Jump to content

గుర్‌దాస్‌పూర్

అక్షాంశ రేఖాంశాలు: 32°02′00″N 75°24′00″E / 32.0333°N 75.40°E / 32.0333; 75.40
వికీపీడియా నుండి
గుర్‌దాస్‌పూర్
పట్టణం
గుర్‌దాస్‌పూర్ is located in India
గుర్‌దాస్‌పూర్
గుర్‌దాస్‌పూర్
గుర్‌దాస్‌పూర్ is located in Punjab
గుర్‌దాస్‌పూర్
గుర్‌దాస్‌పూర్
Coordinates: 32°02′00″N 75°24′00″E / 32.0333°N 75.40°E / 32.0333; 75.40
దేశంభారతదేశం
రాష్ట్రంపంజాబ్
జిల్లాగుర్‌దాస్‌పూర్
Founded byభాయి గురియా జీ
Government
 • Typeమునిసిపాలిటీ
 • Bodyమునిసిపల్ కౌన్సిల్
 • డిప్యూటీ కమిషనరుMohammad Ishfaq, IAS[1]
విస్తీర్ణం
 • Total45 కి.మీ2 (17 చ. మై)
Elevation
241 మీ (791 అ.)
జనాభా
 (2015)
 • Total77,928
 • జనసాంద్రత649/కి.మీ2 (1,680/చ. మై.)
Time zoneUTC+5:30 (IST)
PIN
143521
ప్రాంతపు కోడ్+91-1874-XXX XXXX
Vehicle registrationPB-06, PB-18, PB-58, PB-99, PB-85

గుర్‌దాస్‌పూర్, పంజాబు లోని నగరం. రావి, బియాస్ నదుల మధ్య ప్రదేశంలో ఉంది. ఇది గుర్‌దాస్‌పూర్ జిల్లాకు ముఖ్య పట్టణం. మహంత్ గురియా దాస్ పేరిట నగరానికి ఈ పేరు వచ్చింది.

చరిత్ర

[మార్చు]

గుర్‌దాస్‌పూర్‌ను 17వ శతాబ్దంలో గురియా స్థాపించాడు. ఆయనపేరుతో ఈ పట్టణం గుర్‌దాస్‌పూర్ అయింది. ఆయన ఈ పట్టణ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సంగీ గోత్రానికి చెందిన జాట్‌ల నుండి తీసుకున్నాడు. పాత నగరంలో గుడిసెలలో నివసిస్తున్న పేద ప్రజల కొరకు ఆయన ఈ పట్టణం స్థాపించబడింది. గురియా పూర్వీకులు అయోధ్యకు చెందిన వారు. వారు ఇక్కడకు వచ్చి పానియర్‌లో స్థిరపడ్డారు. గురియాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్.హెచ్ నవల్ రాయ్ , ఎస్.హెచ్ పాలా. నవల్ రాయ్ వంశస్థులు గుర్‌దాస్‌పూర్‌లో స్థిరపడ్డారు. నవల్ రాయ్ కుమారుడు బాబా దీప్‌చంద్ గురుగోబింద్ సింగ్ సమకాలీనుడు. బాబా దీప్‌చంద్‌కు గురుగోబింద్‌సింగ్ " గంజ్‌ బక్ష్ " (నిధులకు స్వంతదారుడు) అని బిరుదాంకితుని చేసాడని విశ్వసించబడుతుంది. బాబాదీప్‌చంద్ వంశస్థులు మహంతులని పిలువబడుతున్నారు. గుర్‌దాస్‌పూర్‌లోని ముక్తేశ్వర్ వద్ద ఉన్న రాక్ టెంపుల్ పట్టణ పురాతన చరిత్రకు చిహ్నంగా ఉంది.

రవాణా

[మార్చు]

రోడ్డు

[మార్చు]

గురుదాస్‌పూర్, జాతీయ రహదారి 54 పై ఉంది. ఇది పట్టణాన్ని అమృత్సర్, పఠాన్‌కోట్, జమ్మూ లతో కలుపుతుంది. మరో రహదారి జాతీయ రహదారి 354, గురుదాస్‌పూర్ నగరం నుండే ఉద్భవించింది, ఇది కాలనౌర్, డేరా బాబా నానక్, అజ్నాలా, అమృత్సర్, ఇతర సరిహద్దు పట్టణాల గుండా వెళ్ళి, శ్రీ ముక్తసార్ సాహిబ్ జిల్లా లోని మాలౌట్ వద్ద ముగుస్తుంది. భారత్‌మాలా పథకం కింద 25 వేల కోట్ల వ్యయంతో ఢిల్లీ-అమృత్సర్-కాత్రా ఎక్స్‌ప్రెస్‌వే పేరుతో ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలనే ప్రతిపానను ప్రబుత్వం ఆమోదించింది. ఈ ప్రవేశ నియంత్రిత హైవే గురుదాస్‌పూర్‌ను నేరుగా జలంధర్, న్యూ ఢిల్లీ లతోను, ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలతోనూ రహదారి ద్వారా కలుపుతుంది. అమృత్సర్-గురుదాస్‌పూర్ హైవే ఎన్‌హెచ్ 54 ను కూడా సిగ్నల్ ఫ్రీగా మారుస్తామని, ఎక్స్‌ప్రెస్‌వే యొక్క ఒక పొడిగింపు కర్తార్‌పూర్ కారిడార్ సమీపంలోని డేరా బాబా నానక్‌కు అనుసంధానిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించాడు.

