిని చెయ్యండి. చంద్రకాంత రావు గారు మీ ప్రతిపాదనను పునః సమీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు --వైజాసత్య (చర్చ) 10:09, 5 డిసెంబర్ 2013 (UTC)
సరైన ప్రణాళిక లేకుండా ముందుకు వెళుతున్నారనే కారణంతోనే నేను ఎంపిక మండలిలో చేరదలుచుకోలేదు, కాని ఇప్పుడు పురస్కారం కొరకే ఎంపిక మండలిలో చేరలేదనే భావం సభ్యుల అందింది కాబట్టి నేను ఈ పురస్కార ప్రతిపాదన నుంచి విరమించుకుంటున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 10:51, 5 డిసెంబర్ 2013 (UTC)

సహాయం కావాలి

చంద్రకాంతరావు గారూ, నమస్కారం. నా వాడుకరి పేజీలో, "నేను అభిమానించే తెవికీపీడియనులు" అనే విభాగం వుండేది. కాని ఇప్పుడు కనబడుట లేదు. కాస్త సహాయం చేసి వెతకడం ఎలానో కొంచెం సెలవిస్తారా. అహ్మద్ నిసార్ (చర్చ) 14:26, 4 డిసెంబర్ 2013 (UTC)

నిసార్ గారూ, మీ వాడుకరి పేజీలో కూర్పుల చరితం గమనించండి. ఆ విభాగం తప్పకుండా కనిపిస్తుంది. మీరు ఆ దిద్దుబాటు ఏ కాలంలో చేశారో తెలిస్తే వెదకటం సులభమౌతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:52, 4 డిసెంబర్ 2013 (UTC)
నేను వెతుకుతున్న ""నేను అభిమానించే తెవికీపీడియనులు" అనే విభాగం "" దొరికింది. అది నాప్రయోగాశాలలో ఉండింది, కాని మతిమరుపువల్ల దాన్ని వాడుకరి పేజీ లో వెతికాను. అర్జున గారు ఇమెయిల్ పంపారు, దాని ఆధారంగా వెతికాను, దొరికింది. ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ (చర్చ) 22:57, 4 డిసెంబర్ 2013 (UTC)

గౌ. చంద్రకాంతరావు గార్కి నమస్కారాలు. నేను నాకు కావలసిన సమాచారాన్ని గతంలో వికీపీడియా నుంచి పొందాను. కాని అలాంటి సమాచారాన్ని మనం కూడా చేర్చవచ్చు అనే విషయం నాకు తెలియదు. ఒక రోజు అనుకోకుండా ఫేస్ బుక్ లో వికీలో చేరండి. విజ్ఙాన్ని విస్తృత పరచండి, పంచండి" అని ఎవరో ఇచ్చిన ఓ పిలుపుకు స్పందించి చేరాను. చేరినప్పటి నుండి నాకు తెలిసిన సమాచారాన్ని పొందుపరుస్తున్నాను. ఈ ప్రయత్నంలో నేను వేస్తున్న ప్రతి తప్పటడగును అనుక్షణం గమనిస్తూ, సరిచేస్తూ, సలహాలిస్తూ మీరిస్తున్న ప్రోత్సాహానికి సదా ఋణపడి ఉంటాను. ఫేస్బుక్ ద్వారా, బ్లాగ్ ల ద్వారా, వికీ ద్వారా వికీ అభివృద్దికి మీరు చేస్తున్న అవిరళ కృషి చూస్తుంటే ముచ్చుటేస్తుంది. గర్వంగానూ అనిపిస్తుంది. మీ ప్రయత్నంలో సహస్రాంశమైనా నేను చేయగలిగితే ధన్యుడినే. సదా మీ ఆశిస్సులు కాంక్షిస్తూ....Naidugari Jayanna (చర్చ) 17:17, 4 డిసెంబర్ 2013 (UTC)

జయన్న గారూ, మీరు నాపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు. మీరు చూసిన ఫేస్‌బుక్ పేజీ ఇదేనా ఈ ఫేస్‌బుక్ పేజీని నేనే నిర్వహిస్తున్నాను. దీనిని మీరు లైక్ చేశారు కూడా. ఒకవేళ ఇదే నిజమైతే నా ప్రయత్నం కొంతవరకు ఫలించినట్లే. అదేవిధంగా నేను మీకిస్తున్న సలహాలను మీరు సహృదయంతో స్వీకరిస్తూ, ఆచరిస్తున్నారు కాని చాలా మంది సభ్యులు అర్థం చేసుకోక అపార్థం చేసుకున్నారు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:22, 4 డిసెంబర్ 2013 (UTC)

కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం

మీ గురించి కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదన వచ్చినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ఇప్పటికే అంగీకారము తెలుపకపోయినట్లైతే త్వరలో అంగీకారం తెలపవలసినది మరియు ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదనని విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 03:38, 15 డిసెంబర్ 2013 (UTC)

గణాంకాలు

C.Chandra Kanth Rao గారూ ! సబ్యుల నెలసరి దిద్దుబాట్ల గణాంకాలు నెలనెలా వేస్తే బాగుంటుంది.--శ్రీరామమూర్తి (చర్చ) 13:53, 22 డిసెంబర్ 2013 (UTC)

శ్రీరామమూర్తి గారూ, అలాగే చేస్తాను. నవంబరు మాసపు గణాంకాలు ఇంకనూ వెలువడలేవు కాబట్టి వేచిచూద్దాం. అంతేకాకుండా ఇంకనూ తెవికీకి సంబంధించిన విశ్లేషణాత్మక, పరిశీలన గణాంకాలు వేయాలనుకున్ననూ వచ్చే ఉగాది లోపు నేను నా బ్లాగులో పాలమూరు జిల్లాకు చెందిన అన్ని గ్రామాల వ్యాసాలు చేర్చాల్సి ఉంది, కాబట్టి ఇక్కడ సమయం సరిపోవడం లేదు. మరో 3 మాసాల వరకు నేను తెవికీలో అంతగా క్రియాశీలకంగా ఉండనేమో! అయినా అప్పుడప్పుడూ వస్తుంటాను, పరిశీలిస్తుంటాను. సి. చంద్ర కాంత రావు- చర్చ

ఈ వారం బొమ్మ

చంద్రకాంతరావు గారు! క్షమించాలి, వేదిక:రాయలసీమలో బొమ్మ మార్చబోయి వేదిక:తెలంగాణలో బొమ్మ మార్చినట్టున్నాను. అది కేవలం పొరబాటే. మరోలా అనుకోకండి! చక్కని వేదిక ప్రారంభించినందుకు హృదయపూర్వక అభినందనలు - శశి (చర్చ) 18:18, 24 డిసెంబర్ 2013 (UTC)

నేనూ అదే అనుకున్నాను. రాయలసీమ వేదికలో చేర్చాల్సినది తెలంగాణ వేదికలో పొరపాటున చేర్చినట్టున్నారు. అందుకే నేను సరిచేశాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:21, 24 డిసెంబర్ 2013 (UTC)

ఎలకూచి బాలసరస్వతి వ్యాసం విలీనం గురించి

గౌ.చంద్రకాంతరావు గార్కి నమస్కారాలు. 'ఎలకూచి బాలసరస్వతి వ్యాసాన్ని ఏలకూచి బాలసరస్వతితో విలీనం చేయుటకు నాకు ఏ అభ్యంతరం లేదు. అలాగే మానోపాడ్ మండల గ్రామాలకు సంబంధించిన మూసలో 'మనోపాడ్ ' అని ఉంది. వీలైతే 'మానోపాడ్' గా మార్చగలరని మనవి. ధన్యవాదాలుNaidugari Jayanna (చర్చ) 16:56, 29 డిసెంబర్ 2013 (UTC)

Naidugari Jayanna గారూ, రెండూ చేశాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:33, 29 డిసెంబర్ 2013 (UTC)

హాట్ కేట్ గురించి

చంద్రకాంతరావు గారూ, "హాట్ కేట్" ఏమిటి, ఎప్పుడు, ఎలా ఉపయోగిస్తారు కొంచెం తెలుపగలరా. హాట్ కేట్ గురించి నాకు బొత్తిగా తెలియదు. అహ్మద్ నిసార్ (చర్చ) 18:12, 29 డిసెంబర్ 2013 (UTC)

నిసార్ గారు, అది వర్గాలలో మార్పులు చేయడానికి ఉపయోగపడే ఒక ఉపకరణము. పూర్తి వివరాలకై వికీపీడియా:హాట్‌కేట్ లేదా en:Wikipedia:HotCat చూడండి సి. చంద్ర కాంత రావు- చర్చ 18:50, 29 డిసెంబర్ 2013 (UTC)
హాట్ కేట్ గురించి తెలిసింది, తెలిపినందులకు ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ (చర్చ) 19:52, 29 డిసెంబర్ 2013 (UTC)

చంద్రకాంతరావు గారూ, మిమ్మల్ని ఈ వ్యాసం విషయమై చాలా సార్లు అడుగుదామనుకున్నాను, కానీ మర్చిపోతూ వచ్చాను. ఈ గ్రామం గురించి మీకేదైనా సమాచారం ఉన్నదా? ఈ ప్రాముఖ్యత ఉన్న పురావస్తు ప్రదేశం గురించి పెద్దగా ఎక్కడ సమాచారం దొరకటం లేదు. జడ్చర్ల చుట్టూ గూగూల్ శాటిలైటు పటమంతా వెతికినా కనిపించలేదు. --వైజాసత్య (చర్చ) 12:58, 30 డిసెంబర్ 2013 (UTC)

