Jump to content

జానీ మాస్టర్

వికీపీడియా నుండి
జానీ మాస్టర్
జననం
షేక్ జానీ బాషా

(1982-07-02) 1982 జూలై 2 (వయసు 42)
వృత్తితెలుగు సినిమా కొరియోగ్రాఫర్
క్రియాశీల సంవత్సరాలు1992-ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅయేషా
పురస్కారాలుదక్షిణాది ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నృత్యదర్శకులు
నంది ఉత్తమ నృత్యదర్శకులు

జానీ మాస్టర్ (షేక్ జానీ బాషా), భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. తెలుగు,[1] కన్నడ, తమిళ, హిందీ సినిమాలకు పనిచేశాడు. ఇతడు ఎక్కువగా పాశ్చాత్య, జానపద నృత్యాలకు పేరొందాడు.

సినిమారంగం

[మార్చు]

జానీ మాస్టర్, ఈటీవీ వచ్చిన రియాలిటీ-డాన్స్ షో ఢీ అల్టిమేట్ డాన్స్ షో డ్యాన్సర్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. ద్రోణ (2009) సినిమాకు కొరియోగ్రాఫర్ గా అవకాశం వచ్చింది. 2012లో రాం చరణ్ తేజ హీరోగా వచ్చిన రచ్చ సినిమాకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు. దాంతో, రామ్ చరణ్ తన అన్ని సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా నియమించాడు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్.టి.ఆర్, రామ్ పోతినేని, రవితేజ మొదలైన హీరోల సినిమాలకు కూడా పనిచేశాడు.[2]

2014లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన జై హో సినిమాకు జానీ మాస్టర్‌ను కొరియోగ్రాఫర్‌గా నియమించాడు. అవార్డు వేడుకలకు, సినిమాలకు కొరియోగ్రాఫ్ చేశాడు.[3] రెండు టెలివిజన్ రియాలిటీ-డ్యాన్స్ షోలకు కొరియోగ్రాఫర్‌గా, గురువుగా పనిచేశాడు. ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు, సినీమా అవార్డులు, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు వంటి అవార్డుల వేడుకులకు కొరియోగ్రాఫర్‌గా చేశాడు.[4] 2017నుండి, స్టార్ మాలో నీతోనే డాన్స్ వంటి వివిధ తెలుగు టెలివిజన్ రియాలిటీ-డ్యాన్స్ షోలకు జడ్జీగా ఉన్నాడు.[5]

2018లో ఎమ్‌ఎల్‌ఏ సినిమాకి కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు.[6] అదే సంవత్సరంలో ఒక తమిళ పాట కోసం ప్రభుదేవాకు సహాయకుడిగా పనిచేశాడు. మారి 2 సినిమాలోని రౌడీ బేబీ పాటతో గుర్తింపు పొందాడు. ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది.[7]

తరువాత, 2020లో అల వైకుంఠపురములో సినిమాలోని బుట్ట బొమ్మా పాట కోసం కొరియోగ్రఫీ చేసినందుకు మరోసారి ప్రశంసలు అందుకున్నాడు. ఈ మ్యూజిక్ వీడియోలోని రోలింగ్ స్టెప్ అందరికి బాగా నచ్చింది. ఆ స్టెప్ ను వివిధ సోషల్ మీడియా, షార్ట్-వీడియో మేకింగ్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్‌లలో చాలామంది వాడుకున్నారు.[8] ఈ పాటకూడా ప్రపంచవ్యాప్తంగా విజయాన్ని సాధించింది.[9]

రాజకీయ జీవితం

[మార్చు]

షేక్ జానీ మాస్టర్ 2024 జనవరి 24న మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరాడు.[10][11]

వివాదాలు

[మార్చు]

జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అతని సహాయకురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.[12]

టీవీ కార్యక్రమాలు

[మార్చు]
సంవత్సరం కార్యక్రమం ఛానల్ భాష ఇతర వివరాలు
2007 ఢీ అల్టిమేట్ డాన్స్ షో ఈటీవీ తెలుగు నృత్య దర్శకుడు
2016 ఢీ జూనియర్స్ 2 మెంటర్
2016 ఢీ జోడి మెంటర్
2017 నీతోనే డాన్స్ స్టార్ మా జడ్జీ[5]
2019 జబర్దస్త్ ఈటీవీ జడ్జీ[13]
2020 స రి గ మ ప నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ జీ తెలుగు ఎపిసోడ్ 12లో అతిథి

