Jump to content

కోజికోడ్ జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 11°15′N 75°46′E / 11.25°N 75.77°E / 11.25; 75.77
వికీపీడియా నుండి
(కాలికట్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)
Kozhikode district
Calicut district
Clockwise from top:
Kozhikode Beach, KSRTC bus stand complex, Hilite Mall,
Chaliyam harbour, Administrative block of NIT Calicut, IIM Kozhikode, Calicut Mini Bypass, and Thamarassery Churam.
పటం
Kozhikode district
Location in Kerala
Coordinates: 11°15′N 75°46′E / 11.25°N 75.77°E / 11.25; 75.77
Country India
రాష్ట్రంKerala
ముఖ్యపట్టణంKozhikode
Government
 • CollectorNarasimhugari T. L. Reddy IAS[1]
 • District Panchayat PresidentBabu Parasserry CPI (M)[2]
 • Members of Parliament
విస్తీర్ణం
 • Total2,344 కి.మీ2 (905 చ. మై)
Highest elevation2,339 మీ (7,674 అ.)
జనాభా
 (2018)[3]
 • Total32,49,761
 • జనసాంద్రత1,386/కి.మీ2 (3,590/చ. మై.)
Languages
 • OfficialMalayalam, English
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
ISO 3166 codeIN-KL
Vehicle registrationKL-11 Calicut City,
KL-18 Vatakara,
KL-56 Koyilandy,
KL-57 Koduvally,
KL-76 Nanmanda,
KL-77 Perambra,
KL-85 Ramanattukara (Feroke)
HDI (2005)Increase 0.781[4] ( High)

కోజికోడ్ జిల్లా, భారతదేశం కేరళ రాష్ట్రం లోని జిల్లా.[5] దీనినే కాలికట్ అని కూడా అంటారు. కోళికోడ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా 38.25% నగరీకరణ చేయబడింది. [1] కోళికోడ్ జిల్లా భారతదేశ నైరుతీ సముద్రతీరంలో ఉంది.దీనికి ఉత్తరం కన్నూర్ జిల్లా, తూర్పున వాయనాడ్ జిల్లా, దక్షిణం మలప్పరం జిల్లా, పశ్చిమం అరేబియన్ సముద్రం సరహద్దులుగా ఉన్నాయి.ఇది ఉత్తర అంక్షాంశం 11° 08' నుండి 11° 50' డిగ్రీలు , తూర్పురేఖాంశం 75° 30' నుండి 76° 8' డిగ్రీలు మధ్య ఉంది. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాను 3 రెవెన్యూ విభాగాలుగా, 12 తాలూకాలుగా విభజించారు.

పేరువెనుక చరిత్ర

[మార్చు]

జిల్లా చరిత్ర కోళికోడ్ పట్టణం చరిత్రతో ముడిపడి ఉంది. అనేది కోళికోడ్ అనే పేరు ఆంగ్లరూపం కాలికట్. కోళికోడ్ అనే పేరు అరేబియన్లలో వాడుకలో ఉంది. దీనిని కోక్‌పోర్ట్ అని కూడా పిలిచే వారు. మలయాళ భాషలో కోళి అంటే " కోడి " కోడు అంటే శక్తివంతమైనది. చరిత్రకారుడు కె.వి కృష్ణన్ అయ్యర్ అభిప్రాయం అనుసరించి " కొయి అంటే " ప్రదేశం అంటారు. కొడు అంటే శక్తివంతమైన అని అర్ధం. కోళికోడ్ అంటే శక్తివంతమైన ప్రదేశం అని అర్ధం ".

మలబార్ సముద్రతీరాలు హిందూమహాసముద్రతీర సుగంధద్రవ్యాల వ్యాపారంలో భాగస్వామ్యం వహిస్తుంది. పట్టు, ఇతర వస్తువుల సముద్రతీర వాణిజ్యం రెండువేల సంవత్సరాల నుండి సాగుతుంది. 14వ శతాబ్దంలో కోళికోడ్ స్వతంత్ర దేశంగా అవతరించింది. దీనికి జమోరిన్ పాలకుడుగా ఉండేవాడు.