రైలు

[మార్చు]

గురుదాస్‌పూర్ రైల్వే స్టేషన్ అమృత్సర్-పఠాన్‌కోట్ మార్గంలో ఉంది. స్టేషన్ కోడ్ GSP.. ఈ రైల్వే స్టేషన్‌లో రెండు ప్లాట్‌ఫాంలు ఉన్నాయి, వీటిలో ఒకటి ప్యాసింజర్ రైళ్లకు, రెండవది సరుకు రవాణా రైళ్లకు ఉపయోగిస్తారు. ఈ రైల్వే స్టేషన్ పూర్తిగా విద్యుదీకరించారు. విద్యుదీకరణ పనులు 2019 లో పూర్తయ్యాయి. గురుదాస్‌పూర్ నుండి అమృత్సర్-పఠాన్‌కోట్ మార్గపు డబ్లింగు పనులు జరుగుతున్నాయి. ఈ స్టేషన్ సమీప స్టేషన్లు అమృత్సర్, పఠాన్‌కోట్ లకు చాలా రైళ్లు ఉన్నాయి. దూర స్టేషన్లు జమ్మూ తవి, భటిండా, బికనీర్, జోధ్‌పూర్, అంబాలా, ఢిల్లీ, టాటానగర్, రూర్కెలా లకు కూడా గురుదాస్‌పూర్ నుండి ఒకటి రెండు రైళ్ళున్నాయి.

విద్య

[మార్చు]

గురుదాస్‌పూర్‌లో అనేక ప్రాథమిక, మాధ్యమిక స్థాయి పాఠశాలలు ఉన్నాయి, 13 డిగ్రీ స్థాయి, ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. 1995 లో అప్పటి ముఖ్యమంత్రి బీంట్ సింగ్ స్థాపించిన బీంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. పర్యాటక మంత్రిత్వ శాఖ (ఇండియా) ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్ & న్యూట్రిషన్ జాతీయ గుర్తింపు పొందిన సంస్థ గురుదాస్‌పూర్‌లో ఉంది.

కళాశాలలు

[మార్చు]
  • బీంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
  • బాబా హజారా సింగ్ పాలిటెక్నిక్ కళాశాల, ఎన్‌హెచ్ -54, బైపాస్, ఆజ్లా
  • సిటీ నర్సింగ్ కళాశాల
  • గోల్డెన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
  • ప్రభుత్వం కళాశాల
  • గురు నానక్ దేవ్ విశ్వవిద్యాలయం ప్రాంతీయ ప్రాంగణం
  • హిమల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
  • IHM (ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్)
  • పండిట్. మోహన్ లాల్ ఎస్.డి. మహిళలకు కాలేజ్
  • శివాలిక్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్
  • సుఖ్జిందర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్

పాఠశాలలు

[మార్చు]
  • కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, కలనౌర్ రోడ్
  • ఢిల్లీ పబ్లిక్ స్కూల్, బెహ్రాంపూర్ రోడ్
  • డూన్ ఇంటర్నేషనల్ స్కూల్, ముఖేరియన్ రోడ్
  • ప్రభుత్వం మెరిటోరియస్ స్కూల్, బటాలా రోడ్
  • ప్రభుత్వం సీనియర్ సెకండరీ స్కూల్ (బాలుర) (పిఎస్‌ఇబి)
  • ప్రభుత్వం సీనియర్ సెకండరీ స్కూల్ (బాలికలు) (పిఎస్‌ఇబి)
  • హెచ్.ఆర్.ఏ ఇంటర్నేషనల్ స్కూల్, బైపాస్ NH-54
  • హెచ్‌ఆర్‌ఏ లోటస్ స్కూల్, బెహ్రాంపూర్ రోడ్
  • జియా లాల్ మిట్టల్ D.A.V. ప్రజా పాఠశాల
  • లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ స్కూల్
  • శ్రీ అద్వైత్ గురుకుల్ హైట్స్ స్కూల్, కొండల్ ఎన్క్లేవ్, జైలు రోడ్, గురుదాస్పూర్
  • సెయింట్ సోల్జర్ డివైన్ పబ్లిక్ స్కూల్
  • టి.సి. ఇంటర్నేషనల్ స్కూల్, బెహ్రాంపూర్ రోడ్

వైద్య సదుపాయాలు

[మార్చు]
  • సివిల్ హాస్పిటల్, బాబ్రీ, నేషనల్ హైవే 54
  • అబ్రోల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కైలాష్ ఎన్క్లేవ్, బటాలా రోడ్
  • ఆర్.పి. అరోరా మెడిసిటీ, బిఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం సమీపంలో, రైల్వే రోడ్
  • కల్సీ చిల్డ్రన్ హాస్పిటల్, కలనౌర్ రోడ్
  • దీప్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, జైలు రోడ్
  • మహాజన్ హాస్పిటల్, హర్దోచని రోడ్

మూలాలు

[మార్చు]
  1. "Punjab Police Amritsar". gurdaspur.nic.in. Archived from the original on 22 సెప్టెంబరు 2020. Retrieved 3 March 2020.