జడ్చర్ల-కల్వకుర్తి మధ్యలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ప్రాంతాలు అనేకంగా ఉండేవి. ప్రస్తుతం చాలా ప్రాంతాలు కాలగర్భంలో కలిసిపోయిననూ వాటి ఆనవాళ్ళు మాత్రం అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఆలవానిపల్లి (ఇప్పటి ఆల్వాన్‌పల్లి, ఇది గొల్లతగుడి సమీపంలోనిదే) లో రాతియుగం నాటి సమాధులు కూడా చరిత్రకారులు కనుగొన్నారు. జైనమతం ఉచ్ఛదశలో ఉన్నప్పుడు ఇక్కడి ప్రాంతాలన్నీ జైనమతస్థులకు పట్టుగొమ్మలుగా ఉండేవట! ఇక్కడి త్రవ్వకాలలో లభించిన జైన విగ్రహాలు పిల్లలమర్రి మ్యూజియంలో కూడా చూశాను. మీరు చెప్పిన గొల్లతగుడి కూడా ఇదే విధంగా ఒకప్పుడు ఉచ్ఛదశలో ఉండేదట! అక్కడొక పెద్ద జైన ఆలయం ఉండేదట! దాని ఆనవాళ్ళే ఇప్పుడు శిథిలరూపంలో కనిపిస్తున్నాయి. జడ్చర్ల నుంచి కల్వకుర్తి వెళ్ళే రహదారిలో గంగాపురం స్టేజి దాటిన వెంటనే రోడ్డుకు కుడిప్రక్కన ఇటుకలతో కట్టిన ఒక ఎత్తయిన కమాన్ శిథిలరూపంలో కనిపిస్తుంది. అదే గొల్లతగుడి జినాలయంగా చెప్పబడుతుంది. పూర్వం ఈ జినాలయం పరిసరాలలో గ్రామం ఉండేదని, మధ్యయుగంలో వచ్చిన సాంస్కృతిక మార్పుల వల్ల గ్రామం మొత్తం ఖాళీ అయినట్లు చెప్పబడుతుంది. ఇది ప్రస్తుతం నిర్జన గ్రామం కాబట్టి దీని వివరాలు ఇప్పటి అధికారిక దస్త్రాలలో కనిపించడం లేదు. గొల్లతగుడి సమీపంలోనే కళ్యాణి చాళుక్యుల ఉప రాజధాని గంగాపూర్ ఉంది. దానికి సమీపంలో మీనాంబరం అనే చారిత్రక ప్రాంతం ఉండేది. అదికూడా నిర్జనప్రాంతంగా మారింది. ఇదే విషయమై రాజశేఖర్ గారు ఇక్కడ అడిగారు. గొల్లతగుడి ప్రాంతంలో ప్రస్తుతం ఒక శిథిల ద్వారం మినహా ఏమీ లేనందున గూగుల్ మ్యాప్‌లో ఎవరూ చేర్చలేరనుకుంటున్నాను. ఇప్పుడు గూగుల్ మ్యాప్‌లో నేను చేర్చాను. 16°45'35"ఉ.అ., 78°12'10"తూ.రే. పై ఇది కనిపిస్తుంది. ఈ ప్రాంతానికి సంబంధించిన పూర్తి వివరాలు సరైన ఆధారాలతో లభ్యం కావడం లేదు. నా వద్ద పాత పేపర్ క్లిప్పింగులలో ఈ సమాచారం ఉంది కాని అది నమ్మశక్యంగా లేదు. బుద్ధుడు, నాగార్జునుడు, హ్యూయాన్‌త్సాంగ్ లాంటి వారు కూడా ఇక్కడికి వచ్చినట్లుగా వ్రాశారు. జైనమతం అభివృద్ధి చెందిన ఈ ప్రాంతానికి వారెందుకు వచ్చారో పరిశీలించాల్సి ఉంది. కాకుంటే త్రవ్వకాలలో నాగార్జునుడి విగ్రహం లభించడం విశేషం. ఈ ప్రాంతాలపై చారిత్రక పరిశోధనలు చేసిన వారి రచనలు పరిశీలించి మరిన్ని వివరాలు వ్యాసంలో పొందుపర్చుటకు ప్రయత్నిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:32, 30 డిసెంబర్ 2013 (UTC)
సమాచారానికి ధన్యవాదాలు. వికీమాపియాలో మీరు చేర్చిన స్థలాన్ని చూశాను. నేను జడ్చర్ల నుండి వచ్చేటప్పుడు ఈ ప్రదేశం రోడ్డుకు ఎడమవైపు నది ఒడ్డున ఉందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది. --వైజాసత్య (చర్చ) 03:11, 31 డిసెంబర్ 2013 (UTC)

విద్యార్ధులకు తెలుగు వికీ వ్యాసరచన పోటీ

చంద్రకాంతరావు గారూ, మీకు వీలైతే వికీపీడియా:విద్యార్ధులకు తెలుగు వికీ వ్యాసరచన పోటీ కి న్యాయనిర్ణేతగా ఉండాలని కోరుతున్నాను. వికీ విధివిధానాలు చక్కగా తెలిసినవారిగా ఈ పోటీకి మీ అవసరం ఉన్నది. --వైజాసత్య (చర్చ) 17:29, 5 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నాపై ఉన్న నమ్మకానికి వైజాసత్య గారికి కృతజ్ఞతలు. కాని తెవికీలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నాకు ఎలాంటి బాధ్యత తీసుకోవడానికి ఇష్టం లేదని చెప్పడానికి విచారిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:27, 6 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

చంద్రకాంత రావు గారూ! బొమ్మలకు సంబంధించిన మీ సూచనలకు ధన్యవాదాలు. జోగులాంబ హాల్ట్ కు రైల్వేస్టేషన్ జతచేసినట్టే, జూరాల ప్రాజెక్ట్ రోడ్ కు ముందు కూడా ' ప్రియదర్శిని ' ని చేర్చండి పరిపూర్ణంగా ఉంటుంది. Naidugari Jayanna (చర్చ) 17:17, 12 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

జయన్న గారూ ప్రియదర్శిని పదం కూడా చేర్చాను. తెలియజేసినందుకు కృతజ్ఞతలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:29, 12 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

దశాబ్ధిఉత్సవాలకు స్వాగతం

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియన్లుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.ఎన్ కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటు నోటీసు ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది ఉత్సవ కార్యవర్గం, సహాయమండలి

ఎనుముల రేవంత్ రెడ్డి స్వగ్రామము

చంద్రకాంతరావు గారూ,
కొండారెడ్డిపల్లి పేరుతో మహబూబ్ నగర్ జిల్లాలో రెండు గ్రామాలు కలవు.

కొండారెడ్డిపల్లి (బల్మూర్) - మహబూబ్ నగర్ జిల్లాలోని బల్మూర్ మండలానికి చెందిన గ్రామము కొండారెడ్డిపల్లి (వంగూరు) - మహబూబ్ నగర్ జిల్లాలోని వంగూరు మండలానికి చెందిన గ్రామము

వీటిలో ఎనుముల రేవంత్ రెడ్డి స్వగ్రామము ఏదో తెలుపగలరు.

--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:09, 15 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

రేవంత్ రెడ్డి స్వగ్రామం వంగూరు మండలంలోని కోండారెడ్డిపల్లి గ్రామము. సి. చంద్ర కాంత రావు- చర్చ 04:49, 16 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు చంద్ర కాంత రావు గారు. వాడుకరి:సుల్తాన్ ఖాదర్ వాడి ఉంటే నాకు ఎకో సందేశము వచ్చి ఉండేది. నాకు మీరు ప్రత్యుత్తరం ఇచ్చినట్లు తెలియక పోవడం వలన మీ సమాధానము చూడడం ఆలస్యం అయినది. దయచేసి గమనించగలరు --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:32, 17 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

కొలరావిపు ప్రశంసాపత్రం

కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
చంద్రకాంతరావు గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో విస్తృత నిర్వహణా కృషి, వివిధాంశాలపై విస్తారంగా వ్యాసాలు, మహబూబ్ నగర్ జిల్లా వ్యాసాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.
ప్రశంసా పతకం బహుకరించిన వైజాసత్య గారికి కృతజ్ఞతలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:29, 16 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం

తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం
దశాబ్దాల అణచివేతకు, నయవంచనకు గురై
"ఉస్మానియా", "కాకతీయ" విద్యార్ధుల పోరాటంతో ఉధృతం దాల్చి
భారతీయ జనతా పార్టీ మద్దతుతో బలం చేకూరి
వందలాది ప్రజల ఆత్మత్యాగాలతో ప్రతిఫలించి
దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన
తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం, సుస్వాగతం
- సి.చంద్రకాంతరావు
ఇది నచ్చితే, బొమ్మ రూపంలో ఉన్న వ్యాఖ్య తొలగించగలరు :-) --వైజాసత్య (చర్చ) 00:46, 2 నవంబర్ 2014 (UTC)
వైజాసత్య గారూ, ఇది బాగుంది. మీ కోరికను మన్నించి వ్యాఖ్య ఉన్న బొమ్మను తొలగిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:20, 2 నవంబర్ 2014 (UTC)
బొమ్మ రూపంలో ఉన్న వ్యాఖ్యను తొలగించినందుకు చంద్రకాంతుల వారికి నెనరులు --వైజాసత్య (చర్చ) 06:55, 4 నవంబర్ 2014 (UTC)

వర్గాల గూర్చి

కొన్ని వర్గాలలో "అదిలాబాద్ జిల్లా" అనీ, మరికొన్ని వర్గాలలో "ఆదిలాబాదు" అని ఉన్నది ఏది ఖచ్చితమైనది?-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 16:33, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

రమణ గారూ, ధీర్ఘంతో కూడిన "ఆ"నే సరైనది. ఇక చివర ఉండాల్సిన బాద్, బాదు గురించి చెప్పాలంటే ఆంగ్లంలో బాద్ అనిననూ, తెలుగులో మాత్రం బాదు అనే అనాల్సి ఉంటుంది (ఎందుకంటే అది తెలుగులో ప్రథమా విభక్తి- డు,ము,వు,లు). ఇదే విషయమై దాదాపు ఏడేళ్ళ క్రితం తెవికీలో పెద్దా రాద్ధాంతమే జరిగింది (చూడండి: చర్చ:చంద్రగుప్త మౌర్యుడు) సి. చంద్ర కాంత రావు- చర్చ 16:45, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం

ప్రముఖ దేవాలయాల గోడలపై చిత్రించిన చిత్రాలను ఫోటోలు తీసి మన స్వంత చిత్రాలుగా ఎక్కించవచ్చా? ఏవేని కాపీ హక్కుల సమస్యలుంటాయా? ఉంటే ఆ సమస్య పరిష్కారానికి ఏం చేయవలసిఉంటుంది?---కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 17:40, 1 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సాధారణంగా ప్రకృతిపరంగా లభించిన చిత్రాలకు ఎలాంటి అవరోధం ఉండదు, కాని ఎవరో కృషితో చేసిన చేసిన వాటికైతే సార్వజనీనం చేయడానికి మనం ఆలోచించాల్సి ఉంటుంది. రోడ్డుప్రక్కన అంటించే సినిమా పోస్టర్లకు తీసిన ఫోటోలు కూడా సార్వజనీన బొమ్మల క్రింద అప్లోడ్ చేసే అవకాశం మనకు లేదు. వీధులలో పెట్టే విగ్రహాలకు మనం ఉచిత లైసెన్సు కింద అప్లోడ్ చేస్తున్నాం కాని కేలండర్‌పై ఉన్న బొమ్మలను మాత్రం చేయడానికి వీలులేదు. అయితే దేవాలయంపై ఉన్న బొమ్మలు కొత్తవా? పాతవా? అని చూసి పాత బొమ్మలైతే ఉచిత లైసెన్సుగానూ, కొత్త బొమ్మలైతే సాధ్యమైనంతవరకు ఉచిత లైసెన్సు కాకుండానూ అప్లోడ్ చేయండి. అయితే ఆ బొమ్మలు ఎక్కడి నుంచి తీసుకున్నారో వివరణ మాత్రం తప్పకుండా ఇవ్వండి. అయితే ఈ విషయంలో స్పష్టమైన నియమాలు మాత్రం లేవు. బొమ్మను చూస్తే కాని మరికొన్ని విషయాలు చెప్పలేము. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:57, 1 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు ఆహ్వానం