చరిత్ర

[మార్చు]

1792లో టిప్పు సుల్తాన్ మూడవ ఆంగ్లో యుద్ధం తరువాత కుదుర్చుకున్న ఒప్పందం అనుసరించి మైసూర్ సామ్రాజ్యం నుండి బ్రిటిష్ ప్రభుత్వానికి స్వాధీనం చేసిన భూభాంలో ప్రస్తుత కోళికోడ్ జిల్లా ప్రాంతం కూడా ఉంది. మలబార్ సముద్రతీరంలో కొత్తగా లభించిన బ్రిటిష్ స్వాధీన భూభాగం మలబార్ జిల్లాగా రఉదిద్దుకుని నిర్వహించబడింది. మలబార్ జిల్లాలో కన్నూర్, కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్ జిల్లా, వయనాడ్ ప్రాంతాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంగా కోళికోడ్ ఉండేది. మలబార్ జిల్లా బ్రిటిష్ ప్రభుత్వ " మద్రాస్ ప్రెసిడెంసీ "లో భాగంగా ఉండేది. 1947లో స్వతంత్రం తరువాత మద్రాస్ ప్రెసిడెంసీ మద్రాస్ రాష్ట్రంగా మార్చబడింది. మద్రాస్ రాష్ట్రం భాషాప్రయిక్త రాష్ట్రాలుగా విడదీయబడిన సమయంలో మలబార్ జిల్లాను మునుపటి ట్రావన్కోర్ - కొస్చిన్‌ , కాసర్‌గాడ్లో విలీనం చేస్తూ 1956 నవంబరులో కేరళ రాష్ట్రం రూపొందించబడింది.

మలబార్ జిల్లా పాలనా నిర్వహణకు జిల్లా వైశాల్యం అధికంగా ఉండడం ముఖ్య కారణంగా మారింది. అందువలన 1957 జనవరి 1 న మలబార్ జిల్లా కోళికోడ్, కన్నూర్ , పాలక్కాడు జిల్లాలుగా విభజించబడింది. జిల్లాలో వడకర, కోయిలండీ, కోళికోడ్, ఎర్నాడు , తిరూర్ తాలూకాలు ఉన్నాయి. 1969 జూన్ 16న ఎర్నాడు , తిరూర్ తాలూకాలు కొత్తగా రూపొందించబడిన మలప్పురం జిల్లాలో విలీనం చేయబడ్డాయి. దక్షిణ వయనాడు భూభాగాన్ని ప్రస్తుత వయనాడు జిల్లాగా రూపొందించారు.

Admiral Zheng He's navigation chart from Hormuz to Calicut, 1430

చైనా యాత్రికుడు జెంగ్ హి సందర్శన

[మార్చు]

యోంగ్ లీ శకంలో చైనాకు చెందిన మింగ్ రాజవంశం అడ్మిరల్ జెంగ్ హి, ఆయన నిధి అన్వేషకులు కోళికోడ్‌ను సందర్శించారు. వారి సందర్శనలు లిఖితపూర్వకంగా నమోదు చేయబడ్డాయి. అరబ్ బోర్డ్ అనువాదకుడు మాహుయాన్ ఫెయి క్సిన్, గాంగ్ జెంగ్ దీనిని అరబ్ భాషలో అనువదించి నమోదు చేసారు. అవి సందర్శనలను పుస్తకరూపంలో ప్రచురించబడ్డాయి. మాహుయాన్ పుస్తకం యింగ్ " యాయి షెంగ్ లాన్ " (ఆంగ్లంలో " ది వోవరాల్ సర్వే ఆఫ్ ది ఓషన్ షోర్స్ " పేరుతో) అనువదించబడ్డాయి. అందులో కోళికోడ్‌ గురించి క్రింది వివరణలు ఉన్నాయి:

  • పశ్చిమ సముద్రతీరంలో కాలికట్ పెద్ద సామ్రాజ్యమని అందులో పేర్కొనబడింది. దీనికి తూర్పు సరిహద్దులో కోయంబత్తూర్, దక్షిణ సరిహద్దులో కొచ్చి, ఉత్తర సరిహద్దులో హొనవారి ప్రాంతాలు ఉన్నాయి.
  • కాలికట్ రాజు వనవిక్రముడు బ్రాహ్మణుడు, బౌద్ధుడు. ఆయన వంటవారు ముస్లిములు (ప్రస్తుతం ఇది సరైన పరిశోధన కాదని కాలికట్ రాజు నాయర్ : హిందు అని భావిస్తున్నారు ఆయన వంటవారు హిందువులు, ముస్లిములు అని భావిస్తున్నారు).
  • తరువాత సింహాసనం రాజు సహోదరి కుమారునికి ఇవ్వబడింది.
  • 1407లో మింగ్ రాజవంశానికి చెందిన 5 సంవత్సరాల యంగ్ లి చక్రవర్తి అడ్మిరల్ జెంగ్‌ను ఆదేశంతో కాలికట్ రాజుకు వంటవారిని బిరుదులతో అవార్డులు, వివిధ స్థాయిలకు చెందిన నడుము బెల్టులను బహూకరించాడు.
  • అడ్మిరల్ జెంగ్ ఇందుకు స్మారకచిహ్నంగా కాలికట్‌లో ఒక భవనం నిర్మించాడు.
  • రాజు ముద్రించిన నాణ్యాలలో (ఫనం లేక పణం) 60% బంగారం, వెండి నాణ్యాలు ఉన్నాయి.
  • కలికట్ ప్రజలు విశ్వాశపాత్రులు, పరిశ్రమకు ఓర్చేవారని పేర్కొనబడింది.
  • కాలికట్ ప్రజలు పట్టుపురుగుల నుండి పట్టు తయారుచేసి పట్టుకు వివిధ వర్ణాలతో అద్దకం చేస్తారు.
  • కాలికట్ ప్రజలు టర్నిప్, ఎర్రగడ్డలు, అల్లం, వంకాయలు పండిస్తున్నారు. అలాగే ఎర్రని, తెల్లని బియ్యం పండిస్తున్నారు. గోధుమలు మాత్రం పండించడం లేదు.
  • కాకికట్ రాజు 50 ఔంసుల బంగారాన్ని వెంట్రుక వంటి దారాలను చేయమని, దానితో రిబ్బన్ తయారు చేసి దానిని ముత్యాలు, వివిధ వర్ణాలరత్నాలు పొదిగి మేఖల తయారు చేయమని ఆదేశించాడు. దానిని దూత నైనాకు వద్దకు చేర్చి మింగ్ చక్రవర్తికి కప్పంగా ఇవ్వాలని ఆదేశించాడు.
  • మింగ్ సామ్రాజ్య విధానాలను అనుసరించి రాజులేని ప్రాంతానికి నరగరక్షణ అధికారిగా కాలికట్ వాసిని నియమించాలి. ఆయన జెంగ్‌తో కలవడానికి కాలికట్ వాసి షసోజుని నియమించి బదులుగా వారికి పాలనాధికారం ఇచ్చాడు. తరువాత అడ్మైరల్ జెంగ్ పలు మార్లు కాలికట్‌ను సందర్శించాడు. 1433 ఆయన చివసరి సారిగా కాలికట్ వచ్చి అక్కడే మరణించాడు. జెంగ్ స్మారకార్ధం కాలికట్‌ వద్ద స్మారకచిహ్నం నిర్మించబడింది. 1610లో జెంగ్ స్మారక చిహ్నాన్ని చూసానని జెసూట్ గాడింహొ ఎరాడియా పేర్కొన్నాడు.

