Jump to content

నీరజ్ చోప్రా

వికీపీడియా నుండి
లెఫ్టినెంట్ కల్నల్
నీరజ్ చోప్రా
2021లో చోప్రా
Personal information
Nicknameసర్పంచ్[1]
Nationality భారతీయుడు
Born (1997-12-24) 1997 డిసెంబరు 24 (వయసు: 28)
ఖండ్రా , హర్యానా, భారతదేశం
Educationడిఎవి కాలేజ్
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ
Years active2010–ప్రస్తుతం
Height1.86 మీ (6 అడుగుల 1 అంగుళం)[2]
Weight86 కిలోగ్రాములు (190 పౌండ్లు)[3]
Spouse
హిమానీ మోర్
​
(m. 2025)​
Military career
రాజభక్తి భారతదేశం
సేవలు/శాఖ భారత సైన్యం
ర్యాంకు లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవనీయ)
యూనిట్ ప్రాదేశిక సైన్యం[4]
పురస్కారాలు
  • పరం విశిష్ట సేవా పతకం
  • పద్మశ్రీ
  • విశిష్ట సేవా పతకం
Sport
Country భారతదేశం
Sportఅథ్లెటిక్స్
Eventజావెలిన్ త్రో

సుబేదార్ నీరజ్ చోప్రా (జననం 1997 డిసెంబరు 24) జావెలిన్ త్రోలో పాల్గొనే ఒక భారతీయ ట్రాక్ & ఫీల్డ్ అథ్లెట్. అతను ప్రపంచ అథ్లెటిక్స్ ప్రకారం అంతర్జాతీయంగా రెండవ స్థానంలో ఉన్నాడు. చోప్రా భారత సైన్యంలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO). ఒలింపిక్స్‌లో భారతదేశానికి బంగారు పతకం సాధించిన మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్.[5] అతను ఐఎఎఎఫ్ (IAAF) ప్రపంచ U20 ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం తరుపున గెలిచిన మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్, 2016 లో అతను 86.48 మీటర్ల ప్రపంచ అండర్ -20 రికార్డు త్రోను సాధించాడు, ప్రపంచ రికార్డు సృష్టించిన మొదటి భారతీయ అథ్లెట్‌గా నిలిచాడు.

చోప్రా ఆగస్టు 7న తన రెండో ప్రయత్నంలో 87.58 మీటర్లు విసిరి ఫైనల్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు, అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన మొదటి భారతీయ ఒలింపియన్‌గా, అథ్లెటిక్స్‌లో స్వాతంత్ర్యానంతరం భారత తొలి ఒలింపిక్ పతక విజేతగా నిలిచాడు.[6]

అమెరికాలోని యుజీన్‌లో జరుగుతున్న 2022 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా 2022 జలై 24న జావెలిన్ త్రో ఫైనల్లో 88.13 మీటర్ల దూరం విసిరి రజతం కైవసం చేసుకున్నాడు.[7] 2003 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అంజు బాబీ జార్జ్ తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన రెండవ భారతీయుడిగా నీరజ్ చోప్రా నిలిచాడు.

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

నీరజ్ చోప్రా హర్యానా రాష్ట్రం, పానిపట్ జిల్లా, ఖాంద్రా గ్రామంలో 1997 డిసెంబరు 24న సతీష్ కుమార్ చోప్రా, సరోజ్ బాలాదేవి దంపతులకు జన్మించాడు.[8] చోప్రా చండీగఢ్ డీఏవీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.[9][10]

క్రీడా జీవితం

[మార్చు]

ప్రారంభ శిక్షణ

[మార్చు]

చిన్నప్పుడు ఒకసారి అతని ఊబకాయం గురించి స్థానిక పిల్లలు అతడిని ఆటపట్టించారు, దాంతో చోప్రా తండ్రి అతడిని మద్లౌడాలోని వ్యాయామశాలలో చేర్పించాడు; తరువాత అతను పానిపట్ లోని జిమ్‌లో చేరాడు. పానిపట్ లోని శివాజీ స్టేడియంలో ఆడుతున్నప్పుడు, అతను కొంతమంది జావెలిన్-త్రో క్రీడాకారులను చూసి స్వయంగా పాల్గొనడం ప్రారంభించాడు.[11]

చోప్రా సమీపంలోని పానిపట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్, SAI) కేంద్రాన్ని సందర్శించాడు, అక్కడ 2010 శీతాకాలంలో జావెలిన్ త్రోయర్ జైవీర్ చౌదరి అతనిలోని ప్రతిభను గుర్తించాడు.[12] శిక్షణ లేకుండా చోప్రా 40 మీటర్ల త్రో వేయగల సామర్థ్యాన్ని గమనించి, చౌదరి అతని మొదటి కోచ్ అయ్యాడు.[13] చౌదరి నుండి, జలంధర్‌లో జావెలిన్ కోచ్ కింద శిక్షణ పొందిన మరికొంత మంది అనుభవజ్ఞులైన అథ్లెట్ల నుండి చోప్రా క్రీడ యొక్క ప్రాథమిక విషయాలను నేర్చుకున్నారు.[14] ఆ తర్వాత త్వరలోనే తన మొదటి పతకం, జిల్లాస్థాయి పోటీలలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఆపై అతని సామర్ధ్యాలను అభివృద్ధి చేసుకుంటూ పానిపట్‌లో నివసించడానికి అతని కుటుంబాన్ని ఒప్పించాడు.[14]

చోప్రా 2018 సెప్టెంబరు 25 న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుండి అర్జున అవార్డును అందుకున్నాడు.[15]

ఒక సంవత్సరం పాటు చౌదరి కింద శిక్షణ పొందిన తరువాత, 13 ఏళ్ల చోప్రాను పంచకులలోని టౌ దేవిలాల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో చేర్చారు. అప్పుడి హర్యానా రాష్ట్రంలో సింథటిక్ రన్‌వేతో ఉన్న రెండు సౌకర్యాలలో ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి. అక్కడ రన్నింగ్ కోచ్ నసీమ్ అహ్మద్ కింద జావెలిన్ త్రోతో పాటు సుదూర పరుగులో శిక్షణ పొందాడు. పంచకులాకు ప్రత్యేక జావెలిన్ కోచ్ లేనందున, చోప్రా, తోటి జావెలిన్ త్రో ఆటగాడు పర్మీందర్ సింగ్, చెక్ దేశ ఛాంపియన్ జాన్ జెలెజ్నీ వీడియోలను డౌన్‌లోడ్ చేసి, అతని శైలిని అనుకరించడానికి ప్రయత్నించారు.[14] మొదట్లో టౌ దేవిలో, చోప్రా సాధారణంగా దాదాపు 55 మీటర్లు విసిరేవాడు, కానీ కొన్నిరోజులకే తన పరిధిని పెంచుకున్నాడు 2012 అక్టోబరు 27 న లక్నోలో జరిగిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో, 68.40 మీటర్ల కొత్త జాతీయ రికార్డు త్రోతో స్వర్ణం సాధించాడు.[16][17]

అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనటం

[మార్చు]

2013 లో, చోప్రా తన మొదటి అంతర్జాతీయ పోటీ, యుక్రెయిన్ లో జరిగిన వరల్డ్ యూత్ ఛాంపియన్‌షిప్‌లో ప్రవేశించాడు.[14] అతను 2014 లో తన మొదటి అంతర్జాతీయ పతకాన్ని గెలుచుకున్నాడు, బ్యాంకాక్‌లో జరిగిన యూత్ ఒలింపిక్స్ అర్హత పోటీలలో రజతం సాధించాడు.[18] 2014 సీనియర్ నేషనల్స్లో తన తొలి 70 మీటర్లపై త్రో వేసాడు.

2015 లో, ఆల్ ఇండియా ఇంటర్-యూనివర్సిటీ అథ్లెటిక్స్ మీట్‌లో 81.04 మీటర్లు విసిరి, చోప్రా జూనియర్ కేటగిరీలో మునుపటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు; ఇది అతని మొదటి 80 మీటర్లపై త్రో.[17]

కేరళలో జరిగిన 2015 నేషనల్ ఆటలలో చోప్రా ఐదవ స్థానంలో ముగించాడు,[19] ఫలితంగా జాతీయ స్థాయి శిక్షణ శిబిరం కోసం పిలుపు అందుకున్నాడు.[13] దాంతో 2016 లో పంచకుల వదిలి పాటియాలాలోని నేతాజీ సుభాష్ నేషనల్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్కు వెళ్ళాడు.[14][20] చోప్రా ప్రకారం, జాతీయ శిబిరంలో చేరడంతో అతని కెరీర్‌ ఒక మలుపు తిరిగింది, ఎందుకంటే అక్కడ పంచకుల కంటే మెరుగైన సౌకర్యాలు, మెరుగైన నాణ్యమైన ఆహారం, మెరుగైన శిక్షణ అందుకున్నాడు. అతని ప్రకారం, జాతీయ స్థాయి జావెలిన్ త్రోయర్లతో శిక్షణ పొందడం అతని మనోధైర్యాన్ని పెంచింది.[19] కేవలం చోప్రా కొరకు 2010 కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత కాశీనాథ్ నాయక్‌ను కోచ్ గా కేటాయించారు, అయితే నాయక్ శిక్షణ నియమావళి చాలా కష్టంగా ఉందని, నెలన్నర తర్వాత తనంతట తానుగా శిక్షణను తిరిగి ప్రారంభించాడు.[14]

