Jump to content

కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం

వికీపీడియా నుండి
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం
పథకం రకంతల్లి, బిడ్డ సంరక్షణ
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
ముఖ్యమంత్రికల్వకుంట్ల చంద్రశేఖరరావు
ప్రారంభం10 సెప్టెంబరు 2022 (2022-09-10)
తెలంగాణ
స్థితిఅమలులో ఉంది

కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం, తెలంగాణ రాష్ట్రంలోని గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పథకం.[1] ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజల లవణాలతో కూడిన 2వేల రూపాయల గల ఈ న్యూట్రిషన్‌ కిట్‌ ను గర్భిణీలకు రెండుసార్లు (5వ నెలలోనూ, 9వ నెలలోనూ) అందిస్తారు.[2]

రూపకల్పన

[మార్చు]

ఏజెన్సీ ప్రాంతాల్లో మహిళలు తీవ్రమైన రక్తహీనతను ఎదుర్కొంటున్నారని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ సమస్యను అధిగమించేందుకు దేశంలో అత్యుత్తమ విధానాన్ని అనుసరిస్తున్న రాష్ర్టాల్లో అధ్యయనానికి మహిళా ఐఏఎస్‌ అధికారుల బృందాన్ని పంపించింది. సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్‌, స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ దివ్యా దేవరాజన్‌, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తూ సహా 8 మంది మహిళా ఐఏఎస్‌ అధికారులు తమిళనాడు, కేరళ రాష్ర్టాలలో పర్యటించారు. వారి సిఫారసులను పరిశీలించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు దేశంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ రూపొందించబడింది.[3]

ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డుతున్న గ‌ర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం నుండి న్యూట్రిష‌న్ కిట్ అందజేస్తామని 2022 మార్చిలో జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాలలో మార్చి 10న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హ‌రీశ్‌రావు ప్ర‌క‌టించాడు.[4]

గర్భిణీ మహిళలు పౌష్టికాహారం తీసుకుంటే గర్భంలోని శిశువులు ఆరోగ్యకరంగా పెరుగుతారు. అయితే, మారుమూల జిల్లాల్లోని మహిళలకు పౌష్టికాహారం లభించడం లేదని సర్వేలో గుర్తించిన ప్రభుత్వం గర్భిణులు, గర్భంలోని శిశువు రక్షణ కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ కిట్ వల్ల గర్భిణులకు విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు అందుతున్నాయి.[5]

ప్రారంభం

[మార్చు]

తెలంగాణలోని ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగర్‌ కర్నూల్‌, వికారాబాద్‌ జిల్లాలను ఎంపికచేసి 2022 సెస్టెంబరులో బతుకమ్మ పండుగ కానుకగా ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించాలనుకున్నారు.[6] 9 జిల్లాలలోని 205 ఆరోగ్య కేంద్రాల ద్వారా 1.50 లక్షల మంది గర్భిణీలకు అందించేందుకు 50 కోట్ల రూపాయలతో దాదాపు 2,29,552 న్యూట్రిషన్ కిట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పథకం సెప్టెంబరులో ప్రారంభం కాలేదు.

2022 డిసెంబరు 21న కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో హరీశ్ రావు, తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రోడ్లు భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తదితరులుతో కలిసి కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభించగా ఇదే సమయంలో ఆదిలాబాద్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్, ములుగులో సత్యవతి రాథోడ్, జయశంకర్‌ భూపాలపల్లిలో ఎర్రబెల్లి దయాకర్‌ రావు, వికారాబాద్‌లో సబితా ఇంద్రారెడ్డి, నాగర్‌కర్నూల్‌లో మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్, గద్వాల్‌ జిల్లాలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డిలతోపాటు స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి ప్రారంభించారు.[7]

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలులో భాగంగా 2023, జూన్ 14న నిమ్స్ ఆసుపత్రి వేదికగా జరిగిన తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్త కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రారంభించి, ఆరుగురు గర్భిణులకు కిట్లను అందజేశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ ఆలీ, ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు, పశు సంవర్థక శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, లతోపాటు స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.[8]

కిట్‌లో ఉండే వస్తువులు

[మార్చు]

ఈ కిట్ లో ఈ క్రింది వస్తువులు ఉంటాయి.[9] మొదటి కిట్ విలువ 1,962 రూపాయలు... రెండవ కిట్ విలువ 1,818 రూపాయలు.[10]

  • న్యూట్రిషన్‌ మిక్స్‌డ్‌ పౌడర్‌ (హార్లిక్స్‌) 2 బాటిళ్లు (ఒక్కొక్కటి కిలో చొప్పున)
  • ఖర్జూర ఒక కిలో
  • నెయ్యి 500 గ్రాములు
  • ఐరన్‌ సిరప్‌ 3 బాటిళ్లు
  • ఆల్బెండజోల్‌ ట్యాబ్లెట్లు ఒక కప్పు
  • ప్లాస్టిక్ బుట్ట
  • వస్త్రపు సంచి
  • కప్పు

మూలాలు

[మార్చు]
  1. "Pregnant women to be given KCR nutrition kits". The Hindu. Special Correspondent. 2022-08-13. ISSN 0971-751X. Archived from the original on 2022-08-14. Retrieved 2022-08-14.{{cite news}}: CS1 maint: others (link)
  2. telugu, NT News (2022-08-14). "గర్భిణులకు బతుకమ్మ కానుక." Namasthe Telangana. Archived from the original on 2022-08-14. Retrieved 2022-08-14.
  3. telugu, NT News (2022-12-21). "కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌.. నేడు ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు". www.ntnews.com. Archived from the original on 2022-12-21. Retrieved 2022-12-21.
  4. telugu, NT News (2022-03-11). "9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్ ప‌థ‌కం అమ‌లు : మంత్రి హ‌రీశ్‌రావు". Namasthe Telangana. Archived from the original on 2022-03-11. Retrieved 2022-08-14.
  5. "గర్భిణీలకు 'కేసీఆర్‌ పౌష్టికాహార కిట్'.. వచ్చే వారమే శ్రీకారం." ETV Bharat News. 2022-12-04. Archived from the original on 2022-12-04. Retrieved 2022-12-04.
  6. "బతుకమ్మ కానుకగా కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌". Sakshi. 2022-08-14. Archived from the original on 2022-08-14. Retrieved 2022-08-14.
  7. "ఆరోగ్య తెలంగాణే భారాస లక్ష్యం: హరీశ్‌రావు". EENADU. 2022-12-21. Archived from the original on 2022-12-21. Retrieved 2022-12-21.
  8. "CM KCR : నిమ్స్ కొత్త బ్లాక్ కు భూమిపూజ.. న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి శ్రీకారం". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-06-14. Archived from the original on 2023-06-14. Retrieved 2023-06-14.
  9. India, The Hans (2022-08-14). "'KCR Nutrition kit' to be launched next month". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-08-14. Retrieved 2022-08-14.
  10. "గర్భిణులకు కేసీఆర్‌ పౌష్టికాహార కిట్లు". EENADU. 2022-12-04. Archived from the original on 2022-12-04. Retrieved 2022-12-04.