ట్యూబోకురరిన్
ట్యూబోకురరిన్ (tubocurarine)అనేది బెంజిలిసోక్వినోలిన్ ఆల్కలాయిడ్ కండరాల ఉపశమన మందు, ఇది క్యూరే యొక్క క్రియాశీలక భాగం. ఇది నికోటినిక్ విరోధి, కండరాల సడలింపు మరియు ఔషధ అలెర్జి కారకంగా పనిచేస్తుంది.ఇది ట్యూబోకురరన్ యొక్క హైడ్రైడ్ నుండి ఉద్భవించింది.[1] ట్యూబోకురరిన్ ఒక నాన్-డిపోలరైజింగ్ న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్ మరియు మొదట గుర్తించబడిన క్యూరే ఆల్కలాయిడ్.క్యూరేర్ అనేది వేట బాణాలు మరియు చేబల్లెము (ఈటె )లకు పూయడానికి స్వదేశీ దక్షిణ అమెరికన్లు ఉపయోగించే మొక్కల-ఉత్పన్న విషాలను వివరించడానికి ఉపయోగించే పేర్లలో ఒకటి, ఇవి సాధారణంగా కొండ్రోడెండ్రాన్ మరియు స్ట్రైక్నోస్ జాతుల మొక్కల నుండి సేకరించిన విష పదార్థాలు.[2]ట్యూబోకురరిన్ న్ అనేది బెంజిలిసోక్వినోలిన్ ఉత్పన్నం మరియు మార్ఫిన్ మరియు పాపావెరిన్తో సహా అనేక మొక్కల-ఉత్పన్న ఆల్కలాయిడ్స్‌తో నిర్మాణాత్మక మూల సౌష్టవాన్ని పంచుకుంటుంది.[2]
చరిత్ర
[మార్చు]వివిధ ఉష్ణమండల అమెరికన్ మొక్కలలో, ప్రధానంగా మెనిస్పెర్మేసి కుటుంబానికి చెందిన కొండ్రోడెండ్రాన్ జాతులమొక్కలలో మరియు లోగానియేసి కుటుంబానికి చెందిన స్ట్రైక్నోస్ జాతుల మొక్కలలో ట్యూబోకురరిన్లభిస్తుంది.[3] క్యూరే అనే పేరు ఇండియన్ పదానికి "విషం" అని అర్ధం; ఇండియన్ పదం ఉరరా,ఉరళి,ఉరారి,వూరాలి మరియు వూరారి అని అనేక రకాలుగా అన్వయించ బడింది.మొదట 1897లో ట్యూబ్ క్యూరే నుండి వేరుచేయబడింది మరియు 1935లో స్ఫటికాకార రూపంలో పొందబడింది.దక్షిణ అమెరికా మొక్క కొండ్రోడెండ్రాన్ టోమెంటోసమ్ యొక్క బెరడు మరియు కాండం నుండి వేరుచేయబడిన ట్యూబోకురైన్ క్లోరైడ్ (డి-ట్యూబోకురైన్ క్లోరైడ్ రూపంలో ) మొదట్లో వైద్యంలో ఉపయోగించబడింది.[3]ఇది మొట్టమొదట 1942లో సాధారణ అనస్థీషియా కోసం, వాణిజ్య తయారీలో కోస్ట్రిన్‌గా ఉపయోగించబడింది. చాలా సంవత్సరాల తర్వాత ట్యూబరిన్ అనే స్వచ్ఛమైన ఉత్పత్తి అందుబాటులోకి వచ్చింది.