వాణిజ్యం

[మార్చు]

జిల్లాకు ఆసియా లోని పలు సామ్రాజ్యాలతో వ్యాపార సంబంధాలు ఉండేవి. అలాగే మిడిల్ ఈస్ట్ వాణిజ్యానికి కోళికోడ్ ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉండేది. వాస్కోడిగామా కోళికోడ్‌కు 18 కి.మీ దూరంలో ఉన్న కప్పడ్ వద్ద 1498 మే మాసంలో వ్యాపార బృందం నాయకుడిగా మొదటిసారిగా భారతదేశంలో ప్రవేశించాడు. వాస్కోడిగామా తనకు తాను జమోరిన్‌గా ప్రకటించికున్నాడు. 16వ శతాబ్దంలో పోర్చ్‌గీస్ కన్నూర్‌కు ఉత్తరంలో ట్రేడింగ్ పోస్ట్ కొచ్చి వద్ద స్థాపించింది. జమోరిన్ పోర్చుగీసులు నగరంలో స్థిపడడం ఎదిరించాడు. 1503లో చెలియంలో రాజా వెట్టాట్ (తిరూర్) అనుమతితో ట్రేడింగ్ పోస్ట్ నిర్మించబడింది. ట్రేడింగ్ పోస్ట్ లను జమోరినెదుర్కూవడానికి ఉపయోగించబడ్డాయి. జమోరిన్ తరువాత నెదర్లాండ్‌తో చేతులు కలిపాడు.17 వ శతాబ్దంలో డచ్ మలబార్ తీర సుగంధ వాణిజ్యాన్ని పోర్చుగీసు నుండి స్వాధీనపరచుకుంది. 1766లో మైసూర్ సామ్రాజ్యానికి చెందిన హైదర్ అలి కోళికోడ్‌ను, మలబార్ సముద్రతీరంలో అధికభాగాన్ని ఆక్రమించుకున్నాడు. తరువాత మద్రాస్ ప్రెసిడెన్సీతో పోరాడాడు. దాని ఫలితంగా 4 ఆంగ్లో - మైసూర్ యుద్ధాలు జరిగాయి.

వాతావరణం

[మార్చు]

జిల్లాలో తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. జూన్ మాసం నుండి సెప్టెంబరు మాసం వరకు నైరుతీ ౠతుపవనాలు ప్రభావం వలన వర్షాలు మెండుగా ఉంటాయి.ఆ తరువాత అక్టోబరు మాసం నుండి నవంబరు మాసం వరకు ఈశాన్య ఋతుపవనాలు ప్రభావం ఉంటుంది.డిసెంబరు , జనవరి మాసాలలో అహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత సరాసరి 39.4 ° సెల్షియస్ ఉండగా, కనిష్ఠ ఉష్ణోగ్రత సరాసరి 15 ° సెల్షియస్ ఉంటుంది. జిల్లాలో సరాసరి వర్షపాతం 3266 మి.మీ.

శీతోష్ణస్థితి డేటా - కోజికోడ్
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 31.6
(88.9)
32
(90)
32.7
(90.9)
33.1
(91.6)
32.4
(90.3)
29.4
(84.9)
28.4
(83.1)
28.3
(82.9)
29.5
(85.1)
30.6
(87.1)
31.3
(88.3)
31.6
(88.9)
30.9
(87.6)
సగటు అల్ప °C (°F) 22
(72)
23.4
(74.1)
25
(77)
26.1
(79.0)
25.8
(78.4)
24
(75)
23.5
(74.3)
23.5
(74.3)
24
(75)
24
(75)
23.6
(74.5)
22.7
(72.9)
23.8
(74.8)
సగటు అవపాతం mm (inches) 2.7
(0.11)
3.4
(0.13)
21.4
(0.84)
90.2
(3.55)
310.9
(12.24)
818.2
(32.21)
902.5
(35.53)
447.3
(17.61)
233.4
(9.19)
263.5
(10.37)
136.6
(5.38)
35
(1.4)
3,284.6
(129.31)
Source: [6]

మత జనాభా

[మార్చు]
మత వివరం జిల్లా%. జనాభా సెక్స్ నిష్పత్తి అక్షరాస్యత రేటు (L.R) L.R మగ L.R ఆడ
హిందువులు' 58,79 1049 94.5 97.3 91.9
ముస్లిం 38,37 1058 91,6 95.3 88,1
క్రైస్తవులు' 2.7 1178 98.2 98,6 97.8
జైనులు 0.06 1003 97.7 99,3 96.1

