Jump to content

ఉదయ్ కుమార్

వికీపీడియా నుండి
ఉదయ్ కుమార్
జననంబొమ్మసంద్ర శ్రీనివాసయ్య సూర్యనారాయణ మూర్తి
(1933-03-16)1933 మార్చి 16
ధర్మపురి తమిళనాడు భారతదేశం
మరణం1985 డిసెంబరు 26(1985-12-26) (వయసు 52)
బెంగళూరు, కర్ణాటక భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు సినిమా దర్శకుడు నిర్మాత రచయిత
క్రియాశీలక సంవత్సరాలు1954–1985
భార్య / భర్త
కమలమ్మ
(m. 1953)
పిల్లలు5

బొమ్మసంద్ర శ్రీనివాసయ్య సూర్యనారాయణ మూర్తి ( 1933 మార్చి 16- 1985 డిసెంబర్ 26), ఉదయ్ కుమార్ అనే తెర పేరు తో ప్రసిద్ధి చెందిన కన్నడ సినిమా నటుడు. ఉదయ్ కుమార్, కళ్యాణ్ కుమార్, రాజ్ కుమార్.[1] లాంటి నటులతో కలిసి నటించాడు ఉదయ్ కుమార్ అనేక పుస్తకాలు రచించాడు. పలు నాటకాల్లో కూడా నటించాడు..[2] ఉదయ్ కుమార్ కన్నడ సినిమాల్లో భావోద్వేగ పాత్ర లలో ఎక్కువగా నటించాడు. ఉదయ్ కుమార్ అప్పటి ప్రముఖ కన్నడ నటులందరితో కలిసి నటించాడు.[3] ఉదయ్ కుమార్ తన సినిమా కెరీర్ ప్రారంభంలో వీరోచిత పాత్రలను పోషించారు, తరువాత ప్రతినాయక పాత్రలను ఎక్కువగా పోషించేవాడు, తరచుగా ఉదయ్ కుమార్ చారిత్రక పౌరాణిక కథలలో రాజ్ కుమార్ విరోచిత వ్యక్తిత్వాన్ని ఎదుర్కొన్నారు. ఉదయ్ కుమార్ నిర్మాతగా రచయితగా నటుడిగా కన్నడ సినిమా రంగంలో పనిచేశాడు ఉదయ్ కుమార్ 1985 డిసెంబర్ 26న మరణించాడు.

ప్రారంభ జీవితం

[మార్చు]

ఉదయ్ కుమార్ 1933 మార్చి 5న ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు (కొన్ని ఆధారాలు 16 మార్చి 1933 అని చెబుతున్నాయి). ఉదయ్ కుమార్ బి. ఎస్. శ్రీనివాసయ్య, శారదమ్మ. ఈ దంపతులకు జన్మించాడు. ఉదయ్ కుమార్ కు ఒక అన్న ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ఉదయ్ కుమార్ కుటుంబం ఆంధ్రప్రదేశ్ మూలాలను కలిగి ఉంది, వారి పూర్వీకులు ఉదయ్ కుమార్ పుట్టక ముందు దాదాపు 200 సంవత్సరాల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కర్ణాటక రాష్ట్రంకు వలస వచ్చారు.

ఉదయ్ కుమార్ బెంగళూరు సర్జాపుర గ్రామానికి సమీపంలో ఉన్న హీలాలిగే, ముత్తనల్లూర్ గ్రామాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు, తరువాత మాధ్యమిక పాఠశాల విద్యను పూర్తి చేశారు. పాఠశాల దశలో ఉదయ్ కుమార్ పాఠశాలలో జరిగే అనేక కార్యక్రమాలు క్రీడా పోటీలలో చురుగ్గా పాల్గొనేవాడు.