ఇది మొట్టమొదట 1935లో హెరాల్డ్ కింగ్ చేత వేరుచేయబడింది మరియు శస్త్రచికిత్సల సమయంలో, ముఖ్యంగా పొత్తికడుపుకు సంబంధించిన నాడీ కండరాల దిగ్బంధనాన్ని ప్రేరేపించడానికి వైద్యపరంగా ఉపయోగించబడింది.[4]
కొండ్రోడెండ్రాన్ టోమెంటోసమ్ మొక్క
[మార్చు]కొండ్రోడెండ్రాన్ టోమెంటోసమ్ అనే మొక్క మెనిస్పెర్మేసి కుటుంబానికి చెందిన మొక్క. ఒ మొక్క దక్షిణ అమెరికా లోని వర్షఅరణ్యాలలో పెరిగే మొక్క, ఇది పెద్దసైజు అల్లుకుపోయే లతప్రతానం మొక్క.అనగా దేనినైనా ఆధారంగా చేసుకుని పైకి పొదలా పాకే మొక్క.ఈ మొక్క తీగ, కొన్నిసార్లు దాని కాండం అడుగువద్ద 4 అంగుళాల మందంతో, పందిరిలోకి (30 మీటర్ల ఎత్తు వరకు) గణనీయమైన ఎత్తును అధిరోహిస్తుంది.ఇది 2-6 అంగుళాల పొడవు గల ఆకుతొడిమతో 4-8 అంగుళాల పొడవు మరియు దాదాపు వెడల్పుగా ఉండే పెద్ద ప్రత్యామ్నాయ, గుండె ఆకారపు ఆకులను కలిగి ఉంటుంది.ఆకులు పైభాగంలో వెంట్రుకలతో కూడిన తెల్లటి అడుగుభాగంలో నునుపుగా ఉంటాయి మరియు ఆకు పునాది నుండి ప్రసరించే లోతుగా ఇండెంట్ సిరలు ఉంటాయి.చిన్న (1/16-1/8 అంగుళాలు), ఆకుపచ్చ-తెలుపు పువ్వుల సమూహాలు వేర్వేరు మగ మరియు ఆడ పువ్వులతో ఏర్పడుతాయి.కండగల పండ్లు అండాకారంగా ఉంటాయి, తొడిమ వద్ద ఇరుకుగా వుండి సుమారు 1-2 మిమీ పొడవు ఉంటాయి.[5] [6] క్యూరేర్ అనేది అమెజాన్ బేసిన్‌కు చెందిన దక్షిణ అమెరికా పైకి పాకే మొక్క(లత) . ఇది బ్రెజిల్, బొలీవియా, పెరూ, గయానా, ఈక్వెడార్, పనామా మరియు కొలంబియాలో పెరుగుతోంది.[5]
ఉత్పత్తి
[మార్చు]ట్యూబోకురారిన్ అనేది క్యూరే యొక్క డెక్స్ట్రోరోటేటరీ ఐసోమర్, ఇది కొండ్రోడెండ్రాన్ టోమెంటోసమ్ బెరడు నుండి పొందబడుతుంది.[7]
ట్యూబోకురరిన్ భౌతిక ధర్మాలు
[మార్చు]లక్షణం/గుణం | మితి/విలువ |
అణు ఫార్ములా | C37H41N2O+6 |
అణుభారం | 609.7 గ్రా/మొల్[8] |
స్థితి | ఘన రూపం[9] |
ద్రవీభవన ఉష్ణోగ్రత | mp: 268°C[10] |
వైద్యపరమైన ప్రయోజనాలు
[మార్చు]- ట్యూబోకురరిన్ ప్రధానంగా అనస్థీషియాలజీలో మయోరెలాక్సెంట్‌గా ఉపయోగించబడుతుంది, దీని వలన ఆపరేషన్ సమయంలో ఎక్కువ కాలం కండరాల సడలింపు ఏర్పడుతుంది.ప్రాథమిక శరీర విధులలో ఎటువంటి కీలకమైన మార్పు లేకుండా అస్థిపంజర కండరాల తాత్కాలిక సడలింపును కలిగించడం కై చిన్న మోతాదులలలో ఇవ్వడం వల్ల మందు ప్రభావవంతం గా పనిచేస్తుంది.[11][12]
- d-ట్యూబోకురరిన్ న్యూరోమస్కులర్ జంక్షన్ యొక్క మోటార్ ఎండ్ ప్లేట్‌లోని నికోటినిక్ ఎసిటైల్‌కోలిన్ గ్రాహకాల వద్ద డిపోలరైజింగ్ కాని పోటీ విరోధిగా పనిచేస్తుంది, దీని వలన అస్థిపంజర కండరాల సడలింపు ఏర్పడుతుంది.d-ట్యూబోకురరిన్ కనీసం అసిటైల్‌కోలిన్‌తో సమానమైన అనుబంధంతో పోటీపడుతుంది మరియు నికోటినిక్ గ్రాహకాలపై అదే స్థానంలో ఉంటుంది.అందువల్ల క్యూరే గుండె కండరాలు, మృదు కండరం లేదా గ్రంధి స్రావాలను ప్రభావితం చేయదు.[13]
- వివిధ ప్రక్రియలలో కండరాల సడలింపును ఉత్పత్తి చేయడానికి ట్యూబోకురరిన్ ఉపయోగించబడింది, అయితే ఇది ఎక్కువగా తక్కువ హృదయనాళ ప్రభావాలు మరియు హిస్టామిన్ విడుదలకు కారణమయ్యే తక్కువ సంభావ్యత. వున్న ఇతర ఔషధాలవాడకం ద్వారా దీని వాడకం క్రమేణా తగ్గిపోయింది.[14]
- అరుదైన బహుశాబాగా తెలిసిన న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్లలో d-ట్యూబోకురరిన్ ఒకటి. ట్యూబోకురరిన్ EPPలు లేదా EPCల వ్యాప్తిని తగ్గిస్తుంది, అదే సమయంలో సింగిల్-ఛానల్ కరెంట్‌ల ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది.[15][12]