బాబా భాస్కర్ తో[14]

అవార్డులు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగం పాట పేరు ఫలితం ఇతర వివరాలు మూలాలు
2011 సినీ'మా' అవార్డులు ఉత్తమ కొరియోగ్రాఫర్ మర్యాద రామన్న గెలుపు
2012 నంది అవార్డులు ఉత్తమ కొరియోగ్రాఫర్ "మీ ఇంటికి ముందో గేటు" (జులాయి) గెలుపు
2013 60 వ ఫిలింఫేర్ అవార్డులు సౌత్ ఉత్తమ కొరియోగ్రఫీ "ఢిల్లకు ఢిల్లకు" (రచ్చ) గెలుపు [15]
2014 3 వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఉత్తమ డాన్స్ కొరియోగ్రాఫర్ - తెలుగు "లైలా ఓ లైలా" (నాయక్) గెలుపు [16]
2014 సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డు నాయక్ గెలుపు
2015 4వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఉత్తమ డాన్స్ కొరియోగ్రాఫర్ - తెలుగు "సినిమా చూపిస్తా మావా" (రేసుగుర్రం) గెలుపు [17]
2015 సినీమా అవార్డులు ఉత్తమ డాన్స్ కొరియోగ్రాఫర్ రేసుగుర్రం గెలుపు
2015 13వ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డు గెలుపు
2016 5వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఉత్తమ డాన్స్ కొరియోగ్రాఫర్ - తెలుగు "టెంపర్ టైటిల్ ట్రాక్" (టెంపర్) గెలుపు
2018 ఆనంద వికటన్ సినిమా అవార్డులు ఉత్తమ డాన్స్ కొరియోగ్రాఫర్ "గుళేబా" (గులేబకావళి) గెలుపు
2019 66 వ ఫిలింఫేర్ అవార్డులు సౌత్ ఉత్తమ కొరియోగ్రఫీ "రౌడీ బేబీ" (మారి 2) గెలుపు ప్రభుదేవాతో నామినేట్ అయ్యారు [18]

మూలాలు

[మార్చు]
  1. "Here Are The Top 10 Choreographers In Tollywood Today!". chaibisket.com. Archived from the original on 19 November 2016.
  2. "Mega Power Star Birthday Song". Jani Master. Archived from the original on 13 April 2016.
  3. "Choreographer Jani Master current sensation of Tollywood". firstshowz.com. Archived from the original on 16 April 2016.
  4. "Jani Master". Archived from the original on 3 January 2018.
  5. 5.0 5.1 "Siva Balaji and Madhumita get wildcard entry to Neethone Dance". indiatimes.com. Archived from the original on 22 February 2018. Retrieved 1 May 2021.
  6. "'MLA': Nandamuri Kalyanram, Kajal Aggarwal busy shooting for a song". indiatimes.com. Archived from the original on 3 April 2018. Retrieved 1 May 2021.
  7. "Rowdy Baby choreographer thanks the cast for Filmfare award". The Times of India. Retrieved 1 May 2021.
  8. "Butta Bomma Video Promo: Allu Arjun's signature dance moves will keep you hooked". The Times of India. Retrieved 1 May 2021.
  9. "Butta Bomma excels in every aspect". Telangana Today. Retrieved 1 May 2021.
  10. Andhrajyothy (24 January 2024). "జనసేనలో చేరిన జానీ మాస్టర్". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
  11. TV9 Telugu (24 January 2024). "పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరిన జానీ మాస్టర్‌.. ఆ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి." Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  12. "Jani Master: జానీ మాస్టర్‌పై పోక్సో కేసు". EENADU. Retrieved 2024-09-18.
  13. "Jabardasth: Jani Master and Meena to replace Nagababu and Roja as judges?". The Times of India.
  14. "Sa Re Ga Ma Pa 13: Noted choreographer-TV personality Jani wows with his lesser-known singing talent". The Times of India. Retrieved 1 May 2021.
  15. Filmfare awards list of winners Archived 2015-05-10 at the Wayback Machine
  16. "SIIMA AWARDS | 2014 | winners | |". siima.in. Archived from the original on 2017-05-19. Retrieved 2021-05-01.
  17. "SIIMA AWARDS | 2015 | winners | |". siima.in. Archived from the original on 2017-05-17. Retrieved 2021-05-01.
  18. "Winners of the 66th Filmfare Awards (South) 2019". filmfare.com.

బయటి లింకులు

[మార్చు]