ఉదయ్ కుమార్ తన మెట్రిక్యులేషన్ పరీక్షలో ఫెయిల్ అయిన తరువాత కమలమ్మను వివాహం చేసుకున్నారు కమలమ్మను వివాహం చేసుకునే నాటికి ఉదయ్ కుమార్ కు 20 ఏళ్లు. ఆ తరువాత ఉదయ్ కుమార్ పాఠశాలలో వాయామ ఉపాధ్యాయుడిగా పని చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఉదయ్ కుమార్ తన స్నేహితుడి సలహా మేరకు బెంగళూరు నగరానికి మకాం మార్చాడు గుబ్బి వీరన్న నాటక సంస్థలో చేరాడు, అక్కడ ఉదయ్ కుమార్ నటుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. గుబ్బి వీరన్న నాటక సంస్థలో ఉదయ్ కుమార్ అనేక నాటకాలు వేసేవాడు. నాటకాలు వేసిన అనుభవంతో ఉదయ్ కుమార్ కొన్ని రోజుల తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించాడు.

సినీ కెరీర్

[మార్చు]

1954లో కన్నడ సినిమా కథ రచయిత అయిన కనగల్ ప్రభాకర శాస్త్రి, గుబ్బి వీరన్న నాటక సంస్థ వేస్తున్న నాటకాన్ని చూసేందుకు వచ్చాడు. ఆ సమయంలో , ఉదయ్ కుమార్మాండ్య వేదికపై గుబ్బి వీరన్న నాటకంలో బుద్ధుడిగా నటించారు, ఆ సమయంలో కనగల్ ప్రభాకర శాస్త్రి ఉదయ్ కుమార్ ను గమనించి దగ్గరికి పిలిపించి తన ప్రముఖ కన్నడ దర్శకుడు ఎస్. కె. భగవాన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఉదయ్ కుమార్ కు అవకాశం ఇప్పించాడు. కొన్ని రోజుల తర్వాత కనగల్ ప్రభాకర్ శాస్త్రి ఉదయ్ కుమార్ కు సినిమాల్లో రచయితగా అవకాశాలు ఇప్పించారు కొన్ని రోజుల తర్వాత ఉదయ్ కుమార్ సినిమా నిర్మాతగా మారి ఉదయ్ ప్రొడక్షన్స్ ను స్థాపించాడు. ఈ నిర్మాణ సంస్థ ద్వారా అనేక సినిమాలు నిర్మించాడు.

