డి- రకం బాయిలరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డి రకం బాయిలరు ఒక వాటరు ట్యూబు బాయిలరు.బాయిలరు అనగా అన్నివైపుల మూసి వుండి లోపల నీరు కల్గి వుండి, ఇంధన దహనం వలన ఉత్పత్తి అగు ఉష్ణం వినియోగించుకుని నీటిని ఆవిరిగా మార్చు లేదా వేడిచేయు లోహ నిర్మాణం.ద్రవాలను వేడిచేయు లోహనిర్మాణాన్ని కూడా బాయిలరు అంటారు. డి రకపు బాయిలరు ఆకృతి చూచుటకు ఆంగ్లఅక్షరం D ని పోలి ఉన్నందున ఈ రకపు బాయిలరును డి రకపు బాయిలరు అంటారు. ఈ బాయిలరులో నీటిని ఆవిరిగా మార్చు వాటరుట్యూబులతో పాటు వాటరు మెంబ్రేను ట్యూబులు బాయిలరు ఫర్నేసు గోడల లోపలి వైపు చుట్టూ ఆవరించి వుండును. అందువలన ఇంధన దహనం వల్ల ఏర్పడిన ఉష్ణం వేగంగా బాయిలరు నీటికి చేరును.ఈ రకపు బాయిలరులో బాయిలరు ఉష్ణ వినియోగ సామర్ధ్యం 93% వరకు వుండును.మెంబ్రేను వాటరు ట్యూబుల వరుసల మధ్య ప్రతి రెండు ట్యూబులబయటి ఉపరితలాన్ని కలుపుతూ మెటల్ స్ట్రిప్ వుండును. ఈ మెటల్ స్ట్రిప్ వలన ఇంధన వేడి ట్యూబుల గుండా నీటికి ఉష్ణ సంవహనం వలన త్వరగా మార్పిడి అగును.

ప్యాకేజ్డ్ బాయిలరు[మార్చు]

డి రకపు బాయిలరును ప్యాకేజ్డ్ బాయిలరు అంటారు. బాయిలరు మొత్తంగా ఒకయూనిట్‌గా నిర్మాణమై వుండి, సులభంగా బాయిలరు నిర్మాణ స్థావరం నుండి వినియోగదారుని స్థాపక స్థలం వరకు రవాణా చెయ్యవచ్చును. బాయిలరు మొత్తం ఒకేసారి తయారిదారుని వద్దనే సిద్దం అవ్వడం వలన వినియోగ స్థావరంలో కేవలం పునాది పనులు చేస్తే సరిపోతుంది

డి రూపం బాయిలరు లో వాడు ఇంధనాలు[మార్చు]

డి రకపు బాయిలరులో ఇంధనంగా ఆయిల్ లేదా సహజ వాయువు లేదా బయోగ్యాస్ ఉపయోగిస్తారు[1].

బాయిలరు లోని ముఖ్య భాగాలు[మార్చు]

స్టీము డ్రమ్ము[మార్చు]

ఈ డ్రమ్ము బాయిలరు ఫర్నేసు లోపల పైభాగంలో వుండును.పొడవుగా క్షితిజసమాంతరంగా స్తుపాకారంగా వుండును. స్టీము డ్రమ్ము అని పిలిచినప్పటికి కింది సగభాగం వరకు నీరు వుండి మిగిలిన భాగంలో స్టీము వుండును. స్టీము డ్రమ్ము మందమైన ఉక్కు పలక/ప్లేట్ నిర్మాణమై వుండును. ఈ డ్రమ్ము పైభాగాన సేఫ్టి వాల్వులు, ప్రధాన స్టీము వాల్వు, ప్రెసరు గేజ్, వాటరు లెవల్ ఇండికేటరు, ఎయిర్ వెంట్ వాల్వు వుండును., అవసరమైనప్పుడు, డ్రమ్ములోపలి వెళ్ళు పరిమాణంలో మ్యాన్ హోలు వుండును. అంతే కాదు డ్రమ్ము లోపల పైభాగాన స్టీము సపరేటరు కూడా వుండును. డ్రమ్ములో జమ అయిన స్టీములో వున్ననీటి తుంపరలు ఇందులో వేరుపడి స్టీము పొడిగా తయారగును. స్టీము డ్రమ్ముకు సరిగా కింద ఫర్నేసు అడుగున వాటరు డ్రమ్ము వుండును.డ్రమ్ము ముందు వృత్తాకార డోముకూ మ్యాన్ హోల్ వుండును.

