Jump to content

కొట్టాయం జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 9°35′41″N 76°29′08″E / 9.5947087°N 76.4855729°E / 9.5947087; 76.4855729
వికీపీడియా నుండి
(కొట్టయం జిల్లా నుండి దారిమార్పు చెందింది)
Kottayam
City
Top to bottom, left to right: MC Mathew memorial at Thirunakkara, Aksharashilpam, Immaculate Heart of Mary Cathedral, Kodimatha Boat Jetty, Kottayam Government Medical College, CMS College Kottayam
Top to bottom, left to right: MC Mathew memorial at Thirunakkara, Aksharashilpam, Immaculate Heart of Mary Cathedral, Kodimatha Boat Jetty, Kottayam Government Medical College, CMS College Kottayam
Kottayam is located in Kerala
Kottayam
Kottayam
Location in Kerala, India
Kottayam is located in India
Kottayam
Kottayam
Kottayam (India)
Coordinates: 9°35′41″N 76°29′08″E / 9.5947087°N 76.4855729°E / 9.5947087; 76.4855729
Country India
రాష్ట్రంKerala
జిల్లాKottayam
RegionCentral Travancore
Incorporated1921
Official LanguageMalayalam
Native LanguageMalayalam
Government
 • TypeMunicipality
 • BodyKottayam Municipality
 • Municipal ChairpersonBincy Sebastian
విస్తీర్ణం
 • City77.8 కి.మీ2 (30.0 చ. మై)
 • Land134.51 కి.మీ2 (51.93 చ. మై)
 • Water3.09 కి.మీ2 (1.19 చ. మై)
 • Urban
157.6 కి.మీ2 (60.8 చ. మై)
 • Metro
200.83 కి.మీ2 (77.54 చ. మై)
 • Rank5
Elevation
3 మీ (10 అ.)
జనాభా
 • City1,36,812
 • జనసాంద్రత1,800/కి.మీ2 (4,600/చ. మై.)
 • Urban
1,82,927
 • Urban density1,200/కి.మీ2 (3,000/చ. మై.)
 • Metro
3,57,533
 • Metro density1,800/కి.మీ2 (4,600/చ. మై.)
DemonymKottayamkar
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్
686 001
Telephone codeKottayam:0481
Vehicle registrationKL-05
Sex ratio1075 female(s)/1000 male(s)/ /
Literacy99.66 %
HDI0.831

కొట్టాయం జిల్లా, భారతదేశం కేరళ రాష్ట్రంలోని జిల్లా.[1][2] ఈ ప్రాంతానికి తూర్పున పశ్చిమ కనుమలు, పశ్చిమాన కుట్టనాడ్ వెంబనాడ్ సరస్సు ఉంది. జిల్లా అంతటా పచ్చని పొలాలతో దర్శనమిచ్చే కొట్టాయం జిల్లా అసాధారణమైన లక్షణాలను కలిగి ఉంది [3] నైరుతి కేరళలో ఉన్న కొట్టాయం పట్టణం ఈ జిల్లాకు ప్రధాన కార్యాలయం. కొట్టాయం పట్టణం రాష్ట్ర రాజధాని తిరువనంతపురం ఉత్తరాన దాదాపు 155 కిలోమీటర్లు (96 మై.) దూరంలో ఉంది.దీపిక, మలయాళ మనోరమ , మంగళం వంటి అనేక మొదటి మలయాళ దినపత్రికలు ఈ ప్రాంతంలోనే ప్రారంభించబడ్డాయి, నేటికీ కూడా వారి ప్రధాన కార్యాలయాలు కొట్టాయం పట్టణంలో నడుపుతున్నారు. కొట్టాయం జిల్లాలో కొట్టాయం, చంగనస్సేరి, పాలా, ఎరట్టుపేట, ఎట్టుమనూరు, వైకోమ్ అనే ఆరు పురపాలక పట్టణాలు ఉన్నాయి.కేరళలో అరేబియా సముద్రం లేదా ఇతర రాష్ట్రాలు సరిహద్దులుగా లేని ఏకైక జిల్లా. హిందుస్థాన్ న్యూస్‌ప్రింట్ లిమిటెడ్, రబ్బర్ బోర్డ్ జిల్లాలో ఉన్న రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు. కేరళలోని నాయర్ సర్వీస్ సొసైటీ, ఇండియన్ ఆర్థోడాక్స్ చర్చి అనే రెండు మత సంఘాల ప్రధాన కార్యాలయాలు కొట్టాయం జిల్లాలో ఉంది:

