Coordinates: 17°24′29″N 78°28′49″E / 17.4080°N 78.4802°E / 17.4080; 78.4802

గగన్‌మహల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గగన్‌మహల్‌
సమీప ప్రాంతాలు
గగన్‌మహల్‌ is located in Telangana
గగన్‌మహల్‌
గగన్‌మహల్‌
తెలంగాణలో ప్రాంతం ఉనికి
గగన్‌మహల్‌ is located in India
గగన్‌మహల్‌
గగన్‌మహల్‌
గగన్‌మహల్‌ (India)
Coordinates: 17°24′29″N 78°28′49″E / 17.4080°N 78.4802°E / 17.4080; 78.4802
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్ జిల్లా
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500029
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంహిమాయత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

గగన్‌మహల్‌, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. హైదరాబాదు నగరంలోని ప్రముఖ ప్రాంతాలలో ఒకటైన ఈ గగన్‌మహల్‌ ప్రాంతం వ్యాపారాలకు, నివాసానికి అత్యంత ప్రముఖమైన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఇది హైదరాబాదు జిల్లాలోని హిమాయత్‌నగర్ మండల పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతం హైదరాబాదు మహానగరపాలక సంస్థ, కవాడిగూడ డివిజన్‌ పరిధిలోని 90వ వార్డు నంబరులో ఉంది.[1]

సమీప ప్రాంతాలు[మార్చు]

చంద్రానగర్, హుస్సేన్ సాగర్, సాయి విహార్, రాజా మనోహర్ కాలనీ, ఆర్.టి.సి. క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, బర్కత్‌పురా, హిమాయత్ నగర్, నల్లకుంట, కోఠి మొదలైన ప్రాంతాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.[2]

నివాసం, వాణిజ్యం[మార్చు]

ఇది హిమాయత్ నగర్ ప్రాంతానికి సమీపంలో ఉండడంతో ఇక్కడ అనేకమంది నివాసముంటున్నారు. గగన్‌మహల్‌లో అనేక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చాట్ బండార్లు, టీ స్టాల్స్, బేకరీలు, పాన్ షాప్స్, రెస్టారెంట్లు, జ్యూస్ సెంటర్స్ ఉన్నాయి.

ప్రజా రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో గగన్‌మహల్‌ నుండి వి.ఎస్.టి, కోఠి, టోలిచౌకి, సికింద్రాబాద్, గచ్చిబౌలి, మెహదీపట్నం, ఇసిఐఎల్, జూబ్లీ హిల్స్, కుషాయిగూడ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] ఇక్కడికి సమీపంలోని ఖైరతాబాదు, లక్డికాపూల్ ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

ప్రార్థనా మందిరాలు[మార్చు]

  • జగన్నాథ దేవాలయం
  • పోచమ్మ దేవాలయం
  • మైసమ్మ దేవాలయం
  • మస్జిద్ ఇ అలంగీర్
  • మస్జిద్-ఎ-సుభానీ

విద్యాసంస్థలు[మార్చు]

  • నారాయణ జూనియర్ కళాశాల
  • చైతన్య విద్యాలయం
  • మదీనా పబ్లిక్ స్కూల్
  • రిషి పబ్లిక్ స్కూల్

పార్కు[మార్చు]

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో గగన్‌మహల్‌ కాలనీలో 30లక్షల రూపాయలతో 12వందల గజాల స్థలంలో పార్కు నిర్మించబడింది. వాకర్స్‌ నడిచేందుకు వీలుగా ఫుట్‌పాత్‌ నిర్మాణం, పిల్లల కోసం ప్రత్యేకంగా ఆటస్థలం, సందర్శకుల కోసం విశాలమైన లాన్‌ తయారుచేశారు. సీనియర్‌ సిటిజన్స్‌ కోసం కుర్చీలు, ప్లేగ్రౌండ్‌లో పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఆధునిక ఆట వస్తువులు ఏర్పాటుచేశారు.[4]

మూలాలు[మార్చు]

  1. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 4 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Gagan Mahal Locality". www.onefivenine.com. Retrieved 2021-11-04.
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 4 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "చురుగ్గా సాగుతున్న పార్కు నిర్మాణ పనులు". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 2021-11-04. Retrieved 2021-11-04.