వాటరుడ్రమ్ము[మార్చు]

ఇది ఫర్నేసు అడుగున, స్టీము డ్రమ్ముకు సరిగా కింద వుండును. వాటరు డ్రమ్ము కూడా స్టీము డ్రమ్ములా పొడవుగా క్షితిజసమాంతరంగా స్తూపాకారంగా వుండును. వాటరుడ్రమ్ము, స్టీము డ్రమ్మును నిలువుగా కలుపుతూ చాలా ట్యూబులు వుండును.వాటిని నిలువు బాయిలరు ట్యూబులు అంటారు. వాటరుడ్రమ్ముకు బ్లో ఆఫ్ పైపు వుండి, అది ఫర్నేసు బయటి వరకు వుండును.డ్రమ్ములోని నీటిలో TDS పరిమాణం పెరిగినపుడు బ్లో ఆఫ్ వాల్వు తెరచి బాయిలరు నీటిని కొద్ది నిమిషాల పాటు బయటికి వదిలి, బాయిలరులోని TDS ని నియంత్రణ చేయుదురు.డ్రమ్ము ముందు వృత్తాకార డోముకు మ్యాన్ హోల్ వుండును.

నిలువు బాయిలరు ట్యూబులు:[మార్చు]

ఇవి కార్బను ఉక్కుగొట్టాలు. ఇవి సాధారణంగా సీమ్ లెస్ (అతుకు లేని) ట్యూబులు అయ్యివుండును. తక్కువ ప్రెసరు బాయిలరు అయినచో ERW ట్యూబులు ఉపయోగిస్తారు. ఈ ట్యూబుల బయటి వ్యాసం రెండు అంగుళాలు[2] లేదా రెండున్నర అంగుళాలు వుండును.

వాటరు మెంబ్రేను ట్యూబులు[మార్చు]

వీటిని వాల్ వాటరు ట్యూబులూని కూడా అంటారు. ఇవి ఫర్నేసుకు మూడు వైపుల (కింద, నిలువుగా, పైన) విస్తరించి వుండును. పైపుల ఒక చివర స్టీము డ్రమ్ముకు మరో చివర వాటరు డ్రమ్ముకు అతుకబడి వుండు ను. మెంబ్రేను ట్యూబు ట్యూబు మధ్య ఒక పలుచని మెటల్ స్ట్రిప్పు అతుకబడి వుండును. ఈ ట్యూబుల వెలుపలి వ్యాసం సాధారణంగా 2.0 అంగుళాలు (50.0 మి.ల్లీ) వుండును. కొన్ని బాయిలరులలో రెండున్నర అంగుళాలు (63.5 మి.మీ) ఉండును.

ఫర్నేసు[మార్చు]

ఉష్ణ /తాపక నిరోధక ఇటుకలతో నిర్మింపబడి వుండును. వీటీని ఫైరు బ్రిక్సు అనికూడా అంటారు. లోపలి వైపు గోడ ఫైరు బ్రిక్స్‌తో, వెలుపలి వరుస ఇన్సులేసన్ ఇటుకలను పేర్చి నిర్మిస్తారు. కొన్ని ఫర్నేసు గోడలలో కేవ లం ఇన్సులేసను ఇటుకలు పేర్చి ఇటుకల చుట్టూ ఉష్ణ నిరోధక మెటిరియలుతో కప్పి వుంచుతారు. ఫర్నేసు నలుచదరంగా లేదా కొద్దిగా దీర్ఘంగా వుండును. ఒకవైపు బర్నరుల అమరిక వుండగా మరో వైపు గోడకు ఫ్లూ గ్యాసులు బయటకు వెళ్ళుటకు మార్గం వుండును. ఈ మార్గం ద్వారా వేడి వాయువులు పొగగొట్టానికి వెళ్ళును. కొన్నిబాయిలరులో వేడి వాయువులు ఎకెనమైజరుకు వెళ్ళి తరువాత పొగగొట్టానికి వెళ్ళును. ఫర్నేసులోని మంటను గమనించుటకు వ్యూ హోల్ అమరిక వుండును.