2016 జూనియర్ ప్రపంచ పోటీలు, ఆర్మీలో చేరిక

[మార్చు]

2016 దక్షిణ ఆసియా క్రీడలలో, చోప్రా గౌహతిలో అథ్లెటిక్స్ ఫైనల్స్‌లో కొత్త వ్యక్తిగత అత్యుత్తమ విజయాన్ని సాధించాడు, 83 మీటర్ల ఒలింపిక్ అర్హత మార్కుకు కాస్త తక్కువైనా, 82.23 మీటర్ల త్రోతో స్వర్ణం గెలిచాడు. అతను ఆ నెలలో ఆస్ట్రేలియన్ కోచ్ గ్యారీ కాల్వర్ట్ కింద శిక్షణ కూడా ప్రారంభించాడు.[14] చోప్రా పోలాండ్లోని బిడ్గాష్చ్ లో జరిగిన 2016 ఐఎఎఎఫ్ ప్రపంచ యు20 పోటీలలో 86,48 మీటర్ల త్రోతో కొత్త ప్రపంచ జూనియర్ రికార్డ్ను నెలకొల్పి బంగారు పతకం గెలిచాడు. అలా ఒక ప్రపంచ రికార్డు సాధించిన మొట్టమొదటి భారతీయ అథ్లెట్ చోప్రానే, అదే సమయంలో ఇది ఒక కొత్త జాతీయ రికార్డు కూడా.[21] ఆ పోటీలలో అతను యు20 రికార్డ్ డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ కేషోర్న్ వాల్‌కాట్ రికార్డును అధిగమించినప్పటికీ, 2016 వేసవి ఒలింపిక్స్‌ అర్హతకు చివరి తేదీ జూలై 11 ఒక వారం ముందే వెళ్ళిపొతయింది. దాంతో అర్హత సాధించలేకపోయింది. 2016 ఏప్రిల్ లో న్యూఢిల్లీలో జరిగిన ఫెడరేషన్ కప్ సమయంలో వచ్చిన వెన్నునొప్పి కారణంగా రియో కోసం అతని సన్నాహాలు కూడా దెబ్బతిన్నాయి, ఇది పోటీలో అతని ప్రదర్శనను గణనీయంగా ప్రభావితం చేసింది.[21]

దక్షిణ ఆసియా క్రీడలలో చోప్రా ప్రదర్శన, అతని సామర్థ్యం భారత సైన్యాన్ని ఆకట్టుకుంది. అతనికి రాజ్‌పుతానా రైఫిల్స్‌లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) గా నేరుగా నియామకాన్ని నాయబ్ సుబేదార్ ర్యాంక్‌తో ఇచ్చింది, ఈ ర్యాంక్ సాధారణంగా అథ్లెట్లకు మంజూరు చేయబడదు, వీరిని సాధారణంగా నాన్-కమిషన్డ్ ఆఫీసర్‌లుగా (NCO) నియమించుకుంటారు.[22] 2016 సెప్టెంబరు లో, అతను బెంగుళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రంలో శిక్షణ కోసం నేతాజీ సుభాస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ నుండి బయలుదేరాడు. అతను 2016 డిసెంబరులో అధికారికంగా జెసిఓగా చేరాడు, తదనంతరం అతని శిక్షణను కొనసాగించడానికి పొడిగించిన సెలవులను పొందాడు.[20]

2017 లో ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ పోటీలలో చోప్రా బంగారు పతకం సాధించాడు.

2017 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో చోప్రా 85.23 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు.[23] తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల కోసం ఆగస్టులో లండన్‌కు వెళ్లాడు, కానీ ఫైనల్స్‌కు చేరుకోవడానికి ముందే తొలగించబడ్డాడు.[24] ఆగస్టు 24 న, జ్యూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో తన మూడవ ప్రయత్నంలో గజ్జల (groin) చోట పెద్ద గాయమయింది, ఆ ప్రయత్నంలో అతను 83.39 మీటర్ల దూరాన్ని సాధించాడు; గాయం కారణంగా, అతను తన నాల్గవ ప్రయత్నాన్ని ఫౌల్ చేసాడు, తన మిగిలిన చివరి రెండు ప్రయత్నాలను దాటవేసాడు.[24] అతని మొదటి, ఉత్తమ త్రో 83.80 మీటర్లు అతనికి ఏడవ స్థానంలో నిలిపింది.[24] ఫలితంగా, 2017 లో అన్ని తదితర పోటీల నుండి వైదొలిగాడు.[25] గాయాల నుండి కోలుకున్న తర్వాత, వెర్నర్ డేనియల్స్‌తో శిక్షణ కోసం జర్మనీలోని ఆఫెన్‌బర్గ్‌కు వెళ్లాడు. అతని మాజీ కోచ్ కాల్వర్ట్ తన కాంట్రాక్టుపై వివాదాల కారణంగా మేలో భారతదేశాన్ని విడిచిపెట్టాడు.[25]

2018 కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల జావెలిన్ త్రోలో, అతను 86.47 మీటర్ల సీజన్-ఉత్తమ త్రోను నమోదు చేశాడు, కామన్వెల్త్ గేమ్స్‌లో జావెలిన్ త్రోలో గెలిచిన మొదటి భారతీయుడయ్యాడు.[26] 2018 మేలో దోహా డైమండ్ లీగ్‌లో 87.43 మీటర్లు విసిరి జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు.[27]

2018 ఆగస్టు లో, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఆసియా క్రీడలలో చోప్రా అరంగేట్రం చేసాడు. ఆ ఆటలలో జరిగే దేశాల పరేడ్ లో భారత బృందానికి జెండా మోసాడు.[28] ఆగస్టు 27 న, అతను 2018 ఆసియా క్రీడలలో పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించడానికి 88.06 మీటర్ల దూరం విసిరాడు, తన స్వంత జాతీయ రికార్డును మెరుగుపరుచుకున్నాడు.[29] ఆసియా క్రీడల్లో జావెలిన్ త్రోలో భారతదేశానికి ఇదే మొదటి బంగారు పతకం. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న కోసం అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) సిఫారసు చేసిన ఏకైక ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ చోప్రా మాత్రమే, కానీ 2018 సెప్టెంబరులో అర్జున అవార్డును అందుకున్నాడు.[30] నవంబరులో సైన్యం అతన్ని సుబేదార్‌ పదవికి ప్రమోట్ చేసింది.[31]

తదనంతరం 2021 కి వాయిదా వేయబడిన, 2020 టోక్యో ఒలింపిక్స్‌కు చోప్రా తన జర్మన్ కోచ్ ఉవే హోన్, బయోమెకానిక్స్ నిపుణుడు క్లాస్ బార్టోనిట్జ్, ఫిజియోథెరపిస్ట్ ఇషాన్ మార్వా మార్గదర్శకత్వంతో శిక్షణ పొందాడు.[32] 2018 - 2019 సమయంలో, హోన్ చోప్రా యొక్క త్రోయింగ్ టెక్నిక్‌ను మెరుగుపరిచాడు, హోన్ ప్రకారం ఇది గతంలో "అటవికం"గా ఉంది.[7]

గాయం , కోలుకోవడం

[మార్చు]

చోప్రా తన కుడి మోచేతి ఎముకలో స్పర్స్, దానికి సంబంధించిన శస్త్రచికిత్స కారణంగా దోహాలో 2019 ప్రపంచ పోటీలకు దూరమయ్యాడు. పటియాలాలో, విజయనగర్ లోని స్పోర్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్ లో ధ్యానం, పునరావాస శిక్షణతో కొంతకాలం కోలుకున్న తర్వాత, చోప్రా జర్మన్ బయోమెకానిక్స్ నిపుణుడు క్లాస్ బార్టోనిట్జ్ దగ్గర శిక్షణ కోసం 2019 నవంబరులో దక్షిణాఫ్రికా వెళ్లాడు.[33][34] గతంలో, అతనికి గ్యారీ కాల్వర్ట్ [35], వెర్నర్ డేనియల్స్ శిక్షణ ఇచ్చారు.[36]

16 నెలల విరామం తరువాత 2020 జనవరిలో దక్షిణాఫ్రికాలో జరిగిన అథ్లెటిక్స్ సెంట్రల్ నార్త్ వెస్ట్ లీగ్ సమావేశంలో 87.86 మీటర్ల త్రో గెలిచి అంతర్జాతీయ పోటీలలో తిరిగి ప్రవేశించాడు. ఈ 85 మీటర్లపై త్రోతో టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే అర్హత సాధించాడు.[33]