చరిత్ర

[మార్చు]

తెక్కుంకూర్ పాలన (1100 - 1753)

[మార్చు]

సా.శ. తొమ్మిదవ శతాబ్దం ఆరంభం నుండి, తెక్కుంకూర్ ఇంకా కొట్టాయం చరిత్ర వాస్తవికంగా చాలా దగ్గర అపోలికలను కలిగి ఉంటాయి. కొట్టాయం అప్పుడు కులశేఖర సామ్రాజ్యం (800–1102AD) అయిన వెంపోలినాడ్‌లో భాగంగా ఉంది. సుమారు 1100 AD సమయంలో వెంపోలినాడ్ రాజ్యం తెక్కుమ్కుర్ ఇంకా వడక్కుమ్కుర్ అనే రెండు రాజ్యాలుగా చీలిపోయింది, రెండోది కొచ్చిన్ సామంత సామ్రాజ్యంగా ఏర్పడింది.

ట్రావెన్‌కోర్ పాలన (1753 - 1949)

[మార్చు]

1817లో కొట్టాయంలో మొదటిసారి ఇంగ్లండ్ చర్చ్ మిషనరీ సొసైటీ CMS కళాశాలను పాశ్చాత్య కళాశాలను ప్రారంభించింది. బ్యూరోక్రాట్లకు సరైన శిక్షణ అందించడానికి ఈ కళాశాల అవసరమని ట్రావెన్‌కోర్ ప్రభుత్వం స్వాగతించింది .[4]

భారత ప్రభుత్వ పాలన (1949 - ప్రస్తుతం)

[మార్చు]

భారతప్రభుత్వం ఏర్పడ్డాక కొచ్చిన్ ట్రావెన్‌కోర్‌లో రెవెన్యూ డివిజన్‌గా మారింది.[5] 1949లో ట్రావెన్‌కోర్, కొచ్చిన్ రాష్ట్రాలు విలీనం అయిన సమయంలో, ఈ రెవెన్యూ డివిజన్‌లు జిల్లాలుగా పునర్నిర్వహించబడ్డాయి. 1949 నుండి దివాన్ పేష్కార్‌లకు బదులు జిల్లా కలెక్టర్ల పాలన మొదలైంది.[6]

జనాభా గణాంకాలు

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19014,50,615—    
19114,88,040+0.80%
19215,85,478+1.84%
19317,75,069+2.84%
19419,42,899+1.98%
195111,32,478+1.85%
196113,13,983+1.50%
197115,39,030+1.59%
198116,97,442+0.98%
199118,28,271+0.75%
200119,53,646+0.67%
201119,74,551+0.11%
ఆధారం:[7]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం కొట్టాయం జిల్లాలో 19,74,551 జనాభా ఉంది. ఇది [8] స్లోవేనియా దేశం [9] లేదా యుఎస్ రాష్ట్రం న్యూ మెక్సికోతో సమంగా ఉంటుంది.[10] ఇది జనాభా పరంగా భారతదేశంలోని మొత్తం 640 జిల్లాలలో 234వ ర్యాంక్‌ను ఇస్తుంది [8] జిల్లాలోని విస్తీర్ణంలో ప్రతి చ.కి.మీ.కు (2.320 చ.మైళ్లు) 896 మంది జనసాంద్రత ఉంది.[8]

2001–11 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 1.32% శాతానికి పెరిగింది [8] కొట్టాయంలో ప్రతి 1000 మంది పురుషులకు 1040 స్త్రీల లింగ నిష్పత్తి ఉంది. మొత్తం జనాభాలో అక్షరాస్యత రేటు 97.21% ఉంది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం, భారతదేశ స్థాయిలో 4వ స్థానంలో ఉంది. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వరుసగా 7.79%, 1.11% మంది ఉన్నారు.[8]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