డౌన్ కమరులు[మార్చు]

ఈ పైపు/ట్యుబుల ద్వారా స్టీము డ్రమ్మునుండి వీఋఊ వాటరు డ్రమ్ముకు ప్రవహించును.ఇవి స్టీము డ్రమ్ము రెండు చివరల నుండి వాటరు డ్రమ్ము రెండి చివరలకు పక్క భాగాన కలుపబడి వుండును.

బర్నరు[మార్చు]

సాధారణంగా డి రకపు బాయిలరులలో ఆయిల్ లేదా సహజ వాయువును ఇంధనంగా వాడేదరు.ఆయిల్, వాయువు మండించి బర్నరు డిజైను వేరు వేరుగా వుండును.రెండింటిలోను ఇంధనంతో గాలిని తగు ప్రమాణంలో మిక్సుచేసి ఫర్నేసులోకి స్ప్రే చేస్తారు.

ఫోర్సుడ్ డ్రాఫ్ట్ బ్లోవరు/ఫ్యాన్[మార్చు]

ఇంధనం మండుటకు అవసరమైన గాలిని ఈ బ్లోవరు ద్వారా అందించబడును.

ఎకెనమైజరు[మార్చు]

ఈ ఎకెనమైజరులో ఫర్నేసు నుండి పొగ గొట్టానికి వెళ్ళు వేడివాయువుల ద్వారా బాయిలరుకు వెళ్ళు నీటిని వేడి చేస్తారు.

ఫీడ్ వాటరు వ్యవస్థ[మార్చు]

బాయిలరుకు అవసరమైన నీటిని బాయిలరుకు అందించుటకై ఒక సెంట్రిఫుగల్ పంపు/తోడుయంత్రం/జలయంత్రం, వాల్వులు, తదితరాలు వుండును. బాయిలరు పనిచేయు పీడనం కన్న ఒకటిన్నర రెట్లు ఎక్కువ పీడనంతో నీటిని తోడు కెపాసిటిని పంపు కలగి వుండును.ఫీడ్ పంపులుగా హరిజాంటల్ మల్టి స్టెజి సెంట్రిఫుగల్ పంపు లేదా వెర్టికల్ మల్టి స్టెజి పంపును ఉపయోగిస్తారు.

బ్లో ఆఫ్ వ్యవస్థ[మార్చు]

బాయిలరులో నీరు నీటి ఆవిరిగా మారుతున్న క్రమంలో బాయిలరు నీటిలో క్రమంగా TDS (total Disolved solids :అనగా నీటిలో కరిగి వుండు మొత్తం పదార్థాలు) పెరుగును.ఈ కరిగిన ఘన పదార్థాలు ట్యూబుల చుట్టు పొరలుగా పేరుకు పోయిన ట్యూబుల ఉష్ణగ్రహణ సామర్ద్యము తగ్గిపోయి, ట్యూబులు పోలి పోయే ప్రమాదం ఉంది. అందువల్ల బాయిలరు నీటిలో TDS సాధారణంగా వుండవలసిన దానికన్న ఎక్కువ పెరిగినపుడు బ్లో ఆఫ్ ద్వారా కొంత బాయిలరు నీటిని బయటకు వదిలి, బాయిలరు నీటి లోని TDS ను నియంత్రణలో వుంచడం జరుగుతుంది.