దక్షిణాఫ్రికా తరువాత, చోప్రా శిక్షణ కోసం టర్కీకి వెళ్లాడు, కాని COVID-19 మహమ్మారి కారణంగా 2020 మార్చిలో భారతదేశానికి తిరిగి రావలిసి వచ్చింది.[37] భారతదేశంలో మహమ్మారి, లాక్డౌన్ కారణంగా,[37] చోప్రా మరుసటి సంవత్సరం ఎనైఎస్ (NIS) పాటియాలాలో శిక్షణ పొందాడు.[38] 2020 చివరలో, జాతీయ జావెలిన్ బృందం కోసం భారత అథ్లెటిక్స్ ఫెడరేషన్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది, చోప్రా 2020 డిసెంబరు నుండి 2021 ఫిబ్రవరి వరకు దానికి హాజరయ్యారు.[39]

2021 మార్చి 5 న, చోప్రా మళ్లీ 88.07 మీటర్లు విసిరి తన స్వంత జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు, అలాగే అంతర్జాతీయంగా మూడో ర్యాంక్ కు ఎదిగాడు.[40]

మహమ్మారి కారణంగా, శిక్షణ కోసం స్వీడన్ వెళ్లడానికి కావాల్సిన వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. వారాల తరబడి ప్రయత్నించాక, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జోక్యంతో తన కోచ్‌తో కలిసి ఐరోపా‌కు వెళ్లడానికి అనుమతి దొరికింది.[41][42] సమావేశం సిడాడ్ డి లిస్బోవా కోసం పోర్చుగల్‌కు వెళ్లడానికి ముందు అతను తప్పనిసరియైన నిర్బంధ వ్యవధి కోసం 2021 జూన్ 5 న పారిస్‌కు వెళ్లాడు.[37] అతను తన అంతర్జాతీయ సీజన్ 2021 ను 83.18 మీటర్లు విసిరి అక్కడ ప్రారంభించాడు, అది అతనికి బంగారు పతకం సాధించింది.[43] చోప్రా తన కోచ్ తో తదుపరి శిక్షణ కోసం స్వీడన్‌లోని ఉప్సలాకు వెళ్లే ముందు జూన్ 19 వరకు లిస్బన్‌లోనే ఉన్నాడు.

అతను జూన్ 22 న స్వీడన్‌లో జరిగిన కార్ల్‌స్టాడ్ మీట్‌లో పాల్గొన్నాడు, అక్కడ అతను 80.96 మీటర్ల త్రోతో స్వర్ణం సాధించాడు. ఆ తర్వాత ఫిన్లాండ్ లో జరిగిన కుర్టేన్ ఆటలలో 86,79 మీటర్ల త్రోతో కాంస్యం గెలుచాడు.[44][45] కుర్టేన్ ఆటల తరువాత మరో పొటీకై స్విట్జర్లాండ్ లోని లూసర్న్ కు ప్రయాణించాడు కానీ అలసట కారణంగా ఉపసంహరించుకున్నాడు.[45] అతను జూలై 13 న గేట్స్‌హెడ్‌లో జరిగే డైమండ్ లీగ్‌లోకి ప్రవేశించడానికి యునైటెడ్ కింగ్‌డమ్‌ వీసా పొందడానికి ప్రయత్నించాడు, కానీ మహమ్మారి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. బదులుగా ఉప్సలాలో తన నైపుణ్యం మెరుగుకై శిక్షణ కొనసాగించాడు.[46]

2020 టోక్యో ఒలింపిక్స్

[మార్చు]

2021 ఆగస్టు 4 న, జపాన్ జాతీయ స్టేడియంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి చోప్రా ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేశాడు.[47] ఫైనల్‌కు ప్రవేశించడానికి అతను తన అర్హత గుంపులో 86.65 మీటర్లు విసిరాడు.[48] ఆగస్టు 7 న తన రెండో ప్రయత్నంలో 87.58 మీటర్లు విసిరి ఫైనల్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు, అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన మొదటి భారతీయ ఒలింపియన్‌గా, అథ్లెటిక్స్‌లో స్వతంత్ర భారత్ తొలి ఒలింపిక్ పతక విజేతగా నిలిచాడు.[6] చోప్రా పతకంతో కలిపి 2020 ఒలింపిక్స్‌లో భారతదేశం మొత్తం ఏడు పతకాలు గెలిచింది, 2012 లండన్ ఒలింపిక్స్‌లో గెలిచిన ఆరు పతకాల ఉత్తమ ప్రదర్శనను అధిగమించింది.[49] టోక్యోలో అతని ప్రదర్శన ఫలితంగా, చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో అంతర్జాతీయంగా రెండవ ర్యాంక్ అథ్లెట్ అయ్యాడు.[50] 2008 సమ్మర్ ఒలింపిక్స్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో బంగారు పతకం సాధించిన అభినవ్ బింద్రా తర్వాత వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకున్న రెండో భారతీయుడిగా చోప్రా నిలిచాడు.[51] అతను తన విజయాన్ని స్ప్రింటర్స్ మిల్కా సింగ్, PT ఉష, భారతదేశ మాజీ ఒలింపియన్లకు అంకితమిచ్చాడు.[52]

పారిస్ ఒలింపిక్స్ & డైమండ్ లీగ్ (2024)

[మార్చు]
2024 పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రాకు రజత పతకం లభించింది

2022 ఆసియా క్రీడలలో ఒలింపిక్ క్వాలిఫైయింగ్ స్టాండర్డ్‌ను సాధించడం ద్వారా చోప్రా 2024 పారిస్ ఒలింపిక్స్ అర్హత సాధించాడు.[53] 2024 దోహా డైమండ్ లీగ్‌లో అతను 88.36 మీటర్ల విసిరి రెండవ స్థానంలో నిలిచాడు, 88.38 మీటర్ల విసిరి, సమావేశంలో అగ్రస్థానంలో నిలిచిన చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వాడ్లెజ్ కేవలం 2 సెంటీమీటర్ల దూరంలో ఉన్నాడు.[54] అతను ఫెడరేషన్ కప్‌లో 82.27 మీటర్ల విసిరి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.[55] ఆ తరువాత అతను 2024 పావో నూర్మి గేమ్స్ పాల్గొన్నాడు, అక్కడ అతను 85.97 మీటర్ల విసిరి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.[56]

చోప్రా 2024 పారిస్ ఒలింపిక్స్ పోటీ పడ్డాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో, అతను 89.34 మీటర్ల సీజన్-బెస్ట్ త్రోతో తన గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.[57][58] ఫైనల్లో, అతని రెండవ ప్రయత్నం మాత్రమే చట్టబద్ధమైన త్రో, కానీ 89.45 మీటర్ల వద్ద అది వెండి పతకాన్ని గెలుచుకోవడానికి సరిపోతుంది.[59] 2020 ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తరువాత, చోప్రా భారతదేశానికి ఐదవ వ్యక్తిగత బహుళ పతక విజేతగా నిలిచాడు, బంగారు & వెండి కలయికను గెలుచుకున్న మొదటి వ్యక్తి అయ్యాడు.[60] ఒలింపిక్స్ తరువాత, అతను లౌసాన్ మీట్‌లో రెండవ స్థానాన్ని పొందాడు, సీజన్లో అత్యుత్తమంగా 89.49 మీటర్ల దూరం విసిరాడు.[61] 2024 డైమండ్ లీగ్‌లో 2వ స్థానంలో నిలిచి చోప్రా ఆ సీజన్‌ను ముగించాడు.

90 మీ మార్క్, NC క్లాసిక్ (2025-)

[మార్చు]

వరల్డ్ అథ్లెటిక్స్, నీరజ్ చోప్రా క్లాసిక్ అనే పేరుతో గోల్డ్ కేటగిరీ జావెలిన్ మీట్‌ను ప్రకటించింది , దీనిని 2025 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు ఒక కీలక అర్హత ఈవెంట్‌గా చేసింది.[62] 2025 డైమండ్ లీగ్ దోహా క్వాలిఫికేషన్ మీటింగ్‌లో , చోప్రా 90.23 మీటర్లు విసిరి, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 90 మీటర్ల మార్కును అధిగమించాడు.[63] జూలియన్ వెబర్ తన చివరి త్రోలో 91.06 మీటర్లు సాధించి, మొదటి స్థానాన్ని కైవసం చేసుకునే వరకు, అతను మొత్తం మీట్ లైవ్ ఫలితాలలో అగ్రస్థానంలో నిలిచాడు.[64]

మేలో, ఆడి ఇండియా చోప్రాను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది.[65] ఆ తరువాత అతను 2025 డైమండ్ లీగ్ పారిస్ క్వాలిఫికేషన్ మీట్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.[66] అతని తదుపరి ప్రదర్శన గోల్డెన్ స్పైక్ ఓస్ట్రావా ఉంది, దానిని అతను గెలుచుకున్నాడు.[67] అతను నీరజ్ చోప్రా క్లాసిక్ కు ఆతిథ్యం ఇవ్వడానికి, పాల్గొనడానికి ముందుకు వెళ్ళాడు.[68] అతని పేరు మీద జరిగిన పోటీలో చోప్రా గెలిచారు. [69] ఈ కార్యక్రమానికి బెంగళూరు శ్రీ కంఠీరవ స్టేడియం 15,000 మందికి పైగా హాజరయ్యారు.[70] 2025 డైమండ్ లీగ్ ఫైనల్ సమయంలో, అతను రెండవ స్థానంలో నిలిచాడు, 2021 నుండి తన మొదటి రెండు పరంపరను, 2020 నుండి తన పోడియం ముగింపు పరంపరను కొనసాగించాడు.[71] కానీ 2025 ప్రపంచ ఛాంపియన్షిప్]] పోడియం చేరుకోవడంలో విఫలమైనప్పుడు ఆ పరంపర చివరకు ముగిసింది.[72][73]