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,089,543,[7]
ఇది దాదాపు. మంగోలియా దేశ జనసంఖ్యకు సమానం
అమెరికాలోని. లోవా నగర జనసంఖ్యకు సమం.[8]
640 భారతదేశ జిల్లాలలో. 115 వ స్థానంలో ఉంది.[7]
1చ.కి.మీ జనసాంద్రత. 1318 [7]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 7.31%.[7]
స్త్రీ పురుష నిష్పత్తి. 1097:1000 [7]
జాతియ సరాసరి (928) కంటే. ఎక్కువ
అక్షరాస్యత శాతం. 95.24%.[7]
జాతియ సరాసరి (72%) కంటే. ఎక్కువ

శతాబ్ధాల తరబడి హిందూమహాసముద్రం మీదుగా సాగిన వర్తకం జిల్లాను మాహానగరంగా మార్చింది. జిల్లాలో హిందువులు అధికంగా ఉన్నారు. తరువాత స్థానంలో ముస్లిములు (మొపిల్లాస్), క్రైస్తవులు అధికంగా ఉన్నారు. సా.శ. 52 నుండి కేరళాలో పోర్చుగీసు ప్రజలతో క్రైస్తవం ప్రవేశించిందని భావిస్తున్నారు. తరువాత పోర్చిగీసులు, డచ్ బ్రిటిష్ ప్రజలతో క్రైస్తవుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

శాసనాత్మక నియోజకవర్గాలు

[మార్చు]

కోళికోడ్ ఉత్తరం, కోళికోడ్ దక్షిణం, కున్నమంగలం, కొదువల్ల్య్, నదపురం, బెయ్పోర్, బలుస్సెర్య్, తిరువంబడి, ఎలథుర్, కోజికోడ్, పెరంబ్ర, కొయిలంద్య్, కుత్తియడి, వదకర.

మాధ్యమం

[మార్చు]

కోళికోడ్ మలయాళం జర్నలిజ చరిత్రలో ప్రధానస్థానం ఆక్రమించుంది. 1880 నుండి జిల్లాలో జర్నలిజం మొదలైంది. కోళికోడ్‌లో మొదటిసారిగా ప్రచురించబడిన వార్తా పయ్రిక " కేరళ పత్రిక ". 1893 నుండి కోళికోడ్‌లో ప్రచిరించబడుతున్న పత్రికలలో కేరళం, కేరళా సంచారి, భరతన్ విలాసం మొదలైనవి ప్రధానమైనవి. మలయాళ వార్తాపత్రికలలో ప్రధానమైనవి మలయాళ మనోరమ, మాతృభూమి, చంద్రిక పత్రికలకు ఆదరణ అధికంగా ఉంది. దేశీయ పత్రికలలో ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎడిషన్ కూడా నగరంలో ప్రచురించబడుతుంది.

రేడియో

[మార్చు]

ఆల్ ఇండియా రేడియా సంబంధిత కోళికోడ్ స్టేషను 1950 మే 14 నుండి పనిచేస్తుంది. దీనికి రెండు ట్రాంస్‌మీటర్లు ఉన్నాయి. కోళికోడ్ ఏ 10 కి.వా శక్తి బి (వివిధభారతి) 1 కి.వా శక్తితో పనిచేస్తుంది.

టెలివిజన్

[మార్చు]

1984 జూలై 3 నుండి కోళికోడ్ టెలివిజన్ ట్రాంస్‌మీటర్ ఢిల్లీ, తిరువనంతపురం ప్రసారాలను అందిస్తుంది. జిల్లా అంతటా కేబుల్, శాటిలైట్ టెలివిజన్ టెలివిజన్ సేవలు లభ్యం ఔతున్నాయి. 2013లో మీడియా వన్ పేరుతో కాలికట్ నుండి హెచ్.క్యూ వార్తా ప్రసారాలను అందిస్తుంది. ఇది కలికట్ నుండి ప్రసారం చేస్తున్న మొదటి ప్రసారంగా గుర్తించబడుతుంద.