బాయిలరుకు అదనంగా అమర్చబడి వుండు ఉపకరణాలు[మార్చు]

ఫీడ్ వాటరు పంపు[మార్చు]

హరిజోటల్ మల్టి స్టెజి వాటరు పంపు

ఇది బాయిలరుకు కావాల్సిన వాటరును బాయిలరుకు పంపింగు చెయ్యును. బాయిలరు వాతావరణ వత్తిడికి కన్న ఎక్కువ వత్తిడిలో ( 9-10Kg/cm2) స్టీము ఉత్పత్తి చేయ్యును.కావున ఫీడ్ పంపు బాయిలరు వర్కింగు ప్రెసరు కన్న ఒకటిన్నర రెట్లు ఎక్కువ వత్తిడిలో వాటరును తోడు పంపును బాయిలరుకు అమర్చెదరు. అంతేకాదు బాయిలరు గంటకు స్టీముగా మార్చు నీటి పరిమాణం కన్నరెండితలు ఎక్కువ నీటినితోడు కెపాసిటి కల్గి వుండును. హరిజంటల్ మల్టి స్టెజి సెంట్రిఫ్యుగల్ పంపులను వాడుచున్నారు.కొత్తగా వెట్రికల్ మల్టి స్టేజి పంపులు వాడుకలోకి వచ్చాయి.

గ్లాసు ట్యూబువాటరు లెవల్ ఇండికేటరు గేజ్/వాటరు గేజ్[మార్చు]

బాయిలరులో ఎప్పుడు ఫైరుట్యూబుల మట్టం దాటి నీరు వుండాలి. అప్పుడే ఎటు వంటి ప్రమాదం లేకుండా నీరు స్టీముగా ఏర్పడును. బాయిలరులో ఇంధనం వలన ఏర్పడు వేడి వాయువుల ఉష్ణోగ్రత 1000°C డిగ్రీలు దాటి వుండును.ట్యూబుల మట్టానికి దిగువన వాటరు ఉన్నచో, ఇంతటి ఉష్ణోగ్రత ఉన్న ఫ్లూగ్యాసెస్ ఫైరుట్యూబుల ద్వారా వెళ్ళునపుడు ఉష్ణ వినిమయం జరుగనందున ట్యూబుల ఉష్ణోగ్రత పెరిగి బాయిలరు ట్యూబులు పేలి పోవును.అందువలన బాయిలరు షెల్ లో నీటి మట్టం ట్యూబు బండిల్ కన్నఎక్కువ మట్టం వరకు ఉండటం అత్యంత ఆవశ్యకం.బాయిలరు షెల్ లో వాటరు ఎంత ఎత్తులో నీరు వున్నది ఈ వాటరు గేజ్ వలన తెలుస్తుంది.

ప్రెసరు గేజ్[మార్చు]

ఈ పరికరం బాయిలరులో ఉత్పత్తి అయ్యే స్టీము ప్రెసరును చూపిస్తుంది.

సేఫ్టి వాల్వు[మార్చు]

స్ప్రింగు లోడేడ్ సెప్టి వాల్వు

బాయిలరు షెల్ లో వర్కింగు ప్రెసరు కన్న ఎక్కువ స్టీము తయారై, ఏర్పడిన స్టీమును అదే ప్రమాణంలో వాడనప్పుడు, బాయిలరులో స్టీము పరిమాణంపెరిగి, అధిక వత్తిడి ఏర్పడి బాయిలరు షెల్ ప్రేలి పోయే ప్రమాదం ఉంది. ఈ సేఫ్టివాల్వు, బాయిలరులో పరిమితి మించి ఎక్కువ ప్రెసరులో ఏర్పడిన స్టీమును బాయిలరు బయటకు విడుదల చెయ్యును. సేఫ్టి వాల్వులు పలు రకాలున్నవి. అందులో స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వుఒక రకం

స్టీము స్టాప్ వాల్వు[మార్చు]

ఇది బాయిలరులో ఉత్త్పతి అయ్యిన స్టీమును అవసరమున్న మేరకు మెయిన్ స్టీము పైపుకు వదులుటకు ఉపయోగపడును.దీనిద్వారా బాయిలరు స్టీమును వినియోగ స్థావరానికి అవసర మైనపుడు పంపుట, అక్కరలేనప్పుడుఆపుట చెయ్యుదురు.