కోచింగ్ చరిత్ర

[మార్చు]

చోప్రా పలువురు కోచ్‌ల వద్ద శిక్షణ పొందాడు, వారిలో తొలి కోచ్‌లలో ఒకరైన జైవీర్ సింగ్ చౌదరి 2010 నుండి 2011 వరకు ఆయనకు శిక్షణ ఇచ్చారు.[74] నసీమ్ అహ్మద్ తరువాత వచ్చి 2011 నుండి 2016 వరకు అతని కోచ్‌గా కొనసాగారు.[75] కాశీనాథ్ నాయక్ చోప్రా సంక్షిప్త శిక్షకుడు, 2016లో అతనికి శిక్షణ ఇచ్చాడు.[76] గ్యారీ కాల్‌వర్ట్ 2016 నుండి 2017 వరకు పగ్గాలు చేపట్టాడు.[77] అతను 2018 నుండి 2021 వరకు ఉవే హాన్ చేత శిక్షణ పొందాడు.[78]

2021 నుండి 2024 వరకు క్లాస్ బార్టోనిట్జ్ ఆధ్వర్యంలో చోప్రా శిక్షణ అనేక విజయాలు, టైటిల్స్, బంగారు పతకాలకు దారితీసింది.[79] అప్పటి నుండి 2026 ప్రారంభంలో ఇద్దరూ విడిపోయే వరకు జాన్ జెలెజ్నీ చేత శిక్షణ పొందారు.[80][81] చోప్రా 2026లో జైవీర్ సింగ్ చౌదరితో తిరిగి కలుసుకున్నాడు, అతను తన నిర్మాణ సంవత్సరాల్లో అతనికి మార్గదర్శకత్వం వహించాడు.[82]

వ్యవధి కోచ్
2010–2011 జైవీర్ సింగ్ చౌదరిభారతదేశం
2011–2016 నసీమ్ అహ్మద్భారతదేశం
2016 కాశీనాథ్ నాయక్భారతదేశం
2016–2017 గ్యారీ కల్వెర్ట్Australia
2018–2021 ఉవే హోన్జర్మనీ
2021–2024 క్లాస్ బార్టోనిట్జ్జర్మనీ
2024–2026 జాన్ జెలెజ్నీCzech Republic
2026-ప్రస్తుతం జైవీర్ సింగ్ చౌదరిభారతదేశం

ప్రదర్శనల రికార్డు

[మార్చు]

టోర్నమెంట్లు

[మార్చు]
భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు భారతదేశం
సంవత్సరం టోర్నమెంట్ వేదిక స్థానం ఫలితం సూచన.
2013 U18 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు Ukraine డొనెట్స్క్ , ఉక్రెయిన్ 19వ 66.75 మీ [83]
2015 ఆసియా ఛాంపియన్‌షిప్‌లు China వుహాన్ , చైనా 9వ 70.50 మీ [84]
2016 దక్షిణాసియా క్రీడలు భారతదేశం గౌహతి , భారతదేశం 1వ 82.23 మీ [85][86]
2016 U20 ఆసియా ఛాంపియన్‌షిప్‌లు వియత్నాం హో చి మిన్ సిటీ , వియత్నాం 2వ 77.60 మీ [87]
2016 U20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు పోలాండ్ బైడ్‌గోస్జ్ , పోలాండ్ 1వ 86.48మీ WU20R [88]
2017 ఆసియా ఛాంపియన్‌షిప్‌లు భారతదేశం భువనేశ్వర్ , భారతదేశం 1వ 85.23 మీ [89]
2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు United Kingdom లండన్ , యునైటెడ్ కింగ్‌డమ్ 15వ 82.26 మీ [90]
2018 కామన్వెల్త్ గేమ్స్ Australia గోల్డ్ కోస్ట్ , ఆస్ట్రేలియా 1వ 86.47మీ [91][92]
2018 ఆసియా క్రీడలు Indonesia జకార్తా , ఇండోనేషియా 1వ 88.06మీ [93]
2021 ఒలింపిక్ క్రీడలు Japan టోక్యో , జపాన్ 1వ 87.58మీ [94]
2022 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు అమెరికా సంయుక్త రాష్ట్రాలు యూజీన్ , యునైటెడ్ స్టేట్స్ 2వ 88.13 మీ [95]
2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు హంగరీ బుడాపెస్ట్ , హంగరీ 1వ 88.17 మీ [96]
2023 ఆసియా క్రీడలు China హాంగ్జౌ , చైనా 1వ 88.88మీ [97]
2024 ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్స్ పారిస్ , ఫ్రాన్స్ 2వ 89.45మీ [98]
2025 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు Japan టోక్యో , జపాన్ 8వ 84.03మీ [99]
2026 కామన్వెల్త్ గేమ్స్ స్కాట్లాండ్ గ్లాస్గో , స్కాట్లాండ్ 2వ 85.83 మీ [100]

డైమండ్ లీగ్

[మార్చు]
సంవత్సరం సమావేశం రౌండ్ ఫలితం మూ
2022 దోహా డైమండ్ లీగ్ అర్హత డిఎన్‌పి
బౌహాస్‌ గాలన్ 2వ [101]
కమీలా స్కోలిమోవ్స్కా స్మారక చిహ్నం డిఎన్‌పి
అథ్లెటిస్సిమా 1వ [102]
వెల్ట్‌క్లాస్ జ్యూరిచ్ తుది విజేత [103]
2023 దోహా డైమండ్ లీగ్ అర్హత 1వ [104]
అథ్లెటిస్సిమా 1వ [105]
హెర్క్యులిస్ డిఎన్‌పి
వెల్ట్‌క్లాస్ జ్యూరిచ్ 2వ [106]
ప్రిఫోంటైన్ క్లాసిక్ తుది 2వ [107]
2024 దోహా డైమండ్ లీగ్ అర్హత 2వ [108]
మీటింగ్ డి పారిస్ డిఎన్‌పి
అథ్లెటిస్సిమా 2వ [109]
వెల్ట్‌క్లాస్ జ్యూరిచ్ డిఎన్‌పి
వాన్ డామ్ స్మారక చిహ్నం తుది 2వ [110]
2025 దోహా డైమండ్ లీగ్ అర్హత 2వ [111]
మీటింగ్ డి పారిస్ 1వ [112]
కమీలా స్కోలిమోవ్స్కా స్మారక చిహ్నం డిఎన్‌పి
వాన్ డామ్ స్మారక చిహ్నం డిఎన్‌పి
వెల్ట్‌క్లాస్ జ్యూరిచ్ తుది 2వ [113]
2026 మీటింగ్ ఇంటర్నేషనల్ మహమ్మద్ VI డి'అథ్లెటిస్మ్ డి రబాట్ అర్హత డిఎన్‌పి
గోల్డెన్ గాలా డిఎన్‌పి
దోహా డైమండ్ లీగ్ 4వ [114]

ఆహ్వాన సమావేశాలు

[మార్చు]
సంవత్సరం టోర్నమెంట్ వేదిక స్థానం ఫలితం మూ
2018 సోటెవిల్లే అథ్లెటిక్స్ మీట్ France 1వ 85.17 మీ [115]
2018 సావో గేమ్స్ Finland 1వ 85.69 మీ [116]
2021 లిస్బన్ నగరం సమావేశం Portugal 1వ 83.18 మీ [117]
2021 ఫోల్క్‌సామ్ గ్రాండ్ ప్రిక్స్  Sweden 1వ 80.96 మీ [118]
2021 కువోర్టానె గేమ్స్ Finland 3వ 86.79 మీ [119]
2022 కువోర్టానె గేమ్స్ Finland 1వ 86.69 m [120]
2024 పావో నూర్మి గేమ్స్ Finland 1వ 85.97 మీ [121]
2025 పోట్చెఫ్‌స్ట్రూమ్ ఇన్విటేషనల్ దక్షిణ ఆఫ్రికా 1వ 84.52 మీ [122]
2025 జానుజ్ కుసోసిన్స్కి స్మారక చిహ్నం Poland 2వ 84.14 మీ [123]
2025 గోల్డెన్ స్పైక్ ఓస్ట్రావా Czech Republic 1వ 85.29 మీ [124]
2025 నీరజ్ చోప్రా క్లాసిక్ భారతదేశం 1వ 86.18 మీ [125]

