ఓరి నీ ప్రేమ బంగారం కానూ
Jump to navigation
Jump to search
ఓరి.. నీ ప్రేమ బంగారంగానూ..! | |
---|---|
దర్శకత్వం | ఏ.వి.ఎస్ |
రచన | శంకరమంచి పార్థసారధి (మాటలు) |
స్క్రీన్ ప్లే | ఏ.వి.ఎస్ |
కథ | ఏ.వి.ఎస్ |
నిర్మాత | మైత్రీ టాకీస్ |
తారాగణం | రాజేష్ కృష్ణన్, సంగీత, గిరి బాబు, జయప్రకాష్ రెడ్డి, సునీల్, బ్రహ్మానందం, చలపతి రావు, తనికెళ్ళ భరణి, ఎమ్.ఎస్.నారాయణ, ఆలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం |
ఛాయాగ్రహణం | వాసు |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | మైత్రీ టాకీస్ |
విడుదల తేదీ | 9 అక్టోబరు 2003 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఓరి.. నీ ప్రేమ బంగారంగానూ..! 2003, అక్టోబర్ 16న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఏ.వి.ఎస్ నిర్మాణదర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజేష్ కృష్ణన్, సంగీత, గిరి బాబు, జయప్రకాష్ రెడ్డి, సునీల్, బ్రహ్మానందం, చలపతి రావు, తనికెళ్ళ భరణి, ఎమ్.ఎస్.నారాయణ, ఆలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ముఖ్యపాత్రలలో నటించగా, మణిశర్మ సంగీతం అందించారు.[1][2]
కథ
[మార్చు]రాజేష్ ఉద్యోగం లేని ఒక పేద యువకుడు. ఇతను సంగీత అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. సంగీత తండ్రికి ఈ విషయం తెలిసి రాజేష్ కి ఒక పరీక్ష పెడతాడు. అతనికి ఒక కోటి రూపాయలున్న సూట్ కేసు ఇచ్చి దాన్ని అతని గదిలో ఒక నెలరోజులపాటు దాచియుంచి తర్వాత తిరిగివ్వమంటాడు. అతను ఈ పందెంలో విజయుడైతే తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని చెబుతాడు. అతను ఆ పందెం ఎలా నెగ్గి తన ప్రేమను స్వంతం చేసుకున్నాడన్నది మిగతా కథ.
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: ఏ.వి.ఎస్
- నిర్మాత: మైత్రీ టాకీస్
- మాటలు: శంకరమంచి పార్థసారధి
- సంగీతం: మణిశర్మ
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, సుద్దాల అశోక్ తేజ, శ్రీహర్ష
- ఛాయాగ్రహణం: వాసు
- కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
- నిర్మాణ సంస్థ: మైత్రీ టాకీస్
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "ఓరి.. నీ ప్రేమ బంగారంగానూ..!". telugu.filmibeat.com. Retrieved 9 February 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Ori Nee Prema Bangaram Kaanu". www.idlebrain.com. Archived from the original on 12 డిసెంబరు 2017. Retrieved 9 February 2018.