అమరావతి ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

భారతీయ రైల్వేస్ [1]కు చెందిన సౌత్ ఈస్ట్రన్ రైల్వే (ఎస్.ఇ.ఆర్.), ఖరగ్ పూర్ డివిజన్ కేంద్రంగా అమరావతి ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసును నడిపిస్తున్నారు. ఈ రైలు వారానికి నాలుగు సార్లు ఇరు మార్గాల్లో నడుస్తుంటుంది. విజయవాడ, గుంతకల్, హుబ్లీ, మడగాం స్టేషన్ల మీదుగా ఈ రైలు కార్యకలాపాలు సాగుతుంటాయి. పశ్చిమ బంగ నుంచి ఒడిషా మీదుగా, భారత తూర్పు ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక మరియు గోవాకు ప్రయాణిస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా గుంటూరు, నర్సారావు పేట, మార్కాపూర్, కంబం, గిద్దలూరు, నంద్యాల, మహానంది, గుంతకల్ మరియు బళ్లారి మరియు సమీప ప్రాంతాలవారికి అమరావతి ఎక్స్ ప్రెస్ సుపరితం.

18047/18048 Amaravati Express (Howrah - Vasco) Route map

డిసెంబర్ 2012 నాటికి, ఈ రైలు బండి సేవలు

  • 17225 విజయవాడ - హుబ్బల్లి అమరావతి ఎక్స్ ప్రెస్
  • 17226 హుబ్బల్లి - విజయవాడ అమరావతి ఎక్స్ ప్రెస్ [2]

ఈ రైలు వారానికి మూడు సార్లు విజయవాడ హుబ్బల్లి మధ్య నడుస్తుంది,, ఈ రైలును దక్షిణ మధ్య రైల్వే (ద మ రే) బెజవాడ (విజయవాడ) డివిజన్ ఆంధ్రప్రదేశ్ గోవా రాష్త్రముల మధ్య నడుపుచున్నది.

  • 18047 హౌడా - వాస్కోడగామా అమరావతి ఎక్సప్రస్ [3]
  • 18048 వాస్కోడగామా - హౌడా అమరావతి ఎక్సప్రస్

ఈ రైలు బండి వారానికి నాలుగు రోజులు రెండు వైపుల నుండి వయా విజయవాడ, గుంతకల్లు, హుబ్బల్లి, మదగావ్ నడుస్తుంది, ఈ రైలును ఆగ్నేయ రైల్వే మండలముఖరగపూర్ విభాగము చే నడపబడుచున్నది. ఈ రైలుబండి పశ్చిమ బెంగాల్ నుండి గోవాకు ఓడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాష్త్రా గుండా ప్రయాణించును.

అమరావతి ఎక్సప్రస్ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరునరసరావుపేటకంభంగిద్దలూరు గుంతకల్లు కర్నాటకలోని బళ్ళారి హుబ్బల్లి తదితర ప్రాంతాలలో బహుళ ప్రజాదరణ పొందింది.

17225/17226 Amaravati Express (Vijayawada - Hubli) Route map

చరిత్ర[మార్చు]

అమరావతి ఎక్సప్రస్ చరిత్ర[మార్చు]

అమరావతి ఎక్స్ప్రస్ చారిత్రక వైశిష్ట్యం కల మచిలీపట్టణం-మొర్ముగావ్ రైలు మార్గములో నడుస్తున్నది

ఈ రైలును తొలిగా 1950 మీటర్ గేజ్ మార్గమునందు గుంటూరు, హుబ్బల్లి మధ్య నడపబడ్డది, తర్వాత 1987-1990 లలో గుంటూరు హుబ్బలి శీఘ్ర సవారీగా వున్నతికరించబడింది, అటు తర్వాత దీనికి అమరావతి ఎక్స్‌ప్రెస్ గా నామకరణం చేయబడ్డది తొలుత ఈ రైలు బండి yp ఆవిరి ఇంజిన్ తో నడపబడేది, వాస్కోడగామా నుండి కొన్ని బోగీలు గుంటూరు వరకు నడిపేందుకు గాను అదనంగా హుబ్బల్లిలో తగిలించేవారు, వాస్కోడగామా నుండి గోమంతక్ ఎక్సప్రస్ ద్వారా గదగ్ వరకు, గదగ్ నుండి గదగ్-మిరాజ్ లింక్ ఎక్స్ప్రస్ కు ఈ అదనపు భోగీలను తగిలించి నడిపేవారు, కాలక్రమేనా ఈ విధంగా భోగీలను తగిలించటం విడగొట్టడం మానేసి రైలునుహుబ్బలి వరకు అమరావతి ఎక్స్ప్రస్ పేరుతో నడిపించటం మొదలుపెట్టారు.1997 గేజ్ ప్రామనికరణం జరిగేంతవరకు ఈ రైలు ఈ విధానం లోనే నడిపింప బడ్డది.

