జాన దుర్గా మల్లికార్జునరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాన దుర్గా మల్లికార్జునరావు బాల అవధానిగా, యువ అవధానిగా ప్రసిద్ధుడు. తన 18వ యేటనే సంపూర్ణ శతావధానాన్ని చేశాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు 1979, జూన్ 19వ తేదీన తూర్పుగోదావరి జిల్లా, అంబాజీపేట మండలం, ముక్కామల గ్రామంలో వేంకట సత్యవతి, సత్యనారాయణస్వామి దంపతులకు జన్మించాడు. ఇతడు ముక్కామలలోని కళావెంకటరావు జిల్లాపరిషత్తు ఉన్నతపాఠశాలలో ఎస్.ఎస్.సి. వరకు చదువుకున్నాడు. తరువాత సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి చరిత్ర, అర్థశాస్త్రం, తెలుగు అభిమానవిషయాలుగా బి.ఎ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి దూరవిద్య ద్వారా తెలుగు భాషాసాహిత్యాలు అధ్యయనం చేసి ఎం.ఎ. డిగ్రీ సంపాదించాడు. ఎస్.ఎస్.సి. పరీక్ష పాసైన తరువాత మోడేకుర్రు ఓరియంటల్ పాఠశాలలో చదివాడు. పిదప 1995లో రాజమండ్రిలోని గౌతమీ విద్యాపీఠంలో చేరి సంస్కృతాంధ్ర కావ్య నాటక సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు. కందుకూరి భాస్కరశాస్త్రి, లంక నరసింహశాస్త్రి, ద్వా.నా.శాస్త్రి ఇతని గురువులు.

అవధాన రంగం

[మార్చు]

ఇతడు 13వ యేటనే 1993లో అమలాపురం లోని కామాక్షి పీఠంలో కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి శతజయంతి సందర్భంగా మొట్టమొదటి సారి అష్టావధానం చేశాడు.ఇతడు ఇప్పటి వరకు 180కి పైగా అష్టావధానాలు, ఒక అర్థశతావధానము, ఒక సంపూర్ణ శతావధానమును ప్రదర్శించాడు. ఇతడు అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, భీమవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల, కడప, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, వరంగల్లు, భద్రాచలం, హైదరాబాదు, బెంగుళూరు, బళ్ళారి, హొస్పేట, బొంబాయి, మద్రాసు, న్యూఢిల్లీలలో అవధానాలను నిర్వహించాడు. ఇతని అవధానాలలో సమస్య, దత్తపది, వర్ణన, ఆశువు, వారగణనం, వ్యస్తాక్షరి, న్యస్తాక్షరి, పురాణపఠనం, ఘంటానాదం వంటి అంశాలు ఉన్నాయి.

అవధానాలలో పూరణలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]