మీరు రూపుదిద్దుతున్న వ్యాసం వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ‎ పరిధిలోకి వచ్చినందుకు అభినందనలు. మీరు కూడా ప్రాజెక్టు సభ్యునిగా పాల్గొంటే తెవికీని మరింత అభివృద్ధి చేయవచ్చు. మీ పేరు వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్#సభ్యులు లో నమోదు చేసుకోమని ఆహ్వానిస్తున్నాము. అర్జున (చర్చ) 06:32, 6 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జునరావు గారు మీ ఆహ్వానానికి కృతజ్ఞతలు. నేను ఇదివరకే ఒక తెవికీ-ప్రాజెక్టు అభివృద్ధిలో కృషిచేస్తున్నాను. ప్రతి ప్రాజెక్టులో చేరి దేనికి సరైన న్యాయం చేకూర్చకపోవడం కంటే మనకున్న పరిమిత సమయంలో, పరిమిత ప్రాజెక్టుల పరిధిలోనే ఉంటూ ఆ ప్రాజెక్టులకు పూర్తి న్యాయం చేకూర్చడానికి నేను ఇష్టపడతాను. నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు గురించి నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. నేను ఈ ప్రాజెక్టులో చేరిననూ, చేరకపోయిననూ నేను అభివృద్ధి పరిచే వ్యాసాలు నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ప్రాజెక్టు పరిధిలో తప్పకుండా కనిపించేటట్టు చేయడానికి ప్రయత్నిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:31, 6 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఏప్రిల్ 27, 2014 సమావేశం

ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 12:44, 23 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అర్థరాత్రి 12.00 నుంచి తెల్లవారుజామున 04.00 మధ్యలో అయితేనే నాకు వీలవుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:01, 25 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసం మార్పు గూర్చి

తెవికీ లో ఈ వారపు వ్యాసాలలో "తెలంగాణ" వ్యాసాన్ని 2014, 24 వ వారానికి తయారుచేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2 అయినందున ఆ రోజున "తెలంగాణ" వ్యాసం ప్రచురిస్తే బాగుండునని నా అభిప్రాయం. అందువల్ల 24 వ వారం తెలంగాణ వ్యాసాన్ని 23 వ వారానికి , 23 వ వారానికి చెందిన "ఇడ్లీ" వ్యాసాన్ని 24 కు పరస్పరం మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.---- కె.వెంకటరమణ చర్చ 04:58, 19 మే 2014 (UTC)[ప్రత్యుత్తరం]

రమణగారూ, మీ సూచన బాగుంది. జూన్ 2 న రాష్ట్ర అవరతణ కాగానే మార్పులు చేర్పులు, కొత్త ప్రభుత్వం, ప్రమాణస్వీకారాలు తదితరాలు ఉంటాయి, ఇందులోని కొన్ని ముఖ్యాంశాలనూ మొదటిపేజీ ప్రదర్శనలో ఉంటే మంచిదన్న ఉద్దేశ్యంతో ఒక వారం తర్వాత తేది ఇచ్చాను. మొదటిపేజీలో ప్రదర్శించిన అనంతరం మళ్ళీ ఆ సమాచారంలో మార్పులు చేయలేము కదా! అయిననూ మీరన్నట్లు జూన్ 2నే మొదటిపేజీలో ఉంచితే సందర్శకుల దృష్ట్యా మంచిదే. మొదటిపేజీ ప్రదర్శనలో ఉన్నప్పుడు కూడా ఆ సమాచారంలో మార్పులు చేసే వీలుంది కాబట్టి ఒక వారం ముందుకు మార్చిననూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:06, 19 మే 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసాదరాయ కులపతి పేజీ

చంద్రకాంత్ గారూ ప్రసాదరాయ కులపతి (ప్రస్తుతం సిద్ధేశ్వరానందభారతి) గారి పేరు మీద ఉన్న పేజీని 12:30, 13 జూలై 2008 న తొలగించారని తెలుస్తున్నది. కారణం తెలుసుకో గోరుతున్నాను.--స్వరలాసిక (చర్చ) 10:28, 8 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

స్వరలాసిక గారూ, ఇది నిర్వహణలో భాగంగా తొలగించబడిన పేజీ. తొలగించడానికి ముందు ఈ వ్యాసంలో వాడుకరి:Ranganadh చే చేర్చబడిన "ప్రసాద రాయ కులపతి గారు కుర్తాలమ్ పీటాధిపతిగ వున్నారు" అనే ఒకేఒక్క వాక్యం మాత్రమే ఉంది. ఐదురోజుల వరకు వేచి 13/7/2008 నాడు తొలగించబడిన ఈ వ్యాసాన్ని మీరు విస్తరించదలుచుకుంటే నేను కాని మరెవరైనా నిర్వాహకులు కాని మళ్ళీ పునఃస్థాపించగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:51, 8 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా - విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ

నమస్కారం, సభ్యులు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి అందులోని ప్రతిపాదిత వ్యాసాల జాబితాను పరిశీలించండి. అందులో విశేష వ్యాసాలకు కావలసిన లక్షణాలుంటే, వాటిని మీ ఆమోదం తెలుపండి, వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించేందుకు వీలుంటుంది. మీ అభిప్రాయాలు ప్రతిపాదిత వ్యాసాల క్రింద "సభ్యుల అభిప్రాయాలు" శీర్షికలో వ్రాయండి. అలాగే, వ్యాసాలపేర్ల క్రింద మీ అంగీకారం తెలుపుతూ సంతకం చేయండి. మీ అంగీకారం ఓటుగా పరిగణింపబడును. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలతోనే వ్యాసం విశేష వ్యాసంగా ఎన్నుకోబడుతుంది. సభ్యులందరూ తప్పక పాల్గొనవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 19:54, 3 ఆగష్టు 2014 (UTC)

పిట్స్‌బర్గ్ వ్యాసం అనువాదంలో సహాయం

నమస్కారం. ఇంగ్లీషు వికీపీడియానుండి పిట్స్‌బర్గ్ వ్యాసాన్ని తెలుగులోనికి అనువాదం చేయడంలో మీ సహాయాన్ని అర్థిస్తున్నాను. మీకు వీలైనప్పుడు కొంచెం కొంచెం అనువాదం చేస్తూ ఉండండి.--స్వరలాసిక (చర్చ) 23:53, 17 నవంబర్ 2014 (UTC)

నమస్కారమండి స్వరలాసిక గారూ, పిట్స్‌బర్గ్ వ్యాసంలో నేను తప్పకుండా సహకరిస్తాను. వ్యాసాలను సమిష్టిగా అందరు కలిసి అభివృద్ధి చేయాలనుకొనే మీ ప్రయత్నం ప్రశంసనీయం. ఐదారేళ్ళ క్రితం మీరనుకుంటున్నట్టే వ్యాసాలపై అందరం కలిసి పనిచేసి నాణ్యమైన వ్యాసాలను తయారు చేసేవాళ్ళము. నాణ్యతాపరంగా అప్పుడు తెవికీ కూడా బాగా అభివృద్ధి చెందింది. మరోవిషయం ఏమిటంటే కేవలం అనువాదం వల్ల వ్యాసాల నాణ్యత అంతగా బాగుండకపోవచ్చు కాబట్టి ఆంగ్ల వ్యాసాలను మక్కికిమక్కి కాకుండా దాన్ని ఒక నమూనాగానే తీసుకొని మరిన్ని వనరులతో మనదైన పద్దతిలో వ్యాసం రచిస్తే బాగుంటుంది. ఆంగ్లవికీలో ఉన్నట్లుగా మరీ అంత పెద్ద వ్యాసం కూడా కాకుండా ఇక్కడి తెలుగువారిని దృష్టిలో ఉంచుకొని సంక్షిప్తంగా మరియు మధరంగా ఉండేట్టు వ్యాసాన్ని తయారుచేద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:32, 18 నవంబర్ 2014 (UTC)
స్వరలాసిక గారూ, పిట్స్‌బర్గ్ గురించి 2010లో సృష్టించబడిన పిట్స్బర్గ్, పెన్సిల్వేనియా వ్యాసం ఉన్నట్లుగా గమనించాను. ఈ యాంత్రిక అనువాద వ్యాసాన్ని మెరుగుపరిస్తే చాలనుకుంటాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:42, 19 నవంబర్ 2014 (UTC)
ధన్యవాదాలు చంద్రకాంతరావు గారూ! నా వ్యాసాన్ని పిట్స్బర్గ్, పెన్సిల్వేనియా వ్యాసానికి దారి మళ్లిస్తాను. --స్వరలాసిక (చర్చ) 22:31, 19 నవంబర్ 2014 (UTC)

నూతన సంవత్సర శుభాకాంక్షలు

చంద్రకాంతరావు గారూ,
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు 2015 ఆంగ్ల సంవత్సర ప్రారంభ శుభాకాంక్షలు.మీరు మరలా తెవికీలో పునరాగమనం చేసి మీ విశేశ కృషిని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇట్లు,
మీ మిత్రుడు,
--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:57, 2 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారూ, కృతజ్ఞతలు మరియు మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:50, 2 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు

హలో C.Chandra Kanth Rao! గారు, స్త్రీవాదం కు సంబంధించిన కథనాలు నందు మీ సహకారానికి ధన్యవాదాలు. వికిప్రాజెక్ట్ ఫెమినిజం ఒక వికీప్రాజెక్ట్ నందు మీరు కూడా ఒక భాగంగా కావాలని మీకు ఈ ఆహ్వానము ద్వారా ఆహ్వానించుతున్నాము. ఈ వికీప్రాజెక్ట్ ఇక్కడి స్త్రీవాదం వ్యవహరించే వ్యాసాల నాణ్యత మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశ్యం.

మరింత సమాచారం కోసం వికీప్రాజెక్టు/స్త్రీవాదం నందు మీరు పాల్గొనేందుకు కావాలనుకుంటే, దయచేసి సందర్శించండి. "సభ్యులు" కింద మీ పేరు సైన్ అప్ కొరకు సంకోచించకండి. ధన్యవాదాలు!

JVRKPRASAD (చర్చ) 06:46, 12 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియాకు మీ సహాయం కావాలి