కొట్టాయం జిల్లా తన రెవెన్యూ పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ కోసం 100 రెవెన్యూ గ్రామాలుగా విభజించబడింది.[11] అవి 5 తాలూకాలు క్రింద వివరించిన విధంగా ఉన్నాయి.[11]

  • చంగనస్సేరి తాలూకా పరిధిలో 15
  • కంజిరపల్లి తాలూకా పరిధిలో 13
  • కొట్టాయం తాలూకా పరిధిలో 26
  • మీనాచిల్ తాలూకా పరిధిలో 28
  • వైకోమ్ తాలూకా పరిధిలో 18

పర్యాటకం, వన్యప్రాణులు

[మార్చు]

కొట్టాయం జిల్లాలో నదులు, బ్యాక్ వాటర్స్, పురాతన మతపరమైన ప్రదేశాలు, హిల్ స్టేషన్లులను కలిగిఉన్నాయి.

స్థానిక పర్యాటక ప్రదేశాలు

[మార్చు]

రవాణా సౌకర్యాలు

[మార్చు]

కొట్టాయం జిల్లా లోని అన్ని ప్రాంతాల నుండి కేరళలోని ఇతర ప్రముఖ నగరాలకు ప్రధాన రహదారులు ద్వారా, రైలు మార్గాల ద్వారా అనుసంధానించబడి ఉంది. అలాగే జలమార్గ ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. కొట్టాయం కుమలి, ఎట్టుమనూరు-ఎర్నాకులం, కొట్టాయం-పతనంతిట్ట, తిరువల్ల-కిడంగూర్ సెంట్రల్ కేరళ బైపాస్, ప్రధాన సెంట్రల్ రోడ్డు జిల్లాలోని ప్రధాన రహదారులు. సమీప విమానాశ్రయం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం. కొట్టాయం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కేరళ రాష్ట్ర జల రవాణా శాఖ ఫెర్రీ సేవలను నిర్వహిస్తోంది. అలప్పుజ్హ జిల్లా లోని వైకోమ్ నుండి తవనక్కడవు వరకు ఫెర్రీ సర్వీస్ చాలా పొడవైంది.

పరిపాలన

[మార్చు]

ఆదాయ విభాగాలు

[మార్చు]

కొట్టాయం నగరం కొట్టాయం జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. జిల్లాను కొట్టాయం, పాల అనే రెండు రెవెన్యూ విభాగాలుగా విభజించబడింది-.[16]

పురపాలక పట్టణాలు

[మార్చు]

జిల్లాలో 6 పురపాలక పట్టణాలు ఉన్నాయి. అవి:[17]

  • చంగనస్సేరి
  • ఈరట్టుపేట
  • ఎట్టుమనూరు
  • కొట్టాయం
  • పాలా
  • వైకోమ్

శాసన ప్రాతినిధ్యం

[మార్చు]

లోక్‌సభ నియోజకవర్గాలు

[మార్చు]

కొట్టాయం జిల్లాలో రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి: కొట్టాయం (7 అసెంబ్లీ నియోజకవర్గాలు), పతనంతిట్ట (2 అసెంబ్లీ నియోజకవర్గాలు కంజిరపల్లి, పూంజర్).

శాసనసభ నియోజకవర్గాలు

[మార్చు]

కొట్టాయం జిల్లాలో తొమ్మిది కేరళ శాసనసభ స్థానాలు ఉన్నాయి.[18]

