గణపేశ్వరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గణపేశ్వరం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం నాగాయలంక
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,093
 - పురుషులు 2,787
 - స్త్రీలు 2,306
 - గృహాల సంఖ్య 1,405
పిన్ కోడ్ 521 120
ఎస్.టి.డి కోడ్ 08671.

గణపేశ్వరం, కృష్ణా జిల్లా, నాగాయలంక మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 120., ఎస్.టి.డి. కోడ్ = 08671.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో పర్రచివర, టి.కొత్తపాలెం, కమ్మనమొలు, నాగాయలంక గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

అవనిగడ్డ, కోడూరు, రేపల్లె, మోపిదేవి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 76 కి.మీ

గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]

ప్రభుత్వ పాఠశాల, ప్రగతి విద్యానికేతన్, ప్రతిబా విద్యానికేతన్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, సి.బి.సి.ఎన్.సి ప్ర్రాదమికోన్నత పాఠశాల,

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

త్రాగునీటి సౌకర్యాలు[మార్చు]

గణపేశ్వరం పంచాయతీ పరిధిలోని గణపేశ్వరం, దిండి గ్రామాలలో రు. 50 లక్షల ఖర్చుతో, ప్రభుత్వం రెండు రక్షిత మంచినీటి పథకాలు ఏర్పాటుచేసింది. గణపేశ్వరం గ్రామాంలో 60,000 లీటర్ల సామర్ధ్యంగల ఒక ఒవర్ హెడ్ నీటి ట్యాంకును ఏర్పాటుచేసారు. ఇక్కడ మంచినీటి చెరువుద్వారా ఈ పథకం నిర్వహించవలనని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గ్రామంలో ఈ పథకం కొంత కాలం పనిచేసింది. ఇప్పుడు నిర్వహణ లోపం వలన ఈ పథకం పనిచేయకపోవడంతో, గ్రామానికి మంచినీటి సౌకర్యం లేకుండా పోయింది.

విద్యుత్తు సౌకర్యం[మార్చు]

నాగాయలంక మండలంలోని మత్స్యకార గ్రామాలలో విద్యుత్తు సమస్యను పరిష్కరించేటందుకు, ఈ గ్రామంలో కొత్తగా రు. కోటి రూపాయల వ్యయంతో, ఒక 33/11 కె.వి. ఉపకేంద్రం నిర్మాణం పూర్తి అయినది. 2015.ఫిబ్రవరి-12వ తేదీన ప్రారంభించారు. ఈ కేంద్రం వలన, ఈ గ్రామంతోపాటు, చుట్టుప్రక్కల గ్రామాలయిన తలగడదీవి, పర్రచివర, దిండి, పుల్లయ్యగారి దిబ్బ, దీనదయాళపురం, సొర్లగొంది, నాలి, బర్రంకుల గ్రామాలలో విద్యుత్తు సమస్య తొలగుపోవును. ఈ గ్రామంలో నిర్మించిన ఈ విద్యుత్తు ఉపకేంద్రం, మండలంలో నాల్గవ కేంద్రం.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ దాసి జీవరత్నం, సర్పంచిగా ఎన్నికైనారు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ దుర్గా గణపేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

కాకతీయ గణపతిదేవుడి పేరుమీద ఆయన బావమరిది జాయపసేనాని నిర్మించిన ఆలయమిది.[2] దేవాదాయశాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయానికి, తలగడదీవి, టి.కొత్తపాలెం గ్రామాలలో, 100 ఎకరాల మాన్యం భూమి ఉంది. జిల్లాలో, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం తరువాత అంతటి ప్రాశస్త్యం ఉన్న ఆలయం ఇది. ఈ ఆలయ ప్రాంగణంలో, చేబ్రోలు నాయకుడు, ఈ ఆలయ నిర్మాత, కాకతీయ గజసైన్యాధ్యక్షుడు, అయిన జాయపసేనాని విగ్రహాన్ని ఏర్పాటుచేసారు. ఈయన తలగడదీవి ప్రాంతాన్ని ఏలిన అయ్యవంశరాజు పిన్నచోడి కుమారుడు. నృత్యరత్నావళీ గ్రంథకర్తగా, ఆరితేరిన యుద్ధవీరునిగా, మహాశిల్పిగా వాసికెక్కిన ఈయన శిల్పాన్ని, ఈయన నృత్యరత్నావళి వ్రాయు భంగిమలో ఈ శిల్పాన్ని 2016, మే-4వతేదీనాడు ఏర్పాటుచేసారు. ఈ ఆలయ ప్రాంగణంలోని ఉపాలయంలో వేంచేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఏర్పాటుచేసేటందుకు, బర్రెంకుల గ్రామానికి చెందిన దాత శ్రీ గోపాలం వేంకటేశ్వరరావు, రెండున్నర లక్షల రూపాయల వ్యయంతో ఒక నూతన ధ్వజస్తంభాని సమర్పించారు. ఈ జీవ ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2016, ఏప్రిల్-30వతేదీ శనివారంనాడు, ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ నూతన ధ్వజస్తంభాన్నీ, నూతన నవగ్రహ మండపాన్నీ, 2016, మే-4వ తేదీ బుధవారంనాడు వైభవంగా ప్రతిష్ఠించారు.

గ్రామంలోని ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు,

గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 5,093 - పురుషుల సంఖ్య 2,787 - స్త్రీల సంఖ్య 2,306 - గృహాల సంఖ్య 1,405

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5217.[3] ఇందులో పురుషుల సంఖ్య 2641, స్త్రీల సంఖ్య 2576, గ్రామంలో నివాసగృహాలు 1405 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2140 హెక్టారులు.

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో పర్రచివర, టి.కొత్తపాలెం, కమ్మనమొలు, నాగాయలంక గ్రామాలు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Nagayalanka/Ganapeswaram". Archived from the original on 16 డిసెంబర్ 2016. Retrieved 27 June 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)
  2. హల్ట్ష్, ఇ, ed. (1979). ఎపిగ్రాఫియా ఇండికా. 3. న్యూ ఢిల్లీ: డైరెక్టర్ జనరల్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. pp. 126, 127.
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-09.