చంద్రకాంతరావు గారూ, మీరు వృత్తిరీత్యా చార్టర్డు అకౌంటెంట్ లేదా తత్సంబంధ శాఖలలో పనిచేస్తున్నారని భావిస్తున్నాను. నేను ఇటీవల జరిగిన కార్యక్రమాల నిధులు, ఖర్చుల లెక్కలు సముదాయానికి విన్నవించమని సదరు సభ్యులను రచ్చబండలో అడిగాను. వారు లెక్కలు సమర్పించిన తర్వాత మీరు తమ విషయపరిజ్ఞానంతో అవి పరిశీలించి తెవికీ సహాయపడాలని అభ్యర్ధిస్తున్నాను --వైజాసత్య (చర్చ) 15:27, 15 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్య గారు, నేను చార్టర్డ్ అక్కౌంటెంటుని కాను, కాని అలాంటి విధులనే నిర్వహిస్తున్న ప్రభుత్వ ఆడిటర్‌ని. రాష్ట్ర ఆడిటు శాఖలో సీనియర్ ఆడిటరుగా 20 సంవత్సరాల అనుభవం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోని జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, పురపాలక సంఘాలు, కార్పోరేషన్లు, ప్రభుత్వ నియంత్రణలోని పెద్ద దేవాలయాలు, గ్రంథాలయాలు, మార్కెటింగ్ సంస్థలు, పంచాయతీలు, ఈ-సేవ కేంద్రాలు తదితర సంస్థల ఆడిటును నిర్వహించి జమా-ఖర్చుల లెక్కలను పరిశీలించి అందులో జరిగిన లోటుపాట్లను లేవనెత్తి నివేదిక సమర్పించడం మన విధి. మీరు కోరినట్లు తెవికీ కార్యక్రమాల జమాఖర్చు లెక్కల పరిశీలన బాధ్యతను అప్పగిస్తే నేను సునాయాసంగా వాటిని పరిశీలించి నివేదిక ఇవ్వగలను. అయితే దానికి జమాఖర్చులకు సంబంధించిన లెక్కలు, బిల్లులు మాత్రమే కాకుండా పూర్తి వివరాలు అందజేయాల్సి ఉంటుంది. ఉదా:కు 200 మంది భోజనాలకై ఒక్కొక్కరికి రూ.100/- చొప్పున మొత్తం రూ. 20000/- ఖర్చు అయిందనుకుందాం. దానికి బిల్లు మాత్రమే కాకుండా బిల్లుకు సంబంధించిన అన్ని వివరములు అనగా బిల్లులో పేర్కొన్న 200 మంది ఎవరు? వాటికి ఆధారం ఏమిటి? వారందరి భోజనాలకు అనుమతి ఉందా? ఆ హోటల్ ఎక్కడ? అదే హోటల్ ఎంపిక చేసుకోవడానికి కారణం? ఆ బిల్లు సరైనదేనా? ఆ రేటు ఏ విధంగా అంగీకరించారు? అదే నాణ్యతతో సమీప హోటళ్ళలో రేటు ఎలా ఉంది? బడ్జెటులో భోజనాలకు ఎంత కేటాయించారు? తదితర సమాచారంతో క్షుణ్ణంగా మరియు తార్కికంగా (లాజికల్‌గా) పరిశీలించాల్సి ఉంటుంది. మరి తెవికీ ఖర్చులకు సంబంధించి ఎలా పరిశీలించాలి అనేది నిర్ణయించి నాకు పని అప్పగిస్తే ఆ ప్రకారం పరిశీలన కొనసాగించి నివేదిక తయారుచేస్తాను. ఇది కేవలం ఆన్‌లైన్‌లోనే సాధ్యపడదు, ప్రత్యక్షంగా ఒరిజినల్ బిల్లులు మరియు సంబంధిత పత్రాలు పరిశీలించాల్సివస్తుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:57, 15 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు సహాయం చేయటానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. లెక్కలు అందగానే మీకు అందజేస్తాను --వైజాసత్య (చర్చ) 00:44, 17 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం

ఇటీవల వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం.......విశ్వనాధ్

దీనిని మీ వాడుకరి పేజీలో వీలుగా అమర్చుకోగలరు...--విశ్వనాధ్ (చర్చ) 07:16, 18 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

విశ్వనాధ్ గారూ, పతకం ప్రధానం చేసినందుకు కృతజ్ఞతలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:39, 19 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Translating the interface in your language, we need your help

Hello C.Chandra Kanth Rao, thanks for working on this wiki in your language. We updated the list of priority translations and I write you to let you know. The language used by this wiki (or by you in your preferences) needs about 100 translations or less in the priority list. You're almost done!
అన్ని వికీలలో కనిపించేలా అనువాదాలు చేర్చాలన్నా, మార్చాలన్నా, దయచేసి translatewiki.net ను వాడండి. ఇది మీడియావికీ స్థానికీకరణ ప్రాజెక్టు.

Please register on translatewiki.net if you didn't yet and then help complete priority translations (make sure to select your language in the language selector). With a couple hours' work or less, you can make sure that nearly all visitors see the wiki interface fully translated. Nemo 14:06, 26 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

పాలమూరు జిల్లా క్విజ్ పుస్తకాన్ని ఇటీవలే గత వారం ఆవిష్కరింపజేసినట్టున్నారు కదా.. అందుకోండి నా హృదయపూర్వక అభినందనలు. రాష్ట్రప్రముఖులు, జిల్లానేతల నడుమ వైభవోపేతంగా పుస్తకాన్ని మీరు ఆవిష్కరించడం చాలా సంతోషకరంగా వుంది. మీరు ఇంకెన్నో విలువైన గ్రంథాలను వ్రాసి ప్రచురించి కృషిని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మరో విషయమేంటంటే ఇటీవల ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ అన్న శీర్షికతో డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి గారు రాసిన పరిశోధన గ్రంథం కనిపిస్తే కొనుక్కున్నాను. పుస్తకంలో 1900 నుంచి 1956 వరకూ తెలంగాణ(హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాల) సామాజిక, సాంస్కృతిక, ప్రజాజీవన రంగాల వివరాలు, సామాజిక చరిత్ర వంటివి చాలా కూలకషంగా వ్రాశారు. కొండా వెంకటరంగారెడ్డి, రావి నారాయణరావు, కోదాటి నారాయణరావు, మాడపాటి హనుమంతరావు మొదలుకొని దాశరథి సోదరుల వరకూ పలువురు తెలంగాణ ప్రముఖులు వ్రాసిన ఆత్మకథలే కాక హంపీ నుంచి హరప్పా దాక వంటి ఇతరుల ఆత్మకథల్లోనూ దొరుకుతున్న నాటి తెలంగాణ జనజీవన చిత్రాన్ని స్వీకరించి వ్రాశారు. అద్భుతంగా ఉందంటే నమ్మండి. పుస్తకం తెవికీకి ఎంతగా ఉపయోగపడుతుందో చెప్పలేకున్నాను. నేను వీరిలో చాలామంది ఆత్మకథలు ఇష్టంగా చదవుకున్నవే కానీ వారు ప్రత్యేకించి చారిత్రికాంశాలను పరిశోధనాత్మకంగా వ్రాయడంతో ఇది చదవడం వేరే అనుభూతి. ఈ పుస్తకం ఉపయోగించి తెలంగాణాలోని ఆంధ్ర మహాసభలు, తెలంగాణ మహనీయులు, ఆనాటి తెలంగాణ స్థితిగతులు, జంటనగరాల్లోని ప్రదేశాలు వంటివెన్నో అభివృద్ధి చేయవచ్చును అనిపిస్తోంది.
దీని ధర రూ.150, మీరు వీలుంటే కొని చూస్తారని నా సూచన. లేదూ అంటే కొంత భాగాన్ని మాత్రం మనసు ఫౌండేషన్ వారిచేత నేనే స్కాన్ చేయించి మీలాంటి ఆసక్తిపరులతో పంచుకుందామనుకుంటున్నాను. మీరేమంటారో చెప్పగలరు.--పవన్ సంతోష్ (చర్చ) 13:45, 28 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్గారూ, ముందుగా మీరు నాపై చూపిన అభిమామానికి కృతజ్ఞతలు. మీరు పేర్కొన్న మూర్తిగారి పరిశోధన గ్రంథం నేను చూడలేను. అలాంటి గ్రంథాలు అందుబాటులో ఉంటే నేను తప్పకుండా కొనుక్కోంటాను. కాని ఇక్కడ పాలమూరులో లభ్యంకావడం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:56, 28 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Delete my user page, please

Hi Chandra,

I would like to ask you to delete my user page. Thank you!

Cheers, --Denny (చర్చ) 15:03, 8 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా చర్చ:2015 లక్ష్యాలు - మీ అభిప్రాయాలు

చంద్రకాంతరావు గారూ, నమస్కారములు. మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలు అక్షర సత్యాలు. మీరు చెప్పిన విధానము చాలా బాగున్నది. ఈ సూచనలను మీరు రచ్చబండలో కూడా ఉంచితే అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆలోచించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 19:13, 8 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారూ, నా అభిప్రాయాలు నచ్చినందుకు సంతోషం. దాదాపు ఇలాంటి అభిప్రాయాలే నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు చెప్పిన అభిప్రాయాలకు రచ్చబండలో లింకు ఇచ్చాను కూడా. ఇటీవల అర్జునగారన్నట్టు ఏ చర్చ ఎక్కడ కొనసాగించాలో అక్కడే కొనసాగించడం మంచిది కాబట్టి పూర్తి వ్యాఖ్య పెట్టలేకపోయాను. గత కొన్ని రోజుల పరిస్థితిని పరిశీలిస్తే మళ్ళీ తెవికీకి పూర్వవైభవం వచ్చే సూచనలున్నాయి. అందరం కలిసి మళ్ళీ నాణ్యతకై కృషిచేద్దాం. ధన్యవాదాలతో ... సి. చంద్ర కాంత రావు- చర్చ 19:29, 8 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

C.Chandra Kanth Rao నమస్తే సార్ ధన్యవాదాలు కానీ తెవిపీ నాకు ఇంకా 80% అర్ధం కాలేదు, ప్రయత్నం చేస్తూన్నాను. మీ ప్రోచాహం కొన్ని వ్యాసాలు రాయాలనిపించేలా చేసీంది. ఇంకా రాసేలా ప్రోచాహం బాగుంది. తప్పక రాస్తాను సార్.--నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 09:57, 10 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నోముల ప్రభాకర్ గౌడ్గారూ, ఏం భయపడొద్దు. ఎన్నేండ్లు పనిచేసినా ఈడ మొత్తం సమజ్ అయినోళ్ళు ఎవరు లేరు. రాస్తూ పోతే సమజౌతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:23, 11 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సార్ ధన్యవాదాలు

సార్ ధన్యవాదాలు విజ్ఞానసర్వస్వం బ్లాగులో ప్రచురించేంత పెద్ద వాడిని కాదు, మీ మంచి మనస్సూకు మరోఒక్కమారు ధన్యవాదాలు ప్రోచాహం బాగుంది

నేను ఉహీంచనంత సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. --నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 10:17, 10 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు తెలిసిన ఎవరి సమాచారమైనా నాకు మెయిల్ చేయండి (cckrao2000@yahoo.co.in). నా బ్లాగులో ప్రచురిస్తాను. వెలుగులోకి రాని ప్రముఖులను వెలుగులోకి తేవడమే నా ఉద్దేశ్యం. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:27, 11 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్తదనాన్ని ఆస్వాదించాలి

C.Chandra Kanth Rao గారికి, నమస్కారము. మీరు ఏ పని చేసినా చర్చలు, విమర్శలు ఉండవు. నేను ఏ సలహా చెప్పినా, చర్చ చేసినా, మరేదయినా మన వాడుకరులందరిలో (ముఖ్యంగా తెలిసీ తెలియని మిడిమిడి జ్ఞానముతో మిడిసి పడేవారు) ఒక విధమయిన నా మీద చిన్నచూపుతో ఉంటారు. వీరికి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం, సి.బి.ఐ., ఎ.సి.బి, పోలీస్, ఎక్కడైనా సరే, వివిధ సంస్థలు యొక్క పనులు తీరు ఏవిధంగా ఉంటాయో కనీస ఇంగితము ఉన్నట్లుగా ఉందా అని అనిపిస్తుంది ఒక్కోసారి.