- స్థానభ్రంశం చెందినఎముక ల యొక్క దిద్దుబాటు మరియు ఎముక పగుళ్ల అమరిక వంటి వివిధ ఆర్థోపెడిక్ శస్త్ర చికిత్స విధానాలలో ఉపయోగిస్తారు.ఇది సాధారణ మత్తు ఏజెంట్‌తో కలిపి లారింగోస్కోపీ, బ్రోంకోస్కోపీ మరియు ఎసోఫాగోస్కోపీని సులభతరం చేయడానికి ఉపయోగించబడుతుంది .[16][17]
దుష్పలితాలు
[మార్చు]- సరైన ముందస్తు వైద్యం లేకుండా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ట్యూబోకురైన్ ఇవ్వకూడదు.[18][17]
- ట్యూబోకురైన్ IV ను చాలా వేగంగా, అధిక మోతాదులో లేదా బహుళ మోతాదులలో ఇవ్వబడినప్పుడు , హిస్టామిన్ విడుదల వల్ల గ్యాంగ్లియోనిక్ దిగ్బంధనానికి గురై హైపోటెన్షన్ సంభవించవచ్చు.తీవ్రమైన హైపోటెన్షన్ సంభవించినట్లయితే,షాక్‌ను ఎదుర్కోవడానికి IV ద్రవాలు మరియు సానుభూతి కారకాలతో చికిత్స అవసరమవుతుంది.హిస్టామిన్ విడుదల వల్ల లాలాజలం పెరుగుతుంది మరియు బ్రోంకోస్పాస్మ్ ఏర్పడుతుంది.ట్యూబోకురైన్ వల్ల తీవ్రసున్నితత్వ ప్రతిచర్యలు సంభవించవచ్చు.[19][17]
- సాధారణ రుగ్మతలు: అలెర్జీ ప్రతిచర్యలు, హిస్టామిన్ యొక్క అధిక విడుదల;కార్డియోవాస్కులర్ ఆటంకాలు: హైపోటెన్షన్, రిఫ్లెక్స్ టాచీకార్డియా;శ్వాసకోశ రుగ్మతలు: డిస్ప్నియా, బ్రోంకోస్పాస్మ్, లారింగోస్పాస్మ్, ఆస్తమా;కండరాల-అస్థిపంజర లోపాలు: కండరాల బలహీనత;చర్మ సంబంధిత రుగ్మతలు: దద్దుర్లు, ఉర్టిరియారియా, ఇంజెక్షన్ సైట్ వద్ద ప్రతిచర్యలు.[20]
ఇవికూడా చదవండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "CHEBI:9774-tubocurarine". ebi.ac.uk. Retrieved 2024-03-17.
- ↑ 2.0 2.1 "Tubocurarine". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-17.
- ↑ 3.0 3.1 "curare". britannica.com. Retrieved 2024-03-17.
- ↑ "Tubocurarine". go.drugbank.com. Retrieved 2024-03-17.
- ↑ 5.0 5.1 Taylor, L. 1998. Herbal Secrets of the Rainforest.
- ↑ "Chondrodendron tomentosum". ntbg.org. Retrieved 2024-03-17.
- ↑ "Tubocurarine". sciencedirect.com. Retrieved 2024-03-17.
- ↑ Computed by PubChem 2.2 (PubChem release 2021.10.14)
- ↑ "Showing metabocard for Tubocurarine (". hmdb.ca. Retrieved 2024-03-17.
- ↑ Budavari, S. (ed.). The Merck Index - An Encyclopedia of Chemicals, Drugs, and Biologicals. Whitehouse Station, NJ: Merck and Co., Inc., 1996., p. 1670
- ↑ Book:Muscle Relaxants,authors :R.S. Vardanyan, V.J. Hruby, in Synthesis of Essential Drugs, 2006
- ↑ 12.0 12.1 "Tubocurarine". sciencedirect.com. Retrieved 2024-03-18.
- ↑ S.A. Burr, Y.L. Leung, in Encyclopedia of Toxicology (Third Edition), 2014
- ↑ Zoe Clarke, in xPharm: The Comprehensive Pharmacology Reference, 2007
- ↑ W. Atchison, in Comprehensive Toxicology (Third Edition), 2018
- ↑ Hardman, J.G., L.E. Limbird, P.B. Molinoff, R.W. Ruddon, A.G. Goodman (eds.). Goodman and Gilman's The Pharmacological Basis of Therapeutics. 9th ed. New York, NY: McGraw-Hill, 1996., p. 189
- ↑ 17.0 17.1 17.2 "Tubocurarine". pharmacompass.com. Retrieved 2024-03-18.
- ↑ Osol, A. and J.E. Hoover, et al. (eds.). Remington's Pharmaceutical Sciences. 15th ed. Easton, Pennsylvania: Mack Publishing Co., 1975., p. 854
- ↑ McEvoy, G.K. (ed.). American Hospital Formulary Service - Drug Information 1999. Bethesda, MD: American Society of Health-System Pharmacists, Inc. 1999 (Plus Supplements)., p. 1185
- ↑ "Side effects associated with Tubocurarine". humanitas.net. Retrieved 2024-03-18.