ఉదయ్ కుమార్ కన్నడలో 171, తెలుగులో 15, తమిళంలో 6, హిందీలో ఒకటి సహా 193 సినిమాలలో నటించాడు. ముఖ్యంగా కన్నడ సినిమాలలో ఉత్తమ నటనకు గాను ఉదయ్ కుమార్ అనేక ప్రాంతీయ జాతీయ అవార్డులను గెలుచుకున్నారు.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం. సినిమా పాత్ర ( గమనికలు
1956 భాగ్యదయా
1956 దైవా సంకల్పం
1956 పంచరత్న ఈశ్వర
1957 వరదక్షిణే రఘు
1957 బెట్టడ కల్లా భైరవ
1957 రత్నగిరి రహస్య రాజ్కుమార్ చక్రవర్తి
1957 ప్రేమద పుత్రి
1958 భక్త ప్రహ్లాదుడు
1958 మానే తుంబిద హెన్నూ
1958 స్కూల్ మాస్టర్ రవికుమార్
1958 సెంగోట్టై సింగం సింగం తమిళ సినిమా
1959 మహిషాసుర మర్దిని రామభేశ
1959 వీర్ భాస్కరాడు తెలుగు సినిమా
1960 యానై పాగన్ తమిళ సినిమా
1960 దశావతార కంసా
1960 ఇవాన్ అవనేథాన్ తమిళ సినిమా
1960 రణధీరా కంఠీరవ విశ్వనాథ శాస్త్రి
1960 భక్త కనకదాస
1960 శివలింగ సాక్షి
1961 మహావత
1961 విజయనగర వీరపుత్ర
1961 రాజా సత్య వ్రత
1961 సీతారామ కళ్యాణం కుంభకర్ణుడు తెలుగు సినిమా
1962 రత్నా మంజరి
1962 గాలి గోపురా కామియో
1962 విధివిలాస
1962 తాయ్ కరులు
1962 భూదాన రాముడు
1962 నంద దీపా రవి
1962 కరుణే కుటుంబడ కన్ను రంగన్న
1963 శాంత తుకారాం
1963 జెను గూడు రాజన్న
1963 చంద్ర కుమార్
1963 వీరా కేసరి
1963 శ్రీ రామాంజనేయ యుద్ధం
1963 బెవు బెల్లా
1963 మానా మెచిడా మడాడి దేవరాజయ్య
1963 మల్లి మదువే
1964 అమరశిల్పి జకనాచారి
1964 చందవల్లియా తోట శివానంజయ గౌడ
1964 కలావతి సురేష్
1964 నందు కామియో
1965 మిస్ లీలావతి కపనిపతి రావు కామియో
1965 వీర విక్రమ
1965 చంద్రహాస శేఖర్
1965 కవలేరు కులవండూ
1965 ఐడియా మహాసుద్దీన రాజా
1965 మడువే మాడి నోడు భీమన్న
1965 బెట్టడ హులీ భైరవ
1965 సతీ సావిత్రి
1965 సత్య హరిశ్చంద్ర విశ్వామిత్ర
1965 పాతివ్రథ
1965 వాత్సల్య ఆనంద్
1966 దేవ మానవ
1966 మధు మాలతి
1966 సంధ్యా రాగ రాముడు
1966 కటారి వీరా
1966 మోహిని భస్మాసుర శివ.
1966 బడుకువా దరి
1966 మానే కట్టి నోడు
1966 మంత్రాలయ మహాత్మె తిమ్మన్న భట్
1966 శ్రీ కృష్ణ పాండవీయం భీముడు
1967 రాజదుర్గద రహస్య
1967 పడవిధార
1967 ఇమ్మడి పులకేశి కుబ్జ విష్ణువర్ధనుడు
1967 పార్వతి కళ్యాణ నారద
1967 బంగారద హూవు రవి
1967 సతీ సుకన్య
1967 రాజశేఖర జగమల్ల
1967 చక్ర తీర్థ కాశీపతయ్య
1967 శ్రీ పురందర దాసరు వ్యాసతీర్థ
1968 హూవు ముల్లు భీముడు
1968 అరుణోదయ
1968 సింహా స్వప్న
1968 అన్నా తమ్మ
1968 ధూమకేతు
1968 మైసూర్ టాంగా
1968 మనేయ్ మహా మందిర
1968 నమ్మ ఊరు
1968 జెడారా బాలే గోపినాథ్ కుమార్
1968 మహసథి అరుంధతి
1968 నానే భాగ్యవతి
1969 చదురంగ
1969 భలే బసవ బసవా
1969 మదువే మదువే
1969 అడే హృదయ అడే మమతే
1969 మాతృభూమి
1969 మధుర మిలనా రమేష్
1969 కల్ప వృక్ష
1969 ముకుంద చంద్ర
1969 ఒడహుట్టిదవరు సుందర్
1969 శివ భక్తుడు
1969 మక్కలే మనేగే మాణిక్య
1969 భాగీరథి
1970 తక్కా బిట్రే సిక్కా
1970 కల్లారా కల్లా శంకర్
1970 హాసిరు తోరానా సూరి