  • మీకు నా మనసులోని కొన్ని విషయములు తెలియజేస్తున్నాను. మీరు అర్థం చేసుకోగలరు.
  1. ఏ విషయము అయినా నేను తెలుసుకోవాలంటే నా పదాలు తీరు వేరుగా ఉంటాయి.
  2. అదే ఏదైనా చర్చ మొదటిసారిగా మొదలు పెట్టినప్పుడు ఒకలా ఉంటాయి.
  3. ఒక చర్చను తిరిగి మరలా మరలా ప్రస్తావిస్తూ ఉంటే ఆ పదాలు మరోలా ఉంటాయి.
  4. ఒక చర్చ ఒకరితో జరుగుతున్నప్పుడు అతిసౌమ్యము, సౌమ్యము, పరుషము, కఠినము, దూషణము...............ఆవిధంగా సాగుతుంది.
  5. ఈ మధ్యన వాడుకరులు దాడి, దండయాత్రలకు మాత్రము వచ్చేందుకు మాత్రము సిద్ధంగా ఉంటారు. (పనికి కాదు). ప్రతి నెలా వాడుకరుల హాజరు చూస్తే గమనించ వచ్చును. చర్చ ప్రధాన అంశం ఏమిటో అస్సలు అర్థము చేసుకోరు. చర్చలోని పదాలను పట్టుకొని దరిద్రపు సలహాలు ఇస్తారు.
  6. ఇప్పుడు పనిచేయని వాడుకరులు వచ్చి, ఆపని ఈపని చేయమని సూచనలు, సలహాలు ఇస్తారు. వీళ్ళు ఏదో ఘనకార్యాలను వెలగబెట్టినట్లుగా లెవల్ చూపించి, పోజులిస్తారు.
  7. నన్ను AWB వాడవద్దని చాలామంది వారిస్తున్నారు. మీలా కొత్తగా చేయాలనుకుంటూ ఉంటాను.
  8. వికీలో పనిచేస్తుంటే ఇదివరకు మనశ్శాంతి ఉండేది. ఇప్పుడు దరిద్రం పట్టింది. ఏ పని చేయాలన్నా ముందు ప్రశాంతత కావాలి.
  9. అందరూ సమానమే పనిలో ఇక్కడ. ఎక్కడయినా అంతే. కానీ వయసుకు, ప్రతి వ్యక్తికి గౌరవ, మర్యాదలు ఉండాలి. పెద్దవయసు వాళ్ళు వివేకంతో చిన్నవాళ్ళని మర్యాదగా చూస్తుంటే, వారు మాత్రం వారికి తోచినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఏ మాత్రము సహించరాని, భరించదగ్గ విషయము కాదు. ప్రపంచములో ప్రతి వ్యక్తికి ఎన్నో వేల కుటుంబాలు తెలిసినవి ఉంటాయి. వారు కూడా మనము వ్రాసేవి చదువుతూ ఉంటారు. ఇది అందరూ గమనించుకోవాలి. (సశేషం) JVRKPRASAD (చర్చ) 11:58, 2 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రసాద్ గారూ, మీరు AWB వాడినందుకు ఎవరూ విమర్శించలేరు. కాకుంటే మీరు చేసిన దిద్దుబాట్లలో కొన్ని లోపాలుంటున్నాయనే విషయాన్ని మాత్రమే సభ్యులు తెలియజేశారు. మనం ఏ పనిచేసిననూ బాగా ఆలోచించి పొరపాట్లు లేనట్టుగా దిద్దుబాట్లు చేస్తూ ఇతరులకు మన పొరపాట్ల గురించి చెప్పే అవకాశం రానట్లుగా చూసుకుంటే సరిపోతుంది. తెవికీ నియమాలను, గత చర్చలను మాత్రమే కాకుండా జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ ఓపికతో, ఆలోచనతో దిద్దుబాట్లు చేస్తే విమర్శలకు ఆస్కారమే ఉండదు. AWB కూడా నేను ఎక్కువగా వాడలేను. కొన్నాళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్→తెలంగాణ మార్పులు చేయగా, నిన్న తెలంగాణ మండల వ్యాసాలలో ఒక విభాగాన్ని మాత్రం జతచేశాను. గ్రామవ్యాసాలలో AWB ద్వారా సమాచారం చేర్చాలనే ఆలోచన ఉన్ననూ సమయాభావం వల్ల చేయలేకపోతున్నాను. AWB ఉపయోగించడానికి ముందు రెండు-మూడు దిద్దుబాట్లు చేసే వాటిని బాగా పరిశీలించి అందులో ఏమైనా పొరపాట్లు ఉంటే సరిచేసుకోవాలి. ఓ 50-60 దిద్దుబాట్లు కాగానే మనం దిద్దుబాట్లు చేసిన పేజీలలో యాధృచ్ఛికంగా కొన్ని పరిశీలించి పొరపాట్లు ఏమీ జరగడం లేదని నిర్థారణ చేసుకున్నపిదపే వేగం పెంచాలి. పొరపాట్లు ఎక్కడ తతెత్తుతాయనే విషయాన్ని కూడా ముందస్తుగా ఊహించగలగాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:30, 2 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
సి. చంద్ర కాంత రావు గారికి, మీరు తెలియజేసినవి గ్రహించాను. AWB ప్రథమముగా వాడినప్పుడు దోషములు రావడం, ఆ తదుపరి సరిచేయడము జరిగినది. ప్రస్తుతము ఇంకా ఆ దోషములు గురించి మాత్రమే చర్చలోకి ఎవరు తీసుకున్న సమంజసము కాదేమో ? AWB మీరు మాత్రమే కాదు చాలామంది వాడుతున్నారు. ఇప్పటికీ నన్ను బాటు ద్వారా వాడమంటున్నారు. అందరికీ ఒకే నియమము ఉండాలి కదా ! నా సమాధానములు, చర్చలు వ్యక్తిగతమయినవి బహు అరుదుగా ఉంటాయి. తప్పులు లేకుండా (పోనీ పొరబాటుగా వచ్చినా, అవి నేనే సరిచేసుకొనే విధంగా) నన్ను AWB వాడమంటారా ? లేదా ? ఈ విషయము ఎవరూ తేల్చడము లేదు. నా ఒక్కడికే ఈ నియంత్రణ విధించారు. AWB వాడే వాళ్ళందరూ బాటు పద్దతిలో వాడితే నేను అదే పనిచేస్తాను. మనిషి మనిషికి ఒక పద్ధతి ఈ మధ్యన అలవాటుగా మార్చుకున్నారు. కొంతమంది చెప్పేదే ఆచరించాలి, అనుసరించాలి. దయచేసి కొత్త మస్థిష్కాలు గురించి గమనించండి. JVRKPRASAD (చర్చ) 02:07, 3 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రసాద్ గారూ, ఇటువచ్చాను, ఈ చర్చ కనిపించింది కాబట్టి వ్రాస్తున్నాను. AWB తరచుగా వాడితే బాటుతోనే వాడాలన్నది మీకే కాదు అందరికీనూ, :చంద్రకాంతరావు గారూ మీరూ బాటు ఖాతా తీసుకుంటే బాగుంటుంది --వైజాసత్య (చర్చ) 03:34, 7 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారు, AWB వాడేవాళ్ళు ఇంకా ఉన్నారు. మీ దృష్టికి వాళ్ళేవరూ ఇంకా రాకపోవడము ఏమిటి ? వాళ్ళందరికీ కూడా చెబితే బావుంటుంది. ఏ ఒక్కళ్ళు కూడా వాడే వాళ్ళకి ఏ సందర్భములో నయినా వాడవద్దు అని సలహాలు ఇచ్చిన దాఖాలాలు ఎందుకని లేవు ? ఎవరయినా చెప్పగలరా ? మరి నీతి గురించి కాదు కాని నియమాలు ఏవి ? అందుకే ఒక పాలసీ విషయంగా చేయండి. JVRKPRASAD (చర్చ) 05:14, 7 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రసాద్ గారూ, మరికొందరు వాడినట్టు గమనించాను. కానీ మీరు కాస్త విరివిగా వాడుతున్నారని మీకు ముందుగా చెప్పాను. AWB శిక్షణ మెదలుపెట్టింది అందరూ చిన్నచిన్నయాంత్రిక దిద్దుబాట్లు చేయటానికి అవకాశం కల్పించడానికే, కానీ కాస్త పట్టు సాధించిన తర్వాత బాటు ఖాతా తీసుకోవటం మంచింది. ఇది తెవికీలో ఏ పాలసీలో లేదు, నేను నాకున్న పరిజ్ఞాణం, అవగాహనతో చెబుతున్నదే. నా మాట వినాలని ఎక్కడా వ్రాసిలేదు. ఇక మీ ఇష్టం. మరో విషయం, పాలసీలు ఎక్కడో పైనుండి రావండి. ఫలానా విషయంపై పాలసీ ఉండాలని అనుకుంటే మీరే ఒక పాలసీని తయారుచేసి, సముదాయంలో చర్చించి, వాటికి మద్దతు కూడగట్టుకోవచ్చు. నేను అందుకు తగిన సహాయం చేయగలను. ఇదిగో ఈ పాలసీ చదవండి en:Wikipedia:Bot_policy#Assisted_editing_guidelines --వైజాసత్య (చర్చ) 14:15, 7 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సముదాయేతర సంస్థలు

చంద్రకాంతరావు గారూ, తెలుగు వికీలో సముదాయేతర సంస్థల యొక్క కార్యకలాపాలను నియత్రించేందుకు వికీపీడియా:సముదాయేతర సంస్థలు పేజీలో ప్రతిపాదనలు చేశాను. వాటిని పరిశీలించి, చర్చా పేజీలో మీ అభిప్రాయాలు తెలియజేయగలరు --వైజాసత్య (చర్చ) 06:00, 3 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కతిన చర్యలు

నెను పెత్తిన ఇన్ ఫర్ మెషన్ ను దిలిత్ చెసిరు.వారిపయి కతిన చర్యల్కు తిసుకొనును / / మి అనంద్

ఇక్కడి పరిస్థితిని పరిశీలించి, విశ్లేషించి, గమనించి నా అభిప్రాయాలు ప్రకటించడానికి కొద్దిగా సమయం పట్టవచ్చు. అంతవరకు మీరు టైపింగ్ ప్రాక్టీస్ చేయండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:26, 19 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మీ అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్న -వికీపీడియాలో మన తోడ్పాటు ఎందుకు ? - వికీ ప్రముఖుల అభిప్రాయాలు - లో వ్రాయగలరు..--Viswanadh (చర్చ) 12:41, 28 ఆగష్టు 2016 (UTC)

విశ్వనాథ్ గారూ, మీరు కోరినట్లు నా చిన్న అభిప్రాయాన్ని చేర్చాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:30, 30 ఆగష్టు 2016 (UTC)

త్రైత సిద్ధాంతము

నమస్కారము. ఇంతకు ముందు నేను పెట్టిన మెసేజ్ [2] నకు మీ అభిప్రాయము కోరుతున్నాను. --ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 13:21, 27 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహణ ప్రక్రియకు అడ్డంకి