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]
Mananchira, Kozhikode
View of Kappad beach

జిల్లాలోని ఆలయాలు, మసీదులలో శిలలు, శిల్పాలు ఉన్నాయి. వీటిని నగరంలోని కళారంగ విద్యార్థులు సందర్శిస్తూ ఉంటారు. కోళికోడు నగరంలో పలు ఆలయాలు ఉన్నాయి. వాటిలో తాళి ఆలయం, తిరువన్నూర్ ఆలయం, అళకోడి ఆలయం, శ్రీ వలయనాడు ఆలయం వరక్కల్ ఆలయం, బిలతికులం ఆలయం, బైరాగి మడం ఆలయం, లోకనార్కవు ఆలయం (వడకర సమీపంలో ఉన్న మెముండ వద్ద), సిద్ధ సమాజం (మెముండ), శ్రీముతప్పన్ పయంకుటి మల (సంద్బంక్ వతకర లోని మెముండ), ప్రధానమైనవి.

క్రిష్ణమేనన్ మ్యూజియం

[మార్చు]

కృష్ణమేనన్ మ్యూజియం కోళికోడ్ తూర్పు కొండలలో ఉంది. ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ ఉంది. కోళికోడ్ టౌన్ హాల్ ఆనుకుని లలిత కళా అకాడమీలో కూడా ఆర్ట్ గ్యాలరీ ఉంది. కోళికోడులో " ఇండియన్ బిజినెస్ మ్యూజియం " కూడా ఉంది. నగరకేంద్ర స్థానంలో జాఫర్‌ఖాన్ కాలనీ వద్ద ప్లానిటోరియం ఉంది. కోళికోడ్ సముద్రతీరం, మనచిర సముద్రతీరం, సమీపకాలంలో నిర్మించిన సరోవరం మొదలైన పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.

తుషారగిరి జలపాతం

[మార్చు]

రైల్వే స్టేషను సమీపంలో ఉన్న తుషారగిరి జలపాతం చాలా అందమైనది ఆకర్షణీయమైనదిగా గుర్తించబడుతుంది. ఇక్కడ కేరళ పర్యాటకం డెవెలెప్మెంటు కార్పొరేషన్ హోటెల్ నిర్వహించబడుతుంది.

ఆటో నగర్

[మార్చు]

కోళికోడ్ కేంద్రంలో ఉన్న నడక్కవే నగరానికి 10కి.మీ దూరంలో ఉంది. ఇది ఆటోమొబైల్ విడిభాగాలకు ప్రసిద్ధి. ఇక్కడ అన్ని వాహనాలకు విడిభాగాలు దాదాపు లభిస్తుంటాయి. ఇక్కడ వ్యాపారులు, డాక్టర్లు, మద్యతరహతి ప్రజలు నివసిస్తుంటారు. ఇక్కడ రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీస్, రీజనల్ వర్క్‌షాప్, ట్రాంస్‌పోర్ట్ కార్పొరేషన్ (కె.ఎస్.ఆర్.టి.సి), సేల్స్ టాక్స్ ఆఫీస్ ఉన్నాయి.

కుట్టియాడి ఆనకట్ట

[మార్చు]

కేరళాలోని పెద్ద ఆనకట్టలలో కుట్టియాడి ఆనకట్ట ఒకటి. ఇది చాలా సుందరంగా ఉంటుంది.

కప్పాడ్ సముద్రతీరం

[మార్చు]

వాస్కోడిగామా మొదటిసారిగా భారతదేశంలో ప్రవేశించి ప్రదేశం కేరళాలోని కప్పాడ్ సముద్రతీరం.

బేపోర్ నౌకాశ్రయం

[మార్చు]

కోళికోడ్ మరొక పార్యాటక ఆకర్షణ బేపోర్ నౌకాశ్రయం. మలబార్ వ్యాపార చరిత్రలో ఇది ప్రధాన ప్రదేశంగా ఉంది. కేరళాలో ఉరు (అరేబియన్ ట్రేడింగ్ వెసెల్) ఉన్న ఒకేఒక ప్రదేశం కోళికోడ్ మాత్రమే.

