కాకినాడ పట్టణ మండలం

వికీపీడియా నుండి
(కాకినాడ (పట్టణ) మండలం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కాకినాడ పట్టణ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండలం.కాకినాడ పట్టణ మండల కేంద్రమైన కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పట్టణమే కాక భారత దేశ తూర్పు తీర ప్రాంతంలోముఖ్యమైన రేవు పట్టణం. న్యూయార్క్ నగరం మాదిరిగా వీధులు రూళ్ళకర్రతో గీసినట్టు సమాంతరంగా ఉండి, కూడళ్ళలో ఒకదానికొకటి లంబంగా ఉండడం ఈ నగర ప్రత్యేకత. ప్రణాళికా బద్ధంగా ఉన్న కారణంగా కో-కెనడా గానూ, ప్రముఖమైన ఓడరేవుగా ఉన్న కారణం చేత రెండవ మద్రాసు గానూ, చమురు అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలు అధికంగా ఉన్న కారణంచేత మినీ ముంబై గానూ, పిలుస్తూ ఉంటారు. ప్రశాంత వాతావరణానికి మారుపేరైన ఈ పట్టణం పెన్షనర్స్ పారడైస్గా పేరొందినది. ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం రసాయనాలు పెట్రోరసాయనాల పెట్టుబడి ప్రాంతం పరిధి కాకినాడని ఆనుకొనే మొదలవుతుంది. ఈ మధ్యకాలంలో కె.జి బేసిన్ రాజధానిగా విదేశాలలో ప్రాముఖ్యతని సంతరించుకొంటోంOSM గతిశీల పటము

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

విద్యాసంస్థలు[మార్చు]

కాకినాడలో ఉన్న విద్యా పీఠాలు:

C B M సింప్సన్ స్మారక ప్రాథమికోన్నత పాఠశాల, కాకినాడ
Two gateways next to white building
రంగరాయ వైద్య కళాశాల ముఖద్వారం
  • పిఠాపురం రాజావారి కళాశాల (P. R. College), ఇది చాల రోజులబట్టి ఉన్న కళాశాల. రఘుపతి వెంకటరత్నంనాయుడు, వేమూరి రామకృష్ణారావు వంటి ఉద్దండులు ఇక్కడ పని చేసేరు. పిఠాపురం రాజావారి కళాశాల అత్యంత ప్రాచీనమైన కళాశాలగా ప్రాముఖ్యత సంతంరించుకున్నది. ఈ కళాశాలలో ఇంటర్, డిగ్రీ, పి.జి.విభాగాలలో అభ్యసించవచ్చును.
  • జవాహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇంజనీరింగు కళాశాల (JNTU Engineering College) . ఇది ఆంధ్రాలో మొట్టమొదటి ఇంజనీరింగు కళాశాల. మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రా విడిపోయినప్పుడు, విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో పెట్టాలన్న ఉద్దేశంతో గిండీ ఇంజనీరింగు కాలేజీ నుండి దీనిని విడదీసేరు. మొదట్లో గిండీలో ఉన్న ఆచార్యబృందాన్నే ఇక్కడికి బదిలీ చేసేరు. కాని వాల్తేరులో వనరులు లేక కాకినాడలో తాత్కాలికంగా పెట్టేరు. అది అలా అక్కడే 'ప్రభుత్వ ఇంజనీరింగు కళాశాల, కాకినాడ' (Government College of Engineering, Kakinada) అన్న పేరుతో స్థిరపడి పోయింది. తరువాత జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (Jawaharlal Nehru Technological University) స్థాపించిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగు కళాశాలలన్నిటిని ఈ కొత్త విశ్వవిద్యాలయానికి అనుబంధించేరు.
  • భారతీయ సమాచార సాంకేతిక విద్యాసంస్థ (Indian Institute of Information Technology) కి శంకుస్థాపన జరిగింది.
  • ఆంధ్రా పాలీటెక్నిక్‌
  • యమ్.యస్.యన్ ఛారిటీస్
  • ఆంధ్ర విశ్వవిద్యాలయం - స్నాతకోత్తర విద్యా కేంద్రం (Andhra University - Post-graduate Extension Center)
  • రంగరాయ వైద్య కళాశాల

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]