నేను కూడా ఆ సభ్యుడి దిద్దుబాట్లను గమనించాను. కాని చర్చతీసి ప్రక్రియ ప్రారంభించిననూ పవన్ లాంటి వారు అడ్డగిస్తారని నాకు తెలుసు. కాబట్టి చూస్తూ ఊరుకోవడమే తప్ప చేసేదేమీలేదు. రెండేళ్ళ క్రితపు అనుభవం దృష్ట్యా నిర్వాహణ కార్యక్రమాలు నా నుంచి పూర్తిగా ఆగిపోయాయి. ఇలాంటి దిద్దుబాట్లను ఆపడానికి తప్పకుండా ప్రయత్నించాలి. లేదంటే హెచ్చరిక జారీచేసి ఖాతరు చేయనప్పుడు సదరు సభ్యుడిపై నిరోధం విధించాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 05:03, 25 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:C.Chandra Kanth Rao గారు, మళ్ళీ నన్ను అదే చర్చలోకి లాగారు. నేను గతంలో నిషేధాన్ని ఎత్తివేయమని గుళ్ళపల్లి గారు చేసుకున్న అభ్యర్థనను సమర్థించాను. నాలాగే మరో ఇద్దరు వికీపీడయన్లు కూడా సమర్థించారు. అదంతా ఇక్కడ ఛూడవచ్చు. నిరోధం_తొలగింపు_అభ్యర్థన అన్న ఉపవిభాగాన్ని మన నిరోధ విధానాన్ని ఏ ఆంగ్ల వికీలోనైతే తెచ్చి అనువదించుకున్నామో అక్కడి నుంచే అనువదించాను. దాని ఆధారంగా నేను ఇదే పేజీలో తోటి సభ్యుల ముందు అభ్యర్థన పెట్టాను. ఆయనొక పద్ధతి అవలంబించారు, నేనూ పద్ధతే అవలంబించాను. ఇదలా ఉండగా పైన "నిరోధం_తొలగించ_వలెనని_విజ్నప్తి" అన్నదగ్గర "శిక్షణ ఇవ్వడంలో తప్పేమీ లేదు. అది వికీకి ఎంతో అవసరం, శిక్షణా కార్యక్రమాన్ని చర్చలు, ఒప్పందాలూ అంటూ మాట్టాడ్డం ఆయన తీసుకున్న శ్రద్ధను, శ్రమనూ కించపరచినట్లు అవుతుంది." అని వాడుకరి:Chaduvari పేర్కొన్న విషయం ఇక్కడ అసందర్భం కాదనుకుంటాను. నేను వాడుకరి:Nrgullapalli గారికి శిక్షణనిచ్చి, ఆయన సరిగా పనిచేస్తారని ఆశించి, నిషేధం తొలగించమని చంద్రకాంతరావు గారిని అభ్యర్థించడం, ఆయన తిరస్కరిస్తే సముదాయాన్ని కోరడం అన్న ప్రాసెస్లో ఏ తప్పూ లేదు. ఆ ప్రాసెస్ మొత్తం విఫలం అయినంతమాత్రానా ప్రాసెస్ తప్పు కాదు. సముదాయ సభ్యునిగా నేనొక సదుద్దేశంతో చేసిన పనిని ఇన్నిసార్లు "అడ్డంకి" అడ్డంకి అంటూ ప్రస్తావించడం సముచితం కాదని నేను భావిస్తున్నాను. పైగా నేను ఇంకా వ్యాఖ్యానించని చర్చలో నన్ను ప్రస్తావిస్తూ "కాని చర్చతీసి ప్రక్రియ ప్రారంభించిననూ పవన్ లాంటి వారు అడ్డగిస్తారని నాకు తెలుసు." అనడం నన్ను అగౌరవించడం, ముందే నా అభిప్రాయ ప్రకటనకు అడ్డుకట్ట వేయడమని నమ్ముతున్నాను. ఇది ఏ మాత్రం వికీ స్ఫూర్తి కాదు. కానేరదు. ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాను - నిరోధం తొలగింపు అన్నది ఒకటి వికీపీడియా ప్రపంచంలో ఉండగా అందుకు అభ్యర్థించడం, సముదాయాన్ని దానిని పున:పరిశీలించమని కోరడం ఏ విధంగా అడ్డంకి అవుతుంది? --పవన్ సంతోష్ (చర్చ) 18:19, 25 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ఇతర నిర్వాహకులు, అధికారులు ఈ అంశాన్ని కాస్త పరిశీలించాలి. ఒక నిర్వాహకుడు పద్ధతి ప్రకారం పోయి నిర్ణయం తీసుకున్నాకా, ఆ నిర్ణయాన్ని చర్చించకుండా రివర్ట్ చేస్తే నిర్వహణా పనులకు అడ్డంకి అవుతుంది. మరో చర్చ ప్రారంభించి, ఫలానా కారణాల వల్ల ఈ నిర్ణయాన్ని పున:పరిశీలించుకొమ్మని విజ్నప్తి చేయడం, తర్వాత సముదాయానికి నివేదించి అభిప్రాయాలు కోరడం చేయకూడదా? అంటే వికీపీడియాలో ఒకరు నిర్ణయం తీసుకున్నాకా దాన్ని ప్రశ్నించడం కాదు సరికదా పున:పరిశీలించమని కోరకూడదా? నిరోధం_తొలగింపు_అభ్యర్థన అనే పద్ధతి అనుసరించి నేను చేసిన పని అసలు వికీపీడియా నియమ నిబంధనలే పాటించనట్టు వ్యాఖ్యలు చేయడం సబబేనా? దయచేసి అందరూ పరిశీలించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 18:31, 25 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అభ్యర్థనను సమర్థించాను మరో ఇద్దరు కూడా సమర్థించారు → ఈ విషయంలో నేనేమీ అభ్యంతరం చెప్పడం లేదు, మీ అభిప్రాయానికి మద్దతిచ్చిన సభ్యులకూ నేనేమీ చెప్పడం లేదు వారికి ఆ హక్కు ఉంది.
శిక్షణ ఇవ్వడంలో తప్పేమీ లేదు → తప్పని నేను చెప్పలేదు కదా ! సభ్యుడు ఎంత నేర్చుకున్నాడన్నది సముదాయం చూడాలి మరి.
ఆయన సరిగా పనిచేస్తారని ఆశించి, నిషేధం తొలగించమని అభ్యర్థించడం ... → ఆశించడం కాకుండా ఆయన ఎంతవరకు అర్థం చేసుకున్నది తెలుసుకోవాల్సింది. అలాగే నిషేధం తొలగించమని అభ్యర్థించడాన్ని నేను తప్పు పట్టడం లేదు. అభ్యర్థించడానికి ప్రతి ఒకరికీ హక్కు ఉంది
అభ్యర్థించడం, సముదాయాన్ని దానిని పున:పరిశీలించమని కోరడం ఏ విధంగా అడ్డంకి అవుతుంది? → అభ్యర్థించడానికి, పునఃపరిశీలన చేయడమని కోరడాన్ని నేను తప్పు పట్టడం లేదు. దీనికి అడ్డంకి అని కూడా చెప్పడం లేదు. అంతవరకే ఓకే. ఇదేవిషయాన్ని ఇదివరకు స్పష్టాతిస్పష్టంగా వివరించాను. అభ్యర్థనను నేను తిరస్కరించిన తర్వాత కూడా జరుగుతున్న ప్రక్రియకు (ఈ ప్రక్రియ ఏకపక్షంగా ఏమీ జరగలేదు, చర్చలలో పలువులు నిర్వాహకులు కూడా పాల్గొన్నారు) పూర్తి భిన్నంగా మరో చర్చను ప్రారంభించడం అడ్డుకాదా! దీనికి సభ్యులెవరూ స్పందించలేదు కాబట్టి సరిపోయింది. లేకుంటే అప్పుడే తెవికీలో పెద్ద గందరగోళం తలెత్తేది. దీనికి సభ్యులు కూడా అర్థం చేసుకున్నారు. మీరు మాత్రం ఎంతచెప్పిననూ మీదే సరైనది అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఒక నిర్వాహకుడు సుధీర్ఘచర్చలు, హెచ్చరికలు పంపి సదరు సభ్యుడికి అవకాశాలు ఇచ్చి ప్రక్రియ ప్రకారం తీసుకున్న నిర్వాహణ కార్యక్రమానికి భిన్నంగా మరో చర్చ ఎందుకు తీశారు? (ఇదే అడ్డంకి) రెండు రోజుల్లో ముగిసే నిరోధానికి వారం పాటు కొనసాగే చర్చ అవసరమా?
రివర్ట్ చేస్తే నిర్వహణా పనులకు అడ్డంకి అవుతుంది మరో చర్చ ప్రారంభించి, ... పున:పరిశీలించుకొమ్మని విజ్నప్తి చేయడం, ... చేయకూడదా?→ రివర్ట్ చేస్తే నిర్వాహక హోదాను దుర్వినియోగం చేసినట్లే అలాంటప్పుడు ఆ నిర్వాహకుని పైనే చర్యలు తీసుకోవచ్చు. కాని మీరు రివర్ట్ చేశారనీ, నిర్వాహక హక్కులు దుర్వినియోగం చేశారనీ నేనెప్పుడు చెప్పలేను. పునఃపరిశీలనకు విజ్ఞప్తిపై కూడా నేనేమీ అభ్యంతరపర్చలేను. నిర్వాహక ప్రక్రియకు భిన్నంగా మరో చర్చ తీయడం జరుగుతున్న ప్రక్రియకు అడ్డుకాదా! ఇలాగైతే ఏ నిర్వాహకుడు కూడా ఏ నిర్వహణపని చేయజాలడు. అలాంటప్పుడు ప్రక్రియలెందుకు. చర్చ జరుగుతున్న సమయంలో లేదా ప్రక్రియ ప్రారంభం కాకముందే మీ అభిప్రాయాలు చెప్పాల్సింది. కాని అలా జరగలేదు. ఈ విషయంపై ఇతర సభ్యుల స్పందనలు కోరారు కదా వారి అభిప్రాయాలు కూడా చూద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:41, 26 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అయితే గత చర్చల్లో మీ అభిప్రాయాలు విడిచిపెట్టి, ప్రస్తుతం మీరు రాసినదాన్ని బట్టి చూస్తే: 1. నేను శిక్షణనివ్వడం మీద అభ్యంతరం లేదు, 2. నిషేధం తొలగించమని అభ్యంర్థించడంపై అభ్యంతరం లేదు 3. మద్దతిచ్చిన సభ్యుల అభిప్రాయాల వెల్లడి విషయంలోనూ అభ్యంతరం లేదు. ఈ విషయం మీరిప్పుడు స్పష్టాతి స్పష్టంగా వివరించాకా మీకు, నాకు ఈ విషయంలో భిన్నాభిప్రాయం ఏమీ లేదని అర్థమవుతోంది. అయితే ప్రస్తుతానికి మీకున్న అభ్యంతరమల్లా మీరు నా అభ్యర్థనను తిరస్కరించాకా, (ఈ అభ్యర్థనపై చర్చలో మీరన్నట్టే నిర్వాహకులు పాల్గొన్నారు. ఆ ముక్క నాకూ గుర్తుంది. పాల్గొన్న ఇద్దరూ మీ తిరస్కరణను సమర్థించలేదనుకోండి, అది వేరే సంగతి. పెద్దగా ఈ చర్చకు ఉపకరించదు.) నిర్ణయాన్ని పున:సమీక్షించమని సముదాయాన్ని కోరుతూ నిరోధం_తొలగింపు_అభ్యర్థన అన్న పాలసీని అనుసరించి చేసిన అభ్యర్థన పైనే. ఇదే గనుక మీ అభిప్రాయం అయితే మీకున్న సమస్య నాతోనో, మరో వ్యక్తితోనో కాదు - ఆంగ్లం నుంచి అనువదితమై తెలుగులో ఉన్న నిరోధం తొలగింపు అభ్యర్థన అన్న విధాన విభాగం మీద. కాబట్టి మీరు ఆ విధాన చర్చ పేజీలో అది ఎలా అనుసరణీయం కాదో వివరించి, "నిర్వాహకుడు ఒక నిర్ణయం తీసుకున్నాకా దాన్ని సడలించమని అభ్యర్థించినప్పుడు అతను తిరస్కరిస్తే ఆ నిర్ణయాన్ని పున:సమీక్షించమని సముదాయాన్ని కోరే హక్కు మరెవరికీ ఉండబోదని, అలా కోరడాన్ని అడ్డంకిగా భావించాల్సివుంటుందనీ" సముదాయాన్ని ఏకాభిప్రాయానికి తీసుకురండి. అంతటితో సమస్య మూలచ్ఛేదమైపోతుంది. ఆ విధంగా సమస్యను పరిష్కరించి పారేస్తే పోతుంది. అంతేకానీ మీరు నన్ను, నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించుకుంటూ కూర్చోవడం అనవసరం. --పవన్ సంతోష్ (చర్చ) 17:14, 26 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
మొదటినుంచి నా అభిప్రాయం స్పష్టంగానే ఉంది. అసలు నేను దేనికి "అడ్డింకి" అని చెబుతున్నానో ఇప్పటికీ మీకు పూర్తిగా అర్థం కానట్లుంది. మీరంటున్న పాలసీలో ఆ విభాగం అసలు చర్చాసమయంలో కాని సభ్యుడిని మూడో నిరోధించే సమయంలో కాని ఉందేమో ఒకసారి చూడండి. సభ్యుడిని మూడోసారి నిరోధించిన సమయంలో కూడా లేని పేరాను ఇప్పుడు నాకు చూపిస్తున్నారు. దానికి సముదాయం మద్దతు కూడాలేదు. సరే అవన్నీ ఉన్నాయనుకున్ననూ సభ్యుడిపై విధించింది శాశ్వత నిరోధమూ కాదు. 2 రోజుల్లో ముగిసే తాత్కాలిక నిరోధానికి వారం రోజులపాటు జరిగే చర్చ ఎందుకన్నది నేను మొదటినుంచీ వాదిస్తున్నాను. మీ అభ్యర్థనను తిరస్కరించాక కూడా మరో రెండు రోజులు ఆగే ఓపిక లేక ప్రక్రియకు భిన్నంగా చర్చ ఎందుకు తీశారన్నది నా ప్రశ్న. ఇది అడ్డంకి కాక మరేమిటి? మీరు పెద్ద పొరపాటు చేశారనీ, నియమాలు ఉల్లంఘించారనీ నేను చెప్పడం లేదు కాని ఒక పద్దతి ప్రకారం నడిచిన ప్రక్రియకు ఎందుకు అడ్డుగా ప్రవర్తించారన్నదే నా ప్రశ్న? ఆ సభ్యుడు ఎంత నేర్చుకున్నాడన్నది సముదాయం చూడాలి. ఒకవేళ పొరపాట్లు చేయనప్పుడు తదుపరి నిరోధం ఎలాగూ ఉండదు. ఇంతదానికే అడ్డుగా ఎందుకొచ్చారు? మీరు నైతికంగా ఆలోచించి చూడండి. మీ ప్రక్రియకే ఎవరైనా అడ్డుగా వస్తే మీకెలా అనిపిస్తుంది? ఆ సభ్యుడు తెవికీ నాణ్యతను ఎంతగా దెబ్బతీశాడో ఆయన దిద్దుబాట్లు పరిశీలించే ప్రతి ఒక్కరికీ తెలుసు. మీరు తప్ప దాదాపు నియమాలు తెల్సిన నిర్వాహకులందరూ ఆయనకు నీతిబోధ చేసినవారే (అవసరమైతే ఆయన చర్చాపేజీ చూడండి). ఎంతచెప్పిననూ ఎవరు చెప్పిననూ వినక వ్యాస నాణ్యతను పూర్తిగా దెబ్బతీశాడు. ఆయన చేసిన పొరపాట్లు సరిదిద్దడానికి నలుగురు నిర్వాహకులు కూడా సరిపోరంటే వినండి. ఇలాంటి సభ్యులకు మద్దతిచ్చే ముందు నైతికంగా ఆలోచించాలి. కేవలం దిద్దుబాట్ల కోసం తెవికీ నాణ్యతను నాశనం చేస్తే ఇన్నేళ్ళు అహరహం కృషిచేసిన సభ్యులకు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. దీన్ని ఆలోచించడానికి పెద్దగా నియమాలు కూడా అవసరం లేదు. నేను పాలసీపైన మాట్లాడటం లేదు ప్రక్రియ సమయంలో ఉన్న పద్దతిప్రకారం నైతికంగా ఆలోచించి చేసినది అడ్డండినా కాదా అని ఆలోచించండి. ఇంతకు మించి వివరించడానికి నాకు సాధ్యం కాదేమో! సి. చంద్ర కాంత రావు- చర్చ 19:06, 26 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
"మీరు పెద్ద పొరపాటు చేశారనీ, నియమాలు ఉల్లంఘించారనీ నేను చెప్పడం" సరేనండీ. మీ ప్రక్రియకు నా ప్రక్రియ అడ్డుకావడం చాలా మెటా-స్థాయి చర్చ. ప్రక్రియాపరమైన చర్చ ఇక విడిచిపెట్టేస్తున్నాను. సభ్యుడు అప్పటివరకూ అందరూ హెచ్చరికలే చేశారనీ, ప్రాక్టికల్గా ఎవరూ నేర్పించలేదనీ, ఇప్పుడు నేర్పించినందున సరిదిద్దుకున్నాననీ చెప్పిన మాటల్లో సైద్ధాంతికంగా బలం నాకు కనిపించబట్టే మద్దతునిచ్చాను. ఇది ఆ ప్రక్రియ అవలంబించేముందు నైతికంగా నాకున్న ఆలోచన. ఒక్కమారు మీరలా సడలించి ఏమీ నేర్చుకోలేదని (నేర్చుకున్న దాఖలా లేదని ఈరోజు మనకి రెట్రోస్పెక్టివ్ గా తెలుసు) గ్రహించేందుకు వీలిచ్చి, తర్వాతి వారమే శాశ్వత నిషేధమే విధించినా ఆ ప్రక్రియలో నేనూ మీకు సహకరించేవాడినే. అంతేగానీ అడ్డంకి అయ్యేవాడిని కాను. కానీ చర్చ ఆ దారిలో పోలేదు. మనం ఈ అంశంపై ఒకే అభిప్రాయానికి రానక్కరలేదు. మీరు చెప్తున్న వాదన నాకు, నేను చేసిన పని వెనుక ఉద్దేశం మీకు అర్థమైతే చాలు. నాకు అర్థమైంది. మీకు అర్థమవుతుందని నమ్ముతూ నా వైపు నుంచి ఇక ముగిస్తున్నాను. స్వస్తి. --పవన్ సంతోష్ (చర్చ) 04:47, 27 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చురుకైన ప్రాజెక్టు సమన్వయకర్త