1994లో ఈ రైలును విజయవాడ వరకు పొడిగించారు. రైలు మార్గం ప్రామాణీకరణ జరుగుతున్న కొద్ది ఈ రైలును హుబ్బల్లి, అటు తర్వాత లోండా కూడలి, కాజిల్ రాక్ స్టేషను, వాస్కోడగామ వరకు పొడిగించుకుంటూ వెళ్లారు.2000 సంవత్సరములో ఈ రైలును వాస్కోడగామ విజయవాడ మధ్య ప్రతిరోజు నడిచే రైలుగా మార్పు చేసారు.అయితే ప్రయాణికుల నుండి తగినంత ఆదరణ లభించకపోవడంతో వారానికి రెండు రోజులు మాత్రమే వాస్కోడగామ వరకు మిగతా ఐదు రోజు హుబ్బల్లి వరకు మాత్రమే నడిపారు.

2003 నుండిఈ రైలును వారానికి మూడు సార్లు విజయవాడ హుబ్బల్లి మధ్య నడిచేలా మిగతా నాలుగు రోజులు హుబ్బలి వరకు నడిపారు, జూలై 2007 నుండి వాస్కోడగామ-విజయవాడ రైలును హౌడా కూడలి వరకు పొడిగించారు.

2010లో 7227/7228 విజయవాడ-హుబ్బల్లి రైలును 17227/17228 గా, హౌడా-విజయవాడ 8047/8048 రైలును 18047/18048 గా సంఖ్యను కేటాయించారు ఫెబ్రవరి 12 2013, రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే అమరావతి ఎక్సప్రస్ ను 17225/17226 హుబ్బలి-విజయవాడ రైలును ప్రతి రోజు నడిచే రైలుగా మార్చారు.[4]

సవరించబడిన రైలు సమయ పట్టిక సమయాలు త్వరలో అందించబడును

రైలు యొక్క నామ విశిష్టత[మార్చు]

ఈ రైలును శాతవాహనుల చారిత్రక రాజధాని అమరావతి (ప్రస్తుత గుంటూరుజిల్లాలో ఉన్న అమరావతి) కు గుర్తుగా నామకరణం జరిగింది, బౌద్ధ మత స్తుపాలకు అమరావతి దక్షిణభారత సాంచిగా పేరు గాంచింది

ఈ రైలు ఇంజిన్ యొక్క వివరాలు[మార్చు]

నిపుణులకు సంబంధించిన విషయం-|భారతీయ రైల్వేస్|కారణము=అమరావతి ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ లకు సంబంధించి వేర్వేరు అయిన సమాచార లభ్యత

17225/17226 అమరావతి ఎక్సప్రస్ కు WDM3A డిజిల్ ఇంజిను గుత్తి షెడ్ దక్షిణ మధ్య రైల్వే, గుంతకల్లు విభాగం ఇంజిన్ ను విజయవాడ హుబ్బల్లి మధ్య నడిచెందేందుకు ఉపయోగింపబడుచున్నది.[5]

18047/18048 సంఖ్య గల అమరావతి ఎక్సప్రస్ డిజిల్ మరియు విద్యుత్ ఇంజిన్ లతో నడపబడుచున్నది. హౌడా-గుంటూరు మద్య WAP4 సంత్రగాచ్చి, ఆగ్నేయ రైల్వే ఇంజిన్, గుంటూరు-వాస్కోడగామ మధ్య WDM3A దక్షిణమధ్యరైల్వే ఇంజిన్ ను వినియోగించుకుంటున్నది.

భోగిల వివరాలు
ఇంజిన్- 1SLR- 2GEN - 3GEN- 4GEN- 5 B1- 6 A1- 7 S1- 8 S2- 9 S3- 10 S4- 11 S5- 12 S6- 13GEN- 14GEN- 15GEN- 16SLR

బాహ్య లింకులు[మార్చు]

సూచనలు[మార్చు]

  1. "Indian Railways". indianrail.gov.in. 
  2. "17226 Hubli-Vijayawada". indiarailinfo.com. 
  3. "18047 Howdah-Vasco da Gama". indiarailinfo.com. 
  4. "Amaravati Express - 17225". cleartrip.com. 
  5. "Train Schedule-17226". etrain.info.