పంజాబ్ ప్రభుత్వం (భారతదేశం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Government of Punjab

Emblem of Punjab

Banner of Punjab
Seat of GovernmentChandigarh
చట్ట వ్యవస్థ
Assembly
SpeakerKultar Singh Sandhwan[1]
Deputy SpeakerJai Krishan Singh
Members in Assembly117
కార్యనిర్వహణ వ్యవస్థ
GovernorBanwarilal Purohit
Chief MinisterBhagwant Mann
Chief SecretaryAnurag Verma, IAS[2]
Judiciary
High CourtPunjab & Haryana High Court
Chief JusticeGurmeet Singh Sandhawalia (acting)

పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం, లేదా స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం అని కూడా పిలువబడే పంజాబ్ ప్రభుత్వం, భారత రాష్ట్రమైన పంజాబ్ రాష్ట్ర 23 జిల్లాల అత్యున్నత పాలక అధికారసంస్థ. ఇందులో పంజాబ్ గవర్నరు నేతృత్వంలోని కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థ, శాసనశాఖ ఉంటాయి.

భారతదేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే, పంజాబ్ రాష్ట్ర అధిపతి గవర్నరును కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు భారత రాష్ట్రపతి నియమిస్తారు. గవర్నరు పదవి ఎక్కువగా ఆచారబద్ధమైనది. ముఖ్యమంత్రి ప్రభుత్వానికి అధిపతి. చాలా వరకు కార్యనిర్వాహక అధికారాలు ముఖ్యమంత్రికే ఉంటాయి. పంజాబ్ రాజధాని చండీగఢ్. ఇక్కడ శాసనసభ, సచివాలయం ఉన్నాయి. చండీగఢ్ హర్యానా రాజధానిగా కూడా పనిచేస్తుంది. ఇది భారతదేశం లోని ఒక కేంద్రపాలిత ప్రాంతం. చండీగఢ్‌లో ఉన్న పంజాబ్ & హర్యానా హైకోర్టు మొత్తం రాష్ట్రంపై అధికార పరిధిని కలిగి ఉంది.[3]

ప్రస్తుత పంజాబ్ శాసనసభ ఏకసభ, ఇందులో 117 మంది శాసనసభ సభ్యులు (ఎంఎల్ఎ) ఉన్నారు.ఏదేని ఇతర పరిస్థితులలో ముందుగానే రద్దు చేయకపోతే దీని పదవీకాలం 5 సంవత్సరాలు.[4]

క్యాబినెట్ మంత్రులు

[మార్చు]

శాసన శాఖ

[మార్చు]

శాసనసభ గవర్నరు, పంజాబ్ శాసనసభ ఉంటాయి. ఇది రాష్ట్రంలోని అత్యున్నత రాజకీయ సంస్థ. శాసనసభను పిలిపించే లేదా మూసివేసే అధికారం గవర్నరుకు ఉంటుంది. శాసనసభ సభ్యులందరును సాధారణంగా ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికలలో 18 ఏళ్లు పైబడిన అర్హులైన ఓటర్ల ఎన్నుకుంటారు. ప్రస్తుత శాసనసభలో 117 మంది ఎన్నికైన సభ్యులు ఉన్నారు. ఎన్నికైన సభ్యులు తమ సొంత సభ్యులలో ఒకరిని దాని ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకుంటారు. ఇతనిని శాసనసభ స్పీకరు అని పిలుస్తారు. స్పీకరుకు డిప్యూటీ స్పీకరు సహాయకారిగా ఉంటారు. అతనిని కూడా శాసనసభ్యుల ఎన్నుకుంటారు. సభలో సమావేశాన్ని నిర్వహించడం స్పీకరు బాధ్యత. స్పీకరు గైరు హాజరు అయిన సందర్బలో డిప్యూటీ స్పీకరు ఆ బాధ్యతను నిర్వహిస్తాడు

న్యాయవ్యవస్థ

[మార్చు]

పంజాబ్, హర్యానా హైకోర్టు భారతదేశంలోని పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు, భారతదేశ కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌కు ఉమ్మడి హైకోర్టు. దీనిలో 64 మంది శాశ్వత న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తితో సహా 21 మంది అదనపు న్యాయమూర్తులతో కూడిన ఈ హైకోర్టు న్యాయమూర్తుల మంజూరు చేయబడిన బలం 85. 2023 సెప్టెంబరు 14 నాటికి, 36 మంది శాశ్వత, 22 అదనపు న్యాయమూర్తులతో కూడిన 58 మంది న్యాయమూర్తులు హైకోర్టులో పనిచేస్తున్నారు.[5]

విభాగాలు, సంస్థలు

[మార్చు]
 • పంజాబ్ ప్రభుత్వ విభాగాలు, భారతదేశం
 • పంజాబ్ పోలీసులు

ఇవి కూడా చూడండి

[మార్చు]
 • పంజాబ్ చిహ్నం
 • భారతదేశంలోని పంజాబ్ ప్రభుత్వంలోని మంత్రుల జాబితా
 • పంజాబ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్
 • పంజాబ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్

సూచనలు

[మార్చు]
 1. Brar, Kamaldeep Singh (2022-03-27). "Punjab speaker seeks pardon at Akal Takht after video of priest touching a cow's tail to his turban goes viral". The Indian Express. Retrieved 2022-03-27.
 2. "Anurag Verma appointed Punjab's new chief secretary, supersedes 11 officers". TOI. 27 June 2023.
 3. "Jurisdiction and Seats of Indian High Courts". Eastern Book Company. Retrieved 2008-05-12.
 4. "Punjab Legislative Assembly". Legislative Bodies in India. National Informatics Centre, Government of India. Retrieved 2008-05-12.
 5. https://www.highcourtchd.gov.in/index.php?mod=chief

వెలుపలి లంకెలు

[మార్చు]