చురుకైన ప్రాజెక్టు సమన్వయకారులు
వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణ ప్రాజెక్టు సమన్వయానికి అభివందనాలు.-- అర్జున (చర్చ) 05:21, 3 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునరావు గారూ నేను ఒకప్పుడు తెలంగాణ ప్రాజెక్టు సమన్వయకర్తగా వ్యవహరించాను కాని చాలా కాలం నుంచి తెవికీలో చురుకుగా లేను. అయిననూ నా గత కృషిని గుర్తించినందుకు కృతజ్ఞతలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:55, 5 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

హీరాలాల్ గైక్వాడ్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన

హీరాలాల్ గైక్వాడ్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2007 డిశెంబరులో సృష్టించబడింది.అప్పటినుండి ఇది మొలకగానే ఉంది.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/హీరాలాల్ గైక్వాడ్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 07:53, 9 మే 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 07:53, 9 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

జాన్ రిచర్డ్ హిక్స్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన

జాన్ రిచర్డ్ హిక్స్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

2007 నుండి మొలక. ఎటువంటి మూలాలు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేము.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/జాన్ రిచర్డ్ హిక్స్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. కె.వెంకటరమణ (చర్చ) 09:39, 10 మే 2020 (UTC) కె.వెంకటరమణ (చర్చ) 09:39, 10 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

దస్త్రం:Mahabubnagar Bus Station.jpg పేజీని వికీపీడియా నుండి సత్వరమే తొలగించాలని దానిలో ఒక ట్యాగు పెట్టారు. కింది కారణం వల్ల ఆ ప్రతిపాదన చేసారు:

moved to commons

సత్వర తొలగింపు ప్రమాణాల ప్రకారం, వికీపీడియా ప్రమాణాలకు అనుగుణంగా లేని వ్యాసాలను ఏ క్షణంలోనైనా తొలగించవచ్చు.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు. Baddu676 (చర్చ) 09:12, 25 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]


సరైన నిర్ణయం తీసుకోండి

రచ్చబండలో చదువరిపై అధికార, నిర్వాహక హోదాల నిరోధంపై సరైన నిర్ణయం తీసుకొని తెవికీ అభివృద్ధికై తోడ్పడండి. వికీపీడియా:రచ్చబండ#చదువరిపై అధికార, నిర్వాహక హోదాలపై నిరోధం ప్రతిపాదన / / అజయ్ కుమార్ / / తెలుగు భాషాభిమాని.


ప్రముఖ వికీపీడియన్ గా మంచి నిర్ణయం తీసుకున్నారు. గ్రేట్ సర్. అజయ్ కుమార్.

దుర్భాషలు ఆడుతున్నందుకు ఒకరోజు నిరోధం

C.Chandra Kanth Rao గారూ, సముదాయ సభ్యులిద్దరిని "రాక్షసులు" అని తిట్టడం, సముదాయ సభ్యులపై వ్యక్తిగత ఆరోపణలతో తీవ్రమైన దాడి చేస్తున్న కారణంగా మీపై ఒకరోజు నిరోధం విధించాను. ఇకనైనా వ్యక్తిగత దాడి చేయడం, దుర్భాషలాడడం, నిరాధారమైన నిందలు వేయడాన్ని మానుకొమ్మని హెచ్చరించడమైనది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 17:15, 22 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]


ఒరేయ్ చదువరి, దొంగదెబ్బ తీశావ్ కదరా! తెవికీ రాక్షసులు చదువరి మరియు పవన్ లు అన్నది తెలుగు భాషాభిమానులైన మనమే కాని తెవికీ త్రిమూర్తులలో ఒకరైన సుప్రసిద్ధ వికీపీడియన్ చంద్రకాంతరావు కాదురా. మేము చెప్పింది ఆయన రాశారంతే. //అజయ్ కుమార్ నోముల//