సంస్కృతి , ఆహారం

[మార్చు]

మలయాళ భాషా, సాహిత్యం కోళికోడ్ గుర్తించతగినంత భాగస్వామ్యం వహించింది. జిల్లాలో జానపద గీతాలు లేక బల్లాడ్‌లు (వడక్కన్ పాట్టుకళ్) లకు ప్రసిద్ధిచెందింది. వీటిలో తచోలీ ఒతనాన్ అత్యధిక ప్రజాదరణ పొంది ఉన్నాయి. మాపిళ్ళ పాట్టు, ఒప్పన పాటలు ముస్లిం సంప్రదాయంలో భాగంగా ఉన్నాయి. తులాం మాసంలో తాలి ఆలయంలో పట్టదానం పేరుతో వేదపండితులకు సాహిత్య చర్చ నిర్వహించబడుతుంది. కోళికోడ్‌కు గజల్స్‌తో కూడా సన్నిహిత సంబంధం ఉంది. జిల్లాలో ఫుట్ బాల్ క్రీడకు విశేష ఆదరణ ఉంది. ఎఫ్.ఐ. ఎఫ్.ఎ వరల్డ్ కప్ అత్యుత్సాహంగా నిర్వహించబడుతుంది.

వాణిజ్యం

[మార్చు]

జిల్లాలో పొడవైన మిథై తెరువు వాణిజ్య కూడలిగా పేరుపొందింది. ఇక్కడ చీరెలు, సౌందర్యసాధనాలు, గృహ ఆహారనిలయాలు, స్వీట్ షాపులు ఉన్నాయి. మైతిలి తెరు (ఎస్.ఎం. స్ట్రీట్) లో కోళికోడ్ హల్వా (తరచుగా యురేపియన్లు దీనిని స్వీట్ మీట్ అంటారు) విక్రయించబడుతుంది. జిల్లాలో విభిన్న సంప్రదాయాలకు చెందిన హోళీ, క్రిస్మస్, ఈద్- ఉల్- ఫిర్ట్ పండుగలను (హిందూ, క్రైస్తవ, ముస్లిం పండుగలు) సమానంగా జరుపుకుంటారు.

శాకాహారం

[మార్చు]

కోళికోడ్ రుచికరమైన ఆహారాలకు కూడా ప్రసిద్ధి చెందింది. శాకాహారభోజనంలో " సదయ " (సాంబార్, పప్పడం, ఏడు వివిధమైన కూరలతో పూర్తి భోజనం) అందించబడితుంది. మాంసాహర భోజనంలో క్రైస్తవ మరొయు ముస్లిం వంటకాలు చోటు చేసుకుంటాయి. ఇందులో చేపలు, మాసంతో తయారు చేసిన ఆహారాలు ఉంటాయి. బిర్యాని ప్రజలకు అభిమాన ఆహారాలలో ఒకటిగా ఉంది. చికెన్, బాసుమతి బియ్యానికి మలబార్ మసాలాలను కలిపి వండబడుతున్న రుచికరమైన వంటకం.

విద్య

[మార్చు]

జిల్లాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంటు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (గతంలో ఇది రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్), ది కాలికట్ మెడికల్ కాలేజ్ .[9] మొదలైన ప్రధాన విద్యాసంస్థలు ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Who's Who". Distrik Kozhikode. Retrieved 30 November 2021.
  2. "District Panchayath Kozhikode". kozhikodejillapanchayath.in. Archived from the original on 19 ఫిబ్రవరి 2020. Retrieved 15 February 2020.
  3. Annual Vital Statistics Report – 2018 (PDF). Thiruvananthapuram: Department of Economics and Statistics, Government of Kerala. 2020. p. 55. Archived from the original (PDF) on 2021-11-02. Retrieved 2023-03-31.
  4. "Kerala | UNDP in India". UNDP.
  5. "List of Districts in Kerala - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-06-10.
  6. "Kozhikode weather". India Meteorological Department. Archived from the original on 5 మే 2010. Retrieved 14 November 2010.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  8. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Iowa 3,046,355
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-05-30. Retrieved 2020-01-07.

వెలుపలి లింకులు

[మార్చు]