కొట్టాయం జిల్లా నుండి కేరళ శాసనసభ నియోజకవర్గాలు - (9)
వ.సంఖ్య. నియోజకవర్గాలు సభ్యుడు పేరు పార్ఠీ కూటమి
1 పాలా శాసనసభ నియోజకవర్గం మణి సి. కప్పన్ NCP       UDF
2 కడుతురుత్తి శాసనసభ నియోజకవర్గం మోన్స్ జోసెఫ్ KEC       UDF
3 వైకోమ్ శాసనసభ నియోజకవర్గం సి.కె. ఆశా CPI       LDF
4 ఎట్టుమనూరు శాసనసభ నియోజకవర్గం వి.ఎన్. వాసవన్ CPI (M)       LDF
5 కొట్టాయం శాసనసభ నియోజకవర్గం తిరువంచూర్ రాధాకృష్ణన్ INC       UDF
6 పుత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం ఊమెన్ చాందీ INC       UDF
7 చంగనస్సేరి శాసనసభ నియోజకవర్గం జాబ్ మైఖేల్ KC (M)       LDF
8 కంజిరపల్లి శాసనసభ నియోజకవర్గం ఎన్. జయరాజ్ KC (M)       LDF
9 పూంజర్ శాసనసభ నియోజకవర్గం సెబాస్టియన్ కులతుంకల్ KC (M)       LDF

విద్య

[మార్చు]

కేరళలో మొదటి పాశ్చాత్య శైలి కళాశాల సి.ఎం.ఎస్. కొట్టాయంలోని కళాశాల (వ్యాకరణ పాఠశాల) (1840) ఏర్పడింది.[19]

జిల్లాలోని ప్రముఖ విద్యా సంస్థలు

[మార్చు]
  • సి.ఎం.ఎస్ కాలేజ్ కొట్టాయం
  • ప్రభుత్వ కళాశాల, కొట్టాయం [20]
  • ప్రభుత్వ వైద్య కళాశాల, కొట్టాయం
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కొట్టాయం (ఐఐటి-ె)
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, కొట్టాయం (ఐఐఎంసి-కె)
  • కె. ఆర్, నారాయణన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విజువల్ సైన్స్ అండ్ ఆర్ట్స్
  • కొట్టాయం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్
  • మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కేరళ.
  • రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కొట్టాయం (ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల)

ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "List of Districts in Kerala - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-06-10.
  2. "Municipal corporations in Kerala". Archived from the original on 2021-06-18. Retrieved 2021-10-27.
  3. "About Kottayam". Government of Kerala. 4 April 2020. Retrieved 10 April 2020.
  4. "Setting standards of excellence: UGC recognition has added to CMS College's list of merits". The Hindu. 4 January 2005. Archived from the original on 15 మార్చి 2005. Retrieved 5 April 2010.
  5. Kurien L (2010). "Structure and functioning of Gramsabhas" (PDF). {{cite journal}}: Cite journal requires |journal= (help)
  6. "Kottayam District, Government of Kerala | Kottayam, the Land of Letters | India".
  7. Decadal Variation In Population Since 1901
  8. 8.0 8.1 8.2 8.3 8.4 "District Census Hand Book – Kottayam" (PDF). Registrar General and Census Commissioner of India. 2011.
  9. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 September 2011. Retrieved 1 October 2011. Slovenia 2,000,092 July 2011 est.
  10. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 19 October 2013. Retrieved 30 September 2011. New Mexico – 2,059,179
  11. 11.0 11.1 "కొట్టాయం జిల్లాలోని రెవెన్యూ గ్రామాలు". నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, భారత ప్రభుత్వం. Retrieved 13 జూన్ 2022.
  12. http://www.forest.kerala.gov.in/index.php/kottayam Archived 2020-09-20 at the Wayback Machine [bare URL]
  13. 13.0 13.1 "VEMBANAD LAKE | Kottayam District, Government of Kerala | India".
  14. "ILAVEEZHAPOONCHIRA | Kottayam District, Government of Kerala | India".
  15. "Vagamon,Wagamon, Vagamon hill station, Vagamon Heights, Vagamon Hideout".
  16. "Revenue divisions in Kottayam district". National Informatics Centre, Ministry of Electronics and Information Technology, Government of India. Retrieved 13 June 2022.
  17. "Municipalities | District Kottayam, Government of Kerala | India". Retrieved 2022-06-13.
  18. Niyamsabha official site
  19. CMS College CMS website.
  20. "Government College Kottayam". Archived from the original on 20 March 2015. Retrieved 11 June 2021.

వెలుపలి లంకెలు

[మార్చు]