Prannay nuvvu kuda donga vedhava

మీపై నిరవధిక నిరోధం

చంద్రకాంతరావు గారూ, వికీపీడియా:నిర్వాహకుల నోటీసుబోర్డు లో మీకు తుది హెచ్చరిక చేసాక కూడా, మీ పద్ధతి మార్చుకోనందున మీపై నిరవధిక నిరోధం విధించాను. అయితే ఈ వాడుకరి చర్చ పేజీని మాత్రం నిరోధంలో చేర్చలేదు. మీ నిరోధంపై మీరు చెప్పదలచినది ఇక్కడ రాయవచ్చు. మీ నిరోధానికి కారణమైన వ్యక్తిగత దాడులు, వేధింపులు మొదలైనవాటికి కొనసాగింపుగా దీన్ని వాడవద్దని కోరుతున్నాను. వికీపీడియా:వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష పద్ధతి ప్రకారం మీ నిరోధంపై సమీక్షను కోరవచ్చు. __ చదువరి (చర్చరచనలు) 02:58, 26 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరీ, నిన్ననే నేను చెప్పాను నిరోధాలంటే నాకు అస్సలు గిట్టవనీ. అందులొనూ ఏకపక్షంగా నిరవధికంగా నిరోధమా? ఒకరోజు తర్వాత శాశ్వత నిరోధం చెల్లదు. దానికిచ్చిన కారణం కూడా చాలా తేలికైనది. ఏకవచన సంబోధానికి శాశ్వత నిరోధమా? (నిరోధం ఎలాగూ విధించబడింది కాబట్టి ఏకవచనం కంటిన్యూ చేయడం సరైనదే!) ఏకవచన సంబోధన అనేది తెలంగాణ గ్రామీణ సంస్కృతికి ప్రతీక. ఈ విధంగా తెలంగాణ సంస్కృతిని నిర్లక్ష్యపర్చడమే కాకుండా ఏదో ఒక అవకాశం లభించించనీ నిరోధం విధించినట్టే అయిందనీ, బలమైన క్రారణం ఏమీ లేదనీ తెలుగు భాషాభిమానులు మండిపడుతున్నారు. ఇలాంటి తలతిక్క నిర్వాహక పనులకుగాను తక్షణమే సదరు నిర్వాహౌకుడు నిర్వాహక పదవికి రాజీనామా చేసి తీరవసిందేననీ డిమాండ్ చేస్తున్నారు. తెలులు వికీపీడియాలో ఆంధ్రావాళ్ళు తెల్ంగాణ నిర్వాహకులపై, చురుకైన సభ్యులపై దాడులకు పాల్బడుట, వేధింపులకు గురిచేయుట సర్వసాధారణమైపోయిందని వాపోతున్నారు. తెవికీలోనే అత్యంత నాణ్యమైన వ్యాసంగా తెలంగాణ వ్యాసాన్ని నేను రచించే దశలోనే ఎదురైన ప్రతిఘటన ఆ త్రర్వాత పలుసార్లు ఆంధ్రోళ్ళ నుంచి వేధింపులకు గురికావాల్సి వచ్చింది. మండల వ్యాసాలలో చేర్చిన సకలజనుల సమ్మె విభాగం గురించి నానాయాగీ చేసి చివరికి చదువరి, పవన్, యర్రాలు తెలంగాణ ద్రోహులుగా తోక ముడువాల్సి రావడం జరిగిన పరిణామమే! ఈ విషయంలో కూడా ఇక ఇంతే కావచ్చు, బయటి వ్యతులుజ్యోక్యం చేసుకుంటే మాత్రం రచ్చరచ్చ కావడం ఖాయ. దీనికి ఆంధ్రా నిర్వాహకుఏ పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:08, 26 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నిరోధంపై సమీక్ష కోరచ్చని అంటున్నారు. నేను తెవికీ బిచ్చగాణ్ణి కాన్. ఎవరినీ కోరే అక్కర్లేదు. తెవికీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నిరోధం విధించిన వారికే హెచ్చరిక ఇస్తున్నాను. నాపై శాశ్వత నిరోధం తొలగిస్తారా లేదనీ! ఆ తర్వాత పర్యవసానాలు తీవ్రంగ్ ఉండవచ్చు. ఇది భయపెట్టించడం కానేకాదు. ఒక పద్దతి ప్రకారమే, ఒక ప్రణాళిక ప్రకారమే, సమయానుసారం ముందుకు వెళతాను. ఒక సభనామం పోతే మరో సభ్యనామం సిద్ధంగా ఉంటుంది. అది సాక్ పప్పెట్ కూడా కాదు. అప్పుడు నన్నెవరూ ఆపలేరు. తెవికీ మొత్తం దద్దరిల్లదం ఖాయం. ప్రస్తుత తెవికీలో ఎవరికీ లేనంత పమిచేసిన అనుభవం నాకుంది. అసలు నాకు తెవికీలో పనిచెసే అవసరమే లేదనీ భాషాభిమానులు సలహాలిస్తున్నారు. తెవికీకి పోటీగా, దీటుగా విజ్ఞన స్వస్వాన్ని ర్రూపొందించగల స్థోమత తెలుగు రాష్ట్రాలలో నాకు ఒక్కడికే ఉందనీ, అలాంటప్పుడు చచ్చిపోయిన తెవికిలోరచనలు చేసి సమయం వృధా చేసుకోవదం కంటే తెవికీలో ఉన్న ప్రధాన వ్యాసాలన్నింటినీ కాపీ చేసుకొని నాణ్యత మెరుగుపర్చి, తాజాకరణ చేస్తే తెలుగు పాఠకులకు వికిపిడియా అవసరమే లేదనీ, సిసికెరావు పీడియా బ్లాగు లేదా సైటు సరిపోతుందనీ, మంచి అవకాశాన్ని వదుకోవద్దబి విన్నవిస్తున్నారు. ఈ విషయంలో కోరిన సహకారం అందించడానికిభాషాభిమానులు సిద్ధమైనారు. సముద్రంలో మునుగుతున్న తెవికీనౌకలో నుంచి త్వరగా బయటపడి తెవికీలో ఉన్న కొద్దిపాటి మంచి వ్యాసాలు కాపీ చేస్కోమని అంటున్నారు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:20, 26 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరీ, కొందరు అజ్ఞాత సభ్యులు తమ చర్చా పేజీలలో నాకు మద్దతుగా రాసిన సమాచారాన్ని పూర్తి ఎత్తివేస్తూ చర్చా పేజీలనే తొలగించారు. సభ్యుల చర్చాపేజీలను తొలగించే అధికారం ఎవరిచ్చారు? ఒకరికి నచ్చనతమాత్రానా చర్చాపేజీలను తొలగించే అవసరం ఇతరులకు లేదనీ నిర్వాహకుడిగా, అధికారిగా ఉన్న సభ్యుడికి చెప్పాలా? అధికార మరియు నిర్వాహక దుర్వినియోగం చేసిన సభ్యుడిపై మరి ఏం చర్య తీసుకోవాలి? నిర్వాహకులంటే తమ ఇష్టమైనట్లు చేసుకొవడం కాదు, తమకు ఇష్టమైనట్లు పని జరగకున్ననూ ఓపిక పట్టడం అవసరం అంతగా ఓపిక లేంప్పుడు పదవులు వదీవేయాలి అంతే? నిష్కారణంగా తొలగించిన ఆ చర్చా పేజీలను వెంటనే పునరుద్ధరించారు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:33, 26 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంతరావు గారూ, శాశ్వత నిరోధం విధించడానికి కారణాలను వివరించాను. పదిరోజులుగా ఎడతెగని వ్యక్తిగతదాడులు, నిరధారమైన నిందలు చేస్తూ ఉన్నారు. తుది హెచ్చరిక జారీ చేసాక కూడా కొనసాగించారు. పైగా సాక్ పపెట్లతో దాడి చేస్తానని కూడా బెదిరించారు. వాటన్నిటి పర్యవసానమే మీపై నిరోధం అని రాసాను. మీరు అదంతా పక్కనపెట్టి గత పదిరోజులుగా మీరు ఏమీ చెయ్యనట్లుగా మాట్లాడుతున్నారు. మీ దుర్భాషలను చాప కిందకి తోసెయ్యజాలరు. ఎక్కడో ఎవరో భాషాభిమానులు అన్నారని చెబుతూ ఇక్కడి వాడుకరులను నిందించారు. అజ్ఞాత చేసిన పుకార్లనే మీరూ చెబుతూ వచ్చారు. ఇలా పుకార్లు వ్యాపింపజెయ్యడం కూడా తప్పు. ఏకవచన సంబోధన విషయం గురించి ఒక మాట: అది మీకు అలవాటైన పద్ధతి అయితే ఎవరూ పట్టించుకోకపోదురు. కొందరిని బహువచనంలో గౌరవిస్తూ, మర్యాద గానే మాట్లాడారు. కానీ, అదే పేరాలో ఇతరులను మాత్రం ఏకవచనంలో సంబోధించారు. దీన్ని అలవాటు అనరు. అమర్యాద అంటారు. ఆ తప్పు మీరు పదే పదే చేసారు. అమర్యాదగా మాట్టాడ్డం అనే తప్పును మాత్రమే కాదు, వ్యక్తిగత దూషణలు, దుర్భాషలూ అనేక సార్లు చేసారు. అవి చాలవన్నట్టు, ఇక్కడ మరిన్ని అనుచితమైన విషయాలు కూడా రాసారు. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఇతర ఖాతాలతో రాస్తానని, ఎవరూ ఆపలేరనీ బెదిరిస్తున్నారు. మీరు ఆవేశంలో ఉన్నారు, విచక్షణతో మాట్టాడ్డం లేదు. అంచేత కొన్నాళ్ల పాటు మీ చర్చ పేజీ కూడా మీకు అందుబాటులో లేకుండా నిరోధాన్ని సవరించాను.
పోతే, సభ్యుల చర్చా పేజీలను తొలగించానని అన్నారు. నేను సభ్యుల పేజీలనేమీ తొలగించలేదు. అజ్ఞాతల చర్చ పేజీల్లో అజ్ఞాతలు రాసిన చెత్తను తొలగించానంతే.
ఇక ఇక్కడ మీరు రాసిన మిగతా సంగతులంటారా.. వాటి గురించి నేనేమీ మాటాణ్ణు. __చదువరి (చర్చరచనలు) 19:32, 26 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities

Hello,

As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.

An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:

  • Bangladesh: 4:30 pm to 7:00 pm
  • India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
  • Nepal: 4:15 pm to 6:45 pm
  • Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
  • Live interpretation is being provided in Hindi.
  • Please register using this form

For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.

Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి

నమస్తే C.Chandra Kanth Rao,

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.

70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.

మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.

ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:01, 29 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం

@C.Chandra Kanth Rao గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

  1. File:Tungabhadramma.JPG
  2. File:Tandur_Railway_Station_01.JPG
  3. File:Tungabhadra_Pushkaram_05.JPG
  4. File:Tungabhadra_Pushkaram_04.JPG
  5. File:Ganesh_Viigraham_Palamoor_City.JPG
  6. File:Hussain_Sagar_01.JPG

వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 05:59, 21 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు

@C.Chandra Kanth Rao గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:20, 2 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

2013-11-19కి ముందు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు

@C.Chandra Kanth Rao గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. 2013-11-19కి ముందు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు NFUR లాంటి మూస వాడి చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. మీరు ప్రయత్నించి, ఒక వారం రోజులలోగా మీకు అదనపు సమయం కావలసి వస్తే తెలియచేయండి. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 15:05, 1 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

{{subst:cfd notice|1=వర్గం:భారతదేశపు దేశవాళీ క్రికెట్ జట్లు|action=deletion}} చదువరి (చర్చరచనలు) 01:10, 4 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:59, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]