డెక్కన్ చార్జర్స్
{{{name}}} | |||
సారధి: | కుమార సంగక్కర | ||
---|---|---|---|
కోచ్: | డారిల్ లీమన్ | ||
నగరం: | హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ | ||
రంగు(లు): | |||
స్థాపన: | 2008 | ||
స్వంత మైదానం: |
| ||
యజమాని: | డెక్కన్ క్రానికల్ | ||
IPL జయాలు: | 1 (2009) | ||
CLT20 జయాలు: | 0 (Qualified 2009) | ||
అధికారిక అంతర్జాలం: | http://www.deccanchargers.com/ |
డెక్కన్ చార్జర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో 2009 నుండి 2012 వరకు హైదరాబాదుకు ప్రాతినిధ్యం వహించిన జట్టు. 2009 లో దక్షిణ ఆఫ్రికాలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-2 పోటీలలో ఇది విజేతగా నిలిచింది. 2010 లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-3 పోటిలలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో సెమీఫైనల్స్ లో ఓడిపోయి పోటీనుండి నిష్క్రమించింది. 2010 లో జరిగిన వేలంపాటలో ఈ జట్టుకు చెందిన అనేక మంది ఆటగాళ్ళను వేరే జట్లు కొనుగోలు చేశాయి.
2012లో దీని యజమానులు ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టారు. మునుపటి సీజన్లలో జట్టు లోని ఆటగాళ్లను పదేపదే నిషేధించడం వల్ల వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ, వచ్చిన ఏకైక బిడ్‌ను వాళ్ళు తిరస్కరించారు. 2012 సెప్టెంబరు 14 న, కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను, IPL పాలక మండలి ఫ్రాంచైజీని రద్దు చేసింది.[1] సన్ టీవీ నెట్‌వర్కు, హైదరాబాద్ ఫ్రాంచైజీ బిడ్‌ను గెలుచుకుంది. ఈ సంగతిని బిసిసిఐ, 2012 అక్టోబరు 25 న ధ్రువీకరించింది.[2] కొత్త జట్టుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ అని పేరు పెట్టారు.[3]
2020 జూలైలో బాంబే హైకోర్టు నియమించిన ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్, బీసీసీఐ డెక్కన్ ఛార్జర్స్ ఫ్రాంచైజీని రద్దు చేయడం చట్టవిరుద్ధమని తీర్పునిచ్చింది. డెక్కన్ చార్జర్స్ హోల్డింగ్ లిమిటెడ్‌కి బిసిసిఐ 2012 నుండి నష్టపరిహారంగా 10% వడ్డీతో సహా ₹4,814.67 కోట్లు చెల్లించాలని కోర్టు చెప్పింది.[4]
జట్టు వివరాలు (2010)
[మార్చు]డెక్కన్ చార్జర్స్ జట్టు
| ||||||
---|---|---|---|---|---|---|
బ్యాటింగ్ సభ్యులు
ఆల్ రౌండర్లు
|
వికెట్ కీపర్లు
బౌలింగ్ సభ్యులు
|
జట్టు సహాయ సభ్యులు
|
2010 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్3
[మార్చు]క్రమ సంఖ్య. | తేదీ | ప్రత్యర్థి | వేదిక | ఫలితం |
---|---|---|---|---|
1 | మార్చి 12 | కోల్కతా నైట్ రైడర్స్ | డి.వై.పాటిల్ స్టేడియం, ముంబై | 11 పరుగుల తేడాతో ఓటమి. |
2 | మార్చి 14 | చెన్నై సూపర్ కింగ్స్ | ఎమ్.ఎ.చిదంబరం స్టేడియం, చెన్నై | 31 పరుగుల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ - చమిందా వాస్ - 4/21 |
3 | మార్చి 19 | కింగ్స్ XI పంజాబ్ | బారాబత్తి స్టేడియం, కటక్ | 6 పరుగుల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- ఆండ్రూ సైమండ్స్ - 53 పరుగులు |
4 | మార్చి 21 | ఢిల్లీ డేర్ డెవిల్స్ | బారాబత్తి స్టేడియం, కటక్ | 10 పరుగుల తేడాతో గెలుపు -మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- ఆండ్రూ సైమండ్స్ - 3 వికెట్లు |
5 | మార్చి 26 | రాజస్తాన్ రాయల్స్ | సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్ | 8 వికెట్ల తేడాతో ఓటమి |
6 | మార్చి 28 | ముంబై ఇండియన్స్ | డి.వై.పాటిల్ స్టేడియం, ముంబై | 41 పరుగుల తేడాతో ఓటమి. |
7 | ఏప్రిల్ 1 | కోల్కతా నైట్ రైడర్స్ | ఈడెన్ గార్డెన్స్ స్టేడియం, కోల్కతా | 24 పరుగుల తేడాతో ఓటమి. |
8 | ఏప్రిల్ 3 | ముంబై ఇండియన్స్ | బ్రబోర్న్ స్టేడియం, ముంబై | 63 పరుగుల తేడాతో ఓటమి. |
9 | ఏప్రిల్ 5 | రాజస్తాన్ రాయల్స్ | విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగపూర్ | 2 పరుగుల తేడాతో ఓటమి. |
10 | ఏప్రిల్ 8 | రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్ | ఎమ్. చిన్నస్వామి స్టేడియం, బెంగలూరు | 7 వికెట్ల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- తిరుమలశెట్టి సుమన్ - 78 పరుగులు |
11 | ఏప్రిల్ 10 | చెన్నై సూపర్ కింగ్స్ | విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగపూర్ | 6 వికెట్ల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- ర్యాన్ హ్యారిస్ - 3/18 |
12 | ఏప్రిల్ 12 | రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్ | విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగపూర్ | 13 పరుగుల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- హర్మీత్ సింగ్ |
13 | ఏప్రిల్ 15 | కింగ్స్ XI పంజాబ్ | హెచ్.పి.సి.ఎ క్రికెట్ స్టేడియం, ధర్మశాల | 5 వికెట్ల తేడాతో గెలుపు -మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- రోహిత్ శర్మ - 68* పరుగులు ఔట్ కాకుండా |
14 | ఏప్రిల్ 18 | ఢిల్లీ డేర్ డెవిల్స్ | ఫిరోజ్ షా కోట్ల స్టేడియం, ఢిల్లీ | 11 పరుగుల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- ఆండ్రూ సైమండ్స్ - 54 పరుగులు |
15 | ఏప్రిల్ 22[సెమీ ఫైనల్] | చెన్నై సూపర్ కింగ్స్ | డి.వై.పాటిల్ స్టేడియం, ముంబై | 38 పరుగుల తేడాతో ఓటమి. |
16 | ఏప్రిల్ 24 [మూడో స్థానం కోసం పోటీ] | రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్ | డి.వై.పాటిల్ స్టేడియం, ముంబై | 9 వికెట్ల తేడాతో ఓటమి |
మొత్తం | గెలిచినవి 8, ఓడినవి 8 |
బయటి లింకులు
[మార్చు]- ↑ "India Cricket News: BCCI terminates Deccan Chargers franchise". ESPN Cricinfo. Archived from the original on 17 September 2012. Retrieved 22 May 2013.
- ↑ "Sun TV Network win Hyderabad IPL franchise". Wisden India. 25 October 2012. Archived from the original on 25 June 2017. Retrieved 25 October 2012.
- ↑ "Sun Risers to represent Hyderabad in IPL". Wisden India. 18 December 2012. Archived from the original on 25 June 2017. Retrieved 18 December 2012.
- ↑ "IPL: BCCI asked to pay Rs 4814.67 crore to Deccan Chargers for wrongful termination".