సీజనల్ బెస్ట్‌లు

[మార్చు]
సంవత్సరం తేదీ స్థానం పనితీరు గమనికలు
2013 26 జూలై భారతదేశం తిరువనంతపురం , భారతదేశం 69.66 మీ
2014 17 ఆగస్టు భారతదేశం పాటియాలా , భారతదేశం 70.19 మీ
2015 31 డిసెంబర్ 81.04 మీ
2016 23 జూలై పోలాండ్ బైడ్‌గోస్జ్ , పోలాండ్ 86.48 మీ WJR WU20R
2017 2 జూన్ భారతదేశం పాటియాలా , భారతదేశం 85.63 మీ
2018 27 ఆగస్టు Indonesia జకార్తా , ఇండోనేషియా 88.06 మీ
2020 28 జనవరి South Africa పోట్చెఫ్‌స్ట్రూమ్ , దక్షిణాఫ్రికా 87.86 మీ
2021 5 మార్చి భారతదేశం పాటియాలా , భారతదేశం 88.07 మీ
2022 30 జూన్ Sweden స్టాక్‌హోమ్ , స్వీడన్ 89.94 మీ
2023 4 అక్టోబర్ China హాంగ్జౌ , చైనా 88.88 మీ
2024 22 ఆగస్టు స్విట్జర్లాండ్ లౌసాన్ , స్విట్జర్లాండ్ 89.49 మీ
2025 16 మే ఖతార్ దోహా , ఖతార్ 90.23 మీ NR
2026 31 జూలై స్కాట్లాండ్ గ్లాస్గో , స్కాట్లాండ్ 85.83 మీ

మూలం: వరల్డ్ అథ్లెటిక్స్

సైనిక ర్యాంకులు

[మార్చు]
చిహ్నం ర్యాంక్ భాగం వ్యవధి మూ
నాయిబ్ సుబేదార్ భారత సైన్యం 2016–2021
సుబేదార్ 2021–2024
సుబేదార్ మేజర్ 2024–2025 [126]
లెఫ్టినెంట్ కల్నల్ 2025–ప్రస్తుతం [127]

గుర్తింపు & గౌరవాలు

[మార్చు]
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న నీరజ్ చోప్రా

జాతీయ పౌర & సైనిక గౌరవాలు

[మార్చు]
సంవత్సరం గౌరవం రిబ్బన్ మూ
2022 పరం విశిష్ట సేవా పతకం మూస:Ribbon devices/alt [128]
పద్మశ్రీ మూస:Ribbon devices/alt [129]
విశిష్ట సేవా పతకం మూస:Ribbon devices/alt [130]
75వ స్వాతంత్ర్య దినోత్సవ పతకం మూస:Ribbon devices/alt [131]

ఇతర విశిష్ట గౌరవాలు

[మార్చు]
సంవత్సరం గౌరవం గమనికలు మూ
2021 ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ స్టేడియం, పూణే నీరజ్ చోప్రా స్టేడియంగా పేరు మార్చబడింది రాజ్‌నాథ్ సింగ్ ద్వారా [132]
2021 వోగ్ ఇండియా సంవత్సరపు ఉత్తమ వ్యక్తి ముఖచిత్రంపై కనిపించిన తొలి పురుష క్రీడాకారుడు [133]
2022 స్విట్జర్లాండ్ పర్యాటకం భారత రాయబారిగా నియమితులయ్యారు [134]
2025 ట్రాక్ & ఫీల్డ్ వార్తలు ఉత్తమ పురుష జావెలిన్ త్రోయర్ [135]
2025 ప్రపంచ అథ్లెటిక్స్ స్వర్ణోత్సవం నీరజ్ చోప్రా క్లాసిక్ అంతర్జాతీయ జావెలిన్ సమావేశం [136]
2025 ఆడి ఇండియా బ్రాండ్ అంబాసిడర్ [137]
2025 ది ఎకనామిక్ టైమ్స్ 40 ఏళ్లలోపు 40 మంది జాబితా [138]

అవార్డులు & నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగం ఫలితం మూ
2017 భారత క్రీడా గౌరవాలు సంవత్సరపు ఉత్తమ క్రీడాకారుడు ప్రతిపాదించబడింది [139]
వర్ధమాన క్రీడాకారుడు గెలుపు [140]
2018 అర్జున అవార్డు క్రీడలు మరియు ఆటలలో అత్యుత్తమ ప్రదర్శన గెలుపు [141]
2019 భారత క్రీడా గౌరవాలు సంవత్సరపు ఉత్తమ క్రీడాకారుడు ప్రతిపాదించబడింది [142]
క్రీడా స్ఫూర్తి గౌరవం ప్రతిపాదించబడింది [142]
2021 ఖేల్ రత్న అవార్డు క్రీడా రంగంలో అద్భుతమైన ప్రదర్శన గెలుపు [143]
టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డ్స్ సంవత్సరపు ఉత్తమ పురుష అథ్లెట్ గెలుపు [144]
2022 లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ ఫర్ బ్రేక్‌త్రూ ఆఫ్ ది ఇయర్ ప్రతిపాదించబడింది
స్పోర్ట్‌స్టార్ అవార్డులు స్పోర్ట్‌స్టార్ ఆఫ్ ది ఇయర్ మేల్ గెలుపు
స్పోర్ట్‌స్టార్ ఆఫ్ ది ఇయర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ గెలుపు [145]
ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ క్రీడలలో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ గెలుపు [146]
2023 స్పోర్ట్‌స్టార్ అవార్డులు స్పోర్ట్‌స్టార్ ఆఫ్ ది ఇయర్ మేల్ గెలుపు [147]
భారత క్రీడా గౌరవాలు సంవత్సరపు ఉత్తమ క్రీడాకారుడు గెలుపు
సంవత్సరపు పునరాగమనం గెలుపు
టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డ్స్ సంవత్సరపు ఉత్తమ పురుష అథ్లెట్ గెలుపు [148]
సంవత్సరపు ఉత్తమ క్రీడాకారుడు గెలుపు
ప్రపంచ అథ్లెటిక్స్ అవార్డులు సంవత్సరపు ఉత్తమ అథ్లెట్ ప్రతిపాదించబడింది [149]
2024 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ క్రీడలలో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ గెలుపు [150]
యంగ్ లీడర్స్ అవార్డ్స్ సంవత్సరపు యూత్ ఐకాన్ గెలుపు [151]
భారత క్రీడా గౌరవాలు సంవత్సరపు ఉత్తమ క్రీడాకారుడు గెలుపు [152]
స్పోర్ట్‌స్టార్ అవార్డులు స్పోర్ట్‌స్టార్ ఆఫ్ ది ఇయర్ మేల్ గెలుపు [153]

