Jump to content

కాకినాడ పట్టణ మండలం

అక్షాంశ రేఖాంశాలు: 16°56′38″N 82°14′06″E / 16.944°N 82.235°E / 16.944; 82.235
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°56′38″N 82°14′06″E / 16.944°N 82.235°E / 16.944; 82.235
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ జిల్లా
మండల కేంద్రంకాకినాడ
విస్తీర్ణం
 • మొత్తం32 కి.మీ2 (12 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం3,12,538
 • జనసాంద్రత9,800/కి.మీ2 (25,000/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1048


కాకినాడ పట్టణ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాకు చెందిన మండలం.[3]కాకినాడ పట్టణ మండల కేంద్రమైన కాకినాడ కాకినాడ జిల్లాలో ప్రధాన పట్టణమే కాక భారత దేశ తూర్పు తీర ప్రాంతంలోముఖ్యమైన రేవు పట్టణం. న్యూయార్క్ నగరం మాదిరిగా వీధులు రూళ్ళకర్రతో గీసినట్టు సమాంతరంగా ఉండి, కూడళ్ళలో ఒకదానికొకటి లంబంగా ఉండడం ఈ నగర ప్రత్యేకత. ప్రణాళికా బద్ధంగా ఉన్న కారణంగా కో-కెనడా గానూ, ప్రముఖమైన ఓడరేవుగా ఉన్న కారణం చేత రెండవ మద్రాసు గానూ, చమురు అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలు అధికంగా ఉన్న కారణంచేత మినీ ముంబై గానూ, పిలుస్తూ ఉంటారు. ప్రశాంత వాతావరణానికి మారుపేరైన ఈ పట్టణం పెన్షనర్స్ పారడైస్గా పేరొందింది. ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం రసాయనాలు పెట్రోరసాయనాల పెట్టుబడి ప్రాంతం పరిధి కాకినాడని ఆనుకొనే మొదలవుతుంది. ఈ మధ్యకాలంలో కె.జి బేసిన్ రాజధానిగా విదేశాలలో ప్రాముఖ్యతని సంతరించుకుంది.OSM గతిశీల పటము

మండలం లోని పట్టణాలు, గ్రామాలు

[మార్చు]

కాకినాడ పట్టణ మండలం పరిధిలో కాకినాడ ఒక్క పట్టణం మాత్రమే కలిగి ఉంది. రెవెన్యూ గ్రామాలు లేవు. అందువల్ల ఇది పూర్తిగా కాకినాడ పట్టణానికి మాత్రమే పూర్తిగా చెందిన పట్టణ మండలం.[4]

విద్యాసంస్థలు

[మార్చు]
Two gateways next to white building
రంగరాయ వైద్య కళాశాల ముఖద్వారం
  • పిఠాపురం రాజావారి కళాశాల (P. R. College), ఇది చాల రోజులబట్టి ఉన్న కళాశాల. రఘుపతి వెంకటరత్నంనాయుడు, వేమూరి రామకృష్ణారావు వంటి ఉద్దండులు ఇక్కడ పని చేసేరు. పిఠాపురం రాజావారి కళాశాల అత్యంత ప్రాచీనమైన కళాశాలగా ప్రాముఖ్యత సంతంరించుకున్నది. ఈ కళాశాలలో ఇంటర్, డిగ్రీ, పి.జి.విభాగాలలో అభ్యసించవచ్చును.
  • జవాహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇంజనీరింగు కళాశాల (జె.ఎన్.టి.యు.). ఇది ఆంధ్రాలో మొట్టమొదటి ఇంజనీరింగు కళాశాల. మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రా విడిపోయినప్పుడు, విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో పెట్టాలన్న ఉద్దేశంతో గిండీ ఇంజనీరింగు కాలేజీ నుండి దీనిని విడదీసేరు. మొదట్లో గిండీలో ఉన్న ఆచార్యబృందాన్నే ఇక్కడికి బదిలీ చేసేరు. కాని వాల్తేరులో వనరులు సరిగా లేక కాకినాడలో తాత్కాలికంగా పెట్టేరు. అది అలా అక్కడే 'ప్రభుత్వ ఇంజనీరింగు కళాశాల, కాకినాడ' అన్న పేరుతో స్థిరపడి పోయింది. తరువాత జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం స్థాపించిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగు కళాశాలలన్నిటిని ఈ కొత్త విశ్వవిద్యాలయానికి అనుబంధించేరు.
  • భారతీయ సమాచార సాంకేతిక విద్యాసంస్థ (ఐఐఐటి) కి శంకుస్థాపన జరిగింది.
  • ఆంధ్రా పాలీటెక్నిక్‌ కళాశాల.
  • యమ్.యస్.యన్ ఛారిటీస్.
  • ఆంధ్ర విశ్వవిద్యాలయం - స్నాతకోత్తర విద్యా కేంద్రం.
  • రంగరాయ వైద్య కళాశాల.

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015
  3. "APonline - AP Fact File: District Information-East Godavari". web.archive.org. 2015-06-18. Archived from the original on 2015-06-18. Retrieved 2021-05-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Villages & Towns in Kakinada Urban Mandal of East Godavari, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-05-24.

వెలుపలి లంకెలు

[మార్చు]