Jump to content

పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా

వికీపీడియా నుండి
పశ్చిమ సింగ్‌భుం జిల్లా
पश्चिमी सिंहभूम जिला
జార్ఖండ్ పటంలో పశ్చిమ సింగ్‌భుం జిల్లా స్థానం
జార్ఖండ్ పటంలో పశ్చిమ సింగ్‌భుం జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
డివిజనుకొల్హన్
ముఖ్య పట్టణంచైబాసా
Government
 • లోకసభ నియోజకవర్గాలుసింగ్‌భుం
 • శాసనసభ నియోజకవర్గాలు5
విస్తీర్ణం
 • మొత్తం5,351 కి.మీ2 (2,066 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం15,01,619
 • జనసాంద్రత280/కి.మీ2 (730/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత59.54 %
 • లింగ నిష్పత్తి1001
సగటు వార్షిక వర్షపాతం1422 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

"పశ్చిమ సింగ్‌భుం" జార్ఖండ్ 24 జిల్లాలలో ఒకటి.ఈజిల్లా 1990లో సింగ్‌భుం జిల్లాను విభజించి రెండు జిల్లాలుగా రూపొందించబడ్డాయి.జిల్లాకేంద్రంగా చైబాసా పట్టణం ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో కుంతి జిల్లా, తూర్పు సరిహద్దులో సెరైకెల ఖెర్సవన్ జిల్లా, దక్షిణ సరిహద్దులో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కెందుజహర్ జిల్లా, మయూర్బని జిల్లా, సుందర్ఘర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో సిండెగ జిల్లా, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సుందర్ఘర్ జిల్లా ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

పశ్చిమ సింగ్‌భుం జార్ఖండ్ రాష్ట్రంలో పురాతన జిల్లాగా ఉంది. 1837లో బ్రిటిష్ ప్రభుత్వం కొలాహన్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత చైబాసా పట్టణం రాజధానిగా సింగ్‌ భుం జిల్లాను రూపొందించారు. తరువాతి కాలంలో సింగ్‌భుం జిల్లా నుండి తూర్పు సింగ్‌భుం, పశ్చిమ సింగ్‌భుం, సెరైకెలా ఖర్సవన్ జిల్లాలు రూపొందించబడ్డాయి.

1990లో సిన్‌భుం జిల్లాను విభింజించిన తరువాత పశ్చిమ సిన్‌భుం జిల్లా ఉనికి 9 మండలాలతో ఆరంభం అయింది. జెంషెడ్పూర్ రాజధానిగా తూర్పు భూభాగం 23 మండలాలతో తూర్పు సింగ్‌భుం జిల్లాను రూపొందించారు. 2001లో పశ్చం సింగ్‌భుం జిల్లాను విభజించి 8 మండలాలతో సెరైకెలా ఖర్సవన్ జిల్లాను రూపొందించారు. ప్రస్తుతం పశ్చిమ సింగ్‌భుం జిల్లాలో 15 మండలాలు మాత్రమే ఉన్నాయి.

పేరువెనుక చరిత్ర

[మార్చు]

పశ్చిమ సింగ్‌భుం జిల్లా పేరుగురించిన విభిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సింగ్ భుం అంటే సింఘ్ ప్రజల భూమి అని అర్ధం. సెరైకెలా రాజ్యానికి చెందిన సింగ్ దేవ్ కుటుంబం స్థాపించిన భూమి కనుక ఇది సింగ్‌భుం అయిందని ఒక కథనం వివరిస్తుంది. మరొక కథనం ఆధారంగా ఇక్కడ నివసించిన ఆదివాసి సర్నా ప్రజల ప్రధాన దైవం " సింగ్ గొంగ " అనేపేరు ఈప్రాంతానికి వచ్చిందని వివరిస్తుంది. వేరొక కథనం ఈప్రాంతంలో సింహాలకు నివాసంగా ఉన్నది కనుక ఇది సింగ్ భుం (సింహాలభూమి) అని పిలవబడిందని వివరిస్తుంది.పశ్చిమ సింగ్‌భుం జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగం..[1]

భౌగోళికం

[మార్చు]

పశ్చిమ సింగ్‌భుం జిల్లా సరికొత్తగా రూపొందించబడిన జార్ఖండ్ రాష్ట్ర దక్షణ సరిహద్దులో ఉంది. ఇది రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా గుర్తించబడుతుంది. జిల్లా 21-97 నుండి 23-60 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, 85-00 నుండి 86-90 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. జిల్లా సరాసరిగా సముద్రమట్టానికి 244 మీ. ఎత్తున ఉంది. జిల్లా వైశాల్యం 5351.41చ.కి.మీ ఉంది.

జిల్లాలో కొండలు, ఎత్తైన పర్వతాలు, లోయలతో నిండి ఉంది. కొండచరియలలో దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. ఇందులో ఉత్తమ సాలవృక్ష అరణ్యాలు, ప్రబలమైన సరండ అరణ్యం ఉంది. జిల్లాలో పలు జలపాతాలు ఉన్నాయి. ఏనుగులు, దున్నపోతులు, పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు,, అడవి కుక్కలు అడవి పందులు, సాంబార్ జింక, జింక, చుక్కల జింక మొదలైన జంతువులు ఉన్నాయి. జిల్లాలో అధికంగా ఉన్న ఇనుప ఖనిజాలు చాలావరకు స్టీల్ ఉత్పత్తి కొరకు త్రవ్వితీయబడ్డాయి.

నదులు

[మార్చు]

పశ్చిమ సింగ్‌భుం జిల్లాలో కోయల్ నది, కారో - కొనియా, కుజు, ఖర్కై నది, సంజల్, రోరో, దేవ్ నది, బైతరణి నదులు ప్రవహిస్తున్నాయి. [2]

గనులు , ఖనిజాలు

[మార్చు]

పశ్చిమ సింగ్‌భుం జిల్లాలో అధికంగా ఇనిపగనులు ఉన్నాయి. పారిశ్రామిక ప్రాధాన్యత కలిగిన ఇతర ఖనిజాల జాబితా పట్టిక క్రింద ఉంది.

  • క్రోమైట్
  • మాగ్నెటైట్
  • మాంగనీస్
  • కైనితే
  • లైం స్టోన్
  • ఇనుప గనులు
  • అస్బెస్టాస్
  • సోప్ - స్టోన్

విభాగాలు

[మార్చు]

జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి: చైబాసా, కుంతీపానీ, జింక్పాని, టినోపానీ, కుమార్దుంగీ, తంతనగర్, జగన్నాథ్పూర్, మంఝరి, మంఘ్గావ్, నోయ్మండి, చక్రధర్పూర్, బబ్ద్గావ్, మనోహర్పూర్, గోయిల్కెరా, సొనుయా, హాత్గంహరియా.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,501,619,[3]
ఇది దాదాపు. గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 335వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 209 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21.69%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 1004:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 59.54%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
సంఖ్యాపరంగా ఆధిక్యత ఆదివాసి తెగల ప్రజలు

వృక్షజాలం , జంతుజాలం

[మార్చు]

పశ్చిం సిఘ్‌భుం జిల్లాలో దట్టమైన అరణ్యాలు, కొండలు, నదీతీరాలు, వైవిధ్యమైన వృక్షజాలం, జంతుజాలం ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
  2. "West Singhbhum district of Jharkhand". River Systempublisher = District administration. Archived from the original on 2010-03-22. Retrieved 2010-04-20.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Gabon 1,576,665
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301

వెలుపలి లింకులు

[మార్చు]