1970 ఆరు మూరు ఓంభట్టు
1970 మృత్యుంజయ పంచరదళ్ళి గుడారచారి 555 భాస్కర్
1970 సెడిగే సెడు
1970 ముక్తి
1970 రంగమహల్ రహస్య కుమార్
1970 ప్రతీకారా
1970 మోడాలా రథ్రి సి. బి. ఐ. హెడ్
1971 సిడిలా మారి
1971 బాలే రాణి
1971 జాతకరత్న గుండ జోయిసా
1971 బాలే భాస్కర్
1971 సంశయా ఫలా
1971 కాసిద్రే కైలాస రాముడు
1971 పూర్ణిమ
1971 సిగ్నల్మాన్ సిద్దప్ప
1971 మహదీమనే
1972 కుల్లా ఏజెంట్ 000
1972 కాంచ్ ఔర్ హీరా
1972 నారి మునిడారే మారి
1973 బెట్టడ భైరవ
1973 మన్నినా మగలు
1973 కౌబాయ్ కుల్లా
1973 భారత రత్న
1973 త్రివేణి
1973 ప్రేమా పాషా
1974 చాముండేశ్వరి మహిమే
1974 నాను బాలాబేకు రమానాథ్
1975 సర్ప కావలు
1975 ఆశిర్వాదా
1975 బిలీ హెండ్తి
1975 జాగృతి
1975 మంత్ర శక్తి
1976 సూత్రదా బాంబే
1976 రాజనర్తకియ రహస్య
1977 బనశంకరి
1977 శనిప్రభవ
1977 హేమావతి
1977 శ్రీ రేణుకడవి మహాత్మె
1977 శ్రీమంతన మగలు
1978 మాతు తప్పడ మాగా వజ్రాల స్మగ్లర్
1978 మధుర సంగమ
1978 పరశురామన్
1978 భలే హుడుగ
1978 దేవదాసి
1979 పుతాని ఏజెంట్ 123
1979 సీతారాము
1980 వజ్రదా జలపథ
1980 మరియా నా డార్లింగ్ మహాదేవ/"రామ్దాస్"
1980 మూగానా సెడు పాపన్న
1980 చిత్రకూట
1980 కాళింగ వినాయక్ పాటిల్
1981 కుల పుత్ర
1981 గర్జేన్
1981 తయ్య మాదిలల్లి
1982 సహసా సింహ చౌదరి కామియో
1982 మావా సోస్ సావల్
1982 కెంపు హోరి
1983 నోడి స్వామి నావిరోడ్ హిగ్ అపర్ణ తండ్రి
1983 మాగా మహారాజు తెలుగు సినిమా
1983 భయంకర భస్మాసుర
1983 దేవర తీర్పు
1983 కల్లువీనే నూదియితు
1984 గండు భేరుండా
1984 అగ్ని గుండం
1984 కనూనిగే సావల్[4] పబ్లిక్ ప్రాసిక్యూటర్
1984 భార్యా తెలుగు సినిమా
1984 మరియాడే మహలు
1984 పోలీసు పాపన్న
1984 ఈ చరిత్ర ఇంకెన్నల్లు
1985 విశాఖ[5] కపాల భైరవ
1985 పీతమహా
1985 హావు ఎని ఆటా
1985 లక్ష్మీ కటక్ష నారాయణదాస
1988 వర్ణ చక్రం

అవార్డులు

[మార్చు]
  • 1967-68-ఉత్తమ సహాయ నటుడు
  • 1977-78-ఉత్తమ సహాయ నటుడు [6]

మూలాలు

[మార్చు]
  1. "TOTAL KANNADA Save Our Movieland "Kannada Cinema FAQs"". totalkannada.com. 2006-09-15. Archived from the original on 2006-09-15. Retrieved 2020-06-17.
  2. "Archived copy". popcorn.oneindia.in. Archived from the original on 2 June 2009. Retrieved 13 January 2022.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "Archive News". The Hindu. 2006-03-09. Archived from the original on 23 March 2018. Retrieved 2020-06-17.
  4. Kanunige Sawal-ಕಾನೂನಿಗೆ ಸವಾಲ್ | Kannada Full Movie | FEAT. Srinivas Murthy,Sujatha, Babay Rekha (in ఇంగ్లీష్), retrieved 2024-02-05
  5. Visha Kanya Telugu Full Movie | Sarath Babu | Jayamalini | Jyothi Lakshmi | South Cinema Hall (in ఇంగ్లీష్), retrieved 2023-10-20
  6. "Awards". Kalakesari Udaykumar. Archived from the original on 29 March 2016. Retrieved 2020-06-17.