నిర్మాణం[మార్చు]

ఫర్నేసుకు కుడి వైపున లేదా ఎడమవైపు, ఫర్నేసు గోడకు దగ్గరగా, ఫర్నేసుపై వైna స్టీము డ్రమ్ము, కింది వైపు వాటరు డ్రమ్ము క్షితిజసమాంతరంగా వుండును.స్టీము డ్రమ్ము కింది భాగాన్ని, వాటరు డ్రమ్ము ఉపరి తలాన్ని కలుపుతూ స్తుపాకరం పొడవున బాయిలరు ట్యూబులు పెక్కువరుసలో ఆతుకబడి వుండును.అలాగే స్టీము డ్రమ్ము వాటరు లెవల్ కన్న కొంచెం తక్కువ దూరంలో నుండి చాలా ట్యూబుల ఒక చివర సిలిండరు పొడవున అతుకబడి, ట్యూబులు ఫర్నేసు పైభాగాన్ని, పక్క నిలువు బాగాన్ని తాకుతూ గోడ అడుగు వరకు వచ్చి అక్కడి నుండి క్షితిజ సమాంతరంగా వచ్చి వాటరు డ్రమ్ము పక్కభానికి సిలిండరు పొడవున కలపబడి వుండును.ఈ ట్యూబులు ఫర్నేసు గోడలను మూడు వైపుల తాకుతూ వుండటం వలన వీటిని వాల్ మెంబ్రేను అని మెంబ్రేను ట్యూబులని అంటారు. ట్యూబుకు ట్యూబుకు మధ్య 30-50 మిల్లీమీటర్ల ఎడం వుండి ఆ ఎడంలో పలుచని మెటల్ స్త్రీప్ప్ అతుకబడి వుండును. అంతే కాకుండా వాటరు డ్రమ్ము నుండి కొన్ని ట్యూబులు బాయిలరు వెనుక పక్క గోడను తాకుతూ వుండును. ఫర్నేసు ముందు భాగంలో బాయిలరు సైజును బట్టి ఒకటి లేదా రెండు బర్నరులు వుండును. ఈ బర్నరులు ఆటోమాటిక్^గా పనిచేయు ప్యానల్ వ్యవస్థ వుండును.స్టీము డ్రమ్ము పై స్టీము మైయిన్ వాల్వు, సేఫ్టి వాల్వులు, ఎయిర్ వెంటు వాల్వు, ప్రెసరు గేజ్ అమర్చబడి వుండును.స్టీము డ్రమ్ములో పైభాగం ఫర్నేసు వెలుపల వుండి ఇన్సులేసన్ చెయ్యబడి వుండును.అలాగే వాటరు డ్రమ్ము కింది సగభాగం ఫర్నేసు బయటికి వుండి ఇన్సులేసను చెయ్యబడి వుండును.స్టీము డ్రమ్ము, వాటరు డ్రమ్మును కలుపుతూ నిలువుగా ఆతుకబడిన వాటరు ట్యూబుల మధ్య స్టీముసూట్ బ్లోవరు వుండును. దీని ద్వారా ట్యూబుల ఉపరితలం మీద జమ అగు మసి వంటి దానిని తొలగిస్తారు[3][4].

కెపాసిటి[మార్చు]

గంటకు 10,000 నుండి250,000 పౌండ్ల స్టీము (4500 -112500 కిలోల స్టీము) ఉత్పత్తి చేయు స్టీము కనీస పీడనం : 250 PSI (17 Kg/cm2) నుండి 638PSI (44 Kg/cm2) [2]

బయటి లింకుల వీడియోలు[మార్చు]

ఈ వ్యాసాలు కూడా చదవండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. "D TYPE WATERTUBE BOILERS". industrialboiler.com. Retrieved 07-02-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  2. 2.0 2.1 "D-TYPE PACKAGE BOILER" (PDF). indeck.com. Retrieved 07-02-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  3. "Types of Marine Boilers : Watertube Boilers". brighthubengineering.com. Retrieved 07-02-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  4. "Boiler construction-D type Boiler". marinenotes.blogspot.in. Retrieved 07-02-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)