మూలాలు

[మార్చు]
  1. ↑ Pritam, Norris (30 November 2023). "Neeraj Chopra entered sports to lose weight. Boys would tease him, call him 'sarpanch'". ThePrint. Retrieved 16 October 2024.
  2. ↑ "Neeraj Chopra". Paris 2024 Olympics. Archived from the original on 9 August 2024. Retrieved 6 August 2024.
  3. ↑ "Neeraj Chopra". 2018 Commonwealth Games. Archived from the original on 11 August 2021. Retrieved 14 April 2018.
  4. ↑ Mohan, Vimal (14 May 2025). "Neeraj Chopra Conferred Lieutenant Colonel Rank In Territorial Army, Joins Elite List". NDTV. Archived from the original on 14 మే 2025. Retrieved 14 May 2025.
  5. ↑ "Tokyo Olympics 2020: Neeraj Chopra wins historic Gold in javelin throw, India's first athletics medal in 100 yrs". Mirror Now. The Economic Times. 2021-08-07. Retrieved 2021-08-16.
  6. 1 2 Selvaraj, Jonathan (7 August 2021). "Ice-cold Neeraj Chopra turns Olympic legend with India's first athletics gold". ESPN. Archived from the original on 7 August 2021. Retrieved 7 August 2021.
  7. 1 2 "Who is Neeraj Chopra's coach?". olympics.com. 9 August 2021. Retrieved 13 August 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. ↑ EENADU (8 August 2021). "ఆ కన్నీళ్లే.. పునాది రాళ్లు". Archived from the original on 8 August 2021. Retrieved 8 August 2021.
  9. ↑ Andrajyothy (7 August 2021). "భారత్‌కు స్వర్ణం అందించిన ఈ నీరజ్ చోప్రా ఎవరు?". Archived from the original on 7 August 2021. Retrieved 7 August 2021.
  10. ↑ Andrajyothy (8 August 2021). "స్వర్ణ నీరాజనం". Archived from the original on 9 August 2021. Retrieved 9 August 2021.
  11. ↑ Kumar, Amit (12 August 2021). "I was not thinking about Johannes Vetter, but about myself and my throw: Neeraj Chopra". The Times of India (in ఇంగ్లీష్). New Delhi. Retrieved 13 August 2021.
  12. ↑ Ghosh, Avijit (4 September 2018). "How a chubby guy became champ". The Times of India. Archived from the original on 23 April 2021. Retrieved 11 August 2021.
  13. 1 2 Amsan, Andrew (29 July 2018). "Asian Games: Neeraj Chopra, spearman from Khandra". The Indian Express. Archived from the original on 7 August 2021. Retrieved 7 August 2021.
  14. 1 2 3 4 5 6 7 Selvaraj, Jonathan (28 February 2016). "India's latest athletics sensation Neeraj Chopra is brimming with natural talent". The Indian Express. Retrieved 15 August 2021.
  15. ↑ "National Sports Awards 2018: List of awardees". The Times of India. 25 September 2018. Retrieved 14 August 2021.
  16. ↑ "28th NATIONAL JUNIOR ATHLETICS CHAMPIONSHIPS-2012" (PDF). Athletics Federation of India. 2012. Archived (PDF) from the original on 11 August 2021. Retrieved 11 August 2021.
  17. 1 2 Sharma, Nitin (7 August 2021). "Former coach recalls the chubby Neeraj Chopra with a notebook, now an Olympic gold medallist". The Indian Express. Archived from the original on 7 August 2021. Retrieved 7 August 2021.
  18. ↑ Rayan, Stan (7 August 2021). "Neeraj Chopra: From chubby kid trying to lose weight to Olympic champion". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Archived from the original on 7 August 2021. Retrieved 7 August 2021.
  19. 1 2 "Neeraj Chopra: I am not going to be content with Olympic gold and sit on this laurel" (in ఇంగ్లీష్). ESPN. 10 August 2021. Retrieved 14 August 2021.
  20. 1 2 "World record holder Neeraj Chopra gets Army job, starts supporting farmer father". The Times of India. 12 March 2017. Archived from the original on 23 January 2018. Retrieved 29 August 2018.
  21. 1 2 Selvaraj, Jonathan (24 July 2016). "Neeraj Chopra creates history to become first Indian world champion in athletics". The Indian Express. Archived from the original on 8 November 2020. Retrieved 11 August 2021.
  22. ↑ Sura, Ajay (26 July 2016). "Javelin hero Neeraj Chopra to join Indian Army". The Times of India. Archived from the original on 6 September 2018. Retrieved 29 August 2018.
  23. ↑ Koshie, Nihal (10 July 2017). "Asian Athletics Championship: Slumbering Neeraj Chopra wakes up in time". The Indian Express. Archived from the original on 6 February 2021. Retrieved 9 August 2021.
  24. 1 2 3 "Neeraj Chopra suffers groin injury in Zurich Diamond League Finals". The Indian Express. 25 August 2017. Retrieved 29 August 2021.
  25. 1 2 Koshie, Nihal (22 February 2018). "Neeraj Chopra reboots along the Rhine". The Indian Express. Retrieved 29 August 2021.
  26. ↑ "CWG 2018: Neeraj Chopra wins javelin gold with season-best throw". The Times of India. 14 April 2018. Archived from the original on 23 April 2021. Retrieved 14 April 2018.
  27. ↑ "IAAF Diamond League: Neeraj Chopra breaks his own javelin throw national record again, finishes 4th". Scroll.in. 4 May 2018. Archived from the original on 7 September 2020. Retrieved 4 May 2018.
  28. ↑ McKay, Duncan (12 August 2018). "India chooses javelin thrower Chopra as flagbearer for 2018 Asian Games Opening Ceremony". insidethegames.biz. Archived from the original on 18 November 2020. Retrieved 7 August 2021.
  29. ↑ "Asian Games, Live Updates, Day 9: India's Neeraj Chopra Clinches Gold Medal in Javelin Throw Final". News18. 27 August 2018. Archived from the original on 7 August 2021. Retrieved 27 August 2018.
  30. ↑ "Neeraj Chopra recommended for Rajiv Gandhi Khel Ratna by Athletics Federation of India". India Today. 30 May 2020. Archived from the original on 16 July 2021. Retrieved 16 July 2021.
  31. ↑ Philip, Snehesh Alex (8 August 2021). "With Olympics 'golden throw', Subedar Neeraj Chopra could land promotion in Army". ThePrint. Archived from the original on 8 August 2021. Retrieved 9 August 2021.
  32. ↑ "Raining rewards for Neeraj Chopra: A list of cash awards for Olympic gold medallist". The Indian Express (in ఇంగ్లీష్). New Delhi, India. 12 August 2021. Retrieved 13 August 2021.
  33. 1 2 Sharma, Nitin (30 January 2020). "Reading Shiv Khera's book Jeet Aapki and meditation helped Neeraj Chopra during tough times". The Indian Express. Archived from the original on 7 August 2021. Retrieved 7 August 2021.
  34. ↑ Koshie, Nihal (30 November 2019). "Neeraj Chopra no longer training with high-profile coach Hohn". The Indian Express. Archived from the original on 6 April 2020. Retrieved 4 May 2020.
  35. ↑ "Neeraj Chopra's former coach dies, javelin star posts emotional message". India Today. 28 July 2018. Archived from the original on 29 July 2018. Retrieved 4 May 2020.
  36. ↑ "Watch: On this day two years ago, Javelin Thrower Neeraj Chopra became a world junior record holder". Scroll.in. 23 July 2018. Archived from the original on 9 November 2020. Retrieved 4 May 2020.
  37. 1 2 3 Das, Indraneel (7 June 2021). "Javelin thrower Neeraj Chopra flies to Europe, first competition at Lisbon meet". The New Indian Express. Archived from the original on 9 August 2021. Retrieved 9 August 2021.
  38. ↑ Koshie, Nihal (8 August 2021). "Tokyo 2020: Neeraj Chopra soars to end generations of heartache". The Indian Express. Archived from the original on 7 August 2021. Retrieved 8 August 2021.
  39. ↑ Das, Tanmay (8 August 2021). "When Odisha opened its arms to Neeraj & Co amid COVID lockdown". The New Indian Express. Archived from the original on 9 August 2021. Retrieved 9 August 2021.
  40. ↑ Selvaraj, Jonathan (5 March 2021). "Neeraj Chopra's Nordic weapon: Breaker of storms, and national records". ESPN. Archived from the original on 14 May 2021. Retrieved 8 March 2021.
  41. ↑ Koshie, Nihal (8 August 2021). "Tokyo 2020: Neeraj Chopra soars to end generations of heartache". The Indian Express. Archived from the original on 7 August 2021. Retrieved 8 August 2021.
  42. ↑ Das, Indraneel (29 May 2021). "After long wait, Neeraj Chopra gets France visa, to leave soon". The New Indian Express. Archived from the original on 9 August 2021. Retrieved 9 August 2021.
  43. ↑ "Neeraj Chopra throws 83.18m to clinch gold in Lisbon". The Times of India. 10 June 2021. Archived from the original on 18 June 2021. Retrieved 8 August 2021.
  44. ↑ "I was in training mode in the Lisbon event: Javelin thrower Neeraj Chopra". The New Indian Express. 11 June 2021. Retrieved 9 August 2021.
  45. 1 2 "Javelin thrower Neeraj Chopra pulls out of Switzerland event to rest ahead of Olympics". The New Indian Express. 29 June 2021. Archived from the original on 9 August 2021. Retrieved 9 August 2021.
  46. ↑ "Missed natural feeling of being in world-class event but staying positive: Neeraj Chopra". The New Indian Express. 11 July 2021. Archived from the original on 9 August 2021. Retrieved 9 August 2021.
  47. ↑ "Athletics CHOPRA Neeraj – Tokyo 2020 Olympics". Olympics. Archived from the original on 7 August 2021. Retrieved 7 August 2021.
  48. ↑ "Tokyo Olympics: Spotlight on javelin thrower Neeraj Chopra to end Independent India's wait for medal in athletics". India Today. 7 August 2021. Archived from the original on 8 August 2021. Retrieved 9 August 2021.
  49. ↑ "Tokyo 2020: With 7 medals, India records its best-ever Olympic performance". India Today. 7 August 2021.
  50. ↑ Shrivastava, Kislaya (11 August 2021). "India's Olympic Gold Medallist Neeraj Chopra Becomes World Number 2 In Men's Javelin Throw" (in ఇంగ్లీష్). New Delhi, India: NDTV. Archived from the original on 11 ఆగస్టు 2021. Retrieved 12 August 2021.
  51. ↑ "Neeraj Chopra Men's Javelin Throw Live Updates, Tokyo Olympics: Neeraj Throws 87.58, 1st on Board in Gold Position". News18. 7 August 2021. Archived from the original on 7 August 2021. Retrieved 7 August 2021.
  52. ↑ Mathur, Abhimanyu (8 August 2021). "Neeraj Chopra makes Milkha Singh's dream a reality; dedicates Olympic gold to him and PT Usha". The Times of India. Archived from the original on 9 August 2021. Retrieved 9 August 2021.
  53. ↑ "Paris 2024 Olympics athletics: India's results, scores and times – full list". Olympics.com. 1 August 2024. Retrieved 1 August 2024.
  54. ↑ "Doha Diamond League 2024: Neeraj Chopra finishes second, just 2cm short of Jakub Vadlejch - full results". 10 May 2024.
  55. ↑ "Federation Cup 2024 athletics: Neeraj Chopra marks homecoming with javelin throw gold medal". 15 May 2024.
  56. ↑ "Neeraj Chopra wins gold at Paavo Nurmi Games". 18 June 2024. Archived from the original on 9 August 2024. Retrieved 19 June 2024.
  57. ↑ "Qualification, Athletics at the 2024 Summer Olympics – Men's javelin throw". Paris 2024. 6 August 2024. Archived from the original on 29 July 2024. Retrieved 6 August 2024.
  58. ↑ "Paris Olympics 2024: Neeraj Chopra qualifies for men's javelin throw finals with season's best 89.34m in first attempt". Financial Express. 6 August 2024. Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  59. ↑ "Olympics: Neeraj Chopra wins silver but sets the gold standard for Indian sport". ESPN. 8 August 2024. Archived from the original on 9 August 2024. Retrieved 8 August 2024.
  60. ↑ "Tokyo Gold, Paris Silver: Neeraj Chopra achieves another Olympic first for India". India Today. 8 August 2024. Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
  61. ↑ "Neeraj Chopra finishes second in Lausanne Diamond League with season's best 89.49m". The Times of India. 23 August 2024. Retrieved 23 August 2024.
  62. ↑ Sportstar, Team (3 April 2025). "World Athletics confirms 'Neeraj Chopra Classic' international javelin event in Panchkula". sportstar.thehindu.com (in ఇంగ్లీష్). Retrieved 3 April 2025.
  63. ↑ Sportstar, Team (16 May 2025). "Julian Weber wins Doha Diamond League 2025 with 91.06m throw, bests Neeraj Chopra's 90.23m in javelin". sportstar.thehindu.com (in ఇంగ్లీష్). Retrieved 16 May 2025.
  64. ↑ "Neeraj Chopra Finishes 2nd In Doha Diamond League Despite Record 90.23m Throw | Sports News". News18 (in ఇంగ్లీష్). Retrieved 16 May 2025.
  65. ↑ "Olympic champion Neeraj Chopra is Audi India's new brand ambassador - CNBC TV18". CNBCTV18 (in ఇంగ్లీష్). 26 May 2025. Retrieved 19 June 2025.
  66. ↑ "Neeraj Chopra wins Paris Diamond League: One big early throw does the trick as Neeraj wins first DL meet of the season". The Indian Express (in ఇంగ్లీష్). 21 June 2025. Retrieved 21 June 2025.
  67. ↑ "Neeraj Chopra wins Gold in Ostrava Golden Spike event with best throw of 85.29m". India Today (in ఇంగ్లీష్). 24 June 2025. Retrieved 24 June 2025.
  68. ↑ Koshie, Nihal (3 July 2025). "Neeraj Chopra is hands-on, wears many hats as he takes on role of NC Classic host". The Indian Express. Retrieved 3 July 2025.
  69. ↑ "Historic! India's golden-arm Neeraj Chopra clinches inaugural NC Classic title with 86.18m throw - Watch". The Times of India. 5 July 2025. ISSN 0971-8257. Retrieved 6 July 2025.
  70. ↑ Ramesh, Akshay (5 July 2025). "Neeraj Chopra Classic: Never seen 15,000 people for javelin, says German legend". India Today. Retrieved 6 July 2025.
  71. ↑ "Neeraj Chopra continues streak of finishing in top two of every event since 2021". Sportstar. 28 August 2025. Retrieved 28 August 2025.
  72. ↑ "Shock in Tokyo! Neeraj Chopra's incredible 26-podium streak broken". The Times of India. 18 September 2025. Retrieved 5 June 2026.
  73. ↑ "End of Neeraj Chopra's incredible streak, Keshorn Walcott's stunning win, Julian Weber's wretched Majors curse: Talking points from an insane men's javelin final". The Indian Express. 18 September 2025. Retrieved 5 June 2026.
  74. ↑ "The Gurus of Neeraj Chopra: Who are the men behind Indian athlete's greatness?". 28 August 2023.
  75. ↑ "Naseem Ahmad isn't Olympic gold medallist Neeraj Chopra's coach now. He coached him till 2016". ThePrint. 9 August 2021.
  76. ↑ "How coach Kashinath Naik helped Neeraj Chopra raise the bar". The Times of India. 9 August 2021.
  77. ↑ "Garry Calvert, the gentle soul who shaped Neeraj Chopra's career, passes away at 63". 29 July 2018.
  78. ↑ "India's javelin coach German legend Uwe Hohn sacked".
  79. ↑ "Neeraj Chopra's coach Klaus Bartonietz ends partnership as he wants to spend time with family". October 2024.
  80. ↑ "India's Neeraj Chopra to join Jan Zelezny's training group". The Times of India. PTI. 9 November 2024. ISSN 0971-8257. Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  81. ↑ "Neeraj Chopra parts ways with coach Jan Zelezny after mixed-bag season". Olympics.com.
  82. ↑ Nag, Utathya (15 January 2026). "Neeraj Chopra reunites with formative coach Jai Chaudhary; starts training in Potchefstroom". Olympics.
  83. ↑ "Javelin Throw (700g) Boys 8th IAAF World Youth Championships". World Athletics. Archived from the original on 14 October 2022. Retrieved 14 October 2022.
  84. ↑ "2015 Asian Athletic Championship Results". Athletics Asia. Archived from the original on 5 January 2016. Retrieved 15 September 2022.
  85. ↑ Munjal, Diksha (24 July 2022). "Neeraj Chopra, A look at the achievements of the javelin champion". The Hindu. Archived from the original on 15 September 2022. Retrieved 15 September 2022.
  86. ↑ "From Junior World Champion to Olympic Gold: A look at Neeraj Chopra's five biggest international triumphs". Times Now. 21 January 2022. Archived from the original on 15 September 2022. Retrieved 15 September 2022.
  87. ↑ "2016 Asian Junior Athletics Championships Results". Athletics Asia. Archived from the original on 27 December 2016. Retrieved 15 September 2022.
  88. ↑ "Neeraj Chopra wins javelin gold with new U-20 World Record". The Economic Times. 24 July 2016. Archived from the original on 15 September 2022. Retrieved 15 September 2022.
  89. ↑ "Asian Athletics Championship: Slumbering Neeraj Chopra wakes up in time". The Indian Express. 10 July 2017. Archived from the original on 6 February 2021. Retrieved 15 September 2022.
  90. ↑ "IAAF World Athletics Championships 2017: Neeraj Chopra vows to come back stronger after early exit". First Post. 12 August 2017. Archived from the original on 15 September 2022. Retrieved 15 September 2022.
  91. ↑ "2018 Commonwealth Games: Neeraj Chopra wins gold in men's javelin throw". The Hindustan Times. 14 April 2018. Archived from the original on 15 September 2022. Retrieved 15 September 2022.
  92. ↑ "Commonwealth Games: How Neeraj Chopra won javelin gold at Gold Coast". Olympics.com. Archived from the original on 15 September 2022. Retrieved 15 September 2022.
  93. ↑ "Athletics Men's Javelin Throw". Asian Games 2018. 27 August 2018. Archived from the original on 27 August 2018. Retrieved 28 August 2018.
  94. ↑ "Athletics – Final Results". Tokyo 2020 Olympics. Tokyo Organising Committee of the Olympic and Paralympic Games. 7 August 2021. Archived from the original on 7 August 2021. Retrieved 8 August 2021.
  95. ↑ "Neeraj Chopra wins silver, Anderson Peters takes gold". India Today. 24 July 2022. Archived from the original on 24 July 2022. Retrieved 24 July 2022.
  96. ↑ "Neeraj Chopra wins historic World Athletics Championships gold with incredible 88.17 throw in javelin final". The Hindustan Times. 28 August 2023. Retrieved 27 August 2023.
  97. ↑ "Neeraj Chopra defends Asian Games gold with 88.88m throw, Kishore Jena bags silver". Deccan Herald. 4 October 2023. Archived from the original on 9 August 2024. Retrieved 4 October 2023.
  98. ↑ "Men's Javelin Throw Final Results". Olympics.com. 9 August 2024. Archived from the original on 8 August 2024. Retrieved 9 August 2024.
  99. ↑ "World Athletics Championships 2025: Neeraj Chopra eighth in javelin throw final, Sachin Yadav fourth - as it happened". Olympics.com.
  100. ↑ Roy, Vishesh (1 August 2026). "Neeraj Chopra, India's javelin ace, wins silver at Commonwealth Games 2026; Yash Vir Singh takes home bronze". Hindustan Times. Retrieved 1 August 2026.
  101. ↑ Sportstar, Team (30 June 2022). "Stockholm Diamond League 2022: Neeraj Chopra registers new National Record, finishes 2nd". sportstar.thehindu.com (in ఇంగ్లీష్). Archived from the original on 11 July 2022. Retrieved 15 December 2024.
  102. ↑ "Watch: Neeraj Chopra scripts history again, wins Lausanne Diamond League title". The Times of India. 27 August 2022. Archived from the original on 8 September 2022. Retrieved 10 September 2022.
  103. ↑ "Watch: Neeraj Chopra's 88.44m throw in Diamond League adds another golden chapter in Indian athletics history". The Hindustan Times. 9 September 2022. Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.
  104. ↑ "Neeraj Chopra clinches Doha Diamond League title; records best throw of 88.67m". The Hindustan Times. 5 May 2023. Archived from the original on 12 May 2023. Retrieved 12 May 2023.
  105. ↑ "Lausanne Diamond League 2023: Neeraj Chopra wins javelin throw competition on return". Olympics.com. 1 July 2023. Archived from the original on 9 August 2024. Retrieved 25 June 2024.
  106. ↑ Sportstar, Team (31 August 2023). "Neeraj Chopra finishes second in Zurich Diamond League, long jumper Sreeshankar fifth". sportstar.thehindu.com (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  107. ↑ "Diamond League 2023 Final As It Happened: Neeraj Chopra ends second with best throw of 83.80m". The Indian Express (in ఇంగ్లీష్). 16 September 2023. Retrieved 15 December 2024.
  108. ↑ "Neeraj Chopra finishes second in Doha Diamond League, Kishore Jena ninth". ESPN (in ఇంగ్లీష్). 10 May 2024. Retrieved 15 December 2024.
  109. ↑ PTI (22 August 2024). "Neeraj Chopra finishes second in Lausanne Diamond League with season's best 89.49m". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 15 December 2024.
  110. ↑ "Diamond League Final: Neeraj Chopra battles fracture in hand to finish 1cm short in javelin throw season finale". The Indian Express (in ఇంగ్లీష్). 15 September 2024. Retrieved 15 December 2024.
  111. ↑ "Neeraj Chopra throws record 90.23m, but finishes 2nd in Doha Diamond League". India Today (in ఇంగ్లీష్). 16 May 2025. Retrieved 16 May 2025.
  112. ↑ "Diamond League 2025: Neeraj Chopra Edges Out Julian Weber To Finish Top In Paris". News18 (in ఇంగ్లీష్). Retrieved 20 June 2025.
  113. ↑ "Neeraj Chopra finishes second in Diamond League Final 2025". Sportstar. PTI. 28 August 2025. Retrieved 28 August 2025.
  114. ↑ Menon, Anirudh (20 June 2026). "Neeraj Chopra returns with 4th place finish in Doha Diamond League, Pathirage wins". ESPN.
  115. ↑ "Neeraj Chopra wins gold at Sotteville Athletics Meet in France". The Times of India. 18 July 2018. Archived from the original on 30 July 2018. Retrieved 30 July 2018.
  116. ↑ "Neeraj Chopra wins javelin gold at Savo Games". ESPN. Press Trust of India. 30 July 2018. Archived from the original on 30 July 2018. Retrieved 30 July 2018.
  117. ↑ "Neeraj Chopra throws 83.18m to clinch gold in Lisbon". The Times of India. PTI. 10 June 2021. Archived from the original on 18 June 2021. Retrieved 8 August 2021.
  118. ↑ Peter, Naveen (22 June 2021). "Neeraj Chopra pockets second gold on his European tour". Olympics. Retrieved 28 April 2025.
  119. ↑ "Javelin thrower Neeraj Chopra bags bronze medal at Kuortane Games". The New Indian Express. PTI. 27 June 2021. Archived from the original on 9 August 2021. Retrieved 9 August 2021.
  120. ↑ Sharma, Isha (18 June 2022). "Kuortane Games: Olympic Champion Neeraj Chopra Wins Gold With 86.69m Throw". The Times of India. Archived from the original on 15 September 2022. Retrieved 15 September 2022.
  121. ↑ "Neeraj Chopra wins gold at Paavo Nurmi Games". ESPN. 19 June 2024. Archived from the original on 9 August 2024. Retrieved 19 June 2024.
  122. ↑ "Neeraj Chopra wins gold at Potchefstroom Invitational with 84.52m throw". Sportstar. 17 April 2025. Retrieved 17 April 2025.
  123. ↑ "Neeraj Chopra finishes second at Janusz Kusocinski Memorial 2025". Sportstar. 23 May 2025. Retrieved 23 May 2025.
  124. ↑ Sportstar, Team (24 June 2025). "Neeraj Chopra finishes first at Ostrava Golden Spike 2025". sportstar.thehindu.com (in ఇంగ్లీష్). Retrieved 24 June 2025.
  125. ↑ "Neeraj Chopra wins NC Classic 2025". Sportstar. 5 July 2025. Retrieved 5 July 2025.
  126. ↑ Kataria, Aayush (14 May 2025). "Neeraj Chopra Handed Big Honour By Indian Army; Conferred Honorary Rank Of Lieutenant Colonel". Times Now. Retrieved 17 May 2025.
  127. ↑ "Olympian Neeraj Chopra conferred honorary rank of Lt. Col. in Territorial Army". The Hindu. PTI. 14 May 2025. Retrieved 17 May 2025.
  128. ↑ "Gallantry and distinguished service awards to army on republic day 2022" (PDF). Press Information Bureau (Press release). 25 January 2022. Archived (PDF) from the original on 25 January 2022. Retrieved 25 January 2022.
  129. ↑ "Padma Awardees List 2022" (PDF). Ministry of Home Affairs. 25 January 2022. Archived (PDF) from the original on 25 January 2022. Retrieved 25 January 2022.
  130. ↑ Peri, Dinaker (8 August 2021). "Subedar Neeraj Chopra — an Olympian and a soldier". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 9 August 2021. Retrieved 11 August 2021.
  131. ↑ "Govt issues 75th Independence Anniversary Medal for armed forces". The Hindu Business Line. 14 August 2022. Retrieved 1 June 2024. To commemorate the historic occasion, the government has instituted the 75th Independence Anniversary Medal for all armed forces personnel.
  132. ↑ "Rajnath Singh Renames Army Sports Institute Stadium In Pune After Neeraj Chopra". NDTV. 27 August 2021. Archived from the original on 27 August 2021. Retrieved 30 August 2021.
  133. ↑ Ugra, Sharda (5 November 2021). "Neeraj Chopra: "It's not that my Olympic medal is everything and so I don't need to do more"". Vogue India. Retrieved 19 October 2024.
  134. ↑ "Indian athlete Neeraj Chopra gets appointed the 'Friendship Ambassador' for Switzerland Tourism". Indulgexpress.com. 10 November 2022. Archived from the original on 10 November 2022. Retrieved 10 November 2022.
  135. ↑ "Neeraj Chopra named world's best male javelin thrower in 2024 by reputed U.S. track and field magazine". The Hindu. PTI. 10 January 2025. ISSN 0971-751X. Retrieved 10 January 2025.
  136. ↑ "Olympic javelin champ Neeraj Chopra to face best throwers in the world for the first time on home ground". The Indian Express (in ఇంగ్లీష్). 3 April 2025. Retrieved 3 April 2025.
  137. ↑ India, Fortune (26 May 2025). "Audi India ropes in double Olympic medallist Neeraj Chopra in a new partnership". Fortune India (in ఇంగ్లీష్). Retrieved 19 June 2025.
  138. ↑ "ET 40 under forty: The vanguard leading India into the future". The Economic Times. 14 October 2025. Retrieved 18 October 2025.
  139. ↑ "Indian Sports Honours (ISH) 2017 Celebrates Sports Heroes and Rising Stars". Mumbai Live. 27 November 2017. Retrieved 9 November 2024.
  140. ↑ "Winners | ISH 2017". Indian Sports Honours (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 5 August 2024. Retrieved 19 October 2024.
  141. ↑ "National Sports Awards 2018: Kohli, Mirabai, Neeraj and others honoured". India Today. 28 September 2018. Retrieved 30 January 2025.
  142. 1 2 "Indian Sports Honours - Winner & Nominees". Indian Sports Honours. Retrieved 19 October 2024.
  143. ↑ Venkat, Rahul (2 November 2021). "National Sports Awards: Neeraj Chopra, PR Sreejesh among a dozen Khel Ratna winners". Olympics. Retrieved 30 January 2025.
  144. ↑ "TOISA 2021: Neeraj Chopra and Annu Rani win top honours in athletics". The Times of India. ISSN 0971-8257. Retrieved 19 October 2024.
  145. ↑ "Neeraj Chopra wins Sportsman of the Year (Track and Field) award at Sportstar Aces 2022". Sportstar. 19 March 2022. Retrieved 22 February 2025.
  146. ↑ "CNN-News18 Indian of The Year 2022 Updates: Olympic Champion Neeraj Chopra Wins IOTY Award This Year". News18 (in ఇంగ్లీష్). 12 October 2022. Archived from the original on 18 October 2022. Retrieved 19 October 2024.
  147. ↑ "Neeraj Chopra wins Sportstar of the Year (Male) at Sportstar Aces Awards 2023". Sportstar. 27 February 2023. Retrieved 22 February 2025.
  148. ↑ "TOISA 2023: Neeraj Chopra, Mohammed Shami, Sheetal Devi headline the list of winners". The Times of India. ISSN 0971-8257. Retrieved 19 October 2024.
  149. ↑ "Neeraj Chopra shortlisted for 'Athlete of the Year' award". Business Standard.
  150. ↑ "CNN-News18 Indian of the Year 2023: Neeraj Chopra Wins Award in Sports Category". News18 (in ఇంగ్లీష్). 10 January 2024. Retrieved 19 October 2024.
  151. ↑ Developer, Web (31 August 2024). "Ayushmann Khurrana and Neeraj Chopra get youth icon award". Mid-day. Retrieved 19 October 2024.
  152. ↑ "Indian Sports Honours 2024: Neeraj Chopra, Manu Bhaker, Harmanpreet Singh Among Top Winners – Check Full List Here". Lokmat. 19 November 2024. Retrieved 30 January 2025.
  153. ↑ "Neeraj Chopra wins Sportstar of the Year (Male) at Sportstar Aces Awards 2024". Sportstar. 9 February 2024. Retrieved 22 February 2025.

బాహ్య